టీడీపీ కార్యాలయం పై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ  

గుంటూరు లో కొత్తగా నిర్మించిన టీడీపీ ప్రధాన కార్యాలయం అక్రమ నిర్మాణం అంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆఫీసు కోసం వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల ఈ పిటిషన్‌ వేశారు. 

 

మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు కింద భూమిని కేటాయించిందని.. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని అయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ విషయంలో నీటి వనరులకు సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించారని పిటిషన్‌లో అయన ప్రస్తావించారు. అక్కడ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని... అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అయన కోర్టును కోరారు. 

 

అయితే గతంలో కూడా దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu