పోలీసుల కస్టడీలోకి అక్బరుద్దీన్, విచారణ

 

 

 Akbaruddin Owaisi police custody, Owaisi police custody, Akbaruddin Owaisiin Arrest

 

 

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టైన అక్బరుద్దీన్ ఓవైసీకి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అదిలాబాద్ సబ్ జైలు నుంచి పోలీసు ప్రధాన కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది. కస్టడీలోకి తీసుకొనే ముందు జైలులో అక్బరుద్దీన్ కు రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.


అక్బరుద్దీన్ ఓవైసీని  ఐదు రోజులపాటు పోలీస్ స్టడీ విధిస్తూ నిర్మల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్బర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును మధ్యాహ్నానికి వాయిదా పడింది. భోజన విరామం అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu