ఆదినారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డి ఫైర్.. అది ఆయనకు అలవాటే
posted on Oct 12, 2015 3:22PM

వైకాపా పార్టీనేత, కడప జిల్లా ఎమ్మెల్యే ఆదినారాయణ వైకాపాను వీడి టీడీపీలోకి మారే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు జరపగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అధినేతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పార్టీ మారడానికి మాత్రం ఆయనకు రామ సుబ్బారెడ్డి రూపంలో బ్రేక్ తగిలింది. ఆదినారాయణను పార్టీలోకి తీసుకోవద్దని.. తీసుకుంటే తాను పార్టీ వీడతానని చెప్పి ఆయన చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణరెడ్డి విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకునేదే లేదని.. పార్టీలోకి రానివ్వమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పార్టీకి తన అవసరం ఎంత మాత్రం లేదని.. ఆయన రావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.. అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవడం తనకి అలవాటే అని ఎద్దేవ చేశారు..