బాసర ఆలయంపై పిడుగుపాటు..

ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయ తూర్పు రాజ గోపురంపై పిడుగుపడింది. పిడుగు పాటుకు గోపురానికి పగుళ్లు వచ్చాయి. దీంతో పాటు గోపురంపై ఉన్న మూడు శిల్పాలు కిందపడిపోయాయి. ఆ సమయంలో భక్తులెవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో, ఛైర్మన్ గోపురాన్ని పరిశీలించారు. వెంటనే మరమ్మత్తులు చేపడతామని వారు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu