బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్.. ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి సంబంధించిన ఈడీ దర్యాప్తు జోరందుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించిన ఈడీ.. బుధవారం (ఆగస్టు 6) హీరో విజయ్ దేవరకొండను విచారించనుంది.  నిషేధానికి గురైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సినిమా నటుల వరకూ పలువురిపై నజర్ పెట్టిన ఈడీ వారికి నోటీసులు పంపి వరుసగా విచారణకు పిలుస్తున్నది. 

బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుని బలవన్మరణాలకు పాల్పడిన వారెందరో ఉన్నారు. అటువంటి బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలే ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈడీ వారిని విచారణ చేస్తున్నది. అందులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండను ఈడీ విచారించనుంది. ఇక ఇదే కేసులో మరో నటుడు దగ్గుబాటి రాణాను ఈ నెల 11న, నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మిని ఈ నెల 13న ఈడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ ను గత నెల 30 దాదాపు ఐదుగంటల పాటు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu