అనుష్క 'రుద్రమదేవి'కి 5కోట్ల ఆభరణాలు
posted on Jul 1, 2013 3:49PM

టాలీవుడ్ అందాల అరుంధతి అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ 'రుద్రమదేవి'. ఈ సినిమాలో అనుష్క వాడే ఆభరణాల ఖరీదు 5కోట్ల రూపాయలని సమాచారం. బాలీవుడ్ జోధాఅక్బర్ కు పనిచేసిన నీతా లుల్లా ఈ సినిమా కు ఆభరణాలు డిజైన్ చేసింది. ఈమె డిజైన్ చేసిన నగలు నిజమైన వజ్రాలు, బంగారంతో తాయారు చేసి అనుష్క కు దరిస్తున్నారట. జోధా అక్బర్‌లో ఐశ్వర్యారాయ్ పెట్టుకున్న నగలు ఎంత గుర్తింపు పొందాయో అంత గుర్తింపు ఈ నగలకు లభిస్తుందని అంటున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ జూలై 3 నుంచి వేయి స్తంభాల గుడి సెట్లో జరగనుంది. అనుష్క, రానా, సుమన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2014సమ్మర్ లో రిలీజ్ కానుంది.