అంగరంగ వైభవంగా అర్పిత పెళ్ళి...

 

బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం ఆయుష్ శర్మతో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆయుష్, అర్పిత వివాహం జరిగింది. ఈరోజు సాయంత్రం ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే భారీ స్థాయిలో వివాహ విందు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ మొత్తం తరలి వస్తోంది. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖులు హైదరాబాద్‌కి చేరుకున్నారు. ఆయుష్ శర్మ మరెవరో కాదు.. అప్పట్లో టెలికాం స్కామ్‌లో ఇరుక్కున్న కేంద్ర మాజీ మంత్రి దివంగత సుఖ్‌రాం మనవడే. సల్మాన్ ఖాన్ తన చెల్లెలి వివాహాన్ని కోట్లకు కోట్లు వెచ్చించి చేస్తున్నాడు. అంతే కాకుండా తన చెల్లెలి కోసం ముంబైలో 16 కోట్ల విలువైన త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొని కానుకగా ఇచ్చాడు. సల్మాన్ సోదరి అర్పిత పెళ్ళి సందర్భంగా ఫలక్ నుమా ప్యాలెస్ ప్రాంతం సందడిగా మారింది. సినిమా తారలను చూడటానికి ఎగబడుతున్న స్థానికులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇదిలా వుంటే, అర్పితాఖాన్ సల్మాన్ ఖాన్‌కి సొంత చెల్లెలు కాదు. సల్మాన్ తండ్రి మరో భార్య, నర్తకి హెలెన్‌ కుమార్తె. అలాగని అర్పిత హెలెన్ కన్న కూతురు కూడా కాదు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పేద చంటిపాప అర్పితను హెలెన్ చేరదీసి, పెంచి పెద్ద చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu