బలగం నటుడు కన్నుమూత
posted on May 25, 2025 11:13AM

ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. జీవీ బాబు మృతి పట్లా బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. 'ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది' అని పేర్కొన్నారు. కాగా, రెండేళ్ల క్రితం విడుదలైన ‘బలగం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇందులో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది. చాలా మందికి మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. కాగా, ఇదే బలగం సినిమాలో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా అద్భతంగా నటించారు జీవీ బాబు. కథని ముందుకు తీసుకోవడంలో ఆయనదే కీలక పాత్ర. మన పల్లె టూర్లలో తాతలు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఎంతో సహజంగా నటించి జీవీ బాబు మెప్పించారు. అలాంటి నటుడు మృతిచెందడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.