డోసు పెంచిన మహేష్ దర్శకుడు
posted on Oct 26, 2013 12:09PM

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే రామానాయుడు స్టుడియోలో జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ.."దూకుడు" చిత్రం కేవలం ట్రైలర్ మాత్రమే. "ఆగడు" చిత్రంలో మహేష్ ను మాస్ హీరోగా చూపించబోతున్నాం. "దూకుడు" కంటే పదింతలు ఎక్కువగా ఈ చిత్రంలో మహేష్ కనిపించనున్నాడు. అభిమానులందరికీ నచ్చే విధంగా ఉంటుంది అని అన్నారు.
అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన "దూకుడు" చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మరి ఈ విధంగా శ్రీనువైట్ల "ఆగడు" చిత్రానికి ఇంత భారీ స్థాయిలో అంచనాలు పెంచడం వల్ల అభిమానుల్లో మరింత ఉత్కంట ఎక్కువ అవుతుంది. అభిమానులు ఊహించిన స్థాయిలో ఈ చిత్రం ఉండకపోతే "ఆగడు" చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందో మరి.
14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించనున్నది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.