ప్యార్ మే పడిపోయానంటున్న ఆది

 

మనోజ్ హీరోగా నటించిన తాజా చిత్రం "పోటుగాడు". ఈ చిత్రంలో "ప్యార్ మే పడిపోయా" అనే పాట సూపర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ టైటిల్ తో ఆది హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరుపుకున్నారు. ఈ చిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది సరసన శాన్వి హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.