మోసాన్ని పట్టిచ్చిన ఆధార్

 

ఇప్పుడు భారతదేశంలో ఆధార్ కార్డే దేనికైనా ఆధారం. ‘‘ఆధారే ఆధారం.. మనకథ ఆడనె ఆరంభం’’ అని కొత్త పాటలు రాసుకోవాల్సినంత ఆధారం. ఏ ప్రభుత్వ పథకానికైనా ఆధార్ కార్డు వుండాల్సిందే. అలాంటి కీలకమైన ఆధార్ కార్డు ఒక మోసాన్ని పట్టిచ్చింది. 50 లక్షల విలువైన భూమి మోసగాళ్ళ పాలిట పడకుండా కాపాడింది. గుంటూరు జిల్లా తాటికొండ మండలం కంతేరులో నకిలీ ధ్రువపత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేయించిన ముగ్గురు వ్యక్తులను పట్టుకోవడానికి ఆధార్ కార్డు ఎంతగానో ఉపయోగపడింది. ఆధార్ కార్డు ఆధారంగా మోసాన్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu