ప్రాణం తీసిన సమోసా.. 

టైటిల్ చూసి షాక్ అయ్యారా ..? సమోసా ప్రాణం తియ్యడం ఏంటని అనుకుంటున్నారా..? గాశారం బాగాలేకపోతే గడ్డిపోస కూడా మన చావుకు కారణం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సమోసా ధర విషయంలో ఏర్పడిన చిన్న వివాదం కాస్తా చినికిచినికి గాలివానై.. చివరకు ఓ వ్యక్తి బలవన్మరణానికి దారితీసింది. పోలీసులు విచారణ చేసి  తెలిపిన వివరాల మేరకు అతని పేరు  బజ్రు జైశ్వాల్ వయసు 30 సంవత్సరాలు  తన స్నేహితులతో కలిసి సమోసా తినేందుకు సమీపంలోని షాప్‌కు వెళ్లారు. షాప్‌లో రెండు సమోసాలు తిన్నారు. రెండు సమోసాలకు రూ.20లు చెల్లించాలని సదరు షాప్ యజమానురాలు కాంచన్ సాహు కోరింది. ఇక అంతే ఆమెకు చెల్లించడానికి డబ్బులు లేకనో.. అంతకు ముందు ఉన్న ధరను కాకుండా  ధర పెంచినందుకు తెలియదు గానీ.. కొన్ని రోజుల క్రితం వరకు ఆ షాప్‌లో రెండు సమోసాల ధర రూ.15 (ఒక్కోటి రూ.7.50)గా ఉండేది. రూ.20 ఎందుకు చెల్లించాలంటూ షాప్ యజమానురాలితో  గొడవకు దిగాడు జైశ్వాల్ఒ. ఒక్కో సమోసా ధరను రూ.2.50 పెంచడం కరెక్టుకాదంటూ రూ.5లు అదనంగా ఇచ్చేందుకు నిరాకరించాడు.  అయితే ముడి సరుకుల ధరలు పెరగడంతో సమోసా ధరను ఒక్కోటి రూ.10కి పెంచినట్లు కాంచన్ తెలిపింది. నిజమే కదా మరి నిత్యావసరాల ధరలు కూడా ఆకాశానికి అంటుతున్నాయి ఇప్పుడు ఉన్నపరిస్థితిలో ఆమె వెర్షన్ ఆమె చెప్పింది. అయినా సరే అల్లు అర్జున్ సినిమాలో తగ్గేదే లో అన్నట్లు  వెనక్కి తగ్గని జైశ్వాల్ మునుపటిలా రూ.15లే చెల్లిస్తానని తెగేసి  చెప్పాడు.

ఇక రెండు సమోసాలు, 5 రూపాయల విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. జైశ్వాల్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు షాపు యజమాని సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.  జైశ్వాల్‌పై 294, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీసులు స్టేషన్‌కు పిలించి ప్రశ్నించారు. పోలీసు కేసుతో తీవ్ర మనోవేధనకు గురైన నిందితుడు ఈ నెల 24న తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కుటుంబీకులు, స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పించగా.. చికిత్సా ఫలితం లేకుండా ఆస్పత్రిలో మృతి చెందాడు.

ఆత్మాహుతికి పాల్పడే ముందు జైశ్వాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనను కాంచన్, పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించాడు. పోలీసులు తనను స్టేషన్‌లో తీవ్రంగా కొట్టినట్లు తెలిపాడు. కాగా జైశ్వాల్ కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబీకుల ప్రాణాలకు ముప్పు ఉందని దుకాణ యజమాని కాంచన్ మీడియా తెలిపింది. జైశ్వాల్ ఆత్మాహుతికి ప్రతీకారం తీర్చుకుంటామని అతని కుటుంబీకులు బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీంతో తమ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పారు. మొత్తానికి రెండు సమాసాలకు సంబంధించిన రూ.5ల గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోవడం మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింద.  ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.