రెండో దశ పోలింగ్ షురూ

ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.

అలాగే త్రిపుర, జమ్మూ కాశ్మీర్ లలో కూడా ఒక్కో స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. రెండో దశలో మొత్తంగా 88 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా 1202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న  తొలి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తొలి దశలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ దశలో పోలింగ్ శాతం పెరిగేలా అన్ని చర్యలూ తీసుకుంది.

ఇక బీజేపీ అయితే తొలి దశలో తమ పార్టీ పెర్ఫార్మెన్స్ పై ఒకింత అసంతృప్తితో ఉంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. విపక్షాలపై విమర్శల డోస్ పెంచారు. మతపరమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు వచ్చారు.  విపక్షాలు ఓటమి భయంతోనే మోడీ సమాజంలో విద్వేషాలు సృష్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.