లవర్ పెళ్లి ఆపాలని సీఎం కి యువకుడి ట్వీట్..

ఒక యువతి, యువకుడు ఇద్దరు కలిస్తే ఒక బంధం. ఆ బంధానికి పెట్టుకున్న పేరే ప్రేమ. ఇక ఈ ప్రేమ పేరుతో ఆ ప్రేమ పక్షులు చెయ్యని పనులులేవు. ఇక ఈ ప్రేమకు తోడు ఇప్పుడు మరో సోషల్ మీడియా తయారు అయింది. సోషల్ మీడియా సహాయంతో ఇంకా రెచ్చిపోతున్నారు ప్రేమికులు. తాజాగా తన ప్రియురాలి పెళ్లి ఆపించాలని నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికే  ట్వీట్ చేశాడు ఒక యువకుడు.. అసలు ఏం జరిగిందో మీరే తెలుసుకోండి. 

ప్రస్తుతం యువకుల ప్రేమను పొందాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుని ఆ ప్రేమ ఫలించాలంటే అబ్బాయికి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉండాలి, అమ్మాయి సేమ్  క్యాస్ట్ అయ్యి ఉండాలి. అలా ఉంటేనే అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ప్రేమ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తారు. లేదంటే తమకిష్టమైన అబ్బాయికిచ్చి పెళ్లిచేస్తారు. ఇక అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి ఏమి చేయలేక.. ఎలాగైనా తన ప్రియురాలి పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దానికోసం తన స్నేహితుల హెల్ప్ తీసుకొంటాడు.. లేకపోతే ఇంకొంచెం తెగించి తమ కుటుంబ సభ్యుల సాయం కోరతాడు. అయితే ఇక్కడ ఓ యువకుడు తన ప్రియురాలి పెళ్లి ఆపాలని ఏకంగా సీఎంనే అడిగాడు. తన ప్రియురాలి తండ్రి తనకు గవర్నమెంట్ జాబ్ లేదని పెళ్ళికి నిరాకరించాడని తెలుపుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే..

కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ లో గతకొన్నిరోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెల్సిందే. అయితే మే 13 న బీహార్ సీఎం నితీష్ కుమార్ లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు ట్వీట్ చేశారు. “మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యాం.. లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల సానుకూల ఫ‌లితాలు వ‌చ్చాయి. క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. ఈ క్ర‌మంలో మ‌రో 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమలులోనే ఉంటుంది.  మే 16 నుంచి 25వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తున్న‌ట్లు” ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ కి పంకజ్ కుమార్ గుప్త అనే యువకుడు స్పందిస్తూ  “సార్.. మీరు పెళ్లిళ్ల‌ల‌పై నిషేధం విధిస్తే.. మే 19న జ‌ర‌గాల్సిన తన ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది. నా ప్రియురాలితో పెళ్ళికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు.. ఎందుకంటే  నాకు గవర్నమెంట్ జాబ్ లేదని.. దయచేసి మిరే నా ప్రియురాలి పెళ్లి ఆపాలి.. ఇందుకు నేనెప్పుడూ మీకు కృతజ్ఞత గా ఉంటాను” అంటూ ట్వీట్ చేశాడు. ఈ యువకుడు ఒక్క సీఎం కే కాదు నటుడు సోనూసూద్ కి సైతం తన ప్రియురాలి పెళ్లి ఆపాలంటూ ట్వీట్ చేశాడు.  ప్రస్తుతం ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
    


 

   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu