7ఏళ్ల పిల్ల‌.. 15 ఏళ్ల అమ్మాయిగా తిరిగొచ్చింది!

ఆట‌కి వెళ్లిన పిల్లాడు తిరిగివ‌చ్చాడు, ఆఫీసుకి వెళ్లిన నాన్న తిరిగివ‌చ్చాడు, ప‌క్కింటి పిల్ల‌దీ కాలేజీ నుంచి వ‌చ్చేసింది, పూజా గౌడ్ మాత్రం తిరిగి రాలేదు. త‌ల్లికి ఆతృత‌తో పాటు భ‌యంప‌ట్టుకుంది. ఎవ‌ర‌న్నా కిడ్నాప్ చేశారా? చంపేసారా? అని భ‌యంతో భ‌ర్త‌ను తీసుకుని పోలీస్ స్టేష‌న్‌కి ప‌రుగు తీసింది ఏడుస్తూ. ముంబైలో 2013 జ‌న‌వ‌రి 22వ తేదీన డిఎన్ న‌గ‌ర్ ప్రాంతంలో ఈ సీన్ అక్క‌డివారికి ఇంకా గుర్తే. పోలీసుల రికార్డుల్లో ఆ పిల్ల పేరు మిస్సింగ్ గ‌ర్ల్ 166!  చిత్రంగా 166 పిల్ల ప‌ద‌హారేళ్ల అమ్మాయిగా 2015లో తిరిగి త‌ల్లి వ‌ద్ద‌కు వ‌చ్చింది! యావ‌త్ డిఎన్‌న‌గ‌ర్ వాసులూ ఆశ్చ‌ర్య‌పోయారు.. ఇదెలా సాధ్య‌మ‌ని. ఇన్నాళ్లూ ఎటెళ్లిపోయావే పిల్లా అని అడ‌గ‌ని అమ్మ‌ల‌క్క‌లు లేరు. 

బ‌డికి వెళ్లిన పిల్ల‌లు, చాక్లెట్ల‌కోసం బ‌య‌టికి వ‌చ్చిన పిల్ల‌లు ఇలా చాలామంది క‌నిపించ‌కుండా పోయారు. అదో పెద్ద మిస్ట‌రీగా మారింది. వారిలో కొద్దిమందే పోలీసుల‌కు దొరికారు. మిగ‌తా వారు చ‌ని పోయి ఉంటార న్న న‌మ్మ‌కంతో కేసును ద‌ర్యాప్తు చేయ‌డంకూడా మానేశారు. పూజా విష‌యంలోనూ దాదాపు అదే ఆలోచ న‌లో ఉన్నారు. అప్ప‌టి ఈ కేసుల‌కు సంబంధించిన ఇన్‌ఛార్జ్  ఏ ఎస్ ఐ రాజేంద్ర భోంస్లే అయితే పూజా త‌ల్లి దండ్రుల‌కు ఆశ‌లు వ‌దులుకోమ‌నే చెప్పారు. ఆయ‌నా వెతికి వెతికి వేసారి అదే నిర్ధారించు కున్నారు. కానీ ఆయ‌న రిటైర‌యిన త‌ర్వాత పూజా ఎక్క‌డో బ‌తికే ఉంద‌న్న అనుమానం రానే వ‌చ్చింది. ఏదో ఒక‌రోజు ఆమె త‌న త‌ల్లిదండ్రుల‌ను చేరుకుంటుంద‌ని అంటూం డేవారు. ఇప్ప‌టికీ ఆ పిల్ల స్కూలు ఫోటో త‌న ప‌ర్సులో పెట్టుకునే ఉన్నారు. ముంబైకి వ‌చ్చిన‌పుడ‌ల్లా ఈ కేసు సంగ‌తి విచారిస్తూండేవార‌ట‌. 

ఆరోజు పూజ త‌న అన్న రోహిత్‌తోపాటు స్కూలుకి వెళ్లింది. వాళ్ల అమ్మ‌మ్మ ఇచ్చిన పాకెట్ మ‌నీ కోసం అక్క‌డ ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. రోహిత్‌కి కోపం వ‌చ్చి దూరంగా ఎటో వెళిపోయాడు. ఆ స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన హారీ డిసౌజా, అత‌ని భార్య సోనీ  ఈ  పిల్ల‌ని చూశారు. డి సౌజా ఎల‌క్ట్రీషియ‌న్‌.   పిల్ల‌కి  ఐస్ క్రీమ్ కొనిచ్చి మ‌రి ఏమి  చెప్పి మాయ చేశారో తెలీదు గాని పూజా స్కూలు గేటు లోప‌లికి వెళ్లే లోప‌లే ఆమెను తీసికెళిపోయారు. వారికి సంతానం లేదు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో, వారు ఆమెను ఎలా పెంచార‌న్న‌దీ ఎవ‌రికీ తెలీదు. పోలీసుల‌కీ తెలీదు. మ‌రి ఆమె 15 ఏళ్ల అమ్మాయిలా  ఇంటికి ఎలా చేరింద‌నేది ఇప్ప‌టికీ మిస్ట‌రీయే. పిల్ల ఇంటికి వ‌చ్చేసింద‌న్న ఆనందంలో ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌ల్లిదం డ్రులు, చుట్టుప‌క్క‌ల‌వారూ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదు.