బస్సు ప్రమాదం.. 50 మంది మృతి

 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 50 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయ్యేలా చేసింది. ఈ దుర్ఘటన పాకిస్థాన్ సింధ్ ప్రావెన్స్‌లోని దక్షిణ సూక్కూర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగంతో నడపడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ మీదకి దూసువెళ్ళింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న గ్యాస్ సిలెండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు ప్రయాణికులలో 50 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా వుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని, డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu