కోకాకోలా బెదుర్స్.. ఫెవికాల్ అదుర్స్.. వాట్ ఆన్ ఐడియా..
posted on Jun 18, 2021 3:53PM
కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కంటే.. బ్రేక్‌లో వచ్చే యాడ్సే బాగుంటాయనేది కొందరి అభిప్రాయం. మిగతా యాడ్స్ మాట ఎలా ఉన్నా.. అన్నిటిలోకీ ఫెవికాల్ యాడ్ సంథింగ్ స్పెషల్. ఇప్పటి వరకూ ఇండియన్ యాడ్ ఇండస్ట్రీలో ఫెవికాల్ ప్రకటనల్లో కనిపించేంత క్రియేటివిటీ మరే అడ్వర్టైంగ్‌లోనూ కనిపించదని అనేక మంది అంటుంటారు. కాలాన్ని బట్టి ఎప్పటికప్పుడూ అప్‌డేట్ అవుతున్నా.. కొత్తగా వచ్చే ప్రతీ ఫెవికాల్ యాడ్ కూడా ఆడియన్స్‌ను అంతకుమించి ఆకట్టుకుంటున్నాయి. ఫెవికాల్.. ఈ బంధం ధృడమైనది.. డౌట్ ఉంటే యూట్యూబ్‌లో ఫెవికాల్ యాడ్స్‌ను సెర్చ్ చేసి చూడండి.. క్రియేటివిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలుస్తుంది..
లేటెస్ట్‌గా ఓ పోస్టర్ రూపంలో రిలీజ్ చేసిన ఫెవికాల్ యాడ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వారెవా.. టైమింగ్ అంటే, క్రియేటివిటీ అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో టేబుల్ మీద ఉన్న రెండు కోకాకోలా బాటిల్స్‌ను తీసి పక్కనపెట్టేశాడు స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. వాటర్ తాగాలంటూ చేతులతో సైగలు చేశాడు. రొనాల్డో దెబ్బకు కోకాకోలా షేర్ వ్యాల్యూ ఒక్కరోజులోనే ఏకంగా 29వేల కోట్లు పతనమవడం సంచలనంగా మారింది. వాల్డ్ వైడ్ ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్‌గా మారింది. ఇదే కాన్సెప్ట్‌ని తమకు అనుగుణంగా మార్చి ఫెవికాల్ తాజాగా ఓ యాడ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అంతే. ఆ యాడ్ చూసి నెటిజన్లు అబ్బురపడుతున్నారు.
ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ టేబుల్ మీద రెండు ఫెవికాల్ డబ్బాలు పెట్టి.. "బాటిల్ జరగదు.. విలువ పడదు.." అంటూ క్యాప్షన్ జోడించారు. అంతే. ఇంకేమీ ఉందడు. చూట్టానికి సింపుల్‌గానే ఉన్నా.. కోకాకోలా-రోనాల్డో ఎపిసోడ్ జరిగిన వెంటనే సేమ్ థీమ్‌తో ఇలా రివర్స్‌లో ఫెవికాల్ పోస్టర్‌ను ట్విటర్‌లో రిలీజ్ చేయడం అడ్వర్టైజింగ్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫెవికాల్ యాడా-మజాకా.. యాడ్ అదుర్స్.. హ్యాట్సాప్ అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.