ఏపీ మద్యం కుంభకోణం కేసులో తొలి చార్జ్ షీట్
posted on Jul 19, 2025 9:26PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. శనివారం (జులై 18)న ఈ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్.. ఆ చార్జిషీట్ లో కీలక విషయాలను పేర్కొంది. దాదాపు 300 పేజీల ఈ చార్జ్ షీట్ లో వందకు పైగా ఫోరెన్సిక్ నివేదికలను పొందుపరిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటి వరకూ . 62 కోట్ల రూపాయలను సీజ్ చేసిట్లు పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించి 268మంది సాక్ష్యులను విచారించి, అరెస్టు చేసిన 11 మంది నిందితుల స్టేట్ మెట్లను కూడా ఆ చార్జ్ షేట్ లో పేర్కొంది.
బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో మద్యం అక్రమ సొమ్మును పెట్టుబడులుగా పెట్టినట్లు సిట్ పేర్కొంది. అలాగే షెల్ క ంపెనీల ద్వారా మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సిట్ పేర్కొంది. అలాగే మద్యం అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలు, బంగారం దుకాణాలలో పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలను, నిందితులు, సాక్ష్యుల స్టేట్ మెంట్లనూ కూడా సిట్ ఆ చార్జ్ షీట్ లో పేర్కొంది. కాగా సిట్ శనివారం (జులై 19)న అరెస్టు చేసిన వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మిధున్ రెడ్డి పేరును ఈ చార్జ్ షీట్ లో ప్రస్తావించలేదు. మిథున్ రెడ్డిని ఆదివారం (జులై 20) న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరే అవకాశం ఉంది. .