పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు
posted on Feb 20, 2021 9:30AM
ఊసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్! అన్నాడు మహా కవి గురజాడ. అది నిజమే కదా. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య వంతమైన సమాజంతోనే అభివృద్ధి అన్నది నిజం అయినా ఏ కార్యం సాధించాలన్నా మొదట ఉత్సాహం ఉంటేనే ఏ పనైనా చేయగలం ఇది నిజం . శారీరకంగా గానీ, మానసికంగా కానీ శరీరంలో శక్తి హరించుకుపోయినట్లుగా నీరసంగా అలసటగా ఉంటే ఆవ్యక్తి ఏపని చేయలేడు దీనినే వైద్య పరిభాషలో fatigue అంటారు. జీవితంలో ప్రతి వాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు fatigue తో సమస్యలు ఎదుర్కోడం సహజం. అలా ఉండకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి. శరీరంలో నీరసంగా అలసటగా వున్నట్లు అనిపించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్య కారణం సరైన పోషక ఆహారం తీసుకాకపోవడం, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం లేదా మానసిక ఒత్తిళ్లకు లోనుకావడం కారణమని వైద్యులు అంటున్నారు. శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు లేకపోతే శరీరంలో శక్తి సరిపడా ఉత్పత్తి కాదు. దీని వల్ల జరిగే మొట్టమొదటి నష్టం జీవితం పట్ల ఉత్సాహం చచ్చి పోవడం. చర్మంలో మృదుత్వం పోతుంది. రోమాలు రాలిపోతాయి. గోళ్ళలలో పగుళ్ళు వస్తాయి. ఇవన్ని ఆ మనిషి అనారోగ్యానికి గురౌతున్నడానికి ప్రధమ సూచనగా భావించాలి. ఇందులో నుండి బయట పడాలంటే నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.
1) వారానికి ఒక్క రోజైనా పళ్ళు ఫలాలు తీసుకోవాలి.
1) అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకునే మాంసం కొవ్వు, జున్ను లాంటి ఆహారాలను తప్పుడు కాంబినేషన్లో రెగ్యులర్ గా ఎక్కువ తీసుకుంటే మనిషిలో అలసట అనిపిస్తుంది. దురదృష్టం ఏమిటి అంటే చాలా మంది వారం పొడుగునా నాన్ వెజ్ లేకపోతే ముద్దే దిగదు. అలా తింటేనే వాళ్ళకు భోజనం సంతృప్తిగా తిన్నట్లు ఉంటుందని అంటారు.
2) వారంలో ఒక్క రోజైనా మరి ఏ ఇతర ఆహారానికి పోకుండా కేవలం తాజా పళ్ళు ఫలాలను , మంచి నీళ్ళతోనూ మాత్రమే తీసుకుంటే వారమంతా తిన్న ఆహరం అరగడానికి పేగులు పడ్డ శ్రమకు కాస్త రెస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. శరీరంలో కొత్త ఉత్తాహం వస్తుంది.
2 ) ప్రేరక పానీయాలు వద్దు.
ఉప్పు, పంచదార, కాఫీ, టీ మసాల కూరలు ఆల్కాహాల్ , సిగరెట్ లాంటివి మీ ఒంట్లో శక్తిని హరిస్తాయి, అలాగే అతిగా సెక్స్ కార్య క్రమాలలో పాల్గొంటున్న పైన చెప్పిన వన్నీ అతిగా తీసుకుంటే అడ్రినాల్ వ్యవస్త చిన్నా భిన్నమవుతుంది.
3) ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుంటే రక్తంలో గ్లుకోజ్ శాతం తగ్గిపోయి హై పోగ్లైసీమియా సంభవించే ప్రమాదం ఉంది. దాని మూలంగా కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం మనస్సుకు శరీరానికి సమన్వయము లోపించి వ్యక్తి పూర్తిగా నీరసించిపోతారు. ఈ లక్షణాన్ని గుర్తించి సత్వరం ఆహరం తీసుకోడం అవసరం.
4 ) రిలాక్స్ - రిలాక్స్
చాలా మంది అన్నం తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోవడం లేక పనుల్లో నిమజ్ఞ మవ్వడం లాంటివి అలవాటుగా వుంటాయి. అలా కాకుండా భోజనం చేసిన తరువాత తప్పకుండా కొద్ది సేపు రిలాక్స్ కావాలి . లేదా కొద్ది సేపు రెస్ట్ తీసుకోవాలి ఆ తరువాత మాత్రమే పనుల్లో పాల్గొనాలి. భోజనం తరువాత ఎంత సేపు రిలాక్స్ కావాలి తక్కువలో తక్కువ పావుగంట అని వైద్యులు సూచించారు.
5) బాగా నీళ్ళు తాగాలి.
నిజం చెప్పాలంటే చాలా మంది రోజూ తమకు సరిపడే నీటిని తాగుతూ ఉంటారు. మరీ తక్కువగా నీళ్ళు తాగడం వల్ల శరీరం లో మల బద్ధకం పెరుకుతుంది. శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు బయటికి వెళ్ళక అదే శరీరానికి అలసటకి దారితీస్తుంది.
6 ) పరిశుభ్ర మైన ఆహారం.
ఈ రోజుల్లో కూరగాయలలో క్రిమిసంహారక మందులు చల్ల బడని పళ్ళు , కాయగూరలు ఉండడం లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఈ క్రిమిసంహార మందులు పళ్ళు కూరాగాయలలో సైతం లోపలికి ఇంకిపోతాయి.అయినా వాటిని శుభ్రంగా తుడిచి కదగకపోతే వాటి వల్ల మన శరీరానికి హాని చేస్తాయి. వీటిలో దుమ్ము ధూళి బ్యాక్టీరియా లాంటివి శుభ్రంగా కడిగిన తరువాతే కూరగాయలు, పళ్ళను తినడానికి ఉపయోగించాలి. పళ్ళు ముఖ్యంగా కృత్రిమ రసాయనలతో పండిస్తారు ఎర్రగా కనపడడానికి వివిధ రసాయనాలు పూస్తారు. అందుకే వాటిని కొనేటప్పుడు, వాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
7 ) ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తీసుకోవడం.
ఉదయాన్నే అంటే నిద్రనుంచి లేవగానే మొహం కడుక్కొని ఒక గ్లాసు గోరు వెచ్చటి నేటిలో తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగితే అది నిద్రమత్తును వడిలించి శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే బాయిల్ చేసి చల్లార్చిన నీటిని గోరు వెచ్చటి ఉన్నపుడే తాగితే మంచింది . ముందే పిండుకున్న రసాన్ని లేదా నిల్వ ఉంచిన నిమ్మ రసాన్ని కాకుండా అప్పుడే పిండుకుని తాగి తేనే అందులో పోషక విలువలు నశించి పోకుండా వుంటాయి. అదే శ్రేష్టం. అంటున్నారు వైద్యులు.
8) పళ్ళు ఫలాలు
కొందరు అన్నం తిన్నాక ఆకర్లో అరటి పండు తినడం లేక ఆయా సీజన్లో వచ్చే పళ్ళు ముఖ్యంగా ఎండా కలంలో మామిడి పండ్లు తింటారు. అన్నంతో గానీ , అన్నం తిన్న వెంటనే గానీ పళ్ళు తీసుకుంటే అజీర్ణం , తేన్పులు , గుండెల్లో మంట లాంటి వాటికీ దారితీస్తుంది.
వేగంగా జీర్ణమయ్యే పళ్ళు ఫలాలను నిదానంగా జీర్ణమయ్యే ప్రోటీన్ లు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారంతో పాటు తీసుకుంటే వాటిలో ఏది సరిగ్గా జీర్ణం కాదు. అందుకని పళ్ళను అన్నం తినడానికి బాగా ముందు కాని , భోజననికి, భోజనానికి మధ్య సమాయంలో గాని తీసుకోడం మేలు అంటున్నారు వైద్యులు.
9) ఆహారాన్ని బాగా నమలండి
ఆహారం జీర్ణం కావడం మొదట నోటిద్వారా ప్రారంభమౌతుంది. అందుకని ఆహారంలోని ఉత్తమ విలువలు శరీరానికి లభించాలంటే ఆహారం బాగా నమిలి మింగాలి. మన నోటిలో దంతాలు ఉన్నది లాలాజలం ఊరుతోంది ఇందు కోసమే అందుకే ఆహారం లాలాజలంలో కలిసి జీర్ణమయ్యేందుకు సహాకరిస్తుంది. సో.. ఆహారం గబాగబా మింగేసి పరుగు పెట్టకుండా పూర్తిగా నమిలి తినండి అంటున్నారు వైద్యులు.
10) వొంటికి నలుగు
శరీరానికి బాగా అలసట వచ్చినప్పుడు శరీరానికి మర్దనా చర్మానికి మర్దన జరగడం వల్ల లోపల రక్త ప్రసరణ సక్రమంగా సజావుగా జరుగుతుంది. చర్మాన్ని మర్దనా చేయడం వల్ల శరీరంలో ని లింఫ్ గ్రంధుల వ్యవస్త రీచార్జ్ అవుతుంది శరీరం లోపల ఉన్న విషపూరిత పదార్ధాలు త్వరగా విస్తరించి దీని వల్ల శరీరానికి కిక్ ఇస్తుంది గేర్ వేసినా బండిలా మనిషి దూసుకు పోతాడు.
1 1 ) బరువు తగ్గండి
ఒళ్ళు చేయడం మంచిదే అయితే ఒంటికి తగ్గబరువు ఉండాలి. అయితే వొళ్ళు ఊబాకయంతో ఉంటే త్వరగా అలిసిపోతారు. మరీ తక్కువ తిన్న కూడా అంతే జరుగుతుంది. అధికా శరీరాన్ని తగ్గించుకోడానికి తెలికైన మార్గం ఏమిటి ఆహారంలో గుజ్జు ప్రోటీన్లు కలిపి తీసుకోకూడదు. ఉదాహరణకు ప్రోటీన్లతో కూడుకునివుండే చేపలను స్ట్రాచ్ తో కూడుకుని ఉండే వరి అన్నంతో కలిపి ఒకేసారి తీసుకోకూడదు. అందుకు బదులుగా చేపలను సలాడ్ తో కలిపి లంచ్ టైంలో తీసుకుని సాయంత్రం వరి అన్నాన్ని కోరాగాయలతో కలిపి తీసుకోవాలి.
లేదంటే లంచ్ కింద ఆమ్లెట్ ని తీసుకుని సప్పర్ కింద అన్నంలో బంగాళాదుంప కూరని తీసుకోవచ్చు. ఈ రకం ఆహార పద్దతులల వల్ల జీర్ణం తేలికగా జరిగి మీ బరువు మీ కంట్రోల్ లో ఉంటుంది. శరీరంలో ఉత్సాహం పుంజుకుంటుంది.
1 2 ) అవసర మైతే విటమిన్లు.
మీకు మరీ నీరసంగా , అలసటగా ఉంటే డాక్టర్ సలహా మేరకు ఒక కోర్స్ కింద విటమిన్ మాత్రలు వాడవచ్చు. ఏ విటమిన్ ఎలా తీసుకోవాలి వాటిని వాడాల వద్ద అనేది డాక్టర్ నిర్ణయించాలి. తప్ప మీకు మీ శరీరతత్వాన్ని బట్టి మిత్రులా సలహా మేరకో, వేరొకరి సూచన మేరకో సొంత నిర్ణయంతో మాత్రలు .వాడొద్దు అవి ఒక్కోసారి వికటించడం లేదా తీవ్ర ఇబ్బందులు వస్తాయి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించాలి.
1 3 ) విటమిన్ బి
శరీరంలో శక్తి పుంజుకోవాలంటే విటమిన్లు బాగా దోహదపడతాయి. అలిసిన శరీరానికి బ్యాలెన్స్ తో కూడుకున్న బి కాంప్లెక్స్ విటమిన్ ఎంతో మేలు చేస్తుంది. అలసటగా నీరసంగా అనిపించే వాళ్ళు మెగ్నీషియం విటమిన్ సి తో పాటు బి కాంప్లెక్స్ కల మందులకోసం డాక్టర్ ను సంప్రదించాలి.
1 4 ) దీర్ఘ కాలం దయిటింగ్ కు దూరంగా ఉండండి.
బాగా లావుగా ఉన్నాను కాస్త డైటింగ్ చేయచ్చుగా. అని సలహా ఇస్తే అదే పనిగా డైటింగ్ చేయడం వల్ల ముఖ్యంగా కొవ్వు తక్కువగా వుండే ఆహారాన్ని తీసుకుంటే చర్మం పొడిబారడం హార్మోన్ ఉత్పత్తి లోపించడం వల్ల థైరాయిడ్ , మేటాబాలిక్ డిజర్దార్లు వస్తాయి హార్మోన్ ఉత్పత్తిలో సమాతూకం లేకుంటే స్త్రీలలో జననేద్రియంలో నీటి బుడగలు, సంతాన లేమివంటి సమస్యలు కీళ్ళ నొప్పులు , అలసట, దీర్ఘకాలంతో పాటు కొన్ని ఆనారోగ్య లక్షణాలు చోటు చేసుకుంటాయి. సో సే నో టు డైటింగ్ ఏమంటారు ?
1 5 ) వర్రేలకు దూరంగా ఉండండి.
ఆధునిక సమాజంలో అన్ని సమస్యలే వరీలకు వయస్సుతో సంబంధం లేదు. అయినా మన మనసును క్రుంగదీసే వత్తిళ్ళు ఒత్తిడి మనిషిని హరించివేస్తాయి. మీ ఆందోళనలు సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరితో అయినా పంచుకుంటే ఆ భారం తగ్గుతుంది. అలా కాకుండా మీ మనసులోనే ఉంచుకుంటే మానసికంగా కుంగిపోతారు, మామూలు అనారోగ్యానికి చికిత్సా ఉందికానీ మానసిక అనారోగ్యానికి చికిత్స లేదు.
1 6 ) నిదానంగాఘా డ శ్వాస.
ఒత్తిల్లతో కుంగిపోయే వాళ్ళు శ్వాసను గాడంగా తీసుకోకుండా పై పైన గాలిని పీల్చుకుంటూ సరి పెట్టుకుంటారు. దీనిని హై పర్ వెంటివెంటి లేషన్ అంటారు. శ్వాసను ఇలా పై పైనే పీల్చుకోవడం వల్ల మీరు త్వరగా అలసటకు గురి అవుతారు.
అలాంటి వాళ్ళు అపుడప్పుడూ గాడ శ్వాసనకు సంబంధించి ఈ క్రింద పేర్కొన్న బ్రీతింగ్ ఎక్సర్ సైజు ను చేస్తూ ఉండడం మంచిది. కడుపును లోపలి లాక్కుంటూ మీలోపల ఉన్న గాలినంతా ముక్కు ద్వారా బయటికినేట్టి వేయండి. తరువాత నేమ్మదిగా గాడంగా ముక్కు ద్వారా గాలిని లోపలి కి పీల్చుకోవాలి ఇలా పీల్చుకున్నప్పుడు చాతి కదలకుండా వుండి. పొట్ట అలలా పై కి లేవాలి. మీ ఊపిరితిత్తుల నిండా గాలి నిండడానికి 1 ౦ సెకండ్ల సమయం పడుతుంది. తిరిగి గాలి మొత్తాన్ని బయటికి వదిలేస్తూ రిపీట్ చెయ్యాలి. ఈ ఎక్సర్ సైజు ను చేస్తున్నపుడు మీరు పీల్చేగాలి కలుషితంగా ఉండకూడదు.
ముఖ్య గమనిక:- సాధారణ అలసట విటమిన్ బి 1 2 లేక ఐరన్ లోఫంతో కూడుకున్న రక్త హీనత కారణంకావచ్చు. థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయక పోవటమూ కారణం కావచ్చు పైన చెప్పిన సూత్రాల్నిపాటిస్తూ కూడా మీలో అలసట , నీరసం పోకపోతే డాక్టరు ను సంప్రదించి పరీక్ష చేయించండి. ఇవే పండంటి ఆరోగ్యానికి 1 6 సూత్రాలు.