మహేష్ '1' నేనొక్కడినే టీజర్ కి రికార్డ్ వ్యూస్
posted on Aug 13, 2013 11:06AM

టాలీవుడ్ లో మహేష్ బాబు హంగామా కొనసాగుతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న మహేష్, దూకుడు సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజున విడుదలైన ’1′ సినిమా టిజర్ కి రికార్డ్ స్థాయిలో క్లిక్స్ వచ్చాయి. మూడు రోజుల్లో ఏకంగా పదిలక్షల వ్యూస్ వచ్చాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ చిత్రం రెండో టీజర్ కూడా కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది.
సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధంచేస్తున్నారు. కృతి సనన్ కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు.