ఐటమ్ గర్ల్ గా ఐష్
posted on Aug 8, 2013 9:04PM
బాలీవుడ్ తో పాటు యావత్ భారతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోనే ఉంది. భారతీయుల అందాల రాశి ఐశ్వర్య రాయ్ మళ్లీ వెండితెర మీద తళుక్కుమననుంది. ప్రెగ్నెన్సీ తరువాత సినిమాలకు దూరం అయిన ఐష్ దాదాపు కొద్ది సంత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉంది.
అయితే ఆర్యాధ్య పుట్టిన దగ్గర నుంచి ఐష్ రీ ఎంట్రీ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కాని ఇంతవరకు ఒక్క సినిమా కూడా సెట్స్ వరకు రాలేదు. అయితే త్వరలో ఐష్ ఓ సినిమాలో నటించనుందన్న మాట బాగా వినిపిస్తుంది. అది కూడా ఓ ఐటమ్ సాంగ్ లో అనటం అభిమానులు మరింతగా ఉబ్బి తబ్బిబ్బలవుతున్నారు.
ప్రముఖ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే 'రామ్ లీలా' సినిమాలో ఐటెం సాంగు చేయడానికి ఐశ్వర్య అంగీకరించిందట. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈసినిమాకు ఐష్ అందాలు మరింత ప్లస్ అవుతాయని భావిస్తున్నారు చిత్రయూనిట్. మరి రీఎంట్రీ ఐష్ ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.