వైఎస్ తెలంగాణ పాలిట రాక్షసుడు

 

 YSR KTR, ysrcongress KTR, trs jagan, jagan ktr, jagan telangana

 

కేసిఆర్ తనయుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటిఆర్ వైఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం చేతికి అందాక తెలంగాణ పాలిట యముడిలా..సైంధవుడిలా మారాడు. టీఆర్ఎస్ అండతో అధికారం చేజిక్కించుకుని ఆ తరువాత మిత్ర ద్రోహం చేశాడు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ ముగిశాక తెలంగాణకు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలి..వీసా కావాలి అని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టాడు’’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.


జగన్ పార్టీ నేతలు వైఎస్ దేవుడు అని వేదాలు వల్లిస్తున్నారని, వైఎస్ తెలంగాణకు అంతా చేసింది ద్రోహమేనని విమర్శించారు. రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, అంతేకాని తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu