టీఆర్ఎస్ ‘సమరభేరి’

 

Telangana Rashtra Samithi, TRS smarabheri, KCR telangana, kcr telangana issue

 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉదృతం చేసేందుకు టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆదివారం ‘సమరభేరి’ సభ నిర్వహిస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలలో ప్రజలను సమాయాత్తం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. దానికితోడు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైపు నాయకులు వెళ్లకుండా వాళ్లకు ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ అని చాటి చెప్పేలా కేసీఆర్ ఈ సభను నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా పార్టీ శ్రేణులన్నీ సభ కోసం భారీ ప్రచారం చేశాయి.



10 జిల్లాల నుండి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. 40 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షలమంది హాజరవుతారని అంచనా. ఈ సభకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంల తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30నిషాలకు తెలంగాణ సమరభేరి సభ ప్రారంభం కానుంది. నేడు సమరభేరి సభ జరగనున్న నేపధ్యంలో సూర్యాపేట గులాబిమయమైంది. తెలంగాణ జిల్లాల నుంచి సభకు వచ్చే వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu