బండి పోయి రెడ్డి వ‌చ్చే.. కేసీఆర్ టార్గెట్ షిఫ్ట్ అందుకేనా?

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను కుమ్మేశారు. యాసంగిలో వ‌రి పండించాలంటూ బండి ఇచ్చిన పిలుపుపై ముఖ్య‌మంత్రి విరుచుకుప‌డ్డారు. దీక్ష కూడా చేశారు. క‌ట్‌చేస్తే, కేసీఆరే దీక్ష‌కు దిగొచ్చేలా చేసిన మొన‌గాడంటూ బండి సంజ‌య్‌కు ఒక్క‌సారిగా ఫుల్ క్రేజ్‌. బండి ఏ జిల్లాకు వెళితే అక్క‌డ గులాబీ నిర‌స‌న‌లు. బీజేపీ నేత‌ల ఎదురుదాడులు. ఇలా వ‌రి ఎపిసోడ్ అంతా కేసీఆర్ వ‌ర్సెస్ బండి సంజ‌య్ అన్న‌ట్టుగా మారి.. బండికి తెగ పొలిటిక‌ల్ మైలేజ్ వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత తెలిసింది కేసీఆర్‌కు తాను చేసిన చిన్న‌ త‌ప్పు ఏంటో.

వ‌రిపై కేంద్రాన్ని, బీజేపీని దోషిగా చూపించ‌డంలో కేసీఆర్ కాస్త‌ స‌క్సెస్ అయ్యార‌నే అంటున్నారు. ప‌రోక్షంగా హుజురాబాద్ ఓట‌మి, ఈట‌ల గెలుపు, ద‌ళిత‌బంధు టాపిక్ అట‌కెక్కింది. ప్ర‌జ‌ల న‌జ‌ర్ అటు నుంచి ఇటు షిఫ్ట్ చేయ‌డంలో మాత్రం కేసీఆర్ ఫుల్ స‌క్సెస్‌. కానీ, వ‌రి ఎపిసోడ్‌లో కేసీఆర్‌కంటే సంజ‌య్‌కే ఎక్కువ‌ క్రెడిట్ వ‌చ్చింది. ఇదేదో తేడా కొట్టేలా ఉంద‌ని గులాబా బాస్ వెంట‌నే గెస్ చేశారు. ఆ వెనువెంట‌నే టార్గెట్ కాస్త డైవ‌ర్ట్ చేశారు. తుపాకీని బండి సంజ‌య్ నుంచి కిష‌న్‌రెడ్డి వైపు మ‌ళ్లించారు. బండి కంటే కేంద్ర‌మంత్రిపై మ‌రింత తిట్ల డోస్ పెంచారు. రండ అనే స్థాయి వ‌ర‌కూ వెళ్లిపోయారు. ఇక అంతే. టాపిక్ అంతా కేసీఆర్ వ‌ర్సెస్ కిష‌న్‌రెడ్డి అన్న‌ట్టుగా మారిపోయింది. బండి వెన‌క‌బ‌డింది. 

కేసీఆర్ యాక్ష‌న్‌.. పీకే డైరెక్ష‌న్‌..! గులాబీబాస్ కోసం ఐ ప్యాక్‌?

ఎంత కాద‌న్నా.. ఎంత‌గా వేరువేరు పార్టీలే అయినా.. కేసీఆర్‌-కిష‌న్‌రెడ్డిలు స‌న్నిహితులేన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్‌. సౌమ్యుడిగా పేరున్న కిష‌న్‌రెడ్డి.. కేసీఆర్‌పై స్మూత్‌గానే అటాక్ చేస్తుంటారు. టీఆర్ఎస్ స‌ర్కారుపై సాఫ్ట్‌కార్న‌ర్‌తోనే ఉంటారంటారు. కేసీఆర్ సైతం కిష‌న్‌రెడ్డిని పెద్ద‌గా టార్గెట్ చేసింది లేదు. బండిలా దూకుడు రాజ‌కీయం చేయ‌డం కిష‌న్‌రెడ్డికి చేత‌కాదంటారు. ఆయ‌నదంతా వైట్ కాల‌ర్ పాలిటిక్స్‌. తాను నేష‌న‌ల్ లెవెల్ లీడ‌ర్ అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. స్టేట్ పాలిటిక్స్‌లో పార్ట్‌టైమర్ మాత్ర‌మే. ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం కిష‌న్‌రెడ్డికి అంత‌గా క్రేజ్ లేక‌పోవ‌డానికి ఇదే కార‌ణం. అందుకే అలాంటి కిష‌న్‌రెడ్డిని ఎంత‌గా పైకి లేపినా.. బీజేపీకి పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించిన కేసీఆర్‌.. బండిని వ‌దిలేసి రెడ్డిని టార్గెట్ చేశార‌ని చెబుతున్నారు. కిష‌న్‌రెడ్డికి హైప్ వ‌చ్చినా.. రాక‌పోయినా.. కేసీఆర్‌కు ఉప‌యుక్త‌మే. బండి అంతటి మొండి మాత్రం కాదాయ‌న‌. కేసీఆర్‌కు కావ‌ల‌సింది ఇదే. టూ బ‌ర్డ్స్ ఎట్‌ వ‌న్ షాట్.

పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?