వెంకీ..రామ్ మల్టీస్టారర్ అప్డేట్స్

 

 

 venkatesh ram, ram venkatesh, venkatesh

 

 

ప్రిన్స్ మహేష్ బాబు తో ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' లాంటి మల్టీస్టారర్ సినిమా చేసిన విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ హీరో రామ్ తో మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘బోల్ బచ్చన్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ను మార్చి 13న లాంచనంగా ప్రారంభించి మార్చి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్, రామ్ సరసన నటించే హీరోయిన్స్, మిగిలిన వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న 'షాడో' సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu