రామ్ చరణ్ ముంబై కి షిఫ్టింగ్!

 

Ram Charan gets a Mumbai address, Ram Charan Mumbai, Ram Charan new house, Ram Charan new home

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై వెళ్ళిపోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు! రామ్ చరణ్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడంటూ 'జంజీర్' షూటింగ్ కి ముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ వార్తలకు బలం చేకూరే మరో వార్త బయటకు వచ్చింది. ముంబై లో అత్యంత ఖరీదైన ఏరియాలో రామ్ చరణ్ 12కోట్ల కి ఓ అపార్ట్ మెంట్ కనుగోలు చేశాడు. నాలుగువేల చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ని ఖార్ ఏరియాలో తీసుకున్నాడు. ఈ ఫ్లాట్ కి ఉపాసన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే చరణ్ కనుగోలు చేసినట్లు సమాచారం. 'జంజీర్' రిలీజ్ తరువాత రామ్ చరణ్ అక్కడికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. మొత్తానికి ముంబై లో చరణ్ డ్రీంహౌస్ కల నెరవేరింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu