పురందేశ్వరి రాజీనామా ఆమోదం

 

 

 

కేంద్రమంత్రి పురందేశ్వరి రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. గతంలో పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించలేదు. అయినా ఆమె పదవిబాధ్యతలు నిర్వహించడం లేదు. లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదానికి నిరసనగా పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీకి, మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజీనామాను కూడా ఆమోదించిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu