పార్వతీ పై పోలీస్ కేసు
posted on Mar 14, 2013 11:56AM

కొన్నిరోజుల క్రితం అసభ్యంగా నటిస్తున్నారంటూ అనుష్క, ప్రియమణి పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరిపోయింది. మహేష్ బాబు దూకుడు సినిమాలో ఐటెంసాంగ్ సాంగ్ తో బాగా ఫేమాస్ అయింది పార్వతీ మెల్టన్. తాజాగా ఈ బక్కపలచటి ముద్దుగుమ్మ పై ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
పార్వతీ మెల్టన్ నటించిన యమహో..యమ సినిమాలో బాగానే అందాలను ఆరబోసిందని టాక్ ఉంది. ఈ సినిమా పోస్టర్లను చూసిన కొంతమంది పార్వతి చాలా అసభ్యంగా నటించిందని ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. పార్వతీ మెల్టన్ సినిమాల్లో అనుష్క రేంజికి రాకపోయిన పోలీస్ కేసులను ఎదుర్కోవడంలో మాత్రం ఆమె రేంజికి వచ్చింది!