ఎన్టీఆర్ కు బెల్లంకొండ సింగల్ పేమెంట్..!
posted on Mar 14, 2013 12:43PM

టాలీవుడ్ లో సంచలనాలకు మారుపేరైన ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన సినిమా ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ సురేష్ యంగ్ టైగర్ కి ఒకేసారి పారితోషికాన్ని మొత్తాన్ని ఇచ్చేసి ప్రొడ్యూసర్లని షాక్ కి గురి చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడ ఒకరు. మాములుగా అయితే సినీ పరిశ్రమలో హీరోలకు విడతల వారీగా మూడు, నాలుగు వాయిదాలలో పారితోషికం అందిస్తారు. అలాంటిది ఒకేసారి భారీ మొత్తాన్ని చెల్లించాడన్న వార్త చర్చకు తెరలేపింది. అయితే గత కొంత కాలంగా బెల్లంకొండ సురేష్ చేస్తున్న పనులకు మిగతా ప్రొడ్యూసర్స్ కి నిద్ర పట్టడం లేదు.