త్వరలో మంత్రి పార్థసారథి రాజీనామా?

రాష్ట్రమంత్రి పార్థసారథి రాజీనామా చేయాల్సిన సందర్భం వచ్చిందని రాజకీయనిపుణులు తేలుస్తున్నారు. ఎందుకంటే ఆయన ఫెరా చట్టం కింద నేరం చేశారని రుజువైంది. ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు ఆయనకు మూడు లక్షల రూపాయల జరిమానా విథించింది. పైగా జరిమానా చెల్లించకపోతే పదినెలల పాటు జైలుశిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన త్వరలో రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. కెపిఆర్‌ టెలీమీడియా ప్రాడెక్ట్సు సంస్థకు మేనేజింగ్‌డైరెక్టర్‌ అయిన పార్థసారథి 1994లో పరికరాల కోసం రూ.50లక్షలు విదేశాలకు తరలించారని కోర్టు గుర్తించింది. 2001లోనే ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు మూడు లక్షల రూపాయలు జరిమానా విథించింది.


 

 ఆ జరిమానా చెల్లించకుండా తీర్పు వెలువడే సమయానికి కోర్టుకు రాకుండా పార్థసారథి గడిపేయటంపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకు సకాలంలో సమాచారం అందకపోవటం, ప్రజాజీవితంలో మంత్రిగా కొన్ని సమస్యల్లో చిక్కుకుపోవటం వల్ల కోర్టుకు హాజరుకాలేదని పార్థసారథి వివరణ ఇచ్చారు. దీంతో కోర్టు విథించిన నాన్‌బెయిలబుల్‌వారెంటును రీకాల్‌ చేసింది. అయితే ఫెరా చట్టం కింద నేరం ధృవీకరణ కావటంతో మంత్రి పార్థసారథి చిక్కుల్లో పడ్డారు. ప్రతిపక్షాలకూ ఈ విషయం చేరటంతో త్వరలో తనను రాజీనామా చేయమనే డిమాండు అన్నిపత్రికల్లోనూ, మీడియాలోనూ వస్తుందని మంత్రి పార్థసారథి ఆందోళన చెందుతున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu