దస్‌పల్లా భూములకు దొంగడాక్యుమెంట్లు?
posted on Sep 23, 2012 1:41PM
విశాఖ నగరంలోని దసపల్లాభూములకు కొందరు ఆక్రమణదారులు దొంగడాక్యుమెంట్లు సృష్టించారు. ఈ డాక్యుమెంట్ల సాయంతో వేలాది కోట్ల విలువైన ఆ భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. యథేశ్ఛగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. వందల కోట్ల రూపాయలు ఆక్రమణదారులు సొమ్ము చేసుకున్నారు. అయితే ప్రభుత్వపరంగా స్పందన వచ్చేప్పటికే ఆలస్యమైంది. దీంతో వారు చెలరేగుతున్నారు. గతంలో ఈ భములన్నీ ప్రభుత్వానివేనని ఆక్రమణదారులకు అవకాశం కల్పించిన అధికారులూ ధృవకకరిస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఉద్యోగవిరమణ చేసినందున ప్రస్తుత సిబ్బంది సాయంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే శాసనమండలిలో ఈ అంశం తీవ్రదుమారం లేపింది. వెయ్యికోట్లకు పైచిలుకు ఉన్న ఈ భూములను రక్షించుకుంటామని రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. విజిలెన్స్ సహాయంతో దర్యాప్తు జరిపిస్తామన్నారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వపరంగా కౌంటర్ దాఖలు చేయటంలో జరిగిన ఆలస్యాన్ని ప్రతిపక్షనేత దాడివీరభద్రరావు తదితరులు గుర్తు చేశారు. ఎకరం వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను వదిలేస్తే ఎలా అని నిలదీశారు. దీనిపై సభాకమిటీని కూడా వేయాలని పాలడుగు వెంకట్రావు తదితరులు డిమాండు చేశారు. రెవెన్యూ మంత్రి తన వివరణలో 1958లో గ్రౌండ్‌రెంట్ పట్టా ఇవ్వటంతో మొదలైన ఆక్రమణలు కొనసాగాయని స్పష్టం చేశారు. అన్ని చర్యలూ చేపట్టి ఆ భూమిని ఆక్రమణదారుల నుంచి వెనక్కి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.