సీఎం, స్పీకర్ దొంగ దారిలో...

 

 

తెలంగాణ బిల్లును తిప్పిపంపుతూ సీఎం చేసిన తీర్మానాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంమంత్రి, స్పీకర్ దొంగదారిలో పనికిరాని తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లుపై చర్చలో ఎటువంటి పరిష్కారాలు చూపకుండా మూజువాణి ఓటింగ్‌తో తీర్మానాన్ని ఆమోదించి పైశాచిక ఆనందాన్ని పొందారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో సీఎంకు రాజకీయ సన్యాసం తప్పదని, ప్రజలే సీఎంకు బుద్ది చెబుతారని హెచ్చరించారు.


మరోవైపు టిడిపి తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుట్రలో బాగంగానే తీర్మానాన్ని ఆమోది౦చుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన కీలక సంఘటన ఎంత బలమైనదో తెలిసినా, దాన్ని పట్టించుకోనట్టు మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత నాయకులది అమాయకత్వం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu