విభజన బిల్లును ఉభయసభలు తిరస్కరించాయి...
posted on Jan 30, 2014 2:27PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యవస్థీకరణ బిల్లును ఉభయసభలు తిరస్కరించాయని మంత్రి ఆనం రా౦నారాయణరెడ్డి, మంత్రి టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. సభలో తెలంగాణ నేతలు కూడా బిల్లు తిరస్కరణకు అనుకూలంగా ప్రవర్తించారని అన్నారు.రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా మండలిలో, శాసన సభలో తీర్మానం జరిగిందన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం కూడా రాష్ట్ర అభిప్రాయాలను గౌరవించాలని అన్నారు. శాసనసభ తిరస్కరించిన బిల్లు పార్లమెంటులో పెట్టలేరన్నారు.
ఇది చారిత్రాత్మకమైన రోజు: ఆనం వివేకా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేస్తే బాల్ పెవీలియన్ దాటి ఢిల్లీలో పడిందని, ఇది చారిత్రాత్మకమైన రోజని, దీనిని సువర్ణాక్షరాలతో లిఖించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ఓపికతో, సహనంతో సీమాంధ్ర శాసనసభ్యులు, సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకున్నారో ? దానిని సాధించారని, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజలు హర్షించే నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.