ఇక సిఎం మార్పు లేనట్లేనా?
posted on Jul 28, 2012 12:41PM
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చేస్తారని ఇప్పటి వరకూ వచ్చిన ఊహాగానాలకు తెరపడిరది. ఆయన స్థానంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్‌నేతను సిఎంగా ప్రకటించి ఆ తరువాత సమైక్యాంధ్రగానే రాష్ట్రం కొనసాగిస్తారని కాంగ్రెస్ అధిష్టానంపై పలు ఊహాగానాలు వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక తెలంగాణా ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలు భౌగోళిక, జల సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆంతర్‌రాష్ట్ర విబేధాలకు ఇది వేదికవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి నివేదించనుంది. ఈ నివేదిక మార్పులకు అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించటంతో సిఎం మార్పు కూడా ఉండకపోవచ్చని రాజకీయపరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు.
ఒకవేళ సిఎంను మార్చి ఇంకొకరికి అధికారమిస్తే ఆయన తెలంగాణావాదానికి లొంగరన్న గ్యారెంటీ లేదు కాబట్టి ఆ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం వెనక్కితీసుకుందంటున్నారు. ఇందిరమ్మబాట, మంత్రి ధర్మానప్రసాదరావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, తెలంగాణా సమస్య ఎదురైతే దానిపై స్పందించిన తీరు, పర్యటనలకు వెనుకాడని నైజం సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లస్ అయ్యాయని వివరిస్తున్నారు. ప్రత్యేకించి ప్రజల్లో మమేకమయ్యేందుకు సిఎం చూపిస్తున్న చొరవను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిపాదిక తీసుకుందని భావిస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థి అయ్యేందుకు తన వంతు సహకారం అందిస్తామన్న సిఎం భరోసా కూడా సీటుమార్పు ఆలోచనను దెబ్బతీసిందని విశదీకరిస్తున్నారు.