తిట్టిన నోటితోనే పొగిడిన కేసీఆర్

 

కేసీఆర్ గారు ఏ టైంలో ఎలా ఉంటారో ఎవరికి అర్థంకాదు. ఎందుకంటే ఆయన చేసిన ఎప్పుడు ఎవరిని తిడతారో.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో ఆయనకే ఒక క్లారిటీ ఉండదు. ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వంపైన అందరూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రంతో కూడా ఎడమొహ పెడమొహం లాగే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో కేసీఆర్ మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. మోడీ లేడు.. గీడీ లేడు.. మోడీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్లే అని విమర్శించారు. ఏ నోటితో అయితే మోడీని తిట్టాడో అదే నోటితో ఇప్పుడు మోడీని పొగడాల్సివచ్చింది. కేసీఆర్ చైనా టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన మోడీ సంస్కరణవాది అని.. మోదీ ముఖ్యమంత్రులందరినీ కలుపుకొని వెళుతున్నారని తన నోటితోనే ప్రశంసించారు.

ఇందుకు కారణమూ లేకపోలేదు. ఎందుకంటే మోడీకి ఇతర దేశాల్లో ఉన్న పేరు ప్రతిష్టలు అలాంటివి. మరి తెలంగాణకు పెట్టుబడులు రావాలంటే మోదీ పేరు ఉపయోగించుకోవాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ కు తన కంటూ ఒక బ్రాండ్ ఇంకా ఏం లేదు. ఇక చంద్రబాబు అంటారా ఆయనే ఒక బ్రాండ్.. తను మోదీ పేరు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకుంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ను తనే సృష్టించుకున్నాడు. కానీ కేసీఆర్ కు మాత్రం అలాంటి బ్రాండ్ ఏం లేకపోవడంతో మోడీ పేరు వాడుకోక తప్పలేదు.