బాబు నిద్రపోవడం లేదు..!
posted on Oct 18, 2014 11:59AM
.jpg)
అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రతోపాటు, తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేసిన విషయం విదితమే. హుద్‌హుద్ తుపాను దెబ్బకి విశాఖ మహానగరం విలవిల్లాడి౦ది. అయితే వీలయినంత త్వరగా విశాఖ నగరం మామూలు స్థితికి తెచ్చేందుకు ఆంధ్రప్రభుత్వం రేయింబవళ్ళు కష్టపడుతోంది. విశాఖలో పరిస్థితి చక్కబడే వరకు వదిలేదని కరాఖండీగా చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు విశాఖలో అదే చేస్తున్నారు. నగరంలో చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను ముందుండీ మరీ జరిపిస్తున్నారు. అలాగే అర్థరాత్రి వెళ్లి సిబ్బంది పనులను ఎలా చేస్తున్నారని తనీఖీలు కూడా చేస్తున్నారు. బాబు జోరుచూస్తుంటే అనుకున్న సమయంకంటే ముందుగానే విశాఖ మామూలు స్థితికి చేరుకుంటుందని అంటున్నారు.