రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తా: చంద్రబాబు
posted on Nov 24, 2012 4:43PM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రుణ మాఫీ ఎలా చేస్తారో చెప్పాలని వైఎస్పార్‌సీపీ నేత విజయమ్మ ప్రశ్నించారని, రుణ మాఫీ ఎలా చేస్తానో చేసిచూపిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆయన దోచుకున్న సోమ్ము రికవరి చేస్తే రాష్ట్రంలోని రైతుల రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చునని అన్నారు.
రాష్ట్రంలోని రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం హయాంలో గ్రామసభల ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రుణాలన్నీ మాపీ చేస్తామని మరోమారు ఆయన స్పష్టం చేశారు.