బాలయ్య డైరెక్షన్ లో న్యూ కాన్సెప్ట్‌‌తో 100వ ఫిల్మ్!

 

 

 balakrishna nayanatara, balayya 100 film, nayanatara balakrishna

 

 

నందమూరి బాలకృష్ణ తన శ్రీమన్నారాయణ చిత్రం తరువాత మళ్ళీ ఇంతవరకు కొత్తగా ఏ సినిమా ఒకే చేయలేదు. ఫిల్మ్ నగర్ సమాచారం మేరకు ఆయన త్వరలో ఒక జానపద సినిమాలో నటించబోతున్నారు. బాలయ్య బాబు అభిమానులకు సంతోషం కలిగించే మరో ఆసక్తికరమయిన వార్త ఏమిటంటే ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తారని సమాచారం.

 

 
‘సింహా,’ ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలలో బాలకృష్ణ సరసన నటించిన నయనతార ఈ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో వారిద్దరూ మహారాజు, మహారాణీ పాత్రలు పోషిస్తారని సమాచారం. ఇక,  ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ‘శ్రీరామరాజ్యం’ సినిమాను నిర్మించిన ఎలమంచిలి శివాజీ నిర్మిస్తారని సమాచారం. బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా షూటింగు మొదలవవచ్చునని సమాచారం. అయితే, ఈ విషయాన్నిఇంకా సంబందిత వ్యక్తులు ధృవీకరించవలసి ఉంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu