Guppedantha Manasu : మీ మనసుకి కూడా తెలుసు మీరే రిషి సర్.. వాడికంత కెపాసిటి లేదు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1105 లో....వసుధార స్పృహ లోకి వచ్చి మీరే నా రిషి సర్ అని అనగానే.. లేదని సరోజ అంటుంది. చెప్పండి సర్ మీరే నా భర్త రిషి అని వసుధార అంటుంది. అవును నేనే రిషి సర్ ని అని రంగా అనగానే అందరు షాక్ అవుతారు. వసుధార మాత్రం హ్యాపీగా రిషిని హగ్ చేసుకుంటుంది. పదండి సర్.. మనం ఇక్కడ నుండి వెళదాం..  కాలేజీ ప్రాబ్లెమ్ లో ఉందని వసుధార అంటుంది. ఇప్పుడు  నువ్వు ఫ్రెష్ అప్ అయి రా అని వసుధారకి రిషి చెప్తాడు. మరోవైపు ఫణీంద్ర దగ్గరికి దేవయాని వచ్చి కాలేజీలో బోర్డు మీటింగ్ జరిగిందట ఎందుకని అడుగుతుంది. ఎండీ ఎవరు అనే దాని గురించి జరిగిందని ఫణీంద్ర చెప్తాడు. ఎవరేంటి మన శైలేంద్రని ఎండీ చెయ్యొచ్చు కదా.. రిషి, వసుధారలు లేరు కదా అని దేవయాని అంటుంది. నీకెందుకు అంత.‌ వాడి మీద ఓవర్ కాన్ఫిడెన్స్.. వాడికి ఆ కెపాసిటీ లేదని చెప్పాను కదా.. మళ్ళీమళ్ళీ ఎందుకు అంటావ్.. వాడి తెలివి తక్కువతనం వల్ల కాలేజీని ఒకసారి రిస్క్ లో పడేసాడని ఫణీంద్ర అంటాడు. అప్పుడు వాడికి ఇదంతా తెలియదు కానీ ఇప్పుడు వాడికి అంతా తెలుసని దేవయాని అంటుంది. అయినా ఫణీంద్ర తన మాటలు పట్టించుకోడు. మరొకవైపు మను మినిస్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే.. అప్పుడే శైలేంద్ర కూడా వెళ్తాడు. మనుని అక్కడ చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. కాలేజీ గురించి మాట్లాడడానికి వచ్చానని మను అంటాడు. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చానని మినిస్టర్ తో శైలేంద్ర చెప్తాడు. ఏంటని మినిస్టర్ అడుగగా.. ఇంపార్టెంట్ విషయమని సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత కాలేజీ సక్రమంగా నడవాలంటే ఎండీ కంపల్సరీ కావాలని చెప్తాడు. కాసేపటికి మను, శైలంద్ర లు అక్కడ నుండి వెళ్ళిపోతారు మరొకవైపు ఏంటి బావా.. నువ్వు రిషి సర్ వా.. రంగా కాదా.. ఎందుకు ఇలా అబద్దం చెప్పావ్.. తను అనుకుంటే అనుకోనివ్వు కానీ నువ్వు అనడం ఏంటని సరోజ అడుగుతుంది. డాక్టర్ ఏం చెప్పారు మనసుకి కష్టం కలిగించే విషయాలేం చెపొద్దన్నారు కదా అందుకే అలా రిషి సర్ ని అని అబద్దం చెప్పానని రంగా చెప్తాడు. అప్పుడే వసుధార వచ్చి ఎందుకు వీళ్ళు రంగా అంటున్నారు.. బావ అంటున్నారని వసుధార అంటుంది. నేను రంగానే రిషిని కాదని అనగానే వసుధార షాక్ అవుతుంది. మీ మనసుకి కూడా తెలుసు రిషి సర్ మీరే అని.. మీరు రిషి సర్ అని నిరూపించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనని వసుధార అని వెళ్తుంటే కింద పడిపోబోతుంటే రంగా పట్టుకుంటాడు. మీ కళ్ళు చెప్తున్నాయ్.. నా రిషి సర్ అని వసుధార అంటుంది. మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని వసుధారకి రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : ఆ వీడియో ఉన్న ఫోన్ ని లాక్కున్న రౌడీ‌‌.. ఉన్న ఒక్క ఆధారం పోయిందిగా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -440 లో.. మీ నాన్న చేసిన తప్పు దాచి ఈ అమ్మ గురించి భయపడ్డారు. ఇద్దరు ఎన్నో భరించారు. నా భర్త జీవితంలో మరొక ఆడది ఉందని తెలియడంతో నేను తట్టుకోలేకపోతున్నానని రాజ్ కి తన బాధని చెప్పుకుంటుంది అపర్ణ‌. మరొకవైపు మాయని రౌడీ లు తీసుకొని వెళ్తుంటారు. ఒక కార్ ని కావ్య మరొక కార్ ని కళ్యాణ్, అప్పు లు ఫాలో అవుతుంటారు. ఆ తర్వాత అప్పుడే కావ్యకి మాయ ఒక వీడియో పంపిస్తుంది. అందులో నేను తప్పు చేసాను.. నన్ను క్షమించు.. ఆ బాబుకి మీ మామయ్య గారికి ఏం సంబంధం లేదు.. నా వెనకాల ఉన్నవాళ్ళు ఇదంతా చేయించారు. నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో పెడుతుంది. అది చూసి నా నమ్మకమే నిజం అయిందన్న మాట అని కావ్య అనుకోని.. ఎలాగైనా మాయని కాపాడాలని అనుకుంటుంది. ఆ తర్వాత రౌడీలు వెళ్తున్న ఒక కార్ ని ముందు కు వెళ్లి ఆపుతుంది కావ్య. ఆ కార్ లో మాయ ఉండదు. మాయ ఎక్కడ అని కావ్య అడుగగా వేరే కారులో ఉందని చెప్పి కావ్య ఫోన్ లాక్కొని రౌడీ వెళ్తాడు. ఉన్న ఒక్క ఆధారం కూడా లేదు ఇప్పుడు కచ్చితంగా మాయని పట్టుకోవాలని కావ్య అనుకొని‌‌.. డ్రైవర్ ఫోన్ నుండి కళ్యాణ్ కి చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో లొకేషన్ షేర్ చెయ్యమని చెప్తుంది. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు అనామిక దగ్గరికి వెళ్లి.. నీ భర్త కళ్యాణ్, అప్పు లు హోటల్ లో ఉన్నారు.. ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్ళని పట్టుకోమని చెప్తారు. దాంతో ధాన్యలక్ష్మి దగ్గరికి అనామిక వెళ్లి.. మీరు నాతో రండి అంటూ తనకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం అప్పు, కళ్యాణ్ లు హోటల్ కి వెళ్తారు. అక్కడ మన మనిషి డోర్ వేస్తారు.. మీడియా వస్తుందని రుద్రాణి రాహుల్ లు అనుకుంటారు. ఆ తర్వాత నిజంగానే రౌడీలు హోటల్ లోపలకి వెళ్లడంతో అప్పు, కళ్యాణ్ లో కూడా లోపలికి వెళ్తారు. రిసెప్షన్ లో రౌడీలు ఎక్కడ అని అడుగగా.. వాళ్ళు చెప్పిన రూమ్ కి కళ్యాణ్, అప్పులు వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే డోర్ వేస్తారు. ఆ తర్వాత మీడియా వాళ్ళు వచ్చి ఇలా ఎందుకు హోటల్ కి వచ్చారంటు ఇద్దరిని అడుగుతారు. అప్పుడే కావ్య వచ్చి మీరు అనుకుంటున్నది తప్పు వేరే పని మీద వచ్చామని  కావ్య అంటుంది. అయిన మీడియా వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే అప్పు, కళ్యాణ్ లను కావ్య తీసుకొని వెళ్తుంటుంది ‌ అప్పుడే వాళ్ళకి అనామిక, ధాన్యలక్ష్మి లు ఎదురుపడతారు. అదంతా న్యూస్ లో రావడం చూసి కనకం షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, అప్పులని అనామిక తప్పుపడుతుంది. అప్పుడే కనకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

ఆ ఫీలింగ్ తట్టుకోలేం రా నాయనా!

జీవితంలో ప్రతీ మనిషి కొన్ని భిన్నమైన పరిస్థితులని ఎదుర్కుంటాడు. అయితే వాటిల్లో ప్రేమ, పెళ్ళి అనేవి ప్రతీ ఒక్కరిలో ముఖ్యమైనవిగా ఉన్నాయి. అందులో ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో  రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు  నాగార్జున. గీతు రాయల్ కి ఇన్ స్టాగ్రామ్ లో 674K ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన గీతు రాయల్.. ఆ తర్వాత ఫాలోయింగ్ ని పెంచుకుంది. రెగ్యులర్ గా వ్లాగ్స్, రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో భార్యాభర్తలకి, లవర్స్ కి ఓ టిప్ ఇచ్చింది గీతు. "ఒక రోజు మీతో మాట్లాడకపోతే వాళ్ళ రోజే గడవదు అన్న ఇంపార్టెన్స్ ఇచ్చి, ఒకరోజు మీరు బ్రతికి ఉన్నారా లేదా అన్నది కూడా పట్టించుకోకపోతే.. ఆ ఫీలింగ్  తట్టుకోలేం రా నాయన " అని గీతు రాయల్ చెప్పుకొచ్చింది. ఇలా ఎవరి సిచువేషన్ ఎలా ఉంటుందో తెలియదు.. ఉన్నన్ని రోజులు నీకు నచ్చింది చేయాలని చెప్తూ అదే ఫాలో అవుతుంటుంది గీతు రాయల్. మరి ఇన్ స్టాగ్రామ్ లో తను చేసిన ఈ పోస్ట్ ని చూశారా కామెంట్ చేయండి.

కొత్త కార్ కొన్న బోల్డ్ యాంకర్‌

  సెలెబ్రిటీలు రోజుకో కారు కొంటు ఇన్ స్టాగ్రామ్ లో‌ వైరల్ అవుతున్నారు. వారిలో తాజాగా రీతు చౌదరి కూడా చేరింది. సీరియల్ నటిగా.. యాంకర్‌గా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రీతూ చౌదరి.. ఇప్పుడు గేర్ మార్చి బండిని యమా క్రేజ్ తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతకి పెట్టింది పేరు.. ప్రస్తుతం దావత్ అనే టాక్ షో చేస్తుంది. ఈ షోతో బోల్డ్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి.. ఖరీదైన కారుని కొనుగోలు చేసింది. తన కొత్త కారుని సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని ఫాలోవర్స్‌తో పంచుకుంది. మరో లగ్జరీ కార్‌ను కొన్నది. సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో హాట్ టాపిక్ నిలుస్తున్న రీతూ చౌదరి.. ఖరీదైన టొయోటో హైక్రాస్ లగ్జరీ కారుని కొనేసింది. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా కొంటున్న ఈ కారుని రీతు సొంతం చేసుకుంది. ఈ కారు ఖరీదు.. ప్రస్తుత మార్కెట్ ధర.. రూ.30 లక్షలు పైనే. ఇంటిగుట్టు సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో యాక్టింగ్‌ చేసి అందరినీ మెప్పించింది రీతు. అప్పట్లో యాంకర్‌ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్‌ బీచ్‌లో సందడి చేసిన ఫోటోస్‌ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో, మరొక వైపు జబర్దస్త్‌ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ని కూడా స్టార్ట్‌ చేసింది. ఫోటో షూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా కార్ తీసుకొని దానిని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా సెలబ్రిటీలు అభినందనలు తెలుపుతున్నారు. అయితే రీతు చౌదరికి ఇన్ స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.  

సుప్రిత పార్ట్స్ సంథింగ్ ఈజ్ ఫిషీ.. మోత మోగిస్తున్నారు!

  టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె.  అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే సుప్రిత సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌.  తల్లి సురేఖతో తరచూ రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్‌ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలర్స్‌ నుంచి ట్రోల్స్‌ కూడా ఎదుర్కునేది. అయినా తగ్గేదేలే అంటూ తన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్‌ చేస్తూనే ఉంటుంది. సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 859K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సుప్రిత చేసిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఎక్కడ దిగిందో.. ఎందుకు దిగిందో.. కావాలనే దిగిందో.. లేదంటే ఎవరికి కావాల్సింది వాళ్లు అనుకుంటారని దిగిందో ఏమో కానీ.. చిత్ర విచిత్రంగా వివిధ భంగిమల్లో.. అనేక అనుమానాలు కలిగేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. స్వైప్ లెఫ్ట్ అంటు క్యాప్షన్ ఇచ్చి మొత్తం ఏడు ఫోటోలని షేర్ చేసింది సుప్రిత. ఆమె ఫొటోలు దిగిన తీరు.. ఆమె ఫోకస్ చేసిన పార్ట్స్ చూస్తుంటే మాత్రం.. సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మాత్రం రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఏదో తేడాగా ఉందే అని కొందరు.. ఇది అదేనా మరికొందరు.. మాములుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో సుప్రిత చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.   

Karthika Deepam2 : పారిజాతం  పీకపట్టుకొని నిలదీసిన జ్యోత్స్న.. ‌ఆమె ప్రెగ్నెంట్, ఈమె షాక్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -74 లో.... నేను కేవలం శౌర్య కోసం మాత్రమే అక్కడికి వెళ్తాను. అమాయకంగా తను పిలిచే పిలుపు బాగుంటుంది. నేను దీపతో మాట్లాడిన దీప దగ్గరికి వెళ్లిన అన్ని రౌడీ కోసమే అని కార్తీక్ జ్యోత్స్న కి క్లారిటీ ఇస్తాడు. మరొకవైపు శౌర్య స్కూల్ అయిపోయాక దీప కోసం చూస్తుంది. తన పక్కన ఒక పాప తన నాన్నని ఎందుకు లేట్ గా వచ్చావంటూ అడుగుతుంది. వాళ్ళ ప్రేమని చూసి నాకు నాన్న ఉంటే అలాగే ఉండేదాన్ని కదా అంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత పారిజాతం పీకపట్టుకొని ఎందుకు ఇదంతా చేసావని జ్యోత్స్న అడుగుతుంది. మీ బావని కూడ ఇలాగే అడిగావా అని పారిజాతం అనగానే.. గొంతు పట్టుకొని అడగలేదు కానీ ఇదే రేంజ్ లో అడిగాను. అప్పుడే అదంతా శౌర్య కోసమని చెప్పాడని జ్యోత్స్న అనగానే..‌నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావ్ కానీ నాకు ఎప్పుడో తెలుసని పారిజాతం అంటుంది. ఇప్పుడు నా ఆవేశమే నాకు ముఖ్యం. భర్త వదిలేసిన ఆడదానిగా  దీపపై బావకి విపరీతంగా సింపతీ ఉంది. అలాంటి టైమ్ లో శౌర్య కోసం ఇద్దరు ఒకటి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ని రోజులు శౌర్యకి గార్డియన్ గా కార్తీక్ ఉన్నాడు.. ఇప్పుడు నేనున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ అయిన ఇప్పుడు నాకు వస్తుందని జ్యోత్స్న అంటుంది. దీపని కార్తీక్ కలుస్తాడు కదా ఫోన్ కూడా కొనిచ్చాడని పారిజాతం అనగానే.. కథ అక్కడ నుండే మొదలు పెట్టాలని జ్యోత్స్న అంటుంది. మీ బావ మాటలో ఎక్కడ అయిన నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఇష్టం లేదన్న అనుమానం కన్పించిందా అని పారిజాతం అనగానే.. ఎందుకు అలా అడుగుతున్నావ్? బావ నీతో ఏదైనా చెప్పాడా అని జ్యోత్స్న అడుగగా..‌ అదేం లేదని పారిజాతం అంటుంది. ఆ తర్వాత శౌర్యని దీప నడిపించుకొని తీసుకొని వస్తుంటే.. అప్పుడే కార్తీక్ వచ్చి శౌర్యని కార్ లో తీసుకొని వెళ్తాడు. మరొక వైపు శోభ నర్సింహలు గొడవపడుతుంటారు. అప్పుడే అనసూయ వచ్చి.. ఎందుకే ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అంటావని అంటుంది అప్పుడే శోభ వాంథింగ్ చేసుకుంటుంది. ఏంటివి అవేనా అని అనసూయ శోభని అడుగుతుంది.. అవునని శోభ అనగానే.. అనసూయ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను నానమ్మ కాబోతున్నానని అంటుంది. ఆ తర్వాత శోభని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు అప్పుడే దీప ఎదరుపడుతుంది. శోభ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : భార్య గురించి తప్పుగా మాట్లాడారని‌‌ భర్త ఫైర్.. ఆ వ్రతం జరిగేనా!

  స్టార్ మా టీవీలలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -126 లో.. వాళ్ళు అయిష్టంగానే గా పెళ్లి చేసుకున్నారని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు వాళ్ళ బంధం బలపడిందని ధనతో సిరి చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్ లు పై నుండి వస్తుంటారు. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నావని పెద్దాయన అడుగుతాడు. ఆఫీస్ లో చిన్న మీటింగ్ ఉందని సీతాకాంత్ అనగానే.. ఇంట్లో నీ కోసం నీ భార్య వ్రతం చేస్తుంటే ఈ టైమ్ లో ఆఫీస్ ఏంటి అర్ధం లేకుండా అని పెద్దాయన అంటాడు. ఆఫీస్ లో వర్క్ అంటున్నారు కదా వెళ్లనివ్వండి పూజ వరకు వస్తే చాలని రామలక్ష్మి అనగానే.. థాంక్స్ అర్ధం చేసుకున్నందుకు అని సీతాకాంత్ అంటాడు.  నేను హర్ట్ అయ్యాను.. ఎందుకు ఇలా థాంక్స్ చెప్తున్నారని రామలక్ష్మి అంటుంది. మీరు వెళ్ళేటప్పుడు దేవుడికి మొక్కుకొని వెళ్ళండి అని రామలక్ష్మి చెప్పగానే.. సీతాకాంత్ మొక్కుకొని బయలుదేర్తాడు. నేను పూజ చేసుకుంటున్న మీరు తప్పకుండా రావాలని శ్రీవల్లి, సిరిలకి చెప్తుంది రామలక్ష్మి.ఆ తర్వాత రామలక్ష్మి చుట్టూ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్లి వ్రతానికి రమ్మని చెప్తుంది. ఎలాగైనా రామలక్ష్మి పరువు తీయాలని శ్రీవల్లి అనుకొని వ్రతం కోసం వస్తున్న కొంతమంది స్త్రీలు వస్తుంటే కావాలనే..‌ అభి రామలక్ష్మి ఉన్న ఫొటోస్ తో ఎదరుపడుతుంది. ఆ ఫోటో లో ఉన్నా అబ్బాయి ఎవరని వాళ్ళు అడుగగా రామలక్ష్మి బాయ్ ఫ్రెండ్ అంటు, రామలక్ష్మి గురించి శ్రీవల్లి నెగెటివ్ గా చెప్తుంది. అలాంటిది వ్రతం చేస్తుంటే మనం ఎందుకు ఉండాలంటూ వాళ్ళంతా తిరిగి వెనక్కి వెళ్లిపోతుంటారు. అప్పుడే రామలక్ష్మి చూసి అయ్యో ఎందుకు వెళ్తున్నారని అడుగుతాడు. రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. అప్పుడే సీతాకాంత్ వచ్చి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. మీరు నా భార్యని ఆశీర్వదించే అర్హత కోల్పోయారు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని పంపిస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ రెడీ అయి వస్తానంటూ వెళ్తాడు. పూజకి అంతా సిద్ధం చేసి పంతులు రామలక్ష్మితో పాటు వ్రతానికి పిలిచినా వాళ్ళు కూడా వచ్చి కూర్చోండి అని చెప్పగానే రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఏమైందని పెద్దాయన అనగానే వాళ్ళు వచ్చేలా లేరని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : రంగా కాదు రిషి.. ఎవరూ ఊహించని ట్విస్ట్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1104 లో.....వసుధార వెళ్ళిపోయిందని మహేంద్ర బాధపడుతుంటే.. అనవసరంగా రిషి టాపిక్ తీసి వసుధారని బాధపెట్టానని ఫణీంద్ర ఫీల్ అవుతాడు. తను వెళ్ళింది గానీ నెక్స్ట్ ఎండీ ఎవరనేది చెప్పకుండానే వెళ్ళిందని శైలేంద్ర అంటాడు. లెటర్ పై వారి నేమ్ రాసినా బాగుండేది అనగానే.. లెటర్ ఏంటని మను అంటాడు. దాంతో శైలేంద్ర కంగారుపడుతు ఏం లేదని అంటాడు. ఆ తర్వాత ఎండీ బాధ్యతలు మన కుటుంబంలో ఒకరికి మాత్రమే కదా.. అయిన మను మన కుటుంబం కాదు కదా అని శైలేంద్ర అంటాడు. ఇంకెవరు నేను మాత్రమే ఎండీ బాధ్యతలు చెప్పట్టాలని శైలేంద్ర అనగానే.. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్ బోర్డు మీటింగ్ జరగాలి.. మినిస్టర్ గారు రావాలని మహేంద్ర అంటాడు. మరొకవైపు వసుధార స్పృహలోకి వచ్చి రిషి అంటూ కలవరిస్తుంది. అప్పుడే రంగా వాళ్ళ నాయనమ్మ వచ్చి టాబ్లెట్ ఇస్తుంది. నా మనవడిని కాపాడావని ఆమె అనగానే.. నా రిషి సర్ ఎక్కడ అని వసుధార అడుగుతుంది. రిషి సర్ ఎవరు లేరు నువ్వు పడుకోమని తను చెప్తుంది. మరొకవైపు శైలేంద్ర తనని తాను తిట్టుకుంటు ఉంటాడు. ఆ వసుధార నా పేరు చెప్పిన బాగుండేది అనవసరంగా చంపించేశానని రౌడీకి ఫోన్ చేసి నిజంగానే వసుధారని చంపావా అని అడుగుతాడు. చంపించేసానని అతను చెప్తాడు. ఎక్కడ పాతి పెట్టారో లొకేషన్ పెట్టని శైలేంద్ర అనగానే.. సరేనని రౌడీ అంటాడు. అదేంటి ఇప్పుడు వాడు వస్తే ఎలా మనం చంపలేదు కదా అని ఇంకొక రౌడీ అంటాడు. ఆ లోపు ఆ వసుధారని వెతికి చంపేయాలని రౌడీ అంటాడు. మరొకవైపు  రిషి సర్ అంటూ హాల్లో ఉన్న రంగా దగ్గరకి వసుధార వస్తుంది. అసలు నువ్వు ఎవరు నా బావ రంగాని పట్టుకొని రిషి సర్ అంటున్నావని సరోజ కోప్పడుతుంది. లేదు తను నా భర్త రిషి.. తన కోసం వెతుకుంటూ వస్తుంటే ఇలా జరిగిందని వసుధార అంటుంది. బావ.. నువ్వు రిషి సర్ కాదు నా బావ రంగా అని చెప్పు అని సరోజ అంటుంది. ఆ తర్వాత రంగా కాసేపు అలోచించి, నేనే తన రిషి సర్ ని.. నీ బావ కాదు. మీ మనవడిని కాదు నాయనమ్మ అని రిషి అనగానే.. అందరు షాక్ అవుతారు. వసుధార మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రిషిని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

హోటల్‌ రూమ్‌లో మీడియాకి దొరికిపోయిన బ్రహ్మముడి జంట!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -439 లో.... కావ్య, రాజ్ లు సుభాష్ దగ్గరికి వెళ్లి అపర్ణతో మాట్లాడి తనకి బాధని తగ్గించుకోమని చెప్తారు. దాంతో బయట ఒంటరిగా కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి క్షమించమని రిక్వెస్ట్ చేస్తాడు.  చేసింది మాములు తప్పు కాదంటూ అపర్ణ కోప్పడుతుంది. నిన్ను ఎప్పుడు ఇన్ని రోజుల్లో బాధపెట్టానా ఏదో ఆ మాయ చేసి మాయలో పడి ఇలా జరిగింది. నాకు శిక్ష వెయ్యి అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అపర్ణ మనసు మార్చుకుంటుండగా అప్పుడే బాబు ఏడుపు వినిపించి కోపంగా వెళ్ళిపోతుంది. అదంతా కావ్య, రాజ్ లు చూస్తూనే ఉంటారు. ఆ తర్వాత మరుసటి రోజు కావ్య దగ్గరికి అప్పు వస్తుంది. ఇంత ప్రొద్దునే ఎందుకు వచ్చావని కావ్య అడుగుతుంది. కావ్యని పక్కకి తీసుకొని వెళ్లి అసలు మాయ స్పృహలోకి వచ్చిందని చెప్పగానే.. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ మాటలు కళ్యాణ్ విని.. మీరు నన్ను పరాయి వాడిని చేశారు. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు. నేను మీతో వస్తానని కళ్యాణ్ అనగానే.. సరే అని అప్పు, కావ్య, కళ్యాణ్ లు హాస్పిటల్ కి వెళ్తారు. మాయ స్పృహ లోకి వచ్చిన విషయం తెలుసుకున్న రుద్రాణి.. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోతుందని రాహుల్ కి చెప్పి రౌడీలని హాస్పిటల్ కి వెళ్ళమని చెప్తుంది. ఆ తర్వాత మాయ దగ్గరికి ఇద్దరు రౌడీలు వచ్చి మిమ్మల్ని డిశ్చార్జ్ చేశారని మాయ తో అనగానే మీరెవరని మాయ అడుగుతుంది. కావ్య పంపించిందని చెప్పాగానే నేను ఒకసారి కావ్యతో మాట్లాడాలని మాయ అనగానే.. కావ్య మేడమ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు.. మీరు వెళ్ళేది అక్కడికే కదా అని మాయని నమ్మించి హాస్పిటల్ నుండి రౌడీలు తీసుకొని వెళ్తుంటారు.  ఆ తర్వాత కావ్య వచ్చేసరికి హాస్పిటల్ లో మాయ ఉండదు. ఏమైందని డాక్టర్ ని అడుగగా.. మీరే డిశ్చార్జ్ చెయ్యమన్నారని తీసుకెళ్లారు అనగానే కావ్య వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి కార్లు వెళ్తుంటాయి. వెంటనే కార్లని కావ్య వాళ్ళు ఫాలో అవుతుంటారు. మరొకవైపు అపర్ణ దగ్గరకి రాజ్ వచ్చి మాట్లాడతాడు. తరువాయి భాగంలో రౌడీలు ఏదో హోటల్ కి వెళ్తారు. రిసెప్షన్ లో రూమ్ నెంబర్ అడిగి అప్పు, కావ్య, కళ్యాణ్ లు వెతుకుతుంటారు. అప్పు, కళ్యాణ్ లు గదిలో ఉండగా బయటనుండి ఎవరో లాక్ వేస్తారు. అప్పుడే మీడియా వచ్చి.. హోటల్ లో కళ్యాణ్ అప్పులు అడ్డంగా దొరికిపోయారని న్యూస్ లో వస్తుంటే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

సరోజ గురించి ఎవరికి తెలియని నిజాలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో కొత్తగా రిషి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సీరియల్ టీఆర్పీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో రంగా పాత్రలో ఎంట్రీ ఇచ్చిన రిషికి మరదలి పాత్రలో సరోజ నటిస్తోంది. తన యాక్టింగ్ కి రిషి ఫ్యాన్స్ కూడా అభిమానులు అవుతున్నారు. అంతలా మెప్పిస్తున్న సరోజ గురించి తెలుసుకుందాం. లంగాఓణీ.. జడగంటలు కట్టి.. బొద్దుగుమ్మలా మారిన వసుధార కంటే ఈ పిల్లే బాగుందిగా అన్నట్టుగా ఉన్న సరోజ మన తెలుగు టీవీ ప్రేక్షకులకు తెలిసిన పిల్లే. పైగా ఈమె మన తెలుగు అమ్మాయే. అసలు తెలుగు టీవీ ఇండస్ట్రీని కన్నడ కుట్టీలు ఏలేస్తుండగా.. తెలుగు వాళ్లకి అరకొరగా అవకాశాలు దక్కుతున్నాయి. కాగా గుప్పెడంత మనసు కొత్త కథలో రంగా మరదలు సరోజగా కీలక పాత్ర దక్కించుకున్న ఈ బ్యూటీ అసలు పేరు వినీత. వినీత మన తెలుగు అమ్మాయే. పక్కా హైదరాబాదీ. ఇక్కటే పుట్టి పెరిగింది. బీటెక్ వరకూ చదివిన వినీత.. 2020 కోవిడ్ బ్యాచ్‌లో బీటెక్ పూర్తి చేసింది. సీరియల్స్‌లోకి రాకముందు తమడా మీడియాలో పనిచేసింది వినీత. వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్‌లో నటించింది వినీత. సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిన వినీత.. వెండితెరపై అవకాశం రాలేదు కానీ.. బుల్లితెరపై రాణిస్తోంది. అనేక సీరియల్స్‌లో నటించింది వినీత.  మొదట్లో ఈవీటీలో అను- పల్లవి సీరియల్‌లో నటించిన వినీత.. జీ తెలుగులో ‘దేవతలారా దీవించండి’, ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు పలు టీవీ షోస్‌లోనూ కనిపించింది. శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ వినీత పంచ్‌లు పేల్చింది. దేవతలారా దీవించండి సీరియల్‌లో నెగిటివ్ రోల్‌ పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఊహలు గుసగుసలాడే సీరియల్‌లోనూ మెప్పించింది. ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఇటీవలే రాకేష్ అనే వ్యక్తిని పెళ్లాడింది వినీత. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్‌లో రంగా (రిషి) మరదలిగా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా, తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. అందానికి తగ్గ అభినయం అన్నట్టుగానే రంగా మరదలిగా నటనతోనూ మెప్పిస్తోంది వినీత. అయితే వినీత వల్లభాపురపు(Vineetha Vallabhapurapu) ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఓసారి చూసేయ్యండి.   

Karthika Deepam2 : నిన్ను పెళ్ళిచేసుకోవడం ఇష్టం లేదని చెప్పు చాలు... కారు కిందపడి చచ్చిపోతాను!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -73 లో.. దీప పనిచేసే హోటల్ కి కార్తిక్, జ్యోత్స్న లు వస్తారు. దీప చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది బావా.. నీ సీక్రెట్ నాకు చెప్పొద్దులే దీపా.. నేనే కనిపెడతానని దీపతో జ్యోత్స్న అంటుంది. దాంతో దీప.. నీకేం కావాలో చెప్పు జోత్స్న అని దీప అనగా.. మా బావ కావాలని జ్యోత్స్న అంటుంది. అదే.. దీపా.. మా బావకి ఎంతో ఇష్టమైన స్పెషల్ టీ.. నాక్కూడా ఇస్తావని వచ్చానులే.. నేను కూడా రేపటి నుంచి నీ రెగ్యులర్ కస్టమర్‌ని.. స్కూల్‌లో శౌర్యకి గార్డియన్‌గా మా బావ పేరుకి బుదులుగా నా పేరు ఇచ్చినట్టు.. నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి మా బావకి బదులు నేనే రావాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ పారిజాతం జోత్స్న బుర్రని పాడుచేసి పంపినట్టు ఉందని దీప అనుకుంటుంది. ఇక కార్తీక్ కూడా అదే అనుకుని జోత్స్నకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. ఏంటి దీప.. ఏం మాట్లాడవని జోత్స్న అంటే.. నా యోగక్షేమాల కోసం ఎవరు రావాల్సిన పనిలేదని దీప అంటుంది. అంతేలే నేను వస్తానంటే వద్దంటావ్.. మా బావ వస్తానంటే రమ్మంటావని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. దాంతో దీప.. నా జీవితం ఎవరో ఎగరేసిన గాలిపటం కాదు.. నా చేతులతో నేను ఎగరేసుకున్నది.. ఎదురుగాలికి ఎగరడమే కానీ.. భయపడే మనిషిని కాదని అని అంటుంది. మనకెందుకులే అని వదిలేయడానికి మనది మామూలు బంధం కాదు దీపా.. ఏంటి బావా?? మా బంధం ఏంటో నువ్వే చెప్పాలని అంటుంది. ఏంటి జోత్స్న నేనేం చెప్పాలని అంటాడు. అదే బావా.. మా ఇద్దర్నీ కలిపింది మా మమ్మీనే కదా.. అలా దీప.. నా ఆత్మ బంధువు అయ్యింది.. కాబట్టి నీ యోగక్షేమాలు తెల్సుకోవడం నా బాధ్యత కదా అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో కడియం రావడంతో.. ఇందాక నేనెవరని అడిగావ్ కదా.. నేను కార్తీక్ బాబూ మరదల్ని కాదు.. మీ కార్తీక్ బాబు భార్యని అని జ్యోత్స్న అంటుంది. అవును నేను కార్తీక్‌కి కాబోయే భార్యని.. జోత్స్న అంటే కార్తీక్ భార్య అని గుర్తు పెట్టుకో. చివరిగా నీకో మాట చెప్తున్నా దీప.. పేరెంట్స్ మీటింగ్ బాగా జరిగినట్టు ఉంది.. ఇకపై నీ గురించి ఏది జరిగినా నాకు తెలుస్తుంది.. పద బావా అని కార్తీక్‌ని తీసుకుని వెళ్లిపోతుంది. ఆ పాప కార్తీక్ బాబు గారికి కాబోయే భార్యా?? ఆమె మాటలు చాలా తేడాగా ఉన్నాయమ్మా అని కడియం అంటాడు. అవన్నీ మనకెందుకు బాబాయ్.. వెళ్లి పనిచూసుకోమని దీప అంటుంది. జోత్స్నకి ఇప్పుడు పారిజాతం గారి మాటలు తప్ప, నా మాటలు ఎక్కవు. ఈ అనుమానాలు తీరిపోవాలంటే కార్తీక్ బాబుకి జోత్స్నకి పెళ్లి కావాలి.. కార్తీక్‌ని మాట్లాడమని చెప్పాను.. జోత్స్నతో మాట్లాడలేదని అనుకుంటా అని దీప అంటుంది. మరోవైపు శ్రీధర్.. రెండో భార్య కూతురు స్వప్నని ముద్దు చేస్తుంటాడు. ఈ డాడీపై అలక ఎందుకు చిట్టి తల్లీ అని కూతుర్ని కాకాపడుతుంటాడు‌. మీరిద్దరూ మాట్లాడకపోతే నేనెందుకు ఉంటాను వెళ్లిపోతానని శ్రీధర్ అనగా.. వెళ్లండి, వెళ్లండి.. వైజాగ్‌లో ఉంటే ఎలాగూ వచ్చేవారు కాదు.. మీ కోసం నేను హైదరాబాద్ వస్తే కనీసం మాతో రెండు రోజులు ఉండలేకపోతున్నారు.. పోతే పోండి.. మళ్లీ రావద్దు.. మీకు ఈ కూతురంటే ఇష్టమే లేదని స్వప్న అంటుంది. ఇక శ్రీధర్ తనని బ్రతిమిలాడతాడు కాసేపటికి తనకి పని ఉందని వెళ్లిపోతాడు. ఇక స్వప్న అయితే.. డాడీ ఇలాగే మాట్లాడతారు కానీ.. ఏదో రోజు.. బాస్‌ని తీసుకొచ్చి డాడీకి పరిచయం చేస్తా.. బాస్‌ని చూడగానే డాడీ థ్రిల్ అయిపోతార ని స్వప్న అంటుంది. సరే.. డైరెక్ట్‌గా మీ బాస్‌ని ఇంటికే పిలువమని స్వప్న తల్లి కావేరి అంటుంది. కార్తిక్ , జ్యోత్స్న లు కారులో వెళ్తుంటారు. రెస్టారెంట్‌కి వెళ్దామని చెప్పి దీపతో స్కూల్‌కి ఎందుకు వెళ్లావని జ్యోత్స్న అడుగుతుంది.  శౌర్యకి భయంగా ఉందంటే వెళ్లానంటు కార్తిక్ చెప్తాడు. సరే మనకి పెళ్లి అయ్యి హనీమూన్‌కి వెళ్తాం.. అప్పుడు శౌర్య కాల్ చేసి.. భయంగా ఉందంటే.. వెళ్లిపోతావా? అని జ్యోత్స్న అడుగగా.. అది వేరూ ఇది వేరూ అని కార్తిక్ అంటాడు. వాళ్లందరి గురించి కాదు జోత్స్నా.. నువ్వేం అనుకుంటున్నావో చెప్పు.. నీకూ మనసు ఉంది కదా.. దాంతో ఆలోచించి నువ్వేం అనుకుంటున్నావో చెప్పమని కార్తిక్ అంటాడు. దాంతో జోత్స్న.. ఐ లవ్యూ బావా.. మనసుతో ఆలోచిస్తే నీపై నాకు ఉన్న ఫీలింగ్ ఇదే.. అక్కడ నువ్వు తప్ప వేరే ఆలోచనకి చోటు లేదు. చివరికి నాక్కూడా చోటు లేదు.. నాది ప్రేమ కాదు.. అంతకంటే ఎక్కువ అని జ్యోత్స్న అనగా.. కార్తిక్ మౌనంగా ఉంటాడు. నా ప్రేమకి నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా పర్లేదు.. నేను గెలుస్తాననే నమ్మకం ఉంది బావా? నా ప్రేమని నీకు లైవ్‌లో చూపించాలంటే.. నువ్వేం చేయాల్సిన పనిలేదు.. జోత్స్న నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పు చాలు.. వెంటనే కారు కింద పడి చచ్చిపోతాను.. ట్రై చేస్తావా బావా అంటూ కారులో పడటానికి వెళ్లిపోబోతుంది జోత్స్న. కార్తీక్ అడ్డుకుని.. జీవితం అంటే ఆటలుగా ఉందా అని అంటాడు. నా లైఫే నువ్వని అనుకున్నప్పుడు.. అందులో నువ్వే ఉండను అన్నప్పుడు ఆ లైఫ్ నా కొద్దు.. నువ్వు శౌర్య వల్ల దీపపై జాలి చూపిస్తున్నావా? లేదంటే దీప వల్ల శౌర్యపై జాలి చూపిస్తున్నావా? అని అడుగుతుంది. నేను శౌర్య గురించే చేస్తున్నా.. దీప దగ్గరకు వెళ్లేది కూడా శౌర్య గురించే అని కార్తిక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Eto Vellipoyindhi Manasu : ఆస్తి కొట్టేయాలని సవతి తల్లి ప్లాన్.. మొత్తం వినేసిన కొత్త కోడలు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 125 లో....సందీప్ కోపంగా శ్రీలత దగ్గరికి వచ్చి.. అన్నయ్యని అడిగి ఆస్తిలో వాటా కావాలి అని చెప్పు అంటాడు. నిన్ను ఈ ఆస్తికి వారసుడిని చెయ్యాలని చూస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్.. వాడికి పెళ్లి పిల్లలు అనే ఆలోచనే లేకుండా చేసింది ఇందుకేనా అంటూ.. ఏ విధంగా అయితే సీతాకాంత్ మనసులో పెళ్లి ఆలోచన లేకుండా చేసిందో సందీప్ కి చెప్తుంది. ఆ తర్వాత పెద్దాయన సీతాకాంత్ పెళ్లి ప్రయత్నం ఆపట్లేదని మరొక ప్లాన్ వేసాను. దాంతో పూర్తిగా సీతాకాంత్ మనసులో పెళ్లి ఆలోచన తీసేసి.. అమ్మ, తమ్ముడు, చెల్లి వీళ్ళే లోకం అనుకునేలా మార్చేసానని సందీప్ కి చెప్తుంది శ్రీలత. ఇంకా కొన్నిరోజులు ఓపిక పట్టు అని సందీప్ కి శ్రీలత నచ్చజెప్పగా.. సరేనని సందీప్ అంటాడు. అదంతా విన్న రామలక్ష్మి సీతా సర్ ఆస్తి కొట్టేయడానికి వీళ్ళు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు.. ఎలాగైనా సీత సర్ ని ఈ మోసం నుండి కాపాడుకోవాలని రామలక్ష్మి అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ ఆఫీస్ కి రెడీ అవుతుంటే ఈ సూట్ వేసుకోండి అంటూ రామలక్ష్మి ఇస్తుంది. అతనికి ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని ఇస్తుంటే సీతాకాంత్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. రామలక్ష్మి నిజం గానే ఒప్పుకుందా అని అనుకుంటాడు. మీరు కచ్చితంగా ఆఫీస్ కి వెళ్లి తీరాలా అని రామలక్ష్మి అనగానే.. చిన్న వర్క్ ఉంది ఆఫీస్ లో అని సీతాకాంత్ అంటాడు‌ మీరు మధ్యాహ్నం త్వరగా ఇంటికి రండి లేదంటే పూజకి లేట్ అవుతుందని రామలక్ష్మి చెప్తుంది. దానికి సీతాకాంత్ సరే అంటాడు. సీతాకాంత్ ఏదో ఆలోచిస్తుంటే.. మీరు ఇక్కడే ఉంటే ఎప్పుడు ఆఫీస్ కి వెళ్లి త్వరగా వస్తారు పదండి అంటూ రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ధన పూజకి ఏర్పాట్లు చేస్తుంటే సిరి చూసి.. నువ్వు ఎందుకు చేస్తున్నావని అడుగుతుంది. మా అక్క చేస్తున్నా పూజ కదా అందుకే అని ధన అంటాడు. వాళ్ళు అయిష్టంతో పెళ్లి చేసుకున్నట్లు అనుకున్నాము కానీ వాళ్ళ బంధం ఇప్పుడు బలపడింది అని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్, రామలక్ష్మి  ఇద్దరు వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Guppedantha Manasu : ఆ లెటర్ చదివి షాకైన దేవయాని.. అతను ఇంతపని చేశాడా!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1103 లో.... మను తండ్రి మహేంద్రనే అని దేవయానికి చెప్తాడు శైలేంద్ర.  వసుధార వెళ్లిపోతు లెటర్ లో అదే విషయం రాస్తుంది. ఆ లెటర్ దేవయానికి శైలేంద్ర ఇస్తాడు. అది చదివి దేవయాని షాక్ అవుతూ.. అసలు మహేంద్ర ఇలా చేశాడంటే నేను నమ్మ లేకపోతున్నానని దేవయాని అనగానే.. లెటర్ లో వసుధర అంత క్లియర్ గా రాస్తే నువు నమ్మట్లేదు అంటావని శైలేంద్ర అంటాడు. ఏది ఏమైనా ఈ లెటర్ ని అస్త్రం గా ఉపయోగించాలని దేవయాని అంటుంది. అందుకే కదా మమ్మీ నేనొక పని చేశానంటూ దేవయానికి చెప్తాడు.  వసుధార రాసిన లెటర్ పక్కన పెట్టి.. తానే స్వయంగా ఒక లెటర్ వసుధార రాసినట్టు రాస్తాడు. అందులో మనుగారు మీ తండ్రి చనిపోయారు అందుకే అనుపమ గారు చెప్పలేదని రాస్తాడు. ఆ తర్వాత పనిలో పని ఎండీ గురించి కూడా రాస్తాను అనుకుంటూ నా తర్వాత ఎండీ బాధ్యతలు శైలేంద్రకి ఇవ్వండి అని రాసి మళ్ళీ డౌట్ వస్తుందేమోనని రాసి కొట్టేస్తాడు. ఆ లెటర్ మను టేబుల్ పై పెట్టి శైలేంద్ర వెళ్ళిపోతాడు. అప్పుడే మను వచ్చి ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. ఈ లెటర్ నిజంగానే వసుధర గారే రాశారా అని అనుకుంటాడు. అదంతా శైలంద్ర పక్కన నుండి చూస్తాడు. ఈ విషయం అంతా దేవయానికి ఇలా  లెటర్ రాసానంటూ చెప్పగానే నాకు తెలియకుండా ఎందుకిలా చేసావ్ అంటూ తిడుతుంది. కచ్చితంగా ఆ మనుకి డౌట్ వస్తుంది. నువ్వే రాసావ్ అనుకుంటాడని.. ఈ లెటర్ ని మాత్రం ఎవరికి కనపడనివ్వొద్దని దేవయాని అంటుంది. అప్పుడే ధరణి వచ్చి.. ఏ లెటర్ అంటూ అడుగుతుంది. దాంతో శైలేంద్ర, దేవాయని ఇద్దరు టెన్షన్ పడతారు. ఎదో ఒకటి కవర్ చేస్తారు. మరొకవైపు వసుధార స్పృహ లోకి ఇంకా రాదు. తన పక్కనే రంగ కూర్చొని తననే చూస్తుంటాడు. అప్పుడే సరోజ మరియు రంగా ఫ్రెండ్ వస్తారు. ఏంటి అలా దగ్గర ఉండి చూసుకుంటున్నావని సరోజ అడుగుతుంది. మేడం మంచి వారిలా ఉన్నారని రంగా చెప్తాడు. ఆ తర్వాత వసుధారకి డ్రెస్ రంగాకి ఇచ్చి వెళ్తుంది సరోజ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

Brahmamudi : మారిపోయిన ఇంటి కోడలు.. తనని రౌడీలు తీసుకెళ్ళారు!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -438 లో... తను అంత సేపు పూజలో కూర్చొలేనని అపర్ణ చెప్పడంతో.. నేను కూర్చొని పూజ చేస్తానని సుభాష్ చెప్తాడు. వద్దు నేనిలా అవ్వడానికి కారణం తనే.. ఇప్పుడు నా బాగు కోసం పూజ చెయ్యడం ఏంటని అపర్ణ కోప్పడుతుంది. నేను పూజ చేస్తానని సుభాష్ అనగానే.. అయితే నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని అపర్ణ అంటుంది. వద్దు నేను చెయ్యనని సుభాష్ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పూజలో నా కొడుకు, కోడలు కూర్చొని ఉంటారని అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత రాజ్, కావ్య లు పూజలో కూర్చుంటారు. ఆ మాయకు ఇచ్చిన నగలు పాలలో కడిగి కావ్యకి ఇవ్వండి అని అపర్ణ చెప్తుంది. ఆ అపర్ణ చూసావా ఎలా కావ్యకి సపోర్ట్ చేస్తుందోనని అనామికతో వాళ్ళ పేరెంట్స్ అంటారు. చూసావా ఆ కావ్య ఎలా అందరిని తన వైపుకి తిప్పుకుందో.. నువ్వు అసలు తిట్లు పడడం తప్ప ఏమైనా చేసావా అని అంటారు. ఆ తర్వాత కనకం ఫ్యామిలీ వెళ్తుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ.. మీ అత్తయ్య గారిలో ఈ మార్పు రావడమని కనకం అంటుంది. చూస్తుంటే మమ్మల్ని కూడా ఒప్పుకున్నట్టే అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. నువ్వు ఓపిక పట్టాలంటే ఏంటో అనుకున్నా కానీ నీ నిరీక్షణ ఫలించింది.. ఇంతకంటే ఏం కావాలని కావ్యతో కనకం చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కావ్య ఫ్యామిలీకి అపర్ణ మర్యాద ఇచ్చి మాట్లాడడం చూసిన రుద్రాణి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుంటుంది. ఏమైంది మమ్మీ అంటూ రాహుల్ అడుగుతాడు. మా వదినలో వచ్చిన మార్పుని చూడలేకపోతున్నాను.. తన భర్త చేసిన చేసిన తప్పుని దాచడానికి తన కోడలు ఎంత త్యాగం చేసిందని కావ్య పై మంచి ఇంప్రెషన్ వచ్చిందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత కావ్య దగ్గరకి రాజ్ వస్తాడు. ఇద్దరు అపర్ణ , సుభాష్ ల గురించి మాట్లాడుకుంటారు. రోజు రోజుకి వాళ్ళ ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. మళ్ళీ మావయ్య మొన్నటి లాగా జీవితంపై విరక్తితో ఏదైనా చేసుకుంటే ఎలా? మావయ్య గారిని తన మనసులోని బాధని అత్తయ్యతో చెప్పమని చెప్తే.. అత్తయ్య అర్ధం చేసుకుంటుందని కావ్య అంటుంది. సరే అని సుభాష్ దగ్గరికి వెళ్లి అపర్ణ తో మాట్లాడమని రాజ్, కావ్య చెప్తారు. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్లి మాట్లాడతాడు. కానీ అపర్ణ కోపంగా మాట్లాడుతుంది. తరువాయి భాగంలో అసలు మాయ స్పృహ లోకి వచ్చిందని కావ్యకి అప్పు చెప్తుంది. ఆ తర్వాత అప్పు, కావ్యలు హాస్పిటల్ కి వెళ్లేసరికి రౌడీలు మాయని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.  

తెలుగు ఇండస్ట్రీలో ఒక పెయింటర్ నా డాన్స్ కి ఫ్యాన్ అయ్యాడు

  నీతోనే డాన్స్ షో సెమి ఫినాలే పూర్తి చేసుకుని ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. సెమి ఫినాలేలో అందరూ అద్దిరిపోయే డ్యాన్సస్ చేశారు. ఐతే టాప్ ప్లేసులో ఉన్నారు అమర్ అండ్ తేజు, నయని అండ్ విశ్వా సెకండ్ ప్లేస్, భానుశ్రీ అండ్ మానస్ థర్డ్ ప్లేస్, యావర్ అండ్ వాసంతి ఫోర్త్ ప్లేస్, నితిన్ అండ్ అక్షితా ఫిఫ్త్ ప్లేస్, బ్రిట్టో అండ్ సంధ్య సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు. బాటమ్ టులో ఉన్న నితిన్ అండ్ అక్షితా, బ్రిట్టో అండ్ సంధ్య మధ్య మళ్ళీ పోటీ పెట్టింది శ్రీముఖి. చివరికి ఫైనల్స్ కి నితిన్ అండ్ అక్షితను పంపించారు. ఇక బ్రిట్టో అండ్ సంధ్య ఎలిమినేట్ అయ్యారు. ఐతే వాళ్ళు ఆ బాధను బయట పెట్టకుండా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశారు. తర్వాత బ్రిట్టో మాట్లాడుతూ .. "ముందు నా వైఫ్ సంధ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి నీతోనే డాన్స్ కి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని పరిచయం చేసినందుకు. ఐ లవ్ యు సంధ్య.. నీతోనే డాన్స్ తో నా జర్నీ సూపర్ గా ఉంది. శ్రీముఖి ఐ లవ్ యు.. యాంకర్ గా  నువ్వు నాకు ఎన్నో విషయాలు నేర్పావు" అని చెప్పాడు. బోబ్బా అనే పెయింటర్ గా పని చేసే ఒక వ్యక్తిని స్టేజి మీదకు తీసుకొచ్చి థ్యాంక్స్ చెప్పాడు. అతనికి తన రెట్రో స్టైల్ డాన్స్ నచ్చిందని చెప్పాడట ఆ విషయాన్ని బ్రిట్టో అందరితో షేర్ చేసుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఆ పెయింటర్ తనకు ఫస్ట్ ఫ్యాన్ అని కూడా చెప్పి ఎంతో సంతోషపడ్డాడు. అలా నెక్స్ట్ వీక్ కి మిగతా టీమ్స్ అన్ని వెళ్ళబోతున్నాయి. ఇక జడ్జెస్ ఐతే ఫైనల్స్ లో ఎంటర్టైన్మెంట్ కావాల్సిందే అని చెప్పారు.  

ఆట సందీప్ కి టాటూని గిఫ్ట్ గా ఇచ్చిన జ్యోతి

ఆట సందీప్ అండ్ జ్యోతి గురించి బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఐతే ఆట సందీప్ బర్త్ డే సందర్భంగా జ్యోతి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది.. ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏంటి అనే విషయాన్ని సందీప్ ని గెస్ చేయమని చెప్పింది. కానీ సందీప్ మాత్రం సర్ప్రైజ్ ని ఎలా గెస్ చేస్తారంటూ ఆలోచించాడు కానీ చెప్పలేకపోయాడు. "ప్రతీ ఏడాది ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది కానీ ఈ ఏడాది మాత్రం ఆ సర్ప్రైజ్ వేరు..నా ఐడియాలజీ తెలుసు కదా నేనంటే కంప్లీట్  గా మా పేరెంట్స్ కన్నా ఎక్కువగా నీకే  తెలుసు కదా..సరే కళ్ళు మూసుకో" అని చెప్పి "నేను నిన్ను ఏమని పిలుస్తా" అని అడిగింది. "సనమ్" అని పిలుస్తా అని సందీప్ చెప్పాడు. దాంతో తన చేతి మీద ఉన్న ఒకదాన్ని కెమెరాకు చూపించింది.    తర్వాత సందీప్ కళ్ళు తెరిచి చూపించింది. తన చేతి మీద సనమ్ అని ఒక రెడ్ హార్ట్  సింబల్ ని చూపించింది. అదే ఈ ఏడాది బర్త్ డే సర్ప్రైజ్ అని చెప్పింది. దాంతో ఆట సందీప్ ఫుల్ షాక్ అయ్యాడు. ఇది హ్యాపీ న్యూస్ ఐతే ఇంకో శ్యాడ్ న్యూస్ ఉంది అంటూ ఈ టాటూ వేయించుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా కలిసే పుడతామంటా అని చెప్పింది జ్యోతి. ఆ మాటకు సందీప్ అబ్బా మళ్ళీ నువ్వేనా అన్నట్టుగా షిట్ అనే డైలాగ్ వేసాడు. టాటూ వేయించుకోవడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే టాటూ వేయించుకుంటామో చనిపోయేటప్పుడు కూడా ఈ టాటూ వెంటే వచ్చేస్తుంది అని చెప్తూ  సందీప్ ని హగ్ చేసుకుంది. ఈ వీడియో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్ గురించి అందరికీ తెలిసిందే. డాన్స్ రియాలిటీ షో ఆటతో సందీప్ బాగా పాపులర్  అయ్యాడు. ఆ షో పేరే తన ఇంటికి పేరుగా మారిపోయింది.  ఆట సందీప్ బిగ్ బాస్ తెలుగు 7 తో మరోసారి వెలుగులోకి వచ్చాడు. సందీప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు.  

'కార్తీక దీపం 2' డొల్ల.. మోనిత లేని కార్తీక దీపం సీరియల్ మాకొద్దు!

కార్తీక దీపం ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇందులో కార్తీక్, దీప అండ్ మోనిత.. ఈ ముగ్గురు మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడియన్స్ ని కట్టిపడేసింది. హీరో - హీరోయిన్ ఉన్నప్పుడు తప్పనిసరిగా విలన్ లేకపోతే ఆ సీరియల్ కానీ సినిమా కానీ రేటింగ్ రాదు సక్సెస్ ఉండదు, బోరింగ్ గా సప్పగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆడియన్స్ ని మెప్పించలేదు.. ఇప్పుడు కార్తీక దీపం పార్ట్ 2 అలాగే ఉంది. ఆ సీరియల్ లో ఫైర్ లేదు...ఆడియన్స్ లో అంత ఊపు కూడా లేదు. వీక్లీ రేటింగ్స్ లో కూడా ఎక్కడా ప్లేస్ లేదు.  ఇప్పుడు శోభాశెట్టి ఫాన్స్ ఈ విషయాన్ని చెప్తూ కార్తీక దీపం ప్రోమో కటింగ్ ని ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్  చేశారు. "ట్యాగ్ మోనిత ఫాన్స్..కార్తీక సీరియల్ లో  ఏమీ లేదు అంతా డొల్ల" అని సీరియల్ పార్ట్ 1 ని ఫాహద్ ఫాజిల్ ఇంటరెస్టింగ్ గా చూస్తున్నట్టు...అదే ఫాహద్ ఫాజిల్ పార్ట్ 2 చూసి డల్ గా ఉన్న ఫేసెస్ ని పోస్ట్ చేశారు. కింద ఇంకో పిక్ లో బ్రహ్మానందం చెప్పినట్టు ఒక డైలాగ్ ని పోస్ట్ చేశారు. "భల్లాల దేవుడు లేని బాహుబలి ఎలా ఉంటదో...మోనిత లేని కార్తీక దీపం కూడా అలాగే ఉంటది" అని చెప్పారు.  నిజమే కదా గట్టి విలన్ లేకపోతే సీరియల్ ఎందుకు అని ఆడియన్స్ కూడా అంటున్నారు. మరి ఈ సీరియల్ మేకర్స్ మోనిత ఫాన్స్ చెప్పిన పాయింట్ ని ద్రుష్టిలో పెట్టుకుని ఇకనైనా సీరియల్ లోకి మోనిత అలియాస్ శోభా శెట్టిని తీసుకొస్తే సీరియల్ ఓ రేంజ్ లో పేలే అవకాశం కనిపిస్తోందంటున్నారు సినీ క్రిటిక్స్.

భార్య గదిలోకి వెళ్ళడానికి సిగ్గెందుకు..?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -124 లో.. సీతాకాంత్ తన మనసులోని మాటని రామలక్ష్మికి చెప్పి ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్లు ఉహించుకుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి సీతాకాంత్ కొత్తగా కనపడుతున్నాడు.. సిగ్గు పడుతున్నావంట ఆటపట్టిస్తాడు. ఆ సిగ్గుకి కారణం ఏంటని పెద్దాయన అడుగుగా.. ఆ రూమ్ లోకి వెళ్లాడానికి సిగ్గుగా ఉందని సీతాకాంత్ అంటాడు. నీ భార్య గదిలో ఉంటే ఆనందంగా ఉండాలి గానీ భయమెందుకని పెద్దాయన అంటాడు. అంటే ఇన్ని రోజులు మేమ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా.. ఇప్పుడు భార్యా భర్తలుగా ఉండాలంటే కొంచెం కంగారుగా ఉందని సీతాకాంత్ అనగానే.. నువ్వు వెళ్ళు ముందు అని పెద్దాయన పంపిస్తాడు. సీతాకాంత్ సర్ నన్ను పెళ్లి చేసుకున్నాడంటే అక్కడున్న పరిస్థితికి తాళి కట్టారా.. ఇష్టంతో కట్టారా అని రామలక్ష్మి అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ గదిలోకి వచ్చి అసలు రామలక్ష్మి నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుందా లేక ఆ పరిస్థితికి చేసుకుందా కనుక్కోవాలని.. నువ్వు ఢిల్లీ కోచింగ్ కి వెళ్తా అన్నావ్? మళ్ళీ తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నావని సీతాకాంత్ అడుగగా.. నేను మీ అమ్మ గారి నిజ స్వరూపం బయట పెట్టడానికి చేసుకున్నానని ఎలా చెప్పాలని అనుకుంటూ సైలెంట్ గా ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు కదా.. మళ్ళీ నన్ను చేసుకున్నారని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు అంటే చాలా ఇష్టమని ఎలా చెప్పాలని సీతాకాంత్ మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు. దాంతో నేనంటే ఇష్టం లేదనుకొని రామలక్ష్మి ఎప్పటిలాగే చాప తెచ్చుకొని నేలపై పడుకుంటుంది. దాంతో రామలక్ష్మి ఇప్పుడు కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత సందీప్ దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. ఆస్తిలో మనకి వాటా ఇవ్వమని అడగండి అని అంటుంది. దాంతో సందీప్ కోపంగా వెళ్లి సిగరెట్ తాగుతుంటాడు. అప్పుడే రామలక్ష్మి వాటర్ కోసం వెళ్లి సందీప్ ని చూస్తుంది. సందీప్ శ్రీలత దగ్గరికి వెళ్లి ఆస్తిలో వాటా ఇవ్వమని అన్నయ్యని అడుగమని సందీప్ అనగానే.. సందీప్ చెంప చెల్లుమనిపిస్తుంది శ్రీలత. ఈ ఆస్తి మొత్తానికి నిన్ను వారసుడిని చేస్తానని నేను అంటుంటే.. నువ్వేంటి వాటా అంటున్నావ్.. అందుకే కదా సీతాకాంత్ దృష్టిలో లో పెళ్లి, పిల్లలు అనే ఆలోచన లేకుండా చేశానని శ్రీలత చెప్తుంటే.. ఆ మాటలు అన్ని రామలక్ష్మి వింటుంది. ఇక గతంలో సీతాకాంత్ తో శ్రీలత మాట్లాడిన మాటలు గుర్తుకుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శౌర్యకి గార్డియన్ గా కార్తీక్.. నేనుంటానంటూ జ్యోత్స్న ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -72 లో..... జ్యోత్స్న కి కార్తీక్ ఫోన్ చేసి బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకూడదు.. కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలని జ్యోత్స్న అనుకుంటుంది. మరొకవైపు శౌర్యని దీప తీసుకొని స్కూల్ కి వెళ్తుంది. అక్కడ ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ కదా.. నువ్వు మీ అమ్మని మాత్రమే తీసుకొని వచ్చావ్.. మీ నాన్న ఎక్కడ అని శౌర్య ఫ్రెండ్ అడుగగా.. మా నాన్న ఊరు వెళ్ళాడని శౌర్య చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ కి శౌర్య ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావంటు వెంటనే దీప ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేసావని దీప అడుగగా.. నువ్వు వస్తే స్కూల్ లో జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు వస్తే మళ్ళీ నన్ను బయటకు పంపిస్తే ఎలా అని శౌర్య అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. శౌర్య లిఫ్ట్ చేసి కార్తీక్ నువ్వు త్వరగా రా అని చెప్పగానే.. ఏమైందో ఏంటో అని కార్తీక్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. నాకు భయంగా ఉంది కార్తీక్ ఇక్కడే ఉండు ప్లీజ్ అని శౌర్య రిక్వెస్ట్ చెయ్యడంతో.. సరే కాసేపు ఉండి వెళ్తానని కార్తీక్ అంటాడు. ముగ్గురు కలిసి లోపలికి వెళ్తుంటే జ్యోత్స్న ఫ్రెండ్.. వాళ్ళని ఫోటో తీస్తుంది. మరొకవైపు బావ బ్రేక్ ఫాస్ట్ కి పిలిచాడని జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతు.. సుమిత్రకి చెప్తుంది. హ్యాపీగా వెళ్లిరా అని సుమిత్ర చెప్తుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి తన ఫ్రెండ్ ఫోటో పంపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే జ్యోత్స్న కోపంగా స్కూల్ కి బయల్దేర్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ మీటింగ్ లో ఉన్న కార్తీక్, దీపల దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. తనని చూసి వాళ్ళు షాక్ అవుతారు. శౌర్య గార్డియన్ గా మా బావ ఉన్నాడు. ఇక నుండి నేను ఉంటాను. తను చాలా బిజీ మీరు అలా వెయిట్ చేయిస్తే ఎలా అని ప్రిన్సిపల్ తో జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత దీప హోటల్ కి వెళ్ళిపోతుంది. మరొకవైపు కోపంగా కార్తీక్ కి చివాట్లు పెడుతుంది జ్యోత్స్న. ఆ తర్వాత దీప హోటల్ కి కార్తీక్ ని తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ దీపని ఇండైరెక్ట్ గా అవమానిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.