29 రకాల వంటకాలు.. నాన్ వెజ్ స్పెషల్! గులాబీ ప్లీనరీలో ఘుమఘుమలే..

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లినరీకి సర్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకే రెండేండ్లకోసారి జరిగే గులాబీ పండుగ భారీ స్థాయిలో జరుగుతుంది. టీఆర్ఎస్ ప్లీనరీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వంటకాలే. ప్రతి ప్లీనరీలోనూ అతిథులకు వడ్డించే భోజనమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు సీఎం కేసీఆర్.  అక్టోబర్ 25న హైటెక్స్ లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. కుకింగ్ సెక్షన్ ఇప్పటికే సన్నాహాలు చేసేస్తోంది. ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్‌ కమిటీ ఇన్‌చార్జిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన  ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయబోతున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు. ప్లినరీలో మెన్ ఇదే..  ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌ అందివ్వనున్నారు.  ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. సుమారు 15 వేల మందికి వెజ్‌, నాన్‌వెజ్‌ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నామన్నారు. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నామని తెలిపారు ప్లీనరీ ఫుడ్ ఇంచార్జ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.   

కేసులు పెట్టి ఏం పీకావ్.. జగన్ రెడ్డి! చంద్రబాబు ఉగ్రరూపం.. 

ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతుందని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. ఇది ఉగ్రవాదం కాకపోతే మరేమిటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్‌ దుష్పరిపాలన ప్రజలందరికీ తెలియాలని  అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదని తెలిపారు. దాడులు చేసిన వాళ్లపై కేసులు లేవు.. పట్టాభిపై కేసు పెడతారా అని నిలదీశారు. పట్టాభి అన్న మాట ఏంటో నేను ఇంతవరకు వినలేదన్నారు. పట్టాభి మాటలకు కొత్త అర్ధాలు తీసి దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు.  పోలీసులు, అధికారులకు భయపడి మేం సరెండర్ కావాలా అని చంద్రబాబు అన్నారు.  36 గంటల దీక్షను విరమించిన చంద్రబాబు.. ఆవేశంగా మాట్లాడారు. 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఇక్కడున్నాయని, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్‌పై దాడి ఉగ్రదాడేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 100 గజాల దూరంలో డీజీపీ ఆఫీస్‌ ఉందని, డీజీపీ సరైన చర్యలు తీసుకుంటే ఇది జరిగేదా..? అని ప్రశ్నించారు. ఏపీని డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా పాలసీలు డిసైడ్‌ చేయడానికి వీల్లేదన్నారు. కల్తీ మద్యంతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్‌తో ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్‌ ఉన్నట్టు మీడియా కథనాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 

ప్రచారం ముగిసే రోజు నుంచి కోడ్ అమలట.. ఏపీ ఎన్నికల కమిషన్ స్పెషల్..

తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు.. అదే విధంగా దేశంలో మరికొన్ని రాష్ట్రాలలో ఇంకొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈ నెల అంటే, అక్టోబర్ 30 పోలింగ్ జరుగుతుంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 28 న కేంద్ర ఎన్నికల కేంద్ర షెడ్యూలు విడుదల చేసింది. అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి, ఎలక్షన్ కోడ్  అమలులోకి వచ్చేసింది ... అని కదా అనుకుంటున్నాం .. కానీ, అది తప్పు .. ఉయ్ ఆర్ రాంగ్... మనం తప్పులో కాలేశాం. షెడ్యూలు ప్రకారం నోటిఫికేషన్, నామినేషన్ల ఘటం ముగిసి ప్రచారపర్వం  సాగుతోంది. అదంతా ఓకే ...అలాగే రేపు అక్టోబర్ 30 పోలింగ్ ... నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు అన్నీ కూడా ... యథాతథంగానే ఉంటాయి .. అలాగే జరిగి పోతాయి ... కానీ...ఎలక్షన్ కోడ్ మాత్రం  మీరు, నేను, మనం అనుకుంటున్నట్లుగా  సెప్టెంబర్ 28 రాలేదు ... అక్టోబర్ 28వస్తుంది.. ఏంటి .. నీకేమన్నా మెంటలా ..తల తిరుగుతోందా .. అక్టోబర్ 28 కి ప్రచారం కూడా ముగిసి పోతుంది ..ఆరోజున ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం ఏమిటో, తిక్క సన్నాసి అంటారా? అలాయితే మీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అక్టోబర్ 22న విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ ..చూడండి ..ఆ తర్వాత తిక్క ..పిచ్చ ..తల తిరుగుడు ఎవరికో .. మీరే డిసైడ్ చేసుకోండి  ఏపీ ఎన్నికల కమిషన్ ప్రెస్ నోట్..  The election commission of India has announced schedule for bye – election to 124 – Badvel (SC) Assembly constituency of Andhra Pradesh State vide press note no .ECI1/PN/83/202, dated 28  September, 2021 and the MODEL CODE OF CONDUCT came into effect from 28.10.2021../అని కదా ఉంది అంటే ఏంటి...పోలింగ్’కు రెండు రోజుల ముందు ఈనెల (అక్టోబర్) 28 ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది ... చుసారా.. ఏముందో.. మరి ఇంత వరకు అమలులో ఉన్నది ఏమిటీ... అంటారా.. అదేమిటో శ్రీ కమిషన్ వారే సెలవియ్యాలి.... 

పులులు కాదు పిల్లులు.. గంట క‌ళ్లు మూసుకుంటే.. మాకూ బీపీ.. టాప్‌న్యూస్ @7pm

1. కొన్ని పిల్లులు తాము పుల‌ల‌మ‌నుకుంటున్నాయి.. మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌.  2. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయ‌న‌ గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.  3. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. కేసీఆర్ పేరును బలపరుస్తూ మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో కేసీఆర్ ఎన్నిక లాంఛనమే కానుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి వచ్చిన నామినేషన్లను శనివారం పరిశీలిస్తారు. ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ జరుగనుంది. ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 వసంతాలు కావడంతో 25న పార్టీ తరపున ద్విదశాబ్ది ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.  4. టీడీపీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ సీఎం జ‌గ‌న్‌రెడ్డితో పాటు మంత్రుల‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని.  5. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. 6. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశించ‌గా.. ఆ దిశగా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  7. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఎంపీ రెడ్డెప్ప సమక్షంలోనే ఇలా రెచ్చిపోయారు. చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి. 8. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.  9. తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. నవంబర్, డిసెంబర్ నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లను ఆన్‌లైన్లో ఉంచింది. రోజుకి 12 వేల చొప్పున 7.8 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే, నాలుగు గంటల్లోనే ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయంతో టీటీడీకి 21 కోట్ల రాబడి వచ్చింది.  10. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిన సంద‌ర్భంగా ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. 

కొన్ని పిల్లులు పులులమని భావిస్తున్నాయి.. అస‌లు సినిమా ముందుంది.. లోకేశ్ ఫైర్‌

మా పార్టీ ఆఫీసులో ప‌గిలింది అద్దాలు మాత్ర‌మే.. మా కార్య‌క‌ర్త‌ల గుండెల‌ను మీరు గాయ‌ప‌ర‌చ‌లేరు.. ఒక చెంప మీద కొడితే రెండు చెంప‌లు వాయ‌గొడ‌తాం.. అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వైసీపీని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ప‌సుపు జెండా చూస్తే వైసీపీ శ్రేణుల‌కు ఎందుకంత భ‌య‌మ‌ని ప్ర‌శ్నించారు. ఏపీలో గంజాయి దందా బాగా న‌డుస్తోంది.. దీనిపై నిల‌దీస్తే టీడీపీ కార్యాల‌యంపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. ఏపీ సీఎంగా మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఖాయ‌మ‌న్నారు నారా లోకేశ్‌.  వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష క్లైమాక్స్‌కు చేరింది. మంగ‌ళ‌గిరి ఎన్టీఆర్‌భవన్‌కు రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి టీడీపీ నాయ‌కులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ రాకపోయినా.. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని విమర్శించారు. గంజాయితో యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని నిలదీస్తే టీడీపీ ఆఫీసుల‌పై దాడులు చేశారని విమర్శించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎవరూ లేని సమయంలో వైసీపీ మూకలు దాడిచేశారు.. దమ్ముంటే ఇప్పడు రావాలని సవాల్‌ విసిరారు నారా లోకేశ్‌.   చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్‌ హెచ్చరించారు.  ‘‘పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం. కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే.. మా కార్యకర్తల గుండెలు మీరు గాయపరచలేరు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే .. రెండు చెంపలు వాయగొడతాం. జగన్‌రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్‌ మగాడైతే చిన్నాన్న హత్య కేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం. 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా. వైసీపీకి ట్రైలర్‌ మాత్రమే చూపించాం.. సినిమా ముందుంది’’ అంటూ లోకేశ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.   

వైసీపీకి బిగ్ షాక్‌.. ఆ కేసులో ఆరుగురి అరెస్ట్‌...

జ‌గ‌న్‌ను చూసుకొని రెచ్చిపోయారు. అభిమానం అరాచ‌కంగా మారింది. త‌మ‌నెవ‌రు అడిగేద‌ని విర్ర‌వీగారు. సోష‌ల్ మీడియాలో నోటికొచ్చిన‌ట్టు వాగారు. ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్టారు. అయితే, టీడీపీని విమ‌ర్శించిన‌ట్టు హైకోర్టు తీర్పుల‌ను త‌ప్పుబ‌డితే న్యాయ‌స్థానం ఊరుకుంటుందా? అదే చేస్తోంది. త‌మ జ‌డ్జిమెంట్‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు పోస్టులు పెట్టిన వారంద‌రి సంగ‌తి తేల్చమంటూ సీబీఐని ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ.. వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టిన వారంద‌రిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తోంది. ఆ కేసులో తాజాగా మ‌రో ఆరుగురిని అరెస్ట్ చేసింది. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకటసత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్‌ సుస్వరం, కిషోర్‌ కుమార్‌ దరిస, సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను అరెస్టు చేసినట్టు సీబీఐ వెల్లడించింది.  హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు గతేడాది నవంబర్‌ 11న దర్యాప్తు ప్రారంభించారు.  మొత్తం 16 మందిపై 12 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఏపీ సీఐడీ అధికారుల నుంచి వివరాలు సేక‌రించారు. గతంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వేర్వేరుగా ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీబీఐ తాజాగా ఆరుగురిని అరెస్టు చేసింది. విదేశాల్లో ఉన్న నిందితులపై ఏవిధంగా చర్యలు తీసుకోవాలో చూడాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా సీబీఐ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉంటూ, వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. టీడీపీని విమ‌ర్శిస్తున్న కొంద‌రు.. అదే రీతిన న్యాయ‌మూర్తులు, న్యాయ‌స్థానాల‌పైనా ఇష్టం వ‌చ్చిన‌ట్టు పోస్టులు పెట్ట‌డంతో.. ఇప్పుడు వారంద‌ని భ‌ర‌తం ప‌ట్టేందుకు సీబీఐ చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వ‌డం వైసీపీ శ్రేణుల‌కు షాకింగ్ ప‌రిణామం..అంటున్నారు.   

తుళ్లూరు టూ తిరుమ‌ల‌.. అమరావతి రైతుల మహా పాదయాత్ర.. జ‌న‌సేన స‌పోర్ట్‌!

దాదాపు రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిని కాల‌రాయొద్దంటూ పోరాడుతున్నారు. రాజ్యం ఎంత ఒత్తిడి తెస్తున్నా.. కేసుల‌తో ఎంత‌గా ఉక్కుపాదం మోపుతున్నా.. త‌గ్గేదే లే అంటూ అమ‌రావ‌తి రైతులు మొక్క‌వోని దీక్ష చేస్తున్నారు. కొవిడ్ కార‌ణంగా ఉధృతి కాస్త స‌ద్దుమ‌నగ‌గా.. మ‌రోసారి రాజ‌ధాని రైతులు ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు ప‌దును పెట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్ 1 నుంచి రైతులు మహా పాదయాత్ర చేప‌డుతున్నారు. తుళ్లూరు గ్రామం నుంచి తిరుమల వరకు 45 రోజుల పాటు పాద‌యాత్ర కొన‌సాగనుంది. డిసెంబర్ 17వ తేదీతో పాదయాత్ర ముగియనుంది.  మహా పాదయాత్రకు పలు పార్టీల మద్దతు కూడ‌గ‌డుతున్నారు. తాజాగా, మహా పాదయాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతును రాజధాని రైతుల ప్రతినిధులు కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను రైతులు కలిసారు. రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని రైతులు ఆరోపించారు. అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టినట్లు రైతులు చెప్పారు. రాజధాని కోసం మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్, మనోహర్‌లు మహా పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు, జేఏసీ నేతలలు విజ్ఞప్తి చేసారు. రైతుల మహా పాదయాత్ర  విజయవంతం కావాలని మనోహర్ ఆకాంక్షించారు.   

రేవంత్‌రెడ్డికి భ‌ట్టి హ్యాండిస్తారా? కేసీఆర్ స్కెచ్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. కానీ, పార్టీ సీనియర్లలో మాత్రం ఇంకా కదలిక రాలేదు. సీతక్క, షబ్బీర్ అలీ, మధు యాష్కి వంటి కొద్ది మంది రేవంత్ రెడ్డి అడుగులో అడుగేసి నడుస్తున్నా, ఇతర సీనియర్ నాయకులు వెయిట్ అండ్ వాచ్ మూడ్’లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, సీనియర్ల స్తబ్దతకు ఇంకా కారణాలున్నా ఇప్పట్లో ఎన్నికలు లేక పోవడం కూడా సీనియర్ నాయకుల స్లీపింగ్ మోడ్’కు కారణమని కొందరు పార్టీ నేతలు అంటున్నారు. అలాగే, జాతీయ స్థాయిలో పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ‘సెట్’ అవలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితేనే గానీ, కాంగ్రెస్ ఫ్యూచర్ మీద క్లారిటీ రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో అంతవరకు వెయిట్ అండ్ వాచ్ పాలసీ ఫాలో కావడం ఉత్తమం అనే స్టేట్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. అలాగే, ఈ లోగా హుజూరాబాద్’ ఫలితంతో స్టేట్ సీన్’లో కూడా ఇంకొంత క్లారిటీ వస్తుందని, ఏ రకంగా చూసినా, ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్’ ఉత్తమం అనే అభిప్రాయమే పార్టీ సీనియర్ లీడర్స్’లో ఉందని అంటున్నారు.   అదలా ఉంటే, అధికార తెరాస మరో సారి కొందరు సీనియర్ లీడర్ల ఎగరేసుకు పోయేందుకు పావులు కదుపుతోంది. జాబితా కొంచెం పెద్దగానే ఉన్నా, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కదే అంటున్నారు. రేవంత్ రెడ్డి దూకుడును తగ్గించి, కాంగ్రెస్ స్పీడ్’కు బ్రేకులు వేసేందుకు భట్టి విక్రమార్క వంటి సీనియర్ అండ్ సిన్సియర్ లీడర్’ను తమ వైపుకు తిప్పుకోవడం అవసరమని తెరాస నాయకత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎలాగైనా భట్టిని బుట్టలో వేసుకునేందుకు, ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం మొదలు, దళిత బంధు పథకం విస్త‌రణలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో భ‌ట్టి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చేర్చింది. అంతే కాదు, మిగిలిన, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు రూ .50 కోట్లు చొప్పున  విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, భట్టి నియోజక వర్గం మధిర నియోజకవర్గానికి మాత్రం రూ .100 కోట్లు విడుదల చేసి, ప్రత్యేక ప్రేమను వ్యక్త పరిచారు.   నిజానికి అంతకు ముందు నుంచి భట్టి పై కేసేఆర్ ప్రేమ పొంగుతున్నా, మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ ఇష్యూతో, ‘లవ్ స్టొరీ’ ఓపెన్ అయింది. ఇక అక్కడి నుంచి, దళిత సాధికారిత పేరున తెచ్చిన దళిత బంధును అడ్డుపెట్టుకుని భట్టికి వరసగా బిస్కెట్లు వేస్తూనే ఉన్నారు కేసీఆర్.  తెరాస...ప్రేమ బాణాలు సంధిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ మీడియా ముచ్చట్ల (చిట్ చాట్ ) లో మరోసారి, మరో వలపుబాణం విసిరారు. భ‌ట్టి లాంటి మంచి నాయకుడిని ప‌క్క‌న‌బెట్టి.. గ‌ట్టి అక్ర‌మార్కులు పార్టీని ఏలుతున్నారంటూ ప్రాసతో కూడిన మరో మెరుపు బాణం వ‌దిలారు.   నిజానికి, భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ విషయంలో ఎక్కడా నెగటివ్ కామెంట్స్ చేయలేదు. రేవంత్ రెడ్డి తనను పక్కన పెట్టారని, కేసీఆర్, కేటీఆర్ చెవిలో ఏమైనా చెప్పారేమో కానీ, బహిరంగంగా మాత్రం ఎక్కడా తనకు రేవంత్ రెడ్డితో విభేదాలున్నాయని సూచన మాత్రంగా అయినా సంకేతాలు ఇవ్వలేదు. అయినా కేటీఆర్ ఆయనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం ద్వారా భట్టిని బుట్టలో వేసుకునేందుకు ఏస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చును. అయితే, భట్టిని బుట్టలో వేసుకోవడం అన్ని పార్టీలు తిరిగి వచ్చిన మోత్కుపల్లిని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదని, పార్టీ, సిద్ధాంత నిబద్దత గల భట్టి విషయంలో తెరాస నాయకులకు భంగపాటు తప్పదని అంటున్నారు భట్టి కమిట్మెంట్ తెలిసిన కాంగ్రెస్ నాయకులు.

చంద్రబాబు మీద బాంబు వేస్తా.. వైసీపీ లీడ‌ర్ బ‌రితెగింపు.. కుప్పంలో హైటెన్ష‌న్‌

ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై వైసీపీ మూక‌లు దాడులు చేశారు. ప‌లువురు టీడీపీ నాయ‌కుల‌పై కేసులు బ‌నాయించి జైలుకు త‌ర‌లించారు. ఇక మంత్రుల బెదిరంపుల‌కైతే హ‌ద్దే లేదు. చేసింది చాల‌ద‌న్న‌ట్టు.. కొంత‌మంది వైసీపీ నాయ‌కులు మ‌రీ ఓవ‌ర్‌గా మాట్లాడుతున్నారు. ఏకంగా చంద్ర‌బాబు నాయుడినే అంతం చేస్తామంటూ బెదిరింపుల‌కు దిగుతున్నారు. జ‌గ‌న్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను, నాయ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తుండ‌టంతో.. మంత్రుల నుంచి చోటామోటా లీడ‌ర్ల వ‌ర‌కూ అంతా నోటికొచ్చిన‌ట్టు వాగుతున్నారు.  తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో చంద్రబాబుపై ఓ నేత రెచ్చిపోయి తీవ్ర పదజాలం వాడారు. ‘చంద్రబాబూ.. కుప్పం వస్తే కారు మీద బాంబు వేస్తా.. దమ్ముంటే కుప్పంకి రా రా..’ అంటూ బ‌రితెగింపు మాట‌లు మాట్లాడారు. ఇలా వాగింది ఏ సాదాసీదా చిల్ల‌ర నాయ‌కుడో కాదు. ఆయ‌న బాధ్యతాయుత పదవిలో ఉన్న రెస్కో చైర్మన్‌ జీఎస్‌ సెంథిల్‌కుమార్‌.  కుప్పంకు వ‌స్తే చంద్ర‌బాబు కారు మీద బాంబులేస్తానంటూ సెంథిల్‌కుమార్ ఏకంగా ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో రెచ్చిపోయారు. సెంథిల్ అలా వాగుతుంటే.. ఎంపీ రెడ్డెప్పతో సహా అక్క‌డున్న వారెవ‌రూ ఆయ‌న్ను క‌నీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం విడ్డూరం. చంద్ర‌బాబుపై బాంబులేస్తాన‌ని బెదిరించ‌డ‌మే కాదు.. ఇంకా చాలా బూతులే మాట్లాడారు సెంథిల్‌కుమార్‌.  చంద్ర‌బాబుపై వైసీపీ లీడ‌ర్ సెంథిల్‌కుమార్ చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ మాట‌ల వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సెంథిల్‌కుమార్‌పై టీడీపీ శ్రేణులు భ‌గ్గు మంటున్నాయి. సెంథిల్ కుమార్ వ్యాఖ్య‌ల‌తో కుప్పంలో తీవ్ర‌ ఉద్రిక్తత త‌లెత్తింది. టీడీపీ అధినేతపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైసీపీ నేతపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారికి పోటీగా వైసీపీ శ్రేణులూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో ఇరువర్గాలు రోడ్డుపై బాహాబాహీకి దిగారు. తోపులాట తీవ్రస్థాయికి చేరడంతో భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ శ్రేణుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని.. ఇరువర్గాలకూ నచ్చజెప్పి పంపించేశారు పోలీసులు.  బోసిడీకే అన్నందుకే ప‌ట్టాభిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.. టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు.. మ‌రి, చంద్ర‌బాబు కారుపై బాంబులేస్తాన‌ని బెదిరించిన వైసీపీ నాయ‌కుడు సెంథిల్‌కుమార్‌పై పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకు బీపీ వస్తే జగన్ తాట తీస్తాం..

చంద్ర‌బాబు చేప‌ట్టిన 36 గంట‌ల నిర‌వ‌ధిక దీక్షలో టీడీపీ నాయ‌కులు సీఎం జ‌గ‌న్‌రెడ్డిపై చెల‌రేగిపోతున్నారు. తూటాల్లాంటి మాట‌ల‌తో వైసీపీ ప్ర‌భుత్వాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో ర‌కంగా వార్నింగ్ ఇస్తున్నారు. అందరిలోకీ ప‌రిటాల సునీత చేసిన హెచ్చ‌రిక హైలైట్‌. టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక గంట క‌ళ్లు మూసుకుంటే చాలు.. తామేంటో చూపిస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏపీని చంద్రబాబు రామరాజ్యంగా మారిస్తే, జగన్ రాక్షస రాజ్యంగా మార్చారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లకు బీపీ వస్తే జగన్ తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీ తాకాటు చప్పుళ్లకు భయపడమని.. 2024లో టీడీపీదే అధికారమని బుద్దా వెంకన్న అన్నారు.  ఇక మ‌రో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్ చింత‌మ‌నేని సైతం ఓ రేంజ్‌లో జ‌గ‌న్‌రెడ్డిని, మంత్రుల‌ను దుయ్య‌బ‌ట్టారు. ‘‘మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ కొడాలి నాని టీడీపీ నేతలను తిట్టారు. త్వరలోనే ఆయన పదవి పోవడం ఖాయం. జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు. మేమూ ఉప్పూకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది’’ అని చింతమనేని ప్రభాకర్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ఎన్నికల జరగాల్సిన స్థానిక సంస్థలకు నోటిఫికేషన్‌ ఇస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తామన్నారు చింతమనేని.  మ‌రోవైపు.. అమ్మను వదిలేసినవాడు అమ్మఒడి ఇస్తాడా? అని అమరావతి జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘‘చెల్లిని వదిలేసిన వాడికి సెంటిమెంట్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడు. అరాచకంతో అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడూ పూర్తికాలం అధికారంలో లేడు. ఈరోజు నుంచి సీఎం జగన్ గంజాయి ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినవారే సమాధి చేస్తారు. తాడేపల్లి నుంచి తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్ కోసం ప్రజలంతా తిరగబడాలి. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ అరాచకాన్ని సృష్టించాడు’’ అని కొలికపూడి మండిప‌డ్డారు.   

రేవంత్‌రెడ్డి ఇమేజ్ అదుర్స్‌.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ రీసౌండ్‌...

రేవంత్‌రెడ్డి. ఇప్పుడిది పేరు మాత్ర‌మే కాదు ఓ ప‌వ‌ర్‌. కాంగ్రెస్‌కు ప‌వ‌ర్ బూస్ట‌ర్‌. టీపీసీసీ ప‌గ్గాలు చేప‌ట్టాక రేవంత్‌రెడ్డి పేరు తెలంగాణ వ్యాప్తంగా మ‌రింత మారుమోగుతోంది. తెలంగాణ‌లో ఏ ఇద్ద‌రు క‌లిసినా రేవంత్‌రెడ్డి దూకుడు గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్‌పై, టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసే ప‌దునైన‌ విమ‌ర్శ‌ల గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇలా, కొంత‌కాలంతా రాష్ట్ర‌మంతా రేవంత్‌రెడ్డి హ‌వా న‌డుస్తోంది. మ‌న‌కు ఇంత వ‌ర‌కే తెలుసు. కానీ, రేవంత్‌రెడ్డి టాపిక్ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమితం కాలేద‌ని.. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నాయ‌కుల దృష్టిలోనూ రేవంత్‌రెడ్డి ఉన్నార‌ని తాజా ప‌రిణామంతో స్ప‌ష్ట‌మైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... పంజాబ్ మాజీ సీఎం అమ‌రీంద‌ర్‌సింగ్ తెలుసుగా. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాట్ల‌లో బిజీగా ఉన్నారు. బీజేపీతో పొత్తుకూ సై అన్నారు. అమ‌రీంద‌ర్ ఎపిసోడ్ ఇప్పుడు ఇటు పంజాబ్‌లో, అటు కాంగ్రెస్‌లో వాడివేడి ర‌గిలిస్తోంది. బీజేపీతో జ‌త‌క‌ట్ట‌డంపై కాంగ్రెస్ వాదులు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లూ చేస్తున్నారు. సెక్క్యూల‌రిజం ఏమందంటూ కుళ్ల‌బొడుస్తున్నారు. ఒళ్లుమండిన అమ‌రీంద‌ర్‌.. రివర్స్ అటాక్‌కు దిగారు. మీ కాంగ్రెస్ నేత‌లేమైనా సెక్యుల‌రిస్టులా? అంటూ సిద్ధూ గ‌తంలో బీజేపీలో లేరా? తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది కాదా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత‌టి కీల‌క‌మైన విమ‌ర్శ‌లోనూ పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్ నోటి నుంచి రేవంత్‌రెడ్డి పేరు రావ‌డ‌మే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ వాది అవునా? కాదా? అనేది పెద్ద‌గా ప్రాధాన్యం లేని విష‌యం. బ‌హుషా విద్యార్థి ద‌శ‌లో రేవంత్‌ ఏబీవీపీలో ఉన్నందుకు కాబోలు ఆయ‌న‌లా అని ఉంటార‌ని అంటున్నారు. అయితే, రేవంత్‌రెడ్డి గురించి అంత చిన్న డీటైల్ కూడా.. ఆయ‌న‌ స్టూడెంట్ లైఫ్ గురించి కూడా.. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమ‌రీంద‌ర్‌సింగ్‌కు తెలిసి ఉండ‌ట‌మే ఆస‌క్తిక‌ర‌మైన అంశం. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి విష‌యంలో ఎంత డీప్ డిస్క‌ష‌న్ జ‌రిగి ఉంటుందో.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద స్థాయి నాయ‌కులంద‌రికీ రేవంత్‌రెడ్డి గురించి ఎంత‌లా అప్‌డేట్ ఉండి ఉంటుందో.. అమ‌రీంద‌ర్‌సింగ్ వ్యాఖ్య‌ల‌తో అర్థ‌మైపోతోంద‌ని అంటున్నారు. రేవంత్‌రెడ్డిని జాతీయ కాంగ్రెస్‌ పూర్తిగా స్ట‌డీ చేశాకే.. పార్టీలో చేరిన వెంట‌నే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఆ త‌ర్వాత పీసీసీ ప్రెసిడెంట్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి చిచ్చ‌ర‌పిడుగు కాబ‌ట్టే.. తెలంగాణ‌లోనే కాదు పంజాబ్‌లోనూ ఆయ‌న పేరు రీసౌండ్ అవుతోంది. అందుకే, రేవంత్‌రెడ్డినా.. మ‌జాకా.. అంటున్నారు అభిమానులు.  

గంట క‌ళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం.. మాకూ బీపీ వ‌స్తోందంటూ ప‌రిటాల వార్నింగ్‌..

ప‌రిటాల ఫ్యామిలీ. రాయ‌లసీమ‌లో ప‌రిటాల స‌త్తా ఎంతో తెలుసుగా. ఒక‌ప్పుడు కంటిచూపుతోనే సీమ‌ను శాసించేవారు. రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చేసేవారు. అప్ప‌ట్లో ప‌రిటాల ర‌వీంద్ర చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం. న‌క్స‌లిజం, ఫ్యాక్ష‌నిజం, రాజ‌కీయం.. అన్నిటినీ మిక్స్ చేసి.. సీమ‌లో మొన‌గాడిలా నిలిచారు. ఆయ‌నిప్పుడు లేకున్నా.. ప‌రిటాల బ‌లం, బ‌ల‌గం చెక్కు చెద‌ర‌లేదు. డౌట్ ఉంటే అనంత‌పురం జిల్లాలో ఏ ఒక్క‌రిని అడిగినా చెబుతారు.   టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే ప‌రిటాల ఫ్యామిలీ ఇప్పుడు ఆగ్ర‌హంతో ఊగిపోతోంది. దేవాల‌యంలాంటి టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ మూక‌లు దాడి చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చేసిన దాడులు స‌రిపోవ‌న్న‌ట్టు.. తాజాగా సీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విజ‌య‌వాడ‌లో కాబ‌ట్టి దాడుల‌తో స‌రిపోయింది.. అదే మా సీమ‌లో అయితే ఖూనీలు జ‌రిగేవంటూ మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. దీంతో.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడులు, మంత్రుల బూతులు, వైసీపీ రెచ్చ‌గొట్ట‌డంపై మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌రిటాల సునీత తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే తామేంటో చూపిస్తామంటూ పరిటాల సునీత వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అన్నారు. తన భర్తను చంపినప్పుడు కూడా ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామని.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదని హెచ్చ‌రించారు. ఇక‌నైనా చంద్రబాబు తీరు మారాల‌న్నారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీకి చుక్కలు చూపిస్తామని పరిటాల సునీత గ‌ట్టిగా హెచ్చరించారు.   

అరాచ‌క ప్ర‌భుత్వాన్ని త‌రిమి కొడ‌తాం.. టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

ఏపీలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో అరాచకత్వం రాజ్యమేలుతోందని విమర్శించారు. పట్టాభి ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేశారు.. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించారు.. ఇలాంటి దాడులకు భయపడబోమన్నారు దేవినేని ఉమా.  జగన్ రెడ్డి గుర్తుంచుకో.. టీడీపీ అధికారంలోకి వస్తుంది. మంత్రులు బరితెగించి బూతులు తిడుతున్నారు. అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలో తరిమి కొడతాం.. అంటూ దేవినేని ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 11 సీబీఐ, 6 ఈడీ, 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జ‌గ‌న్‌రెడ్డి పరిపాలనలో ఇంతకన్నా ఏమీ ఆశిస్తామ‌న్నారు. 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి మాట్లాడితే.. ఆ టాపిక్‌ను పక్కదారి పట్టించడానికే ఇలా దాడులు కార్యక్రమం చేశారన్నారు. ప్రజలు విద్యుత్ బాదుడుపై కోపంగా ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వస్తున్నాయి. మనవాడంటూ ప్రజల్ని ఎలా మోసం చేశారో కడపలో ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇలా జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మ‌వుతుండ‌టంతో ఇలా దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. తప్పు చేసిన అధికారుల లిస్టంతా రాస్తున్నాం. అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి సంగ‌తీ తేలుస్తాం. జగన్‌రెడ్డికి డీజీపీ సాగిల పడ్డారు. 5 సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ప్రజాస్వామ్యానికి దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి. అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలంటూ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.   

గంజాయి బ్యాచ్‌తో దాడి!.. వాళ్లు ఆ నాయ‌కుడి అనుచ‌రులేనా?

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్‌పై దాడి చేసి బీభ‌త్సం సృష్టించారు. ఈ దాడి చేసిన వారిపై టీడీపీ ఫిర్యాదు చేసినా.. ఇంత వ‌ర‌కూ ఎవ‌రినీ అదుపులోకి తీసుకోలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. దాడి చేసింది త‌న అభిమానులేన‌ని సీఎం జ‌గ‌న్‌రెడ్డినే స్వ‌యంగా ఒప్పుకున్నారు. అందుకే, ఈ కేసులో జ‌గ‌న్‌రెడ్డి పేరు కూడా చేర్చాలంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో 70 మందిపై కేసు న‌మోదు చేసి చేతులెత్తేశారు. పైగా బాధితులైన టీడీపీ వ‌ర్గీయుల‌పైనా కేసులు క‌ట్టి.. అరెస్ట్ చేసి.. నాదెండ్ల బ్ర‌హ్మంను జైలుకు కూడా త‌ర‌లించ‌డం మ‌రింత దారుణ‌మైన విష‌యం అంటున్నారు.  మ‌రి, క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేసిన వైసీపీ గూండాల‌ను ఇంకా ఎందుకు ప‌ట్టుకోలేక పోతున్నారు? సీసీకెమెరాల్లో ప‌క్కాగా విజువ‌ల్స్ ఉన్నా.. ధ్వంస ర‌చ‌న మొత్తం రికార్డైనా.. ఆ ఫూటేజీ ఆధారంగా నిందితుల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌ట్లేదు? వ‌చ్చిన వారంతా దేవినేని అవినాశ్ మిత్ర‌బృందంకు చెందిన వార‌ని విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. వారంతా గంజాయి బ్యాచ్ అని చెబుతున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన అల్ల‌రిమూక‌ను బెజ‌వాడ వాసులు గుర్తు ప‌డుతున్నారు. మ‌రి, పోలీసులు మాత్రం వారిని గుర్తించ‌క‌పోవ‌డం.. అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. పోలీసులు పాల‌క ప‌క్షానికి కొమ్ము కాస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. టీడీపీ నేత‌లు ప‌ట్టాభి, నాదెండ్ల బ్ర‌హ్మంల అరెస్టు విష‌యంలూ చూపించిన దూకుడు.. టీడీపీ కార్యాల‌యంపై దాడి చేసిన వైసీపీ గూండాలు, గంజాయి బ్యాచ్‌ల‌పై చూపించ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి, ఈ ఆరోప‌ణ‌ల‌కు పోలీసుల స‌మాధానం ఏంటి? సీసీ కెమెరా ఫూటేజ్‌లో క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా.. నిందితులంద‌రినీ అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని ఎలా చూడాలి?    

మ‌చిలీప‌ట్నం నుంచి రాజమండ్రి జైలుకు పట్టాభి తరలింపు.. బెయిల్ వ‌చ్చేనా? క‌స్ట‌డీ కోరేనా?

ఏపీలో ఇంకెవ‌రూ బూతులు మాట్లాడ‌న‌ట్టు.. రాష్ట్రంలో బూతుల‌ను నిషేధించిన‌ట్టు.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఒక్క‌రే బూతు మాట్లాడిన‌ట్టు.. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులకు అస‌లు బూతులే రాన‌ట్టు.. ఒక్క ప‌ట్టాభిపైనే కేసులు పెట్టి.. రాత్రి వేళ ఆయ‌న ఇంటిపై దాడి చేసి.. ఇంటి తలుపులు ప‌గ‌ల‌గొట్టి.. అరెస్ట్ చేసి క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు వైసీపీ ప్ర‌భుత్వం పాల్ప‌డటంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌ట్టాభిని సాకుగా చూపి రాష్ట్ర‌వ్యాప్తంగా టీడీపీ ఆఫీసుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి వైసీపీ మూక‌లు. దేవాల‌యం లాంటి టీడీపీ కార్యాల‌యంపై దాడికి నిర‌స‌న‌గా పార్టీ అధినేత చంద్ర‌బాబు 36 గంట‌ల నిర‌స‌న దీక్ష చేస్తున్నారు. ఇలా, ప‌ట్టాభి ఎపిసోడ్ అనేక మ‌లుపులు తిరుగుతూ రాజ‌కీయంగా ఉద్రిక్త‌త రాజేస్తోంది.  సీఎం జగన్‌ను బోసిడీకే అని తిట్టారంటూ నమోదైన కేసులో ప‌ట్టాభిని అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయ‌స్థానం. గురువారం ప‌ట్టాభిరామ్‌ను మ‌చిలీప‌ట్నం జైలుకు త‌రలించారు పోలీసులు. కొవిడ్ పరీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం.. శుక్ర‌వారం ప‌ట్టాభిని పోలీస్ బందోబ‌స్తుతో మ‌చిలీప‌ట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.  ఇక‌, పట్టాభికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టును ఆశ్ర‌యించ‌నున్నారు. మ‌రోవైపు, పోలీసులు సైతం ప‌ట్టాభిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి, ప‌ట్టాభికి బెయిల్ వ‌స్తుందా?  పోలీస్ క‌స్ట‌డీ వ‌స్తుందా? అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది.   

హుజురాబాద్‌లో కేసీఆర్ 'సెప‌రేట్‌' స్కెచ్‌.. ఈసీ దిమ్మ‌తిరిగే షాక్‌.. అబ్ ఆయేగా మ‌జా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరో ఏడు రోజుల్లో ముగుస్తుంది. అయినా తెరాస ప్రచారంలో ఇంతవరకు మంత్రి హరీష్ రావు మినహా మిగిలిన ముఖ్య నేతలు ఎవరూ, ప్రముఖంగా కనిపించ లేదు. వినిపించ లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రచారానికి దూరంగానే ఉన్నారు. కేటీఆర్ అయితే, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విషయంలోనూ కేటీఆర్ అనుమానాలనే వ్యక్త పరిచారు. ఇప్పుడు ఆ అనుమానమే నిజం అయింది.  ఈనెల 27న, హుజూరాబాద్ నియోజకవర్గం వెలుపల ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు తెరాస అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలను నిర్వహించుకునేందుకు వీలు లేదు. అందుకే, హుజూరాబాద్ పక్కనే ఉండే ప్రాంతమైన పెంచికల్ పేటను టీఆర్‌ఎస్‌ ఎంచుకుంది. సభ హుజూరాబాద్ నియోజక వర్గం వెలుపల జరిగినా, జనాన్ని హుజూరాబాద్ నుంచే తరలించాలని, హరీష్ రావు ప్లాన్ రెడీ చేశారు. అయితే, తెరాస/ హరీష్ రావు  ఒకటి తలిస్తే, కేంద్ర ఎన్నికల సంఘం ఇంకొకటి తలచింది. హుజూరాబాద్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్, ముఖ్యంగా కోవిడ్ స్పెషల్ కోడ్ ఉల్లంఘనలు జరుగుతన్న వైనాన్ని గుర్తించింది. ఈ నేపద్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ అమలు తీరి తెన్నులను మరింత కఠినతరం చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్, కేవలం నియోజక వర్గం పరిధిలో మాత్రమే కాకుండా, నియోజక వర్గం ఉన్న జిల్లా/ జిల్లాలకు మొత్తంగా వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే, పరోక్షంగానే అయినా  హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను కూడా అందులో పేర్కొన్నారు. దీంతో అధికార పార్టీ ఈ నెల 27న పెంచికల్ పేటలో జరపతలపెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల సభకు చిక్కులు ఏర్పడ్డాయి.  తాజా ఉత్తర్వులలో పేర్కొన్న మేరకు హుజూరాబాద్ తో పాటుగా నియోజక వర్గం విస్తరించి ఉన్న కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గానికి కొంత దూరంలో ఉండే ప్రాంతంలో భారీ స్థాయి బహిరంగ సభలు పెట్టడం కోడ్‌లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమేనని కూడా సీఈసీ జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ తాజా ప్రకటనలో తెలిపారు. సో.. ముఖ్యమంత్రి సభ కూడా జరిగే అవకాశం లేదని తేలిపోయింది.  అయితే,  ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులకు ముందే, మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై సందేహం వ్యక్తం చేయడంతో, దాల్ మే కుచ్.. హై క్యా ..అనే  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటలను ఓడించడం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు లక్ష్యం అయితే, ఈటల అడ్డు ఎలగూ తొలిగి పోయింది కాబట్టి, మిలిన అడ్డు హరీష్’ను కూడా తొలిగించుకోవడం కేటీఆర్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇందులో బాగంగానే కేటీఆర్ అభ్యర్ధి ఎంపిక నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందుకే హరీష్ రావును బలిపశువుని చేసేందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనక పోవడంతో పాటుగా ముఖ్యమంత్రి కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘంలో చక్రం తిప్పారా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదే నిజం అయితే హుజూరాబాద్ అంతిమ విజేత కేటీఆరే అవుతారు.

మోదీ ఫిదా.. బిలియ‌న్ మార్క్ టీకాలు.. స‌త్తా చాటిన టీమిండియా...

ఇండియా వ‌ల్ల కాద‌న్నారు. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే 8-9 ఏళ్లు ప‌డుతుంద‌న్నారు. భార‌త్‌కు అంత సామ‌ర్థ్యం లేద‌న్నారు. ఎగ‌తాళి చేసిన నోళ్లన్నీ ఇప్పుడు మూత‌ప‌డ్డాయి. అదే నోటితో శ‌భాష్ ఇండియా అంటూ భుజం త‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌లో అనిత‌ర సాధ్య‌మైన శ‌త‌కోటి ప్ర‌యాణాన్ని మ‌న దేశం సునాయాసంగా సాధించింది. కేవలం తొమ్మిదంటే 9 నెలల్లోనే దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసి అరుదైన ఘ‌న‌త గడించింది. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత్ జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించగా.. అక్టోబర్ 21 నాటికి 100 కోట్ల డోసుల పంపిణీ చేశారు. ఈ ప్రయాణాన్ని ‘ఆందోళన నుంచి భరోసా’ వరకు అని ప్ర‌ధాని మోదీ అభివర్ణించారు. టీకా పంపిణీలో 100 కోట్ల మార్క్‌ను దాటిన సందర్భంగా ప్రధాని మోదీ ‘టీమిండియా - సవాళ్లకు లక్ష్యంతో సమాధానం’ అనే టైటిల్‌తో ఓ హిందీ పత్రికకు ప్ర‌త్యేక‌ ఆర్టిక‌ల్ రాశారు. ఇంత‌కీ మెదీ ఏమ‌న్నారంటే.....  ఆందోళన నుంచి భరోసా వరకు చేరుకున్న ఈ ప్రయాణంతో దేశం మరింత బలమైందని మోదీ అన్నారు. టీకాలపై ఎన్ని అపోహలు సృష్టించినా, గందరగోళ పరిస్థితులు ఎదురైనా.. దేశ ప్రజల విశ్వాసంతోనే ఈ విజయం సాధించగలిగామన్నారు. ‘‘ఇది నాది అని ప్రతిఒక్కరూ అనుకున్నప్పుడు.. ఏదీ అసాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ టీకాలు అందించాలన్న లక్ష్యంతో మన ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమించారు. కొండలు ఎక్కి.. నదులు దాటారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించారు. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, యువత కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో టీకాపై సంకోచాలు కాస్త తక్కువే ఎదురయ్యాయి’’ అని మోదీ చెప్పారు. ‘‘దాదాపు 100 ఏళ్ల తర్వాత మానవాళి ఇంతటి ఘోరమైన మహమ్మారిని ఎదుర్కొంటోంది. కన్పించని శత్రువు వేగంగా పాకుతుంటే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితుల్లో పడిపోయాం. అలాంటి ఆందోళనల నుంచి బయటపడి టీకాలు తయారుచేసుకున్నాం. ఇప్పుడు 100 కోట్ల మైలురాయిని దాటుకుని మహమ్మారి నుంచి బయటపడగలమనే భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఈ ప్రయాణంతో మనం మరింత బలంగా మారాం. దీని కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.    మ‌రోవైపు.. ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతా ప్రొఫైల్ పిక్ మార్చారు. దేశం 100 కోట్ల కరోనా టీకా డోసుల్ని పంపిణీ చేసి, కీలక మైలురాయి దాటిన వేళ.. ఆ ఘనతను ప్రతిబింబించే ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు.    

పీకే స్కెచ్‌తోనే టీడీపీ ఆఫీసుల‌పై దాడులు?.. ఆయ‌న‌ చాలా డేంజ‌ర్ గురూ!

ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో వైసీపీ శ్రేణులు దాడుల‌కు తెగ‌బ‌డ్డాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసుపైనైతే అచ్చం సినీ ఫ‌క్కీలో అటాక్ జ‌రిగింది. అదేదో ఫ్యాక్ష‌న్ సినిమా సీన్ మాదిరి.. రౌడీ మూక‌లు వ‌రుసగా వాహ‌నాలు వేసుకొని.. వాటిపై వేలాడుతూ వ‌చ్చి.. క‌ర్ర‌లు, రాడ్లు, సుత్తిల‌తో దాడి చేశారు. వాహ‌నంతో గేటును ఢీ కొట్ట‌డం అయితే ముందుగానే రిహార్స‌ల్స్ చేసొచ్చిన‌ట్టుగా ప‌క్కాగా గుద్దేశారు. క‌ట్ చేస్తే.. ఇటు మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయ‌గానే.. ఎవ‌రో ఫోన్ చేసి ఉస్కోమ‌న్న‌ట్టు.. ప‌క్కాగా ఇంచుమించు అదే స‌మ‌యానికి ఏపీవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని కార్యాల‌యాల‌పైనా వైసీపీ శ్రేణులు బీభ‌త్సం సృష్టించారు. ఇక‌, వీట‌న్నిటికంటే ముందు విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత ప‌ట్టాభి ఇంటిపై దాడితో ఈ గొలుసుక‌ట్టు దాడుల‌కు నాంది ప‌డింది. ఇలా ప‌ట్టాభి జ‌గ‌న్‌ను ఉద్దేశించి బోసిడీకే అన‌గానే.. అలా వైసీపీ వాళ్లంతా స‌డెన్‌గా రెచ్చిపోవ‌డం మాత్రం కాక‌తాళీయంగానో, యాధృచ్చికంగానో జ‌రిగింది కానే కాదంటున్నారు. ఇదంతా ప‌క్కా వ్యూహం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. మ‌రి, ఆ ప‌క్కా వ్యూహం ర‌చించిందెవ‌ర‌నేదే ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  సీఎం జ‌గ‌న్ పాల‌నా వ్య‌వ‌హారాల‌తో నిత్యం బిజీగా ఉంటారు. సో, అమ‌లు ఆయ‌న ఆదేశాల‌తోనే జ‌రిగింద‌ని అంటున్నా.. వ్యూహం మాత్రం జ‌గ‌న్‌ది కావ‌చ్చు, కాక‌పోవచ్చు. ఇక‌, సీఎంను అంటిపెట్టుకునే ఉండే స‌జ్జ‌ల ప్లాన్‌ చేశారా? అంటే ఆయ‌న‌కు అంత సీన్ లేదంటున్నారు. మ‌రి, ఈ క్రిమిన‌ల్ మైండ్ విజ‌య‌సాయిరెడ్డిదా అంటే.. ఆయ‌న‌కు జ‌గ‌న్‌తో గ్యాప్ పెర‌గ‌డం వ‌ల్ల విజ‌య‌సాయి కూడా కాదంటున్నారు. ఇక మ‌రింత లోతుగా విశ్లేషిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో మూక దాడుల వ్యూహ‌క‌ర్త‌, సూత్ర‌ధారి.. ప్ర‌శాంత్ కిశోర్ కావొచ్చ‌ని భావిస్తున్నారు. ఆ మేర‌కు ఉన్న‌త స్థాయి రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.  ఇటీవ‌లే ప్ర‌శాంత్ కిశోర్‌తో జ‌గ‌న్ పార్టీ డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే పీకే టీమ్ విశాఖ‌లో రంగంలోకి దిగింద‌ని టాక్‌. పీకే బృందం వ‌చ్చిరాగానే ప‌ని మొద‌లుపెట్టేసింద‌ని అంటున్నారు. డ్ర‌గ్స్‌, గంజాయి ఎపిసోడ్ ఏపీలో హాట్ హాట్‌గా సాగుతుండ‌టంతో పాటు.. అప్పులు, జీతాలు ఆల‌స్యం, ప‌థ‌కాల కోత‌, ప‌న్నుల‌ బాదుడు.. ఇలా జ‌గ‌న్ ఇమేజ్ ప్ర‌జ‌ల్లో బాగా డ్యామేజ్ జ‌రిగింద‌ని గుర్తించ‌డంతో.. ప‌బ్లిక్‌ను ఈ విష‌యాల నుంచి డైవ‌ర్ట్ చేసేందుకు అద‌ను కోసం ఎదురుచూస్తున్న పీకే టీమ్‌.. ప‌ట్టాభి ప్రెస్‌మీట్‌ను త‌మ‌కు అనుకూలంగా, అవ‌కాశంగా మార్చుకున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ప‌ట్టాభి మీడియాతో మాట్లాడారో లేదో.. వెంట‌నే దాడుల వ్యూహాన్ని జ‌గ‌న్‌కు చెప్ప‌డం.. ఆయ‌న ఓకే అన‌డం.. ఆ వెంట‌నే దేవినేని అవినాశ్‌ మ‌నుషుల‌తో అటాక్స్ చేయించ‌డం.. అంతా గంట‌ల వ్య‌వ‌ధిలో చ‌క‌చ‌కా జ‌రిపించేశార‌ని అంటున్నారు. పీకే టీమ్ వేసిన స్కెచ్ కాబ‌ట్టే.. ఇంత ప‌క్కాగా వ‌ర్క‌వుట్ చేశార‌ని చెబుతున్నారు.  ఇక, ప్ర‌శాంత్ కిశోర్ ఇలాంటి దాడుల‌ను ఎంక‌రేజ్ చేస్తారా అనే డౌట్ అస్స‌లు రాన‌వ‌స‌రం లేదంటున్నారు విశ్లేష‌కులు. ఎందుకంటే.. బెంగాల్‌లో మ‌మ‌త‌కు పొలిటిక‌ల్ అడ్వైజ‌ర్‌గా ఉన్న పీకే వ్యూహాల‌న్నీ దాడులు, విధ్వంసం చుట్టూనే తిరిగాయి. హింస ఆయ‌న అమ్ముల‌పొదిలోని ప‌దునైన వ్యూహం అంటారు. అంతేకాదు, ఇటీవ‌ల యూపీలో లఖింపూర్ ఖేరీ రైతుల మార‌ణ‌కాండ‌ స్కెచ్ కూడా ఆయనదే అనే మాట కూడా అక్కడక్కడా వినవస్తోంది. అదే నిజం అయితే.. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఆఫీసుల‌పై జ‌రిగిన దాడులు వ్యూహం కూడా ప్ర‌శాంత్ కిశోర్ బృందానిదే అన‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదంటున్నారు. ఏది ఏమైనా.. పీకే గొప్ప వ్యూహకర్త మాత్రమే కాదు.. కొంచెం చాలా ప్రమాదకర వ్యూహకర్త గానూ అనుమానించ వలసి వస్తోంది.  

సొంత‌పార్టీ.. బీజేపీతో పొత్తు.. రైతు పోరాటంలో 'కెప్టెన్' ఇన్నింగ్స్‌..

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇది అనూహ్య పరిణామం కాదు. అయితే, పోయిపోయి బీజేపీతో పొత్తుకు సిద్ధం కావడం విషయంలో రాజకీయ విశ్లేషకులు కొద్దిపాటి విస్మయం ప్రకటిస్తున్నారు. అయితే, అలాగని బీజేపీ అంటరాని పార్టీ అని కాదు. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు బీజేపీని ఏ పార్టీ కూడా అంటరాని పార్టీగా చూడడంలేదు. బీజేపీ కూడా వెనకటిలా మడికట్టుకుని కూర్చోవడం లేదు. ‘నువ్వొస్తానంటే ... నేనొద్దంటా’ అంటూ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి కూడా రెడ్ కార్పెట్ పరచి మరీ స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీ మాజీ పెద్దలు బీజేపీలో చేరి, కాషాయం నీడ పట్టున విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అమరీందర్ సింగ్ నేరుగా బీజేపీలో చేరినా ఆశ్చర్య పోనవసరం లేదు. కానీ, బహుశా రాజకీయంగా లెక్కలేసుకుని కావచ్చు ఆయన సెపరేట్ రూట్’ను ఎంచుకున్నారు.   అయితే అందరి విషయం వేరు, కెప్టెన్ పరిస్థితి వేరు ..నిజానికి, కెప్టెన్ అనే కాదు, పంజాబ్ రాజకీయ నాయకుల అందరి పరిస్థితి అదే. చివరకు ఆర్ఎస్ఎస్’లో పుట్టి బీజేపీలో పెరిగిన కాషాయ నాయకులు కూడా పార్టీలో ఉండలేక, బయటకు వెళ్ళలేక కిందామీద అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా సాగుతున్న రైతుల ఆందోళన ఇతర రాష్ట్రాల కంటే పంజాబ్ రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపింది. ఈ మూడు చట్టాల కారణంగానే, శిరోమణి అకాలీ దళ్ కేంద్ర మంత్రి పదవులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. పంజాబ్’ సాగు చట్టాలు, ఆ చట్టాలు తెచ్చిన బీజేపీ పట్ల పంజాబ్ ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కరలేదు. భయంకర వ్యతిరేకత ఉంది కాబట్టే, ఆకలీ దళ్.. పదవిని వదులుకుని మరీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలో 40 ఏళ్లకుపైబడిన రాజకీయ అనుభవం, ఇంచుమించుగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన అనుభం, అన్నిటినీ  మించి పంజాబ్ ప్రజల నాడి పక్కాగా తెలిసిన కెప్టెన్ అమరీందర్ సింగ్, పోయి పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటీ? అనే ప్రశ్నకే సమాధానం రాజకీయ విశ్లేషకులకు సైతం చిక్కడం లేదు.  అయితే, అమరీందర్ సింగ్ పంజాబ్ కాంగ్రెస్’లో తమ ప్రత్యర్ధి, నవజ్యోతిసింగ్ సిద్దుల్లా చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి అయితే కాదు. మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు. అదీగాక  పంజాబ్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రిగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి రాజకీయాలతో పాటుగా సాగు చట్టాల గురంచి, సాగు చట్టాల రాజకీయం గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ మీడియా అడ్వైజర్ రవీన్ థక్రల్ కెప్టెన్ సొంత పార్టీ, బీజేపీతో పొత్తుకు సంబంధించి  ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం. అంతే కాదు అదే సమయంలో అమరీందర్ సింగ్ ప్రతినిధి, ‘పంజాబ్ ప్రజల ప్రయోజనం కోసం, ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతులకు తమ పార్టీ అండగా ఉంటుదని’ అన్నారు. అంటే, అదేమిటనేది స్పష్టంగా తెలియక పోయినా, కెప్టెన్ జోక్యంతో సంవత్సర కాలానికి పైగా కొనసాగుతున్నరైతుల ఆందోళనకు త్వరలో ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం లేక పోలేదని అనిపిస్తోందని అంటున్నారు.  నిజానికి, రైతుల ఆందోళన  కేవలం పంజాబ్’లో మాత్రామే కాదు, పంజాబ్’తో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నయూపీ, ఉత్తరాఖండ్ ఇతర రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఈనేపధ్యంలో బీజేపీ, అమరీందర్ సింగ్ మధ్యవర్తిత్వంతో రైతుల ఆందోళనకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని, పరిశీలకులు అంటున్నారు, అదే జరిగితే పార్టీలు కూడా కెప్టెన్’ టీమ్ ‘లో చేరితే, అమరీదర్ కూటమి ఎన్నికల్లో గెలిచినా గెలవక పోయినా  కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రం కష్టమే అంటున్నారు. ఈ పరిణామం పరోక్షంగా  ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్)కి మేలు చేస్తాయని, చివరకు పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్న విధంగా  కాంగ్రెస్ పార్టీలో కెప్టెన్ , సిద్దూల మధ్య రగిలిన చిచ్చు చివరకు, ‘ఆప్’ కేజ్రివాల్’కు  సర్పైజ్ గిఫ్ట్ అవుతుందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగ వచ్చును.