what happens if drink fridge water

వేసవి కదా అని ఫ్రిజ్ లో నీళ్లు తాగుతున్నారా? జరిగేది ఇదే..!

వేసవికాలం మొదలవగానే చాలా ఇళ్లలో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు.  ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుండి రాగానే చల్లని నీరు తనివితీరా తాగితే తప్ప శరీరానికి ఉపశమనం, మనసుకు హాయి అనిపించవు. అయితే చాలామంది ఫ్రిజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. అందుకే మేం ఫ్రిజ్ వాటర్ తాగము అని చెబుతూ ఉంటారు. నిజంగా ఫ్రిజ్ వాటర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు.  అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలా మంది.  మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటి? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఫ్రిజ్ నుండి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది.  ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు,ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది.  అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడం చాలా ఆలస్యం. ఫ్రిజ్ నీళ్ళు తాగే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల శరీరంలో మలబద్దకం రావచ్చు.   ఫ్రిజ్ లో చల్లని నీరు తాగడం వల్ల మైగ్రైన్ వచ్చేప్రమాదం పెరుగుతుంది.  ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది.  ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు చల్లని నీరుకు దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలి అనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగవచ్చు.                                  *రూపశ్రీ.

Chhatrapati shivaji Death Anniversary

మరాఠా యోధుడు.. ఛత్రపతి శివాజీ వర్థంతి..!

    ఛత్రపతి అనే పేరు వెంటే చాలు.. శివాజీ మహారాజ్ గుర్తుకు వస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు కూడా ఈయనే. 17వ శతాబ్దపు భారతీయ యోధులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా ప్రముఖమైన వారు.  శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఛత్రపతి మహారాజ్ 1680 సంవత్సరం,  ఏప్రిల్ 3వ తేదీన మరణించారు.  2025 ఏప్రిల్ 3వ తేదీ అయిన ఈ రోజు గురువారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్థంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు,  ఆయన మరణానికి దారి తీసిన సంఘటనల గురించి తెలుసుకుంటే.. శివాజీ భోంస్లే (1630-1680 CE) గా జన్మించిన ఆయన ఈ సంవత్సరం  ఫిబ్రవరి 18న ఆయన 395వ జయంతిని జరుపుకున్నారు  ఈరోజు ఆయన 345వ వర్ధంతిని జరుపుకుంటున్నాము.  1680, ఏప్రిల్ 3న, శివాజీ మహారాజ్ అనారోగ్య సమస్యల కారణంగా, తీవ్రమైన జ్వరం,  విరేచనాలతో బాధపడుతూ రాయ్‌గడ్ కోటలో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ రోజున, మహారాష్ట్రతో పాటు  ఇతర ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు,  నివాళుల ద్వారా శివాజీ మహారాజ్  వారసత్వాన్ని గౌరవిస్తున్నాయి.   శివాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియని నిజాలు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630న పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. కొంతమంది శివుడి ప్రేరణగా ఈయనకు శివాజీ అని పెట్టారని చెబితే కొందరుపండితులు అతనికి స్థానిక దేవత అయిన శివాయ్ పేరు పెట్టారని చెబుతారు. శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు.  అతని లక్ష్యం సంస్కృతంలో ఉన్న తన రాజ  ముద్రలో స్పష్టంగా పేర్కొనబడింది. షాహాజీ కుమారుడు శివాజీ రాజ్యం చంద్రవంకలా పెరుగుతూనే ఉంటుందని,  ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆ ముద్ర హామీ ఇచ్చింది. స్వరాజ్యానికి పునాది వేయడానికి శివాజీ మహారాజ్  రాజ్‌గడ్, తోర్నా, కొండనా,  పురందర్ వంటి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. 1656లో శివాజీ మహారాజ్ సతారా జిల్లాలోని జావాలిని స్వాధీనం చేసుకున్నాడు, ఇది వ్యూహాత్మక కారణాల వల్ల చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. తరువాత  రైరీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు, తరువాత దీనిని రాయ్‌గడ్ అని పేరు మార్చారు. దీన్ని శివాజీ మహారాజ్ తన   రాజధానిగా మార్చుకున్నాడు. కొంకణ్ ప్రాంతంలోని మహులి, లోహగడ్, తుంగా, టికోనా, విసాపూర్, సోంగడ్, కర్నాల, తాలా,  ఘోసాల వంటి కోటలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ అష్ట ప్రధాన మండల్‌ను ఏర్పాటు చేశాడు, ఇది ఎనిమిది మంది సలహాదారుల మండలి. వారు రాజకీయ,  ఇతర ముఖ్యమైన విషయాలలో శివాజీ మహారాజ్ కు  సహాయం చేసేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడరేవులు,  వ్యాపార నౌకలను రక్షించడానికి,  వాణిజ్యం,  కస్టమ్స్ నుండి డబ్బు సంపాదించడానికి ఒక నావికాదళాన్ని నిర్మించాడు. అతను 1665 లో తన మొదటి నావికా దండయాత్రను చేపట్టాడు. శివాజీ మహారాజ్ విద్యకు ఒక చిన్న బృందం బాధ్యత వహించింది. ఆ బృందం అతనికి చదవడం, రాయడం, గుర్రపు స్వారీ, యుద్ధ కళలు,  మతపరమైన అధ్యయనాలను నేర్పింది. సైనిక శిక్షణ కోసం అతనికి ప్రత్యేక బోధకుడు కూడా ఉండేవారు. జూన్ 6, 1674న, గగాభట్ అనే గౌరవనీయ పండితుడు అతనికి రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేశాడు. ప్రత్యేక నాణేలు తయారు చేయబడ్డాయి - హోన్ అనే బంగారు నాణెం,  శివరాయ్ అనే రాగి నాణెం - పురాణగాథ శ్రీ రాజా శివఛత్రపతి అని చెక్కబడి ఉన్నాయట.                                        *రూపశ్రీ.

Husband And Wife Relation

భార్యాభర్తల బంధం విషపూరితంగా మారిందా... ఈ 5 లక్షణాలతో తెలుసుకోవచ్చు..!

  జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, చాలా అందమైన బంధం భార్యాభర్తల బంధం.  ఇది మధ్యలో ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసి జీవితాన్ని నడిపించే బంధం.  బాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఇచ్చే బంధం ఇది. ఈ బంధం ప్రేమ,  గౌరవం,  నమ్మకం,  అవగాహన పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ప్రతి జంట తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ తెలిసో తెలియకో ఆ బంధంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి.  అవి కాస్తా బంధాన్ని విషపూరితంగా మారుస్తాయి. భార్యాభర్తల బందంలో సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి,  ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.  కానీ ఇవి లేకుండా ఆ బంధంలో ఒత్తిడి మాత్రమే ఉంటున్నట్టు అయితే ఆ బంధం విషపూరితమైన లేదా అనారోగ్యకరమైన వ్యక్తితో బంధంలో ఉన్నట్టు అర్థం. తమ బంధం విషపూరితంగా మారిందా లేదా అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని రిలెషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. అసౌకర్యం.. మీరు మీ భాగస్వామితో మాట్లాడే ప్రతిసారీ అసౌకర్యంగా భావిస్తున్నారా? మీరు తరచుగా చిన్న విషయాలకే వాదించుకుంటారా?  మీ భాగస్వామి ప్రతి వాదనలోనూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారా? అలా అయితే, ఇది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన సంబంధంలో, సంభాషణ తర్వాత  రిలాక్స్‌గా ఉంటారు. కానీ విషపూరిత సంబంధంలో, ప్రతి విషయం మిమ్మల్ని బాధపెడుతుంది.  మిమ్మల్ని బలహీనంగా ఫీలయ్యేలా చేస్తుంది. నియంత్రణ.. మీ భాగస్వామి  ప్రతి చిన్న లేదా పెద్ద విషయంలో జోక్యం చేసుకుంటారా? నువ్వు ఏం వేసుకున్నావు, ఎవరిని కలిశావు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ అతను తన నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటాడు. ఈ ప్రవర్తన సంబంధంలో సమానత్వాన్ని నాశనం చేస్తుంది. దీని కారణంగా, ఇద్దరి మధ్య గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి స్వేచ్ఛ,  గౌరవం రెండూ ఉంటాయి. కానీ మీరు అడుగడుగునా ఆంక్షలను ఎదుర్కొంటుంటే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఒత్తిడి.. మీరు సంబంధంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆందోళన, భయం లేదా ఒత్తిడికి గురవుతుంటే, ఇది సాధారణంగా తీసి పారేసే విషయం  కాదు. విష సంబంధాలలో ప్రజలు తమ భాగస్వామిని సంతోషపెట్టే ప్రయత్నంలో తరచుగా తమను తాము మరచిపోతారు.  మానసికంగా అలసిపోయారని  ప్రశాంతత అదృశ్యమైందని మీరు భావిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఎగతాళి.. ప్రతి వ్యక్తికి తన సొంత అవసరాలు ఉంటాయి. సాధారణంగా ప్రజలు ఈ విషయాల గురించి మొదట తమ భాగస్వాములతో మాట్లాడుతారు. కానీ మీ భాగస్వామి మీ  అవసరాలను విస్మరిస్తే లేదా ప్రతిసారీ  ఎగతాళి చేస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. విమర్శ.. మీ భాగస్వామి మీ స్నేహితుల ముందు మిమ్మల్ని ఎగతాళి చేస్తే,  ప్రతిదానినీ విమర్శిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం. ఆరోగ్యకరమైన సంబంధంలో, మీ భాగస్వామి ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబం లేదా బంధువుల ముందు మిమ్మల్ని సంతోషంగా  ఉంచుతారు.                                    *రూపశ్రీ

 How to keep home cool in summer

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

  ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని చల్లగా ఉంచుకోవడం రోజువారీ యుద్ధంలా అనిపిస్తుంది.  ముఖ్యంగా ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ పెట్టుకోవాలంటే  విద్యుత్ బిల్లులను  చూసి భయపడుతుంటారు.  కానీ ఈ విద్యుత్ బిల్లులు తగ్గించుకుని పర్యావరణ అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలని చాలా మంది అనుకుంటారు.  కానీ ఇల్లు చల్లగా ఉండటానికి ఏం చేయాలి?  అనే విషయం చాలా మందికి తెలియదు. ఎయిర్ కండిషనర్లు అప్పటికప్పుడు  వేడి నుండి  ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, అవి రోజు మొత్తం చల్లగా ఉండటంలో అస్సలు ఉపయోగపడవు.  అయితే ఇంట్లో ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.  వీటిని ఫాలో అయితే వేసవి అంతా చల్లగా హాయిగా గడిచిపోతుంది.   వెదురు కర్టెన్లు లేదా  వట్టివేరు మ్యాట్లకు మారాలి.. ఎక్కువ వేడిని తట్టుకుని వేడిని లోపలి పోకుండా చేసేందుకు సాధారణ కర్టెన్లు తొలగించి వెదురు బ్లైండ్లు లేదా వట్టివేరు చాపలను ఎంచుకోవాలి.   ఈ చాపలను కర్టెన్ లాగా ఉపయోగించుకోవచ్చు.  వట్టివేర్ చాపల మీద నీటిని చల్లితే   ఇంట్లోకి ప్రవేశించే గాలిని సహజంగా చల్లబరుస్తూ, రిఫ్రెషింగ్ మట్టి సువాసనను విడుదల చేస్తాయి. ఇది వేసవి వేడి నుండి చాలా గొప్ప ఉపశమనం ఇచ్చే చిట్కా. మట్టి కుండలతో నేచురల్ కూలర్లు.. ఇంట్లో మట్టి కుండ పెట్టుకుని అందులో చల్లని నీరు తాగడం అందరికి తెలిసే ఉంటుంది.  అయితే చాలా మందికి తెలియని చిట్కా ఏంటంటే.. ఇంట్లో వేడి బాగా ఉన్న ప్రాంతాలలో మట్టి కుండలు ఉంచి ఆ మట్టి కుండలలో నీరు పోయాలి.  కుండలలో నీరు ఆవిరి అవుతూ ఉంటే కుండ చుట్టు పక్కల వాతావరణం చల్గగా ఉంటుంది.  మట్టి కుండలను ఇలా ఉంచడం వల్ల సహజంగా ఇల్లు ఎయిర్ కూలర్లు పెట్టినట్టు ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్.. ప్రకృతి ప్రసాదించిన శీతలీకరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి.  ఉదయం,  సాయంత్రం వేళల్లో  కిటికీలను తెరిచి ఉంచాలి. తద్వారా తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో వేడి గాలి లోపలికి రాకుండా వాటిని మూసి ఉంచండి. ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది చల్లని గాలిని లోపలికి,  వేడి గాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది.  ఈ సులభమైన ఉపాయం చాలా తేడాను కలిగిస్తుంది. రంగులు.. నలుపు రంగు క్లాసీగా ఉన్నప్పటికీ, లేత రంగు కాటన్ బెడ్‌షీట్లు, కుషన్ కవర్లు,  కర్టెన్లు వంటివి తక్కువ వేడిని శోషిస్తాయి. అందుకే ఇంట్లో లేత రంగు ఉండే కర్టెన్లు, దిండు కవర్లు, కార్పెట్లు వంటివి ఎంచుకోవాలి.  ఇవి వేడిని బంధించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి, మీ ఇంటిని తాజాగా,  చల్లని  గాలిలితో  ఉంచుతాయి. ఇండోర్ మొక్కలు.. కలబంద, అరెకా పామ్స్, స్నేక్ ప్లాంట్స్,  మనీ ప్లాంట్స్ గాలిని శుద్ధి చేయడమే కాకుండా  అవి ఇండోర్ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కిటికీలు,  సీటింగ్ ప్రదేశాల దగ్గర వాటిని  ఉంచడం వల్ల సహజంగా చల్లటి వాతావరణం ఉండేలా చేస్తాయి.                          *రూపశ్రీ

April Fools Day

జీవితం మొత్తం ఫూల్స్ కావొద్దు.. 

  ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. చాలామందికి చిన్నతనంలో  ఏప్రిల్ ఫూల్ అంటూ చేసిన సందడి గుర్తొస్తుంది.  చిన్నతనంలో ఏదో ఒక తుంటరి సాకు చెప్పడం,  ఎదుటివారిని భయపెట్టడం వారు భయపడటం లేదా అప్రమత్తం కావడం జరగగానే ఏప్రిల్ ఫూల్ అనడం చాలామంది ఎంజాయ్ చేసిన సంఘటనలే.. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఒక సరదా రోజుగా  అందరికి తెలుసు.. కానీ ఏప్రిల్ ఫూల్ రోజు జరిగే తమాషా సంఘటనలలో పూల్స్ అయినా పర్లేదు కానీ నిజ జీవితంలో ఫూల్స్ కాకండి అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే అమాయకంగా ఫూల్స్ అయిపోతుంటారు.  నిన్న కాక మొన్నే తెలుగు సంవత్సరం వచ్చింది.   ఈ కొత్త ఏడాదిలో అయినా ఎవరైనా ఫూల్స్ కాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ కింద చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోవాలి. జీవితం, తమాషా.. రోజువారీ జీవితంలో సంతోషం,  తమాషా అనేవి ఉండటం మంచిదే.. కానీ జీవితమే తమాషా కాకూడదు.  ఇలా జీవితమే తమాషా అయితే ఆ తరువాత ఇతరులకు మన జీవితం ఒక ఆట వస్తువుగా లేక విలువ లేని చిత్తు కాగితంలా అనిపిస్తుంది. అందుకే జీవితంలో తమాషా ఉన్నా జీవితాన్ని తమాషా కానివ్వకూడదు.  జీవితంలో లక్ష్యాల  పట్ల,చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి.  చెయ్యాల్సిన పనిని ఇతరుల కారణంగా ఎప్పుడూ వాయిదా వేయడం,  చేయకుండా ఆపేయడం వంటివి చేయకూడదు. చేసే పని మంచిది అయినప్పుడు,  ఉపయోగకరమైనది అయినప్పుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ అయ్యి దాన్ని వదలకూడదు. ఎందుకంటే చేసే పని,  పని  చేసే విధానం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది. మంచి, చెడు.. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనేవి ఉంటాయి.  కానీ మనిషి తన జీవితంలో జరిగే మంచి అయినా చెడు అయినా తాను కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాడు. ఇది చాలా వరకు తప్పు. అయితే మంచి, చెడు అనేవి వ్యక్తి ఆలోచనా  విధానం మీద ఆధారపడి ఉంటుంది.   ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించే అవకాశం ఉంది. దీని వల్ల మంచి చెడుల విషయం తేల్చుకునే అవకాశం చాలా మందికి ఉండదు. అయితే ఏ పని అయినా  ఇతరులకు అపకారం చేయకుండా నష్టం కలిగించకుండా మనకు మేలు చేసే విధంగా ఉన్నంత వరకు ఆ పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు. విలువలే.. వ్యక్తిత్వం.. ప్రతి మనిషి విలువలు కలిగి ఉండాలి.  ఇలా విలువలు కలిగి ఉండటమే మనిషి జీవితానికి గొప్ప ఆస్తి.  మనిషిలో ఉన్న విలువలు  మనిషి వ్యక్తిత్వాన్ని  వ్యక్తం చేస్తాయి. అందుకే విలువలను ఎప్పటికీ వదలకూడదు.  ఇతరుల పట్ల మంచిగా ఉండటం,  ఇతరులను గౌరవించడం,  ఇతరులకు సహాయం చేయడం,  ప్రేమ,  జాలి, కరుణ, దయ వంటివి ఉండటం.. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వాన్ని,  సెల్ఫ్ రెస్పెక్ట్ ను పోగొట్టుకోకుండా పాటించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా,  గొప్పగా అనిపిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవం, మర్యాద మన గౌరవాన్ని పెంచుతాయి. నమ్మకం, అపనమ్మకం.. మనిషి జీవితం నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.  తరువాత నిమిషం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు. అలాంటప్పుడు మనుషులను,   పరిస్థితులను నమ్మకం అనే ఒక తాడులో బంధించి ఆ తరువాత దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెగిపోయినా దానిదే తప్పని, ఇతరులదే తప్పని అనడం ఆ వ్యక్తిదే నిజమైన తప్పు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉండాలి. అంతేకానీ నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా బాధలలోకి జారిపోకూడదు.                                         *రూపశ్రీ.  

The Secret to Overcoming the Enemy

శత్రువు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాణక్యుడు ఏం చెప్పాడంటే..!

  ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.  ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు.  ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.    చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.  ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా  ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.  శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి.  ఆ శత్రువు బలం,  బలహీనత ఆధారంగా ఒక వ్యూహం  రచించాలి.  ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి.  అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు.  అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సహనం,  సంయమనం.. చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం,  సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ,  ఓర్పు,  సంయమనం పాటించాలి.  సరైన సమయంలో  తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువును అయోమయంలో ఉంచాలి.. శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు,  ఉద్దేశాల గురించి తెలిస్తే వారు  మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన  బుద్ధి చెప్తూనే  ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.                                          *రూపశ్రీ.

Sunita Williams space journey

పోర్చు గీసు పాలనను సవాల్ చేసిన వీర మహిళ.. పద్మశ్రీ పురస్కార గ్రహీత..!

  మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అని అనుకుంటారు. కానీ ఇంటి గడప దాటి ఉద్యోగాలు చేయడం నుండి వివిధ పోరాటాలలో పాల్గొనడం వరకు మహిళలు ఎందులోనూ తీసిపోరు. తాజాగా సునితా విలియమ్స్ అంతరిక్షాన్నే జయించి సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే ప్రపంచం అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో జరిగిన  మహిళల పోరాటం చాలా మందికి తెలియదు.   1947 సంవత్సరం దేశం మొత్తం స్వాతంత్ర్యం పొందింది. అయితే, దానిలో ఒక చిన్న భాగం అయిన గోవా మాత్రం  మరో 14 సంవత్సరాలు పోర్చుగీస్ నియంత్రణలో ఉంది. 1961లో మాత్రమే గోవా  విముక్తి పొందింది. 400 సంవత్సరాల వలస పాలనకు ముగింపు పలికింది. ఆ సంవత్సరాల్లో నిరంతర ఆక్రమణలో ఒక నిశ్శబ్ద విప్లవం పుట్టుకొచ్చింది. స్వేచ్ఛను కోరుతూ వినిపించిన లెక్కలేనన్ని స్వరాలలో, లొంగిపోవడానికి నిరాకరించిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు . గోవా విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో పోరాడారు. ఈ నిర్భయ మహిళలలో కొంతమంది వారి అద్భుతమైన ధిక్కార చర్యల గురించి తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1955 ప్రాంతంలో గోవా వాసులు నమ్మే ఏకైక వార్త 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్' ద్వారా వ్యాప్తి చేయబడిన వార్త. నిజం కోసం రేడియో ప్రసారాన్ని నమ్మవచ్చు. సమయం కఠినంగా ఉంది. గోవా తనను తాను విడిపించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆ సంవత్సరాల్లో చాలా మంది మహిళలు సామాజిక ప్రతీకారం లేదా విమర్శలకు భయపడకుండా తిరుగుబాటులో ముందుకు వచ్చారు. వారిలో ఒకరు లిబియా లోబో సర్దేశాయ్. ఆమె తన భర్త వామన్ సర్దేశాయ్‌తో కలిసి ఎవరూ  గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక అడవి నుండి 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు. వారి వార్తా ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి. జాతీయవాద మనస్తత్వాన్ని పెంచింది.   జనవరి 2025లో లిబియా తన ధైర్యసాహసాలకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. విమోచన దినోత్సవం  19 డిసెంబర్ 1961 గోవా స్వేచ్ఛను రుచి చూసిన రోజు ఆమె మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది. “గోవా విముక్తి పొందినప్పుడు, జనరల్ జెఎన్ చౌధురి [అప్పటి భారత సైన్యం  సైన్యాధ్యక్షుడు] మా వద్దకు వచ్చి స్వయంగా వార్తలను అందించారు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను తోట నుండి ఒక పువ్వును తీసుకొని అతనికి ఇచ్చాను. అతను నన్ను అడిగాడు, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?' అని. నేను 'నేను దానిని ఆకాశం నుండి ప్రకటించాలనుకుంటున్నాను' అని అన్నాను. మరుసటి రోజు గోవా విముక్తిని ప్రకటించే కరపత్రాలతో రాష్ట్రం నిండిపోయింది. మూలం ఆకాశం నుండి  లిబియా  సర్దేశాయ్ కూర్చున్న విమానం నుండి కరపత్రాలను రాష్ట్రం లో కుమ్మరించారు. ఈ  విధంగా రాష్ట్రానికి స్వేచ్ఛ అందిన వార్త విని రాష్ట్రం ఎంతగానో సొంతోషించింది.                                               *రూపశ్రీ

A father real happiness comes only when son proves himself

పుత్రులు ఉదయించే సూర్యులు కావాలంటే...

పుత్రోత్సాహము తండ్రికి  పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగ  బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!! అంటాడు సుమతీ శతకకర్త.  ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం.  సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది.  ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు.  పుత్రుల దినోత్సవం ఎందుకు??  ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు.  మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది.  మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే.. ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు.  ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.                                    ◆నిశ్శబ్ద.

World Theatre Day

రంగురంగుల రంగస్థలం.. ప్రపంచ రంగస్థల దినోత్సవం..!

  రంగస్థలం.. పేరు వినగానే రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం కళ్ల ముందు కదులుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నది రంగస్థలం సినిమా గురించి కాదు.  అసలైన రంగస్థలం గురించి. ప్రజలకు కనువిందు చేసే థియేటర్ ప్రాముఖ్యత గురించి,ఈ థియేటర్ అనేది కేవలం సినిమానే కాదు.. నాటకరంగాన్ని,  ఎన్నో రకాల షో లను కూడా ప్రజలకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా రంగస్థలం గురించి,  దీని చరిత్ర గురించి,  రంగస్థలం అభివృద్ది చెందిన విధానం గురించి తెలుసుకుంటే.. రంగస్థలం అనేది  మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది.  మానవ అనుభవాలు,  భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం,  ఈర్ష్య,  అసూయ,  జాలి, దయ.. ఇలాంటివన్నీ  లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు రంగస్థలం కల్పిస్తుంది.  ఇది కేవలం వినోదం మాత్రమే కాదు..  విద్య,  సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రాముఖ్యత.. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‌లో 1962లో "థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్"  నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి  ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగస్థల ప్రదర్శన కూడా గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వాలు, వ్యక్తులు,  సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి,  ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు,  నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు,  ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని,  మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో,  సందర్భంలో ఈ థియేటర్ తో ముడి పడి ఉంటుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు జరిగే కొన్ని కార్యకలాపాలు.. ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు.. చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు ,  రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‌తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.  అంతర్జాతీయ సందేశం.. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు.  ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకోబడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు.  తగిన గౌరవం పొందుతారు.  ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది. థియేటర్ వర్క్‌షాప్‌లు,  ప్యానెల్ చర్చలు.. థియేటర్ గ్రూపులు,  సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన,  రంగస్థల కళపై వర్క్‌షాప్‌లు, చర్చలు,  మాస్టర్‌క్లాస్‌లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్  పరిణామం చెందిన విధానం,   ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు,  నాటి రాలపు సంఘటనలు  పంచుకుంటారు. వీధి నాటకాలు,  బహిరంగ ప్రదర్శనలు.. సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు,  నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి. నాటక కళాకారుల గుర్తింపు.. అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు,  ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు , గౌరవాలు ఇవ్వబడతాయి. సోషల్ మీడియా , ఆన్‌లైన్ ప్రచారాలు.. థియేటర్ ను ఇష్టపడేవారు,  సంస్థలు,  కథలు, కోట్స్,  మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు,  ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.                                       *రూపశ్రీ.

Reason Why You Should Have a Micro Wedding

మైక్రో వెడ్డింగ్ పేరు విన్నారా? ట్రెండ్ అవుతున్న ఈ పెళ్లి ఏంటంటే..!

  భారతదేశంలో వివాహం అంటే ఒక పెద్ద పండుగ.   జీవితంలో ప్రతి ఒక్కరూ ఏ సంబరానికి ఖర్చు పెట్టనంత ఖర్చు పెడతారు.  అమ్మాయి వైపు ఆలోచిస్తే.. ఒక తండ్రి తన జీవిత కాలంలో సంపాదించే సంపాదనలో దాదాపు పావు భాగం నుండి సగ భాగం వరకు కూతుళ్ల పెళ్లి కోసం ఖర్చు చేస్తారు. చాలా వరకు ఆడపిల్ల వైపే పెళ్లి ఖర్చు ఉంటుంది.  మగ పెళ్ళివారిది కూడా ఖర్చు ఉంటుంది.  కానీ ఆడపిల్ల వైపు జరిగేంత ఖర్చు మాత్రం కాదు.  ఇకపోతే ఈ ఖర్చుల గురించి నేటి యువత చాలా సీరియస్ గానే ఆలోచించి పెళ్లిళ్లను ఆడంబరంగా చేసి డబ్బులు ఖర్చు చేయడం కంటే సింపుల్ గా చేసి డబ్బు ఆదా చేసే దిశగా అడుగులు వేస్తోంది.  ఇలా ఘనంగా చేసే వైపు నుండి సింపుల్ గా పెళ్లి చేయడాన్ని మైక్రో వెడ్డింగ్ అంటున్నారు. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. మైక్రో వెఢ్డింగ్.. మైక్రో వెడ్డింగ్ అంటే వివాహాన్ని సూక్ష్మ పద్ధతిలో నిర్వహించడం అని అర్థం. దీని అర్థం మొత్తం ఇలా చెప్పడంలోనే ఉంది.  మైక్రో వెడ్డింగ్ అంటే చాలా పెద్ద స్థాయిలో జరగని వివాహం. దీనికి ఎక్కువ ఖర్చు ఉండదు, జనాల హడావిడి కూడా ఎక్కువగా ఉండదు. ఈ  వివాహంలో, వధూవరులతో పాటు చాలా సన్నిహిత కుటుంబ సభ్యులు,  అతిథులు పాల్గొంటారు. వివాహాలు అతి తక్కువ మందితో జరుగుతాయి. వాటి సంఖ్య గరిష్టంగా 50-100,  కనిష్టంగా 20-25 వరకు ఉండవచ్చు. ఇంత మంది సమక్షంలో కూడా ఒక గొప్ప వివాహం నిర్వహించబడుతుంది. ఇది అధికారికంగా చేయవచ్చు లేదా సాధారణంగా చేసేయవచ్చు. అయితే మైక్రో వెడ్డింగ్ లో జరిగే పెళ్లి తంతు హంగామాలు అన్ని సింపుల్ గా చేసేస్తారు.   మైక్రో వెడ్డింగ్ లో  సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.  మైక్రో వెడ్డింగ్‌లో అతిథులు తక్కువగా ఉంటారు కాబట్టి ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. సాంప్రదాయ వివాహంతో పోలిస్తే మైక్రో వెడ్డింగ్‌ను చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. పెళ్లి కోసం జరిగే ఖర్చును ఆదా చేసి భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి అనుకునే వారు మైక్రో వెడ్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా కాలంలో జనసమూహం గుమిగూడడంపై నిషేధం ఉంది. తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన వారు చాలా తక్కువ మంది అతిథులతో, ఎటువంటి ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి చూసిన వారందరికీ అది నచ్చింది. ఇదే మైక్రో వెడ్డింగ్ గా మారింది. మైక్రో వెడ్డింగ్ ప్రయోజనాలు.. అప్పుల బాధ ఉండదు.. చాలామంది  పరిమితులను మరచిపోయి పెళ్లికి చాలా ఖర్చు చేస్తారు. చివరికి వారు అప్పుల్లో కూరుకుపోతారు. మైక్రో వెడ్డింగ్ ఊహించని అప్పుల నుండి దూరంగా ఉంచుతుంది. ఇవి పూర్తిగా బడ్జెట్ అనుకూలమైనవి. ఆత్మీయ పలకరింపులు.. సాంప్రదాయ వివాహంతో పోలిస్తే,  మైక్రో వివాహంలో  అతిథులను సంతోషంగా ఉంచవచ్చు. నిజానికి  వివాహ వేడుకలో ప్రతి అతిథితో సమయం గడపడం సాధ్యం కాదు. దీనికి విరుద్ధంగా మైక్రో వివాహాలలో, తక్కువ మంది అతిథుల కారణంగా వధూవరులతో పాటు ఇతర అతిథులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు.  అలంకరణ.. సాంప్రదాయ వివాహాల మాదిరిగా కాకుండా మైక్రో వివాహాలకు చాలా పెద్ద వేదిక అవసరం లేదు.  స్థలం చిన్నది కాబట్టి, అలంకరణకు పెద్దగా ఖర్చు ఉండదు.  అతి తక్కువ ఖర్చుతో వివాహ వేదికను అలంకరించవచ్చు. ఆహార నాణ్యత.. మైక్రో వెడ్డింగ్‌లో తక్కువ మంది ఉంటారు.  తక్కువ ఆహారం వండుతారు.  తక్కువ ఆహారాన్ని వండినప్పుడు దాని నాణ్యత  మెరుగుపడుతుంది. ఇది కాకుండా తక్కువ ధర కారణంగా మీరు చాలా వెరైటీని కూడా ఉంచుకోవచ్చు. అలాగే  ఆహార వృధాను నివారించవచ్చు. సమయం ఆదా.. సాంప్రదాయ వివాహాలలో చాలా రోజులు పట్టే వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. కానీ మైక్రో వివాహంలో, మెహందీ-సంగీత్ నుండి వివాహం వరకు అన్ని ఆచారాలు కనీసం 2-3 రోజుల్లో పూర్తవుతాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది.  అందుకే మైక్రో వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు. నష్టాలు.. ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, సూక్ష్మ వివాహాలకు కూడా వాటి ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సూక్ష్మ వివాహాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ రకమైన వివాహం వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలు.. మైక్రో వెడ్డింగ్ అనేది ఒక చిన్న వివాహ వేడుక. ఎవరిని పిలవాలో, ఎవరిని వదిలేయాలో చాలా మందికి  అర్థం  కాదు. చాలాసార్లు  ఎవరినైనా ఆహ్వానించాలని కోరుకుంటారు. కానీ మైక్రోో వివాహం యొక్క పరిమితుల కారణంగా,  ఆహ్వానం నుండి చాలామంది పేర్లను తొలగించాల్సి వస్తుంది. మైక్రో వివాహం వల్ల  సన్నిహితులు, మిత్రులు,  శ్రేయోభిలాషులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.                                                 *రూపశ్రీ.

helping nature

మనిషిలో ఉండాల్సిన గొప్ప గుణం ఇదే!

మనిషి జీవితంలో ఒకదాని తరువాత ఇంకోటి కావాలని అనుకుంటూనే ఉంటాడు. అంటే మనిషికి తృప్తి ఉండటం లేదు. ఇంకా ఇంకా కావాలనే అత్యాశ మనిషిని నిలువనీయదు. కానీ ఈ ప్రపంచంలో తృప్తి మించిన సంపద లేదన్నది అందరూ నమ్మాల్సిన వాస్తవం. అది పెద్దలు, యువత అందరూ గుర్తించాలి. ముఖ్యంగా యువతరం తృప్తి గురించి తెలుసుకుని  దాన్ని గుర్తించాలి.   ఈ సమాజంలో అందరికీ కూడా తృప్తి అనేది కరవు అయ్యింది. ఎందుకు అంటే మనిషిలో ఇంకా కావాలి అనే అత్యాశ వల్ల తృప్తి అనేది లేకుండా అందరూ స్వార్థంతో జీవిస్తున్నారు. దాని వలన మనశ్శాంతి కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఏదీ లేదు. ఈ సమాజానికి మేథావులు, శక్తివంతులు, ఆదర్శవ్యక్తులు ఎంత అవసరమో అంతకంటే గుణవంతులు ఎక్కువ అవసరం. అటువంటి గుణసంపద యువతీ యువకులు కలిగి ఉండాలి. సంస్కారం, సమగ్ర వ్యక్తిత్వం, సేవాగుణం ఈ కాలంలో ఉన్న యువతలో ఉండటం చాలా అవసరం.  మనిషి దిగజారితే పతనం అంటారు. ఈ పతనావస్థ స్థాయికి జారడం  చాలా సులభం. పతనావస్థకు జరినంత సులువు కాదు విజయం సాధించడమంటే. విజయం గురించి ఆలోచించటం మంచిదే కాని పతనం చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం కూడా చాలా అవసరం. గొప్పపేరు సంపాదించడం కంటే మంచితనం సంపాదించటం చాలా మేలు. వినయ విధేయతలతో కూడిన క్రమశిక్షణ అనేది ఈ కాలంలో యువతకు చాలా ముఖ్యం. తాము ఈ సమాజానికి ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచన యువతలో ఉండాలి తప్ప ఈకాలంలో మనకు తీసుకోగలిగినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు సమాజంతో పని ఏంటి?? అనే ఆలోచనతో అసలు ఉండకూడదు.   ఈ దేశ భవిష్యత్తు అనేది యువతీ యువకులపై ఆధారపడి వుంది. అందుకే యువతకు ఓ బాధ్యత ఉందని,  యువత తాను చెయ్యవలసిన పనిని సక్రమంగా ఒక క్రమపద్ధతితో చేయాలని పెద్దలు చెబుతారు. ఏ పనిని అయినా సక్రమంగా చేయగలిగినట్లయితే తాను అభివృద్ధి చెందగలడు. అట్లాగే దేశాన్ని అభివృద్ధి చేయగలడు. ఇదీ యువతలో దాగున్న శక్తి. వ్యక్తిగత అభివృద్ధిపై దేశాభివృద్ధి ఆధారపడి వుంటుంది. దేశాభివృద్ధి అనేది ఆ దేశంలో నివసించే ప్రజల ఆర్థికాభివృద్ధిని బట్టి చెప్పవచ్చు. ఇకపోతే ఈ దేశానికి మూలస్థంబాలు అయిన యువత భవిష్యత్తు అంతా వారు విద్యావంతులు అవ్వడంలోనే ఉంటుంది. ఎంత కష్టపడి చదివితే అంత గొప్ప స్థాయికి చేరుకొగలరు అనే విషయాన్ని యువత ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి. యువత కష్టపడి ఇష్టంతో చదవాలి. ఇవి చెప్పటం చాలా సులభం కాని చెయ్యటం కష్టం. కానీ ఆర్థిక స్థోమత పెంచుకోవాలంటే కష్టపడటం అవసరమే అవుతుంది. సవాళ్ళను అధిగమించి అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించగలిగినట్లయితే సంతృప్తి అనేది దానంతట అదే వస్తుంది. తృప్తికి మించిన సంపద ఇంకొకటి లేదు.  అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మనిషి జీవితంలో ఉండాల్సిన గొప్ప గుణం ఏదైనా ఉందంటే అది తృప్తిపడటమే అని.                                         ◆నిశ్శబ్ద.

Purple Day

పర్పుల్ డే.. మూర్ఛ వ్యాధి ప్రమాదమా?

  మూర్ఛ.. చాలా మందికి పెద్దగా అవగాహన లేని వ్యాధి ఇది.  ఈ వ్యాధి బారిన పడేవారు ఆ కుంటుంబానికి తప్ప ఈ జబ్బు గురించి తెలిసిన వారు తక్కువే. నాడీ మండలాన్ని ప్రభావితం చేసే ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.  ఈ మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 26వ తేదీన మూర్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ మూర్ఛ దినోత్సవాన్ని  పర్పుల్ డే అని కూడా పిలుస్తారు. మూర్ఛ అవగాహనకు మద్దతుగా  ఊదా రంగును ధరించమని,  ఊదా రంగు రిబ్బన్ ఈ మూర్ఛ వ్యాధిని సూచిస్తుందని చెబుతారు.   నాడీ సంబంధిత పరిస్థితి మూర్ఛ, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, దీనివల్ల మూర్ఛ మాత్రమే కాకుండా  ఇతర లక్షణాలు కనిపిస్తాయి. మూర్ఛ  కారణం,  రకాన్ని బట్టి  దీని చికిత్స  మారుతుంది.  మూర్ఛ వ్యాధికి  అసలు కారణాలు ఏంటి?  దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే.. మూర్చకు కారణాలు.. ప్రమాదవశాత్తు మెదడు గాయం కావడం వల్ల మూర్ఛ  వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరంగా కొందరిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.  కుటుంబంలో ఎవరికైనా వంశ పారంపర్యంగా మూర్ఛ వస్తూ ఉంటే ముందు జాగ్రత్తగా చిన్నతనంలోనే వైద్యులను సంప్రదించాలి. జీవక్రియ లోపాలు ఉన్నవారిలో మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో,  రోగ నిరోధక శక్తికి సంబంధించి ఏవైనా అనారోగ్యాలు ఉండే వారిలో మూర్ఛ వ్యాధి తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న దాదాపు 70 శాతం మంది మందులతో తమ మూర్ఛలను నియంత్రించుకుంటారు. మూర్ఛ ఉన్న వ్యక్తులు  ప్రమాదాలకు ఎక్కువగా గురవుతారు. ముఖ్యంగా మూర్ఛలు హెచ్చరిక లేకుండా వస్తుంటాయి.  దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఉబ్బసం లేదా మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక సమస్యల మాదిరిగానే మూర్ఛ కూడా కొన్ని ప్రమాదాలతో వస్తుంది. వీటిని అదుపు చేయకుండా వదిలేస్తే చాలా తీవ్రంగా మారవచ్చు. మూర్ఛ సంబంధిత ప్రమాదాలను తగ్గించడంలో  మూర్ఛ నియంత్రణ మొదటి అడుగు. మూర్ఛలు కొన్నిసార్లు గాయాలు లేదా పడిపోవడానికి దారితీయవచ్చు. అవి అప్పుడప్పుడు మరింత తీవ్రంగా  మరణానికి కూడా కారణమవుతాయి. వివిధ రకాల మూర్ఛలు వేర్వేరు ప్రమాదాలను కలిగి ఉంటాయి.  వచ్చే మూర్ఛల రకం,  జీవనశైలిపై  ప్రమాద స్థాయి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సరిగా నియంత్రించబడని టానిక్-క్లోనిక్ మూర్ఛలు అత్యధిక ప్రమాదాన్ని కలిగిస్తాయి. మూర్చ సమస్య ఉంటే ఎప్పుడూ ప్రమాదం ఉంటుందని లేదు. కానీ వైద్యులను సంప్రదించి మూర్చ వ్యాధికి తగిన చికిత్స,  జాగ్రత్తలు, నియంత్రణ తీసుకుంటే సాధారణ వ్యక్తులలా జీవితాన్ని గడపవచ్చు. మూర్ఛ వ్యాధికి ప్రథమ చికిత్స.. ప్రశాంతంగా ఉండాలి. మూర్ఛ వచ్చిన  వ్యక్తితోనే ఉండాలి. మూర్ఛ వచ్చిన వ్యక్తిని  సురక్షితంగా ఉంచాలి. గాయాలు కాకుండా జాగ్రత్త పడాలి. మూర్ఛ వచ్చిన వారి తల కింద మెత్తని వస్తువును ఉంచాలి.  బిగుతుగా ఉన్న దుస్తులను వదులుగా చేయాలి. . మూర్ఛ ముగిసిన తర్వాత శరీరంలో  వంకర పోయిన అవయవాలను మెల్లిగా వాటి యథా స్థానాలలో ఉంచాలి.  వాటి నోటిలో ఆహారం లేదా ద్రవం ఉంటే, వెంటనే వాటిని  బయటకు పోయేలా చేయాలి. మూర్చ్ వచ్చిన వ్యక్తి కోలుకునే వరకు వారికి  ధైర్యం చెప్పాలి.వారు ప్రమాదంలో ఉంటే తప్ప వారి నోటిలో ఏమీ పెట్టకూడదు. మూర్ఛ ఎందుకు వస్తుంది..  మెదడులో విద్యుత్ అవాంతరాలు ఏర్పడటం వల్ల మూర్ఛ వస్తుంది.  మూర్చలో వివిధ రకాలు ఉన్నాయి. ఏమి జరుగుతుందో అర్థం కాని వ్యక్తులకు ఇది భయానక పరిస్థితి కావచ్చు. మైగ్రేన్లు, స్ట్రోక్‌లు,  అల్జీమర్స్ తర్వాత ఇది నాల్గవ అత్యంత సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. మూర్ఛ వచ్చిన తర్వాత వ్యక్తిని వీలైనంత త్వరగా వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.                                         *రూపశ్రీ.

Reasons Why We Suffer

ఈ 5 విషయాలను పట్టించుకునేవారు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు..!

  బంధాల విషయానికి వస్తే బాధ్యతలు చాలా ఉంటాయి.  చిన్నవైనా, పెద్దవైనా బాధ్యతలు నిర్వహించడం ప్రతి ఒకరి కర్తవ్యం.  అయితే అంతా తమదే బాధ్యత అనుకోవడం చాలా మంది చేసే తప్పు. ప్రతి ఒక్కరూ నిర్వహించాల్సిన బాధ్యతలకు ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆ పరిమితికి మించి బాధ్యతలు తీసుకునేవారు మంచివారు అనే ట్యాగ్ నేమ్ పొందగలరు ఏమో కానీ.. జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. చాలామంది తరచుగా బాధ్యతల పేరుతో  కష్టాలలోకి జారిపోయి  జీవితాంతం వాటిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.  అసలు బాధ్యతల విషయంలో ఏవి పట్టించుకోకూడదు.  ఏ విషయాలు మనుషులను జీవితాంతం బాధపెడతాయి. తెలుసుకుంటే.. ఇతరుల ఆనందానికి బాధ్యత.. ఇతరులను సంతోషపెట్టే బాధ్యత మీకు లేదు. మీరు వారి ఆనందానికి సహాయం చేయవచ్చు. కానీ నిజమైన ఆనందం వారి లోపలి నుండే వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ భావోద్వేగ శ్రేయస్సును తమ చేతుల్లోకి తీసుకోవాలి,  వారి వ్యక్తిగత జీవితాల్లో సంతృప్తిని పొందాలి. మీరు వేరొకరి ఆనందం భారాన్ని మోయలేరు. అలాగే వారి దుఃఖాన్ని తగ్గించాల్సిన బాధ్యత మీకు ఉండకూడదు. ముందుగా మీ స్వంత ఆనందంపై దృష్టి పెట్టాలి. ఇతరులు వారి స్వంత శాంతిని కనుగొననివ్వగలగాలి.  అంతేకానీ ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసమే బ్రతకడం పనిగా పెట్టుకుంటే మీకంటూ జీవితం, జీవితంలో సంతోషం లేకుండా పోతుంది. ఎంపిక.. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకుంటే అది అందరికీ అర్థమయ్యేలా చెప్పడం,  అందరూ ఆమోదం తెలపాలని అనుకోవడం మీ పని కాదు. మీ విషయంలో ఇతరులు గందరగోళంలో ఉంటే, అలాగే ఉండండి. మనందరికీ జీవితంలో విభిన్నమైన ఆలోచనలు,  అనుభవాలు ఉంటాయి. అవి మన నిర్ణయాలను రూపొందిస్తాయి. ఆమోదం,  ధృవీకరణ కోరుకోవడం సహజం. కానీ అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేరని అంగీకరించాలి. మీ ఎంపికలు మీ విలువలు, మీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.  ఇతరులు వాటిని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు మీ పట్ల నిజాయితీగా ఉండటమే ముఖ్యం. భావోద్వేగాలు.. మీరు ఎవరికైనా మానసికంగా సహాయం చేయవచ్చు, కానీ వారి భావాలను నిర్వహించడం మీ బాధ్యత కాదు. ప్రతి ఒక్కరూ వారి స్వంత భావాలు,  రియాక్షన్స్ కు బాధ్యత వహిస్తారు. ఇతరులను ఓదార్చాలని కోరుకోవడం సాధారణమే కావచ్చు. కానీ వారి భావాలను నియంత్రించడానికి లేదా సరిదిద్దడానికి ప్రయత్నించడం చికాకు లేదా ఆగ్రహానికి దారితీస్తుంది. సానుభూతిని తెలపడం,  మాట్లాడటం  ముఖ్య.  కానీ ఇతరులు ఇలా మాట్లాడటాన్ని కొన్నిసార్లు తప్పుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే భావోద్వేగాల పరంగా ఇబ్బంది పడుతున్నవారికి పదే పదే మాట్లాడించడం సరికాదు.  వారికంటూ కొంత సమయం ఇవ్వాలి. అంతేకాదు.. ఇతరుల భావోద్వేగాలు మీ మీద ఆధారపడటం కూడా తప్పే.. మీ తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు. కానీ తప్పు లేకపోయినా ఇతరులు భావోద్వేగాలు తగ్గించడానికి మీరు మీ జీవితాన్ని,  సంతోషాన్ని త్యాగం చేసే పని పెట్టుకోకూడదు. విలువ.. ప్రతి మనిషి విలువైనవారే.. ఆ విలువను ఇతరుల ముందు  నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు.  విలువ అనేది దానికదే అర్థం కావాలి. ముఖ్యంగా మిమ్మల్ని చూడటానికి లేదా అభినందించడానికి ఇష్టపడని వారికి. మీ విలువకు ఇతరుల ప్రశంసలు లేదా గుర్తింపు అవసరం లేదు. మీ విలువను గుర్తించని వ్యక్తుల నుండి ఆమోదం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపిస్తే  అది మీ శక్తిని హరిస్తుంది. బదులుగా మిమ్మల్ని అభినందిస్తున్న,  ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులతో కలిసిపోవడం మంచిది అంచనాలు..  అందరికీ అన్ని విధాలుగా అందరూ నచ్చరు. అందరి అంచనాలను అన్నివేళలా తీర్చడం సాధ్యం కాదు.  అలా చేయడానికి ప్రయత్నించడం వల్ల నిరాశ,  ఆగ్రహమే వస్తుంది.  పరిమితులను నిర్ణయించుకోవడం,  వేరొకరికి ఎంత ఇవ్వగలరో,  ఎంత ఇవ్వకూడదో స్పష్టంగా చెప్పడం ముఖ్యం.                               *రూపశ్రీ.  

World Tuberculosis Day history

ప్రపంచ క్షయ దినోత్సవం.. క్షయ వ్యాధికి అంతం లేదా?

  క్షయ ప్రజలను భయపెట్టే.. బాధపెట్టే ఒక వ్యాధి.  దీన్ని టి.బి అని కూడా అంటారు.  విచారించాల్సిన విషయం ఏమిటంటే క్షయ వ్యాధికి నివారణ చాలా ఖర్చుతో కూడుకుని ఉన్నది.   ఈ క్షయ వ్యాధి గురించి అవగాహన పెంపొందించడానికి,  క్షయ కేసులు తగ్గించడానికి,  ప్రజలు క్షయ జబ్బుకు దూరంగా ఉండటానికి ప్రతి ఏటా మార్చి 24వ తేదీన క్షయ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్షయవ్యాధికి కారణమయ్యే బాక్టీరియా (మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్)ను  డాక్టర్ కోచ్ కనుగొన్న శతాబ్ది వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, వ్యాధి నిర్ధారణ,  చికిత్సకు మార్గం సుగమం చేస్తూ, WHO 1982 నుండి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. “అవును! మనం టీబీని అంతం చేయగలం: కట్టుబడి, పెట్టుబడి పెట్టండి, అందించండి”. ఇది 2025 సంవత్సరానికి గాను క్షయ వ్యాధి గురించి ప్రకటించిన థీమ్.. టిబి ని అంతం చేయడానికి ప్రపంచం నడుం బిగించింది. గత రెండు సంవత్సరాలుగా  టిబి ని నివారించడం పట్ల ఆచరించబడుతున్న కార్యకలాపాలు చాలా ఆశాజనకంగా ఉండటం విశేషం. ఈ సంవత్సరం థీమ్ ఆశ, ఆవశ్యకత,  జవాబుదారీతనం.. ఇవన్నీ కలిసి  శక్తివంతమైన సమిష్టి విజయాన్ని ఇస్తాయని చెబుతుంది.  2023 ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో (HLM) TBని అంతం చేస్తామని వివిధ దేశాల  దేశాధినేతలు,  ప్రభుత్వాధినేతలు ప్రతిజ్ఞ చేశారు.  ఈ కమిట్‌మెంట్ ను అందరికీ ఈ క్షయ దినోత్సవం గుర్తు చేస్తుంది. అయితే దీనికి తగిన చర్యలు తీసుకోకుండా కేవలం కమిట్‌మెంట్లు మాత్రమే కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.  ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచంలో   మరణానికి కారణమయ్యే అంటు వ్యాధులలో క్షయవ్యాధి ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేస్తుంది. క్షయవ్యాధి నయం చేయగల,  నివారించగల వ్యాధి అయినప్పటికీ, దీని నియంత్రణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది.  క్షయ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. క్షయ వ్యాధి దగ్గు, తుమ్ము,  ఉమ్మివేయడం ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో నాలుగో వంతు మందికి క్షయ వ్యాధి సోకిందని చెబుతారు. ప్రపంచంలో మెడిసిన్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది సరిపోదని చెప్పడానికి క్షయ వ్యాధి ఒక ఉదాహరణ.  ఔషధ నిరోధకత వ్యాప్తి చెందే ప్రమాదం,  దాని తీవ్రత,  మరణాల పెరుగుదలకు ప్రధాన కారణాలు.  రోగ నిర్ధారణలో జాప్యం,  చికిత్సలో అసమర్థత ఇవన్నీ క్షయ జబ్బు విషయంలో జరుగుతున్న తప్పులు. తక్కువ,  మధ్యతరగతి ఆదాయ దేశాలను TB అధికంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధితో బాధపడుతున్న రోగుల జనాభా 170 కోట్లు. వీరిలో 58.7 కోట్లు ఆగ్నేయాసియాలో నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం 4000 కంటే ఎక్కువ మంది యూరోపియన్లు ఈ అనారోగ్యంతో మరణిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 25,90,000 మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు. అంటే లక్ష మంది భారతీయ జనాభాలో ప్రతి 188 మందికి వ్యాధి సోకింది. 2000 సంవత్సరం నుండి, క్షయవ్యాధిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు 7.4 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని అంచనా. అయితే, COVID-19 మహమ్మారి, యూరప్, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు మరియు సామాజిక ఆర్థిక అసమానతలు క్షయవ్యాధిని నిర్మూలించడానికి పోరాటంలో సంవత్సరాల లాభాలను తిప్పికొట్టాయి మరియు ప్రభావితమైన వారిపై, ముఖ్యంగా అత్యంత దుర్బలమైన వారిపై మరింత ఎక్కువ భారాన్ని మోపాయి. 2000 సంవత్సరం నుండి క్షయవ్యాధిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రయత్నాలు 7.4 కోట్ల మంది ప్రాణాలను కాపాడాయని అంచనా. అయితే COVID-19 మహమ్మారి, యూరప్, ఆఫ్రికా,  మధ్యప్రాచ్యంలో యుద్ధాలు,  సామాజిక ఆర్థిక అసమానతలు క్షయవ్యాధిని నిర్మూలించడానికి గల ప్రయత్నాలను  తిప్పికొట్టాయని చెబుతున్నారు.  ఆర్థికంగా వెనుకబడిన వారిని క్షయ వ్యాధి మరింత దుర్భలత్వంలోకి  నెట్టివేసింది. క్షయ వ్యాధి లక్షణాలు.. క్షయవ్యాధి ఉన్న వ్యక్తి ముఖ్యంగా దగ్గు సమయంలో దానిని గాలి ద్వారా వ్యాపిస్తాడు. ఫలితంగా చురుకైన క్షయవ్యాధి ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని,  వారు ఇకపై అంటువ్యాధి నుండి బయటపడే వరకు వీలైనంత వరకు ఇతరులకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  TB  సాధారణ లక్షణాలు: మూడు వారాల కంటే ఎక్కువ లేదా అంతకంటే ఎక్కువ కాలం దగ్గు ఉండటం రక్తం లేదా శ్లేష్మంతో సంబంధం ఉన్న దగ్గు ఛాతీ నొప్పి, లేదా శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు నొప్పి అనుకోకుండా బరువు తగ్గడం అలసట (సాధారణ బలహీనత) జ్వరం (సాధారణంగా 60-85% మంది రోగులలో) రాత్రిపూట చెమటలు పట్టడం (నిద్రలో అధికంగా చెమట పట్టడం) చలి (తీవ్రంగా వణుకు) క్షయ వ్యాధి  నివారించాలంటే.. క్షయవ్యాధి తీవ్రంగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. దీని వల్ల  వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తరచుగా చేతులు కడుక్కోవడం,  నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవడం చేయాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం,  సరైన నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం  వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది,  క్షయవ్యాధి సంక్రమణ అవకాశాన్ని తగ్గిస్తుంది. డాక్టర్ సలహా మేరకు TB చికిత్స మొత్తం కోర్సును పూర్తి చేయడం వలన ఔషధ-నిరోధక TB ప్రమాదాన్ని తగ్గిస్తుంది,  మళ్లీ రాకుండా   నిరోధిస్తుంది. పేదరికం, ఆకలి,  రద్దీగా ఉండే జీవన పరిస్థితులు వంటి సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడం వలన  క్షయవ్యాధి భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  TB ఇన్ఫెక్షన్‌ను యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం వలన ఇన్ఫెక్షన్ క్రియాశీల క్షయవ్యాధిగా అభివృద్ధి చెందకుండా నిరోధించవచ్చు.                       *రూపశ్రీ.

World Water Day

నీటి పొదుపు దాహానికి భద్రత..  

  నీరు లేకుండా జీవితం లేదు. ఇది ఒక ప్రాథమిక అవసరం.  నీరు లేకుండా మనం జీవించలేము. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే జీవిత వేగంలో మనం ఈ సహజ వనరు పరిరక్షణను మరచిపోయాము. చాలా ప్రాంతాలలో నీటి కరువు ఉంది.  పంటలు సాగు చేయడానికి కాదు.. కనీసం తాగడానికి నీరు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.  ఇంత అభివృద్ది చెందిన టెక్నాలజీ యుగంలో కిలోమీటర్ల కొద్ది కాలినడకన వెళ్లి మరీ నీళ్లు తెచ్చుకుంటున్న గ్రామాలు నేటికి ఉన్నాయి.  ఇది ప్రపంచానికి తీవ్రమైన ప్రశ్న.  ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.  ఈ సందర్భంగా నీటిని పొదుపు చేయడం  ఎలా.  సకల ప్రాణుల ప్రాణాలను కాపాడే నీటి సంరక్షణ కోసం చేయాల్సిన కొన్ని చిన్న చిన్న మార్పులను తెలుసుకుంటే.. ఈ ప్రపంచంలో జీవితానికి నీరు ప్రాథమిక అవసరం. నీరు లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. సరళంగా చెప్పాలంటే నీరు ఉంటేనే మనం ఉనికిలో ఉన్నాము. నీటి ప్రాముఖ్యతను వివరించడానికి, ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1993 సంవత్సరంలో ప్రారంభించింది. ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవడం  ప్రధాన లక్ష్యం నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, నీటి సంరక్షణను ప్రోత్సహించడం. నీటి వనరులు తరిగిపోతున్న తీరు ఆందోళన కలిగించే విషయంగా మారుతోంది. మనం ఇప్పుడే అప్రమత్తంగా ఉండకపోతే, భవిష్యత్తులో దాని పరిణామాలను మనం అనుభవించాల్సి రావచ్చు. 2025 ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ రంగంలో సహకరించడం ప్రతి వ్యక్తి కర్తవ్యం. ఒక వ్యక్తి సమాజం కోసం ఏమీ చేయలేకపోతే కనీసం  నీరు వృధా కాకుండా కాపాడటం అయినా చేయవచ్చు. నీటిని ఆదా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనం దానిని సరైన దృక్కోణం నుండి చూడాలి. నీటి వృధాను నివారించడానికి కొన్ని సులభమైన మార్గాలను ఇక్కడ మేము మీకు చెబుతున్నాము. నీటిని ఇలా ఆదా చేయవచ్చు.. షవర్ తో స్నానం చేసే ట్రెండ్ ప్రజల్లో పెరిగింది. అందులో చాలా వృధా ఉంది. మనం బకెట్ తో స్నానం చేసే అలవాటు పెంచుకోవాలి. దీనితో మనం నీటి వృధాను నియంత్రించవచ్చు. ఇళ్లలో వాటర్ ప్యూరిఫైయర్లు చాలా సాధారణం అయ్యాయి. RO నీటిని శుభ్రం చేస్తుంది కానీ చాలా నీరు వృధా అవుతుంది. అటువంటి పరిస్థితిలో, RO నుండి వచ్చే మురికి నీటిని పాత్రలు కడగడం వంటి ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం  అలవాటు చేసుకోవాలి. మనం పళ్ళు తోముకోవడం, టాయిలెట్ కి వెళ్ళడం వంటి రోజువారీ పనులు చేస్తున్నప్పుడు నీటిని వృధా చేయకుండా ఉండాలి. టాయిలెట్‌ను పదే పదే ఫ్లష్ చేయడానికి బదులుగా మగ్గు లేదా బకెట్ నుండి నీటిని పోయడం ద్వారా కూడా మనం నీటిని ఆదా చేయవచ్చు. తరచుగా మనం ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటాము.  మొత్తం నీళ్ళు తాగలేకపోతే, దాన్ని ఇతరులు పారేస్తారు. ఆ నీటిని సింక్‌లో పోయడానికి బదులుగా పక్షుల కోసం బాల్కనీ లేదా టెర్రస్‌పై ఉంచడానికి ప్రయత్నించాలి. కూరగాయలు కడగడానికి ఉపయోగించే నీటిని  మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించాలి. నీటిని ఆదా చేయడానికి ఇది చాలా ప్రభావవంతమైన మార్గం కూడా. మనం సైకిల్ లేదా కారు కడగడానికి రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగించవచ్చు. కారు చాలా మురికిగా లేకపోతే, దానిని నీటితో కడగడానికి బదులుగా, మనం దానిని తడి గుడ్డతో తుడవవచ్చు.                                                      *రూపశ్రీ.  

ప్రపంచాన్ని మురిపించే  తోలు బొమ్మల కళా కౌశలం...

తోలు బొమ్మలాట.. ఇంట్లో అమ్మమ్మలనో.. తాతయ్యలనో ఒక్కసారి కదిలించి చూస్తే.. తోలుబొమ్మలాట గురించి ఒక కొత్త కథ చెప్పినట్టు పిల్లలకు ఎంతో ముచ్చటగా చెబుతారు.  వీధులలో రాత్రిళ్లు తోలుబొమ్మలాట ఆధారంగా భారతీయ ఇతిహాసాలు ఎంతో అందంగా వ్యాప్తి చెందాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జంతు చర్మాలతో బొమ్మలను తయారు చేయడం,  సహజమైన రంగులతో వాటికి రంగులద్దడం,  దుస్తులతో అలంకరణ.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాత్రిళ్లు ఒక తెర వెనుక తోలు బొమ్మలకు తాడు కట్టి చేతులు కదిలిస్తూ బొమ్మలకు ప్రాణం ఇవ్వడం తోలుబొమ్మ కళాకారుల నైపుణ్యానికి, కళా కౌశలానికి నిలువెత్తు నిదర్శనం.  రోజురోజుకు ఈ కళ అంతరించి పోతున్న నేపథ్యంలో ఈ కళ గురించి అవగాహన పెంచి కళను బ్రతికించే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా మార్చి 21వ తేదీన ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తోలు బొమ్మల గురించి, ఈ కళ గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. తోలుబొమ్మలాటకు గొప్ప సంస్కృతి ఉంది.  తోలుబొమ్మలాట కేవలం వినోదం మాత్రమే కాదు.  అంతకంటే ఎక్కువ.  ఇది సంస్కృతులు,  తరాలకు విస్తరించి అనాది కాలంగా గౌరవించబడుతున్న సంప్రదాయం. సాంప్రదాయంగా  చేతితో తయారు చేసిన తోలుబొమ్మల నుండి వినూత్న డిజిటల్ సృష్టి వరకు, తోలుబొమ్మలాట కళాత్మక వ్యక్తీకరణ,  ఊహ లెక్కలేనన్ని  అవకాశాలను అందిస్తోంది. ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం  తోలుబొమ్మలాటను ప్రపంచ కళారూపంగా గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోలుబొమ్మలాట కళాకారులకు నివాళులు అర్పించడానికి, వారిని గుర్తించడానికి,  గౌరవించడానికి కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం. ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవాన్ని 2003లో UNIMA — యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోనెట్ స్థాపించింది. UNIMA అనేది UNESCOతో అనుబంధంగా ఉన్న ఒక ప్రభుత్వేతర సంస్థ.  ఈ రోజును తోలుబొమ్మలాట కళలను ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా తోలుబొమ్మ కళాకారులు అందరూ ఒకచోట   కలవడానికి ఒక స్థలాన్ని ఏర్పాటుచేయడం కూడా  ఇందులో భాగం. తోలు బొమ్మలాట కళను రక్షించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యంగా కార్యక్రమాలు సాగుతాయి. నాటకాల కంటే ముందే ప్రజలను అలరించే కళారూపం ఉండేది. అదే తోలుబొమ్మలాట. ప్రాణం లేని ఈ తోలుబొమ్మలతో కథా రూపాలను ప్రదర్శిస్తుంటే ఆ బొమ్మలకు ప్రాణం వచ్చినట్టు అనిపించేది. ప్రపంచంలో విభిన్న ప్రాంతాల నుండి చాలా మందిని తోలుబొమ్మల కళ అలరించింది.   భారతదేశంలో తోలుబొమ్మలాట  మూలం క్రీ.పూ. 2500 నాటి సింధు లోయ నాగరికత నుండి ఉద్భవించింది. పురావస్తు శాస్త్రవేత్తలు ఒక టెర్రకోట బొమ్మను సింధు లోయలో కనుగొన్నారు. ఆ బొమ్మను తాడుతో తిప్పగలిగే సామర్థ్యం ఉన్న వేరు చేయగలిగిన తలతో తయారు చేశారు. "రామాయణం",  "మహాభారతం" వంటి అనేక భారతీయ శాస్త్రీయ గ్రంథాలు కూడా తోలుబొమ్మల గురించి ప్రస్తావించాయి. చైనా, జపాన్,  తైవాన్‌లు కూడా వాటి స్వంత రూపాల్లో తోలుబొమ్మలాటను కలిగి ఉన్నాయి.  గ్రీస్‌లో పూర్వకాలంలో  హెరోడోటస్,  జెనోఫోన్ రచనలలో లభించిన పాత లిఖిత రికార్డులు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి తోలుబొమ్మలాట ఆచరణలో ఉందని పేర్కొన్నాయి.  ఈ గ్రీకు నాటకాల్లో సామాన్య ప్రజల ముందు తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఉండేవని,  యూరోపియన్ తోలుబొమ్మలాట దీని నుండి ప్రేరణ పొందిందని పేర్కొన్నాయి. క్రీస్తుపూర్వం 2000లో ఈజిప్టులో తోలుబొమ్మల  పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి. 16వ శతాబ్దంలో బ్రిటిష్ సాంప్రదాయ తోలుబొమ్మలాట అయిన  "పంచ్ అండ్ జూడీ" ఇటాలియన్ కామెడియా డెల్'ఆర్ట్ నుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ ప్రదర్శన ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది.  19వ శతాబ్దం వరకు వివిధ మార్పులతో ఇది ప్రదర్శింపబడేది. 1929లో యూనియన్ ఇంటర్నేషనల్ డి లా మారియోనెట్ (UNIMA), లేదా ఇంటర్నేషనల్ పప్పెట్రీ అసోసియేషన్, ప్రేగ్‌లో స్థాపించబడింది. తోలుబొమ్మలాట  పునరుజ్జీవనాన్ని పైకి తీసుకురావడానికి, తోలుబొమ్మలాట కళాకారులు తమ కళారూపాన్ని ప్రదర్శించడానికి,  ఇతర సారూప్యత కలిగిన కళాకారులతో కనెక్ట్ అవ్వడానికి ఈ సంస్థ రూపొందించబడింది. అప్పటి నుండి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో UNIMA కేంద్రాలు సృష్టించబడ్డాయి. ఎంత కాలం మారినా తోలుబొమ్మల కళ ప్రజలను అలరిస్తూనే ఉంది.  నేటికాలంలో పిల్లలకు ఈ కళ మీద ఆసక్తి కలిగించేలా పప్పెట్రీ షోలు,  పప్పెట్రీ మేకింగ్ క్లాసులు, పప్పెట్రీ కళ గురించి అనేక విషయాలు బోధించే దిశగా పాఠశాలలు కూడా తమ వంతు కృషి చేయడం చాలా మంచి విషయం. తల్లిదండ్రులు కూడా తోలుబొమ్మల కళను పిల్లలకు పరిచయం చేస్తూ పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి చేయాలి.                            *రూపశ్రీ.

కిచ‌కిచ‌ల చ‌ప్పుడు.... నిశ్శబ్దంగా కనుమరుగవుతోందా?

పిచ్చుకలు.. ఒకప్పుడు గ్రామాల నుండి పట్టణాల వరకు చాలా మందికి సుపరిచితం.  ఇంటి వరండాలో.. ఇంట్లో.. గూళ్లు పెట్టుకుని అల్లరి చేసే ఈ పిచ్చుకలు క్రమంగా ఇంటి కిటికిలలో,  ముంగిట్లో దండెలా మీద కనిపించేవి. కానీ ఇప్పుడో.. అసలు పిచ్చుకలు కనిపించడమే లేదు.  ఇప్పటి తరం పిల్లలకు పిచ్చుక అంటే పుస్తకంలో చూసి గుర్తుపెట్టుకునే ఒక చిత్రం మాత్రమే అయ్యింది.  ఒకప్పుడు మన పరిసరాలలో విడదీయరాని భాగంగా ఉన్న పిచ్చుకల జనాభా గత కొన్ని సంవత్సరాలుగా బాగా తగ్గింది. ఈ చిన్న పక్షుల జనాభా తగ్గడం ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే అవి సహజ తెగులు నియంత్రణ  కీటకాలను తినడం, తెగులు నియంత్రణలో సహాయపడటం చేస్తాయి.  అంటే ఇవి రైతన్నలకు ఎంతో సహాయం చేస్తాయి.   కానీ ఇలా పిచ్చుకల లాంటి చిన్న పక్షుల  జాతుల జనాభా తగ్గడం గురించి,  వాటిని రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు.   ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025.. 2010 లో తొలిసారిగా  ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకున్నారు.  ది నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా,  ఫ్రాన్స్ కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్ ల ఆలోచన ద్వారా  ఈ దినోత్సవం పిచ్చుకల సంరక్షణ గురించి అవగాహన పెంచడం,  జాతుల పరిరక్షణపై ఆలోచనలను రూపొందించడం కోసం ఏర్పాటు  చేయబడింది.  పిచ్చుకల క్షీణతకు గల కారణాలను అధ్యయనం చేయడానికి,  జాతులను అంతరించిపోకుండా రక్షించే చర్యలను గుర్తించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురించి అవగాహన కల్పించడానికి నేచర్ ఫరెవర్ సొసైటీ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ జాతుల పిచ్చుకల గురించి సమాచారం,  పిచ్చుకలకు సబంధించిన పెద్ద ఎత్తు ఫొటోల  సేకరణ ఉంది. ప్రాముఖ్యత.. పిచ్చుకల జనాభాలో నిరంతర తగ్గుదల వాటి జనాభాను చాలా  అంచున పడేసింది. ఈ ఆందోళనకరమైన స్థితి గురించి అవగాహన పెంచడమే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం లక్ష్యం. అందువల్ల పరిరక్షణ పట్ల మక్కువ ఉన్న ప్రజలు ఈ రోజున కలిసి వస్తారు.  పట్టణ ప్రాంతాల్లో పిచ్చుకల జనాభా పరిమితంగా ఉండటానికి కారణం ప్రకృతి,  జీవవైవిధ్యం నుండి పెరుగుతున్న దూరం కావచ్చు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం  పిచ్చుకల సంరక్షణ,  పట్టణ జీవవైవిధ్యం  తక్షణ అవసరాన్ని స్పష్టంగా చెబుతుంది. పిచ్చుకలను రక్షించడానికి సమిష్టి చర్యను  ప్రేరేపిస్తుంది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 2025 థీమ్.. ప్రతి ఏడాదిలాగే 2025 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం  ఇతివృత్తం ఏర్పాటు చేయబడింది. 'ప్రకృతి యొక్క చిన్న దూతలకు నివాళి'. పిచ్చుకల పట్ల మనుషులకు ప్రేమను తిరిగి పుట్టేలా చేయడం, వాటిని సంరక్షించడం,  అందుకోసం చేయవలసిన కార్యకలాపాల వైపు ప్రజలను ప్రేరేపించడం ఈ ఇతివృత్తం లక్ష్యం. పిచ్చుకల పర్యావరణ ప్రాముఖ్యత.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో పిచ్చుకలు కీలక పాత్ర పోషిస్తాయి. సహజ తెగులు నియంత్రకాలుగా పనిచేస్తాయి.  తెగులుకు కారణం అయ్యే  కీటకాలను తింటాయి, తెగులు నియంత్రణలో సహాయపడతాయి. పరాగసంపర్కం,  విత్తన వ్యాప్తికి కూడా పిచ్చుకలే మూలం. వాటి కదలిక వివిధ మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. పిచ్చుకల ద్వారా జీవవైవిధ్య పెంపు కూడా జరుగుతుంది. పట్టణ,  గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు పిచ్చుకల ఉనికి చాలా ముఖ్యమైనది. చిన్నతనంలో ఇంట్లో పిచ్చుకల అల్లరితో నిద్రలేచే ఉదయాలు జ్ఞాపకాలలో కాకుండా నేటి బాల్యానికి కూడా అందించాలంటే పిచ్చుకల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిచ్చుకలకు హాని కలిగించే చర్యలు మానుకోవాలి.  ఈ సృషిలో మానవుడు మాత్రమే కాదు అన్ని జీవులకు జీవించే హక్కు  ఉంది.  ఆ హక్కును మనం వృధా కానీయరాదు.                                                  *రూపశ్రీ.

ప్రతిభకు-ప్రవర్తనకు గల సంబంధం తెలుసా?

వర్తమానంలో  మనిషి నిలకడగా ఉండకపోవడానికి ఉన్న పెద్ద కారణాలలో గతంలోకి తొంగి చూస్తూ ఉండటం ముఖ్యమైనది.  గతంలో ఎన్నో పరాజయాలు ఎదురై ఉండవచ్చు. కానీ, వాటిని వేటినీ పట్టించుకోకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు, పరాజయాలు సర్వసాధారణమే. అవి మీ జీవితానికి మెరుగులు దిద్దేవే! ఓటములే లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందో తెలుసా! అలాంటి జీవితంలో నేర్చుకోవడానికి ఎవరికీ ఏమీ లభ్యం కాదు. కేవలం కాలంతో ఊరికే అట్లా నడుస్తూ పోవడం అనేది మొదట్లో సుఖవంతంగా అనిపిస్తుందేమో కానీ అది తరువాత ఒక పెద్ద చిరాకుగానూ శూన్యంతో నిండినట్టుగానూ అనిపిస్తుంది.  అలాంటి శూన్యమే మనిషిలో నిస్సహాయత, నిరాశ వంటి వాటిని పొగుచేస్తుంది. ఏదీ చేయలేకపోతున్నామే అనే ఆందోళన, కలవరపాటు చోటుచేసుకుంటుంది. వాటినే కష్టాలనీ, అవి ఎంతగానో బాధిస్తున్నాయని భ్రమ పడుతూ ఉంటారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే.. సమస్య తెచ్చిపెట్టుకున్నది, ఆ తరువాత దాని వల్ల ఇబ్బంది పడి బాధపడుతున్నది కూడా మనిషే… అలాంటప్పుడు ఎవరైనా సహాయం చేస్తారేమో అని దిక్కులు చూస్తారు. కానీ అది తప్పు.   Pull yourself out of difficulties by your- self. There is none to help you... కష్టాలనూ, కడగండ్లనూ స్వశక్తితోనే అధిగమించండి. చాలా మందికి ఇతరుల ముందు చాలా కఠినంగా ఉంటారు.  ముఖ్యంగా ప్రతి చిన్నదానికీ ఇతరులను నిందించడమంటే మహా సరదా.. అలాంటి మనస్తత్త్వాన్ని విడనాడాలి. ఎవరి సమస్యలకు వారే కారణం అయినప్పుడు వాటికి ఇతరులను బాద్యులను చేయడం తప్పు. పైపెచ్చు ఇతరులను నిందించడం వల్ల ఎదురయ్యే పరాభవాలు, పరాజయాలు తోడయ్యి మనిషికి విలువను తగ్గిస్తుంది.   అది మనిషిని ఉన్నతస్థానం నుంచి నీచస్థాయికి దిగజారుస్తుంది. అందుకే మనిషిలో ఉన్న ఆ దుర్గుణాన్ని మెల్లగా తుంచేయాలి.  జీవితంలో ఎద్గురయ్యే వైఫల్యాలనూ, తప్పిదాలనూ ఎదుటి వ్యక్తులపైనో, సమాజంపైనో వేసి పరిస్థితుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. పలాయనవాదులుగా, పరాన్నభుక్కులుగా మిగిలిపోతున్నారు. పరీక్షల దగ్గర నుంచి వివాహ వ్యవహారాల వరకు ప్రతి విషయంలో ఇలాంటి పరిస్థితులలోకి వెళ్ళిపోయి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుఃస్థితి నుంచి బయటపడటం చాలా ముఖ్యం.  రాజ్యాలు, వైభవాలు, యుద్ధాలు, విజయాలు ఇవేవీ నిజానికి చరిత్ర కాదు! అద్భుతాలను సాధించిన కొందరు మహాపురుషుల జీవనప్రవాహమే చరిత్ర. ఆత్మవిశ్వాసం ఆ మహానుభావుల హృదయాలలో ప్రకాశించింది. నాగరకత అభివృద్ధిలో వారిని ముందుకు తీసుకువచ్చిన క్రియాశక్తి ఏదైనా ఉందంటే అది ఈ ఆత్మవిశ్వాసమే! మనకు ఏదైనా నష్టం, దోషం సంభవించాయంటే  అవన్నీ కూడా మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాటి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతుంది కానీ.. నేటికీ మనిషి ఎక్కడో అలాంటి తప్పటడుగులే వేస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్నీ, ఆత్మాభిమానాన్నీ కోల్పోయి అభివృద్ధి పేరుతో, ఆధునికత పేరుతో సానుకూలం కాని సరంజామాను జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ తెలిసినా, కర్ణుడి శస్త్రజ్ఞానంలా అవసరానికి అవి ఉపయోగపడడం లేదు. ఇప్పటి యువతలో సామర్థ్యానికి కొదవలేదు. సౌశీల్యమే కొరవడింది. సామర్థ్యం మనిషిని ఉన్నతస్థాయికి తీసుకువెళుతుంది. కానీ, సౌశీల్యం మనిషిని ఆ ఉన్నతస్థానంలో శాశ్వతంగా ఉంచుతుంది. నేడు సమాజంలో ఎన్నో ఉన్నతస్థానాలను అధిరోహించ గలుగుతున్నా, అక్కడి నుంచి కొన్నాళ్ళకే పతనమైపోవడానికి కారణం  ప్రతిభకు తగ్గ ప్రవర్తన లేకపోవడమే! ఈ ప్రవర్తన ఎంత ముఖ్యమో తెలుసుకున్నవాడు మెట్టు దిగజారకుండా పటిష్టమైన కోటను కట్టుకుంటాడు. కానీ ప్రవర్తన సరిగ్గా లేనివాడు తనకు తానే వైఫల్యాలను కొనితెచ్చుకుని పేకమేడలా కూలిపోతాడు. అందుకే ప్రతిభకు తగిన ప్రవర్తన అలవరచుకుని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారాలి. ఆ దిశగా అడుగులు వేయాలి.                                       ◆నిశ్శబ్ద.

ఆయుధమే దేశానికి రక్ష.. భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం..!

యుద్దమంటూ జరిగితే మనుషుల కంటే ఆయుధాలే కీలకపాత్ర పోషిస్తాయి.  దేశ సంరక్షణ నుండి మనిషి సంరక్షణ వరకు ఆయుధాలే కవచాలు అవుతాయి.  ఇక భారతదేశ రక్షణ విభాగంలో ఆయుధాల పాత్ర మాటల్లో చెప్పలేనిది.  ఎంతటి వీరుడైనా చేతిలో ఆయుధం పట్టుకున్నాడంటే అతని శక్తి వందరెట్లు లేదా వెయ్యి రెట్లు పెరుగుతుంది.  ఇంత ప్రాధాన్యత ఉన్న ఆయుధాల తయారీ అనేది చాలా నైపుణ్యంతో కూడుకున్న విషయం.  బొమ్మ పిస్తోల్,  బొమ్మ కత్తులు,  బొమ్మలు తయారు చేసినట్టు ఆయుధాలను తయారు చేయడం కుదరదు.  భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయుధాలు ఉత్పత్తి చేసే కర్మాగారాల దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 18వ తేదీన జరుపుకుంటారు. ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ చేసిన కృషిని గుర్తించి,  గౌరవించే దిశగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఆయుధాలు, ఆయుధాల ఉత్పత్తి ప్రక్రియలలో తాజా పరిణామాలను ప్రదర్శించే వివిధ కర్మాగారాల కవాతులు, ప్రదర్శనలు,  అవార్డు వేడుకలు జరుగుతాయి. ఇది చరిత్ర.. భారతదేశ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నాటి నుండే వాటి మూలాలు కలిగి ఉన్నాయి. బ్రిటీష్ సైన్యం అవసరాలను తీర్చడానికి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1775లో కోల్‌కతాలో బోర్డ్ ఆఫ్ ఆర్డినెన్స్‌ను స్థాపించింది. ఆ తర్వాత వెంటనే  ఇషాపూర్‌లో (1787) గన్‌పౌడర్ ఫ్యాక్టరీని, 1787లో కోసిపూర్‌లో  గన్ క్యారేజ్ ఫ్యాక్టరీని నిర్మించారు.  దీన్నే ఇప్పుడు గన్ అండ్ షెల్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఈ కర్మాగారాలు భారత ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం మార్చి 18న జరుపుకునే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం భారతదేశ ఆయుధ ఉత్పత్తికి జన్మస్థలంగా గుర్తించబడిన కోసిపోర్ ఫ్యాక్టరీ స్థాపనను గుర్తుచేస్తుంది. ప్రాముఖ్యత.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం భారతదేశంలో మొట్టమొదటి ఆయుధ కర్మాగార స్థాపనను సూచిస్తుంది. దేశీయ ఆయుధాలు,  మందుగుండు సామగ్రి ఉత్పత్తికి ఇదే పునాది. భారత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (IOFలు) భారత సాయుధ దళాలకు సరఫరా చేయడంలో తమ పరిశోధన, అభివృద్ధి,  తయారీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఇందులో విస్తృత శ్రేణి ఆయుధాలు,  మందుగుండు సామగ్రిని ప్రదర్శించడం కూడా ఉంటుంది. భారత సైన్యాన్ని సన్నద్ధం చేయడం ద్వారా జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న IOF శ్రామిక శక్తి  అంకితభావం,  కృషిని గుర్తించి అభినందించే రోజు ఇది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం రక్షణ రంగంలో భారతదేశం  శక్తిని,  ప్రతిష్టను బలోపేతం చేస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖలో ఉండే  రక్షణ ఉత్పత్తి విభాగం పర్యవేక్షించే ఒక భారీ పారిశ్రామిక సముదాయం అయిన ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (IOFలు) భారతదేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోల్‌కతాలో ప్రధాన కార్యాలయం కలిగిన IOFలు దేశవ్యాప్తంగా 24 ప్రదేశాలలో విస్తరించి,  41 కర్మాగారాల విస్తారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. ఈ కర్మాగారాలకు 9 శిక్షణా సంస్థలు, 3 ప్రాంతీయ మార్కెటింగ్ కేంద్రాలు,  4 ప్రాంతీయ భద్రతా నియంత్రణ కార్యాలయాల నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలో 10 కర్మాగారాలు అత్యధికంగా ఉన్నాయి. తరువాత ఉత్తర ప్రదేశ్ (9),  మధ్యప్రదేశ్ (6) ఉన్నాయి.                                   *రూపశ్రీ