బుల్లెట్ కు క్షిపణితో బదులు.. పాకిస్థాన్ కు భారత్ హెచ్చరిక

భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్రత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పహల్గాం దాడి తరువాత నుంచీ పరిస్థితి తీవ్రంగా మారింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పకిస్థాన్ ను వణికించేసింది. పాక్ దాడులకు తెగబడినా భారత్ వాటిని అత్యంత సమర్దంగా తిప్పి కొట్టడమే కాకుండా ప్రతిదాడులు చేసింది. ఈ ప్రతిదాడులు పాకిస్థాన్ అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేశాయి. ఈ పరిస్థితిలో స్పష్టమైన స్వార్థ పూరిత కారణాలతో ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఏకపక్షంగా పూనుకుని కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను సడలించేందుకు ప్రయత్నించారు. భారత్ మాత్రం కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ ఏమీ లేదనీ, అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమనీ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకే తాము మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామనీ చాటింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పాక్ నుంచి ఉల్లంఘన జరిగింది. దీంతో భారత్ దీటుగా స్పందించింది. ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి బుల్లెట్ వస్తూ మీరు క్షిపణితో సమాధానం ఇవ్వండి అంటూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.      దీంతో పాకిస్థాన్ కు ఇక శరణుజొచ్చడం వినా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటి కంటే పాక్ సరిస్థితి దయనీయతకు  త్రివిధ దళాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన అద్దం పట్టింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తొలుత పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేశామనీ, ఆ తరువాత పాక్ సరిహద్దులలో భారత భూభాగంపై చేసిన దాడులకు ప్రతిగా   పాక్ లోని   ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించాయి. అంతే కాకుండా ఈ దాడుల్లో పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమైన వీడియో క్లిప్పింగ్ లను చూపాయి. పాక్ చేసిన ప్రతి దాడినీ సమర్ధంగా తిప్పికొట్టినట్లు త్రివధ దళాల ప్రతినిథులు తెలిపారు. పాక్ ఏ మాత్రం తోక జాడించినా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.  పాక్ పై చర్యలపై విషయంలోకేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ  ఇచ్చిందని పేర్కొన్నారు.  పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తానే మొదట కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించిందని, దానికి భారత్ అంగీకరించిందని, అయితే ఆ దేశమే ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ, మరోసారి ఆ పని చేస్తే భారత్ నుంచి ఎదురయ్యే దాడుల ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. 

ట్రంప్ స‌డెన్ గా యుద్ధం ఎందుకు ఆపాడు?

అమెరికా అస‌లు ఉద్దేశం ఏంటి? భార‌త్ ఇప్ప‌టికే మూడో అతి పెద్ద ఆర్ధిక శ‌క్తిగా ఎదుగుతోంది. అమెరికా, చైనాల‌తో పోటీ ప‌డుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో మ‌రే దేశానికి లేనంత గొప్ప జ‌నాభా శ‌క్తి భార‌త్ సొంతం. ఈ మార్కెట్ ఒక్క‌టి చాలు ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ ని అతి పెద్ద‌ ఆర్దిక శ‌క్తి చేయ‌డానికి. చైనాను కూడా మ‌నం క్రాస్ చేసి అతి పెద్ద జ‌నాభా గ‌ల దేశంగా మార‌డం అత్యంత శ‌క్తిమంత‌మైన దేశంగా ఆవిర్భ‌వింప చేసింది.  అలాంటి భార‌త్ మ‌రింత ఎదిగి అమెరికా, చైనాల‌ను కూడా ఢీ కొడితే ప‌రిస్థితి మ‌రోలా అవుతుంది. ఇప్ప‌టికే కొన్ని దేశాలు అమెరికాను పెద్ద‌న్న పాత్ర నుంచి ప‌క్క‌కు త‌ప్పించి భార‌త్ ను ఆ స్థానంలో చూడాల‌నుకుంటున్నాయ్. మ‌రీ ముఖ్యంగా ఫ్రెంచ్ అధినేత మ‌క్రాన్ భార‌త్ నుంచి మోడీ ఆ పాత్ర పోషించాల‌ని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు.  అమెరికా ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద‌న్న పాత్ర‌లో ఉన్నా.. అదంతా వ్యాపార లావాదేవీల్లో భాగ‌మే. ఏ చిన్న అవ‌కాశం దొరికినా అమెరికాకు లాభం చేకూర్చి పెట్ట‌డం ఎలా అన్న కోణంలోనే ఆ దేశ ప్ర‌తి అధ్య‌క్షుడూ కోరుకుంటారు. అది ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ అయినా,. సిరియా వార్ అయినా., గ‌ల్ఫ్ వార్ అయినా.. దానికి కావాల్సిన వ‌న‌రుల కోస‌మే త‌న ఆరాట‌మంతా చూపిస్తుంది. అందులో భాగంగానే మొన్న ఉక్రెయిన్ తో అతి పెద్ద ఖ‌నిజ వ‌న‌రుల ఒప్పందం చేసుకోవ‌డం చూశాం.  భార‌త్ అలాక్కాదు. దానికలాంటి స‌మ‌స్య‌లు కానీ, ఆలోచ‌న‌లు కానీ లేవు. మ‌న‌మే ప‌ది మందికి అరువు ఇవ్వాలి త‌ప్ప మ‌నమంటూ ఒక‌రి నుంచి ఏదీ ఆశించ‌కూడ‌దు. యుద్ధాన్ని కోరుకోకూడ‌దు. మ‌న‌కంటూ భారంగా ఆయుధాలు వాటిపై పెట్టుబ‌డులు కూడా పెద్ద‌గా లేవు. అదే అమెరికాకి అలాక్కాదు.. ఆ దేశ డాల‌ర్ విలువ ప‌డిపోకూడ‌దు. ఆ దేశ టాప్ పొజిష‌న్ చేజార కూడ‌దు. దానికి తోడు అవ‌స‌ర‌మున్నా లేకున్నా త‌యారు చేసి పెట్టుకున్న ఆయుధాలు చాలానే ఉన్నాయ్. వాటి మీద పెట్టిన పెట్టుబ‌డులు భారీగా ఉన్నాయ్. వీట‌న్నిటి నుంచి రిక‌వ‌రీ కావాలంటే అమెరికా చేయాల్సిన ప‌ని.. ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డ యుద్ధం జ‌రుగుతుందా? ఆ యుద్ధాల‌కు త‌మ ఆయుధాల‌ను ఎలా స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మా? లేకుంటే నిధులను ఎలా స‌మ‌కూర్చ‌డ‌మా? వాటి నుంచి పొందాల్సిన  లాభం పొంద‌డ‌మా? ఇదే అమెరికా చేసే అతి పెద్ద ప‌ని.  మీరు కావాలంటే చూడండి.. ఉక్రెయిన్ ర‌ష్యాతో గొడ‌వ ప‌డి పూర్తిగా నాశ‌న‌మ‌య్యిందా? ఆ దేశ పున‌ర్నిమాణం పేరు చెప్పి.. ఆ దేశ ఖ‌నిజ నిలువ‌లను అపారంగా త‌వ్వేసి... వాటి  సాయంతో దేశాన్ని తిరిగి నిర్మిస్తామ‌ని లింకు పెట్టింది. ఇదే కాదు గ‌ల్ఫ్ కంట్రీస్ నుంచి అంత‌లేసి ఆయిల్ నిల్వ‌ల‌ను పొందినా వెంట‌నే డ‌బ్బులు ఇవ్వ‌దు. ఇవ్వాల్సిన మొత్తాన్ని త‌న ట్రెజ‌రీలోనే దాచుకుని త‌ద్వారా వారి దేశాన్ని మోడ్ర‌నైజ్ చేస్తుంది. ఇటు ఆ నిల్వ‌ల‌ను త‌న వ‌ద్దే దాచుకుంటుంది. ఇప్పుడు భార‌త్ విష‌యానికి వ‌ద్దాం. భార‌త్ కి ఉగ్ర‌వాదం అనే ప‌క్క‌లో బ‌ల్లెం అమెరికాకు అత్యవ‌ర‌సం. ఒక వేళ ఈ యుద్ధం గానీ, కొన్నాళ్ల పాటు జ‌రిగితే అక్క‌డి ఉగ్ర మూక‌లు స‌మూలంగా హ‌త‌మై పోతాయి. వారు గానీ ఖ‌త‌మై పోతే.. ఇటు పాక్ ప‌ని మాత్ర‌మే కాదు.. అమెరికా ఖేల్ కూడా ఖ‌త‌మైపోతుంది. ఎందుకంటే ప్ర‌పంచంలో ఏ స‌మ‌స్యా లేని దేశంగా భార‌త్ మారితే ఇక దాని ఎదుగుద‌ల‌కు  అంతుండ‌దు. వెంట‌నే అంచ‌లంచెలుగా ఎదుగుతుంది. ఎప్పుడైతే భార‌త్ అలా ఎదుగుతూ పోతుందో.. అప్పుడు..  ఇక భార‌త్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ కి వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికి గ‌ణాంకాల రూపంలో చైనా, అమెరికా ఆర్ధిక శ‌క్తులుగా పోటీ ప‌డుతున్నాయి  కానీ.. వాటికంటూ ఉండాల్సిన ఎథిక‌ల్ నెంబ‌ర్ వ‌న్ పొజిషన్ లేదు. ఎప్పుడూ పరాయి దేశాల  మీద ప‌డి దోచుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధి. ఈ విష‌యంలో చైనా యూఎస్ ఒక‌దానితో మరొకటి పోటీ ప‌డుతూనే ఉంటాయ్. అదే భార‌త్ అలాక్కాదు.. సీమ్లా ఒప్పంద కాలంలో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల‌ను సైతం తిరిగి పాక్ కి అప్ప‌గించిన ఉదార‌త ఈ దేశం సొంతం. అలాంటి భార‌త్ కి నైతికంగా నెంబ‌ర్ వ‌న్ గా ఉండే అర్హ‌త, హ‌క్కుల‌న్నీ ఉన్నాయి.  భార‌త దేశానికున్న ఒకే ఒక్క ఉగ్ర ముప్పు కూడా తొలిగిపోతే.. పాక్ ప్ర‌స్తుతం ఉన్న స్థితిగ‌తుల నుంచి పూర్తిగా విడుద‌లై పోతే.. మొద‌ట ఈ పాపిష్టి దేశం ప‌ని అయిపోతుంది. త‌ర్వాత భార‌త్ వెలిగిపోతుంది. ఇప్ప‌టికే ఉగ్ర‌వాదుల్లో స‌గం ప్ర‌మాద‌కారులు న‌శించారు. ఆ మిగిలిన వారి చ‌రిత్ర కూడా ముగిసిపోతే.. ఇక భార‌త్ కి తిరుగే ఉండ‌దు. త‌ర్వాతి కాలంలో భార‌త్ కి ప‌ట్ట‌ప‌గ్గాలుండ‌వు. ఇది జ‌ర‌గ‌డానికి వీల్లేద‌న్న భావ‌న‌తోనే హుటాహుటిన ట్రంప్.. భార‌త్ , పాక్ ల‌ను కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఆగ‌మేఘాల మీద‌ ఒప్పించాడు.  అమెరికా ఉద్దేశంలో ఒక‌టి  ఏదైనా దేశం నుంచి వీలైనంత‌గా వ‌న‌రుల దోపిడీ. లేదంటే త‌న టాప్ పొజిష‌న్ కి ఢోకా లేకుండా చూసుకోవ‌డం. ఇది ఆ దేశానికి రెండో ప్ర‌పంచ యుద్ధ‌కాలం  నాటి  నుంచీ పుట్టుకొచ్చిన అల‌వాటు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చింది కాదు. మ‌న దేశానికి స్వాతంత్ర‌కాలం నాటి  నుంచి ఉన్న కాశ్మీర్ టూరిజం కోసం పుట్టిన టెర్ర‌రిజం ఎలాగో అమెరికాకు ఈ ఆధిప‌త్య ధోర‌ణి కూడా స‌రిగ్గా అలాంటిదే. భార‌త్ టెర్ర‌రిజం ఫ్రీ కంట్రీ అయిపోతే.. అమెరికా ప‌ని అయిపోతుంది. అందుకే ఆ దేశం భార‌త్ లో టెర్ర‌రిజం ఎప్ప‌టికీ ఉండాల‌ని కోరుకుంటుంది అందుకు అవ‌స‌ర‌మైన నిధులు ఉగ్ర‌వాద మాతృదేశం పాకిస్తాన్ కి అవ‌స‌ర‌మైనంత మేర‌ ఇస్తూ.. కాపాడుకొస్తున్నద‌ని అంటారు విదేశాంగ‌ నిపుణులు.

ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. ప్లాన్- B ఇదేనా..? ఈ రాత్రి పాక్ కు చుక్కలే..

  భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్ది సేపటికే పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది. పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నమ్మించి మోసం చేసిన పాకిస్థాన్ కు మరోసారి దీటుగా సమాధానం చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది.

కల్లును సేవించిన మిస్ వరల్డ్-2025 పోటీదారులు

  హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టూరిజం చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శించారు.  ఈ నెలాఖరు వరకు జరిగే అందల పోటీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని పూర్తి చేసింది. అయితే ఈ పోటీలు ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ అందగత్తెలు.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్లు  తాగారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరాకల్లును.. మిస్ వరల్డ్ పోటీదారులు సేవించారు. మేకప్ వేసుకునే ఈ నీరా కల్లు సేవించి... చాలా ఎంజాయ్ చేశారు. తెలంగాణ కల్లు చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

  శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్థ యాత్రికులతో వెళ్లున్న బస్సు కోట్మలే ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు కెపాసిటీ కంటే 20 మందిని అదనంగా తీసుకెళ్లున్నట్లు పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 25 మంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తొలుత 8 మంది చనిపోగా.. ఆస్పత్రిలో మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. మృతుల్లో ఐదుగురు పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.  

ఆపరేషన్ ఆగదు.. యుద్ధం తప్పదు! .. కాల్పుల విరమణ కాదు.. విరామమే!

అనుకున్నదే  జరిగింది. అసలైన యుద్ధం మొదలయ్యేందుకు ముందే పాకిస్థాన్ చేతులు ఎత్తేస్తుందని, నిపుణులు చేసిన విశ్లేషణలు నిజమయ్యాయి. యుద్ధం వస్తే  పాకిస్థాన్ మూడు నాలుగు రోజులకంటే కంటే నిలబడలేదని చెప్పిన మాటలు నిజమయ్యాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్  ప్రకటించిన మూడు నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్  చేయగల్గినంతా చేసి  శనివారం (మే10)  కాళ్ళ బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో భారత్  తలుపు తట్టింది. ఆ దేశ డీజీఎంవో,మన డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. మన డీజీఎంవో షరతులతో అంగీకారం తెలిపారు.  ఇదే విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్ర మార్గంలో మిలటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు.  అయితే.. అంతలోనే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒప్పందం కుదిరి నాలుగు గంటలు అయినా కాక ముందే  పాక్ మళ్ళీ కుక్క తోక వంకరని అన్నట్లు,ఉల్లంఘనలకు తెర తీసింది. దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్  దాడులకు పాల్పడింది.  షరా మాములుగా మన సేనలు, పాక్  డ్రోన్లను తుక్కును కొట్టి నట్లు కొట్టి పడేశాయి అనుకోండి అది వేరే విషయం.  కానీ, ఇక్కడ కూడా మరో మారు విశ్లేషకుల మాట నిజం అయింది. కాల్పుల విరమణ వార్త వచ్చిన తర్వాత ఏటీవీ చానల్ తెరిచినా  పాక్  కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా.. మళ్ళీ మాములుగా ఉల్లంఘనలకు పాల్పడుతుందా  అన్న అనుమానాలే వినిపించాయి. ఆ దేశ దుర్మార్గ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు, పాక్  ఉల్లంఘనలకు పాల్పడుతుందని అనుమానం లేకుండా స్పష్టంగా చెప్పారు. అయితే.. కొందరు మాత్రం  అనుమనాలు వ్యక్తం చేశారు. అయితే,ఎక్కువ నిరీక్షణ అవసరం లేకుండానే  పాక్  అనుమానాలను నిజం చేసింది. టీవీలలో చర్చ జరుగతున్న సమయంలోనే ఉల్లంఘన  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం సేథీ అవును  పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని, మీడియా సమావేశంలో చెప్పారు.  నిజానికి అందుకు పెద్దగా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. పాక్ ,ఒప్పందానికి కట్టుబడితే ఆశ్చర్య పోవాలే కానీ, ఉల్లంగిస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే  అనేక మార్లు రుజు వైన పాక్  నైజం. అయితే, పాక్  విషయాన్ని పక్కన పెట్టి మన విషయానికి వస్తే..  చాంతాడంత రాగం తీసి ఏదో పాట పాడి నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం  పూర్తి స్థాయి యుద్ధం మొదలవ్వక  ముందే ఓటమి అంచులకు చేరిన పాక్ తో  సంధి కి ఎందుకు అంగీకరించింది? పాకిస్థాన్   కాళ్ళ బేరానికి వచ్చిందంటే  కాల్పుల విరమణ కోసం ఎవరెవరి కాళ్ళో పట్టుకుంది అంటే, అర్థం చేసుకోవచ్చును. కానీ, భారత దేశం, కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఇది ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.  అలాగే  కాల్పుల విరమణ ఒప్పందం  పౌరోహిత్యం తమదే అంటూ జబ్బలు చర్చుకుంటున్న అమెరికా  గోలేంటి? నిన్నటి వరకు భారత్, పాక్ దేశాల మధ్య యుద్దమే వచ్చినా వేలు పెట్టేది లేదని అంటూ వచ్చిన పెద్దన్న ట్రంప్  ఇప్పుడు, ఇలా  నాలుక మడతేసి అంతా  తామే చేశామని చెప్పుకోవడం వెనక ఉన్న మతలబు ఏమిటి? ఇందులో పాక్  కు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించిన,  ఐఎంఎఫ్   పాత్ర ఏమిటి? అంటే.. ప్రస్తుతానికి ఎవరి వద్ద సరైన అమాధానం లేదు.  అయితే..  ట్రంప్ .. క్రెడిట్  తమ ఖాతాలో కలుపుకున్నా, మన దేశం మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మూడో దేశం(అమెరికా) పాత్ర లేదని కుండబద్దలు కొట్టింది.  అలాగే.. కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి? వాటికి కూడా విరమణ షరతు వర్తిస్తుందా?అనే ప్రశ్నకు, అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణ ఒక్కటే షరతులకు లోబడి కుదుర్చుకున్న అంగీకారమని, సింధు జాలల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయం సహా దౌత్యపరమైన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్‌కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేనని ఆ వర్గాలు వివరించాయి.  మిలటరీ యాక్షన్ సీజ్ చేసినప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో స్పష్టం చేశారు. కాల్పులు, మిలటరీ యాక్షన్‌పైనే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్న భారత విధాన నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు. సో.. కాల్పుల విరమణ ఒప్పందం అమలు అయినా కాకున్నా, ఉగ్రవాదాన్ని ఈ భూమి మీద ఎక్కడా లేకుండా చేయడమే లక్ష్యంగా మన దేశం ప్రారంభించిన ఆపరేషన్ సిదూర్  ఆగదు. యుద్ధం తప్పదు. ప్రస్తుత కాల్పుల విరమణ .. విరమణ కాదు, విరామం మాత్రమే.

పీవోకే‌ను భారత్‌కు అప్పగించాల్సిందే..ప్రధాని మోదీ కీలక ప్రకటన

  ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరిపితే భారత్ కూడి ప్రతి దాడి చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్‌తో పీవోకే, ఉగ్రవాదులను అప్పగించడం తప్ప మరే అంశంపై చర్చలు అవసరం లేదని తెలిపారు. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించేది లేదని మోదీ తెలిపారు.ఈ మేరకు మోదీ నివాసంలో జరిగిన భేటీలో త్రివిధ దళాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారత ఆర్మీ చేసిన యుద్దంలో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని అన్నారు. సైనిక బలగాలు చేసిన ప్రతి దాడిలో పాక్ ఓడిపోయిందని తెలిపారు. దాయాది ఎయిర్‌బేస్‌లపై మనం చేసే దాడులతోో  వాళ్లు అసలు యుద్ధంలోనే లేరని విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు.  దాడుల ద్వారా పాక్‌కు గట్టి సందేశం ఇచ్చామని మోదీ తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌  అనంతరం పాకిస్థాన్‌ దుశ్చర్యల కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక అడ్వైజరీ జారీ చేశారు. ప్రజలు అప్పుడే తిరిగి తమ ఇళ్లకు తిరిగి రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. పాకిస్థాన్‌ ప్రయోగించిన ఫిరంగి గుండ్లు (షెల్స్‌)నుంచి ఈ ప్రాంతాలను గుర్తించి శానిటైజ్‌ చేయాల్సి ఉందని తెలిపారు.  పాక్‌ దాడుల తీవ్రతకు అధికంగా నష్టపోయే అవకాశం ఉండటంతో బారాముల్లా, బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ సమీపంలోని గ్రామాలకు చెందిన దాదాపు 1.25లక్షల మందికి పైగా ప్రజలను భద్రతా సిబ్బంది ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఇప్పుడే తమ నివాసాలకు వెళ్లొద్దని కోరుతున్నారు. దాడుల సమయంలో పాక్ ప్రయోగించిన షెల్స్‌ (ఫిరంగి గుండ్లు) చెల్లాచెదురుగా పడి ఉండటం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. 

యూపీలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్‌ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్

  పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని  రక్షణ శాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్  అన్నారు. ఉగ్రవాద నిర్మూలకు ఆపరేషన్ సిందూర్ చేపట్టామని.. పాకిస్థాన్ ఉగ్రవాద నిర్మూలనకు గట్టి సమాధనం ఇచ్చామని ఆయన అన్నారు. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.300 కోట్లతో 80 హెక్టార్ల స్థలంలో బ్రహ్మోస్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నమని ఆయన అన్నారు. ఉగ్ర శక్తులకు భారత్‌ దీటుగా బదులిస్తుందన్నారు. ఈ ఆపరేషన్‌  ఉగ్రవాదంపై పోరులో దృఢ సంకల్పంతోపాటు మన సైనిక శక్తి సామర్థ్యాలను చాటిచెప్పిందన్నారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందన్నారు. పాక్‌ ప్రజలపై భారత్‌ దాడి చేయలేదని, కానీ, దాయాది మాత్రం పౌరులే లక్ష్యంగా మన దేశంపై దాడులు చేసిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా బ్రహ్మోస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. మూడున్నరేళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

వీర జవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి నారా లోకేష్

  ఆపరేషన్ సిందూర్ లో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కళ్లితండాలోని నివాసం వద్ద మురళీ నాయక్ భౌతికకాయాన్ని సందర్శించి అశ్రు నివాళులు అర్పించారు. మురళీనాయక్ పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి సెల్యూట్ చేశారు. అనంతరం అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు.  మురళీ నాయక్ స్నేహితులు, బంధువులను పరామర్శించారు. యుద్ధానికి ముందు వీరజవాన్ మురళీ నాయక్ బంధువు, స్నేహితుడు రాజశేఖర్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను మంత్రి పరిశీలించారు. మురళీనాయక్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా బంధువులు పంచుకున్నారు. వీరజవాన్ మురళీ నాయక్ కు జై, భారత్ మాతాకి జై, వందేమాతరం అంటూ ప్రజలు, స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అగ్నివీర్ మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.   వీరజవాన్ మురళీ నాయక్ పార్థీవదేహాన్ని మోసిన మంత్రి లోకేష్ వీరజవాన్ మురళీ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. మురళీ నాయక్ పార్థీవదేహాన్ని స్వయంగా మోసారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మురళీ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతకుముందు ఉదయం నుంచి వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి లోకేష్ దుగ్గరుండి పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

  ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు నమ్మొద్దని పేర్కొన్నాది. తమకు ఇచ్చిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశామని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ పై అసత్య ప్రచారాలు ఊహాగానాలను నమ్మొద్దని కోరింది. భారత్‌-పాక్‌ మధ్య సీజ్ ఫైర్ కుదిరిన వేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు ప్రధాని  మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్‌లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు  తెలుస్తోంది. రేపు పాకిస్థాన్‌తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ప్రతి ఇంటికి గుండె చప్పుడు అమ్మ...మదర్స్ డే సందర్బంగా తల్లులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

  అమ్మ తొలి గురువు మాత్రమే కాదని, ప్రతి ఇంటికి గుండె చప్పుడు కూడా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మదర్స్ డే సందర్బంగా తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.కుటుంబంలో శక్తివంతమైన పునాదిలాంటిది అమ్మ భవిషత్తుకు మార్గదర్శి తల్లి పాత్ర అసమానమైనది. తన పిల్లలకు విలువలను నేర్పుతుంది. అమ్మ ప్రేమ, త్యాగం అపరిమితమైంది. కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కుటుంబమే అమ్మకు సమాజం, దేశం అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఓ అమృతమయి. సృష్టిలో ఉన్న అన్ని సంబంధాలలోనూ నిష్కల్మషమైనది, ప్రేమకు ప్రతిరూపంగా నిలిచేది తల్లి బిడ్డల బంధమే.    కన్న బిడ్డల కోసం ఎండనక, వాననక కష్టించి పనిచేసే వారి జీవితాలకు పూల బాటలు వేసింది తల్లే. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం వాళ్ళ మీద పరిపూర్ణమైన ప్రేమను చూపించేది తల్లి మాత్రమే. అమ్మ.. పేరులోని ప్రేమని… పిలుపులోని మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే. త్యాగమూ, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ ప్రేమను వర్ణించటం సామాన్యం కాదు. ఆమె త్యాగం అనన్యసామాన్యం. అందుకే ‘అమ్మలేకపోతే జననం లేదు.. గమనం లేదు. సృష్టిలో జీవం లేదు’ కంటిపాపలా కాపాడే ప్రతి బిడ్డకీ జన్మనిచ్చిన అమ్మలకు మదర్స్‌ డే శుభాకాంక్షలు.  

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత బార్డర్‌లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు  తెలుస్తోంది. రేపు పాకిస్థాన్‌తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్‌-పాక్‌లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్‌ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు.. సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ ప్రెస్‌ బ్రీఫింగ్‌ కూడా ఉంది.  

వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

    దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ నివాళి అర్పించారు.  శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు. మురళీ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను డిప్యూటీ సీఎం ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.  అనంతరం కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. కూటమి సర్కార్ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. మురళీనాయక్‌ కుటుంబానికి ఐదెకరాలతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు. వీరజవాను కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని డిప్యూటీ సీఎం కళ్యాణ్ పవన్‌ హామీ ఇచ్చారు.  ఇంకా ఎలాంటి సాయం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మురళీనాయక్‌ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. మరోవైపు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి కల్లితండాకు తీసుకు వస్తున్న సమయంలో జై జవాన్ జై జవాన్ అంటూ రోడ్డు పొడవునా జనం నివాళులు అర్పించారు. ఆదివారం మురళీ నాయక్‌ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించ నున్నారు.  హోంమంత్రి అనిత, మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవిత, ఎంపీ పార్థసారథితోపాటు పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు

పాకిస్థాన్ మేజర్ జనరల్ ష‌రీఫ్ ఎవ‌రో తెలుసా?

భార‌త్.. పాక్, కెనెడాలో  ఉగ్ర‌వాదం ప్రేరేపిస్తోందని అభాండాలు వేశారు పాక్ డీజీ ఐస్ పీఆర్ అహ్మ‌ద్ ష‌రీఫ్. ఈయ‌న మ‌రెవ‌రో కాదు స‌న్నాఫ్ సుల్తాన్ బ‌షీరుద్దీన్. ఈ బషీరుద్దీన్   మ‌రెవ‌రో కాదు.. పాకిస్థాన్ కి రెండో అణుపితామ‌హుడు. ఒసామా బిన్ లాడెన్ కి,  అల్ ఖైదాకి అణ్వాయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేద్దామ‌నుకున్న‌వ్యక్తి. తాలిబ‌న్ చీఫ్ ముల్లా ఓమ‌ర్ ని కూడా క‌లిసిన వాడు.  అత్యంత భ‌యంక‌ర‌మైన ఇస్లామిక్ తీవ్ర‌వాది ఈ సుల్తాన్ బ‌షీరుద్దీన్. ఇత‌డి ఆలోచ‌న ప్ర‌కారం అల్ ఖైదాకు అణ్వాయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి..  త‌ద్వారా నాగ‌రిక ప్ర‌పంచాన్ని నామ‌రూపాల్లేకుండా చేయ‌డం. అప్ప‌టికే 911 దాడుల‌తో విమాన భ‌ద్ర‌తా నియ‌మాల‌నే మార్చేసిన ఘ‌ట‌న‌కు కార‌కుడైన లాడెన్ తో ఇత‌డి భేటీని చూసి భ‌య‌ప‌డ్డ యూఎస్ వెంట‌నే యూఎన్ దృష్టికి ఇత‌డ్ని తీస్కెళ్లింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదుల జాబితాలో చేర్చింది. త‌ర్వాత ఇత‌డి మీద ఐఎస్ఐ చేత ద‌ర్యాప్తు చేయించింది. ఈ ద‌ర్యాప్తులో తాను లాడెన్ని క‌లిసిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పాడు. దీంతో ఒకింత ముందుగానే ఇత‌డు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.  పాక్ యురేనియం వ్య‌వ‌హారాలు ఇంకా ఎన్నో నిషిద్ధ ఆయుధాల త‌యారీకి పాక్ అణు పితామ‌హుడు ఖాదిర్ ఖాన్ త‌ర్వాత ఆ స్థాయి నాయ‌క‌త్వం వ‌హించాడు సుల్తాన్ బ‌షీరుద్దీన్. అయితే త‌న‌కున్న ఇస్లామిక్ తీవ్ర వాదం దృష్ట్యా లాడెన్ వంటి వారికి ద‌గ్గ‌రై.. త‌న ప‌ద‌వి కోల్పోయాడు. ఆపై ఉగ్ర‌వాద అనుకూల సంస్థ యూటీఎన్ ని స్తాపించాడు. త‌ద్వారా.. ఉగ్ర‌వాద వ్యాప్తికి మ‌రింత‌ కృషి చేశాడు. ఇత‌డి సంస్థ కార్యాల‌యంలో శోధ‌నలు చేస్తే అణ్వాయుధ అక్ర‌మ‌ త‌యారీకి సంబంధించి ఎన్నో ప‌త్రాలు ల‌భించాయి.  ఎలాగైనా స‌రే ఉగ్ర‌వాదానికి అణు శ‌క్తిని జోడించాల‌న్న‌ది అహ్మ‌ద్ ష‌రీఫ్ తండ్రి ఎత్తుగ‌డ‌. అలాంటి తండ్రికి పుట్టిన త‌న‌యుడు అహ్మ‌ద్ ష‌రీఫ్ ఈ రోజు పాక్ లో సైనిక ప‌రంగా అత్యంత ఉన్న‌త‌మైన స్థానంలో ఉన్నాడు. పాక్ టాప్ మోస్ట్ మిల‌ట‌రీ అఫిషియ‌ల్స్ లో ఇత‌డు కూడా ఒక‌డు. ఒక ఉగ్ర‌వాది కొడుకు భార‌త్ కి ఉగ్ర‌వాద కోణం అంట‌గ‌డుతుంటే విడ్డూర‌మ‌నిపిస్తుంది. అంతే కాదు ఆ దేశ‌పు సైనిక ఉగ్ర సంబంధం తండ్రీ కొడుకుల బంధ‌మ‌ని కూడా చెప్పాల్సి ఉంటుంది.

పాక్ తో యుద్ధం ముగిసిన‌ట్టేనా?

పాక్ తోక జాడింపులు ఇక్క‌డితో ఆగిన‌ట్టేనా? భార‌త్ ఇంకా సాధించ‌వ‌ల‌సిన ల‌క్ష్యాలేంటి? భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు ఏమంటున్నారు? మే 10 సాయంత్రం 5 గంట‌ల నుంచి భార‌త్ పాక్ మ‌ధ్య యుద్ధ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం అమ‌ల్లోకి వ‌చ్చింది. అయినా నాలుగు గంట‌ల అనంత‌రం అంటే రాత్రి 9 గంట‌ల‌కు పాక్ మ‌న స‌రిహ‌ద్దుల వెంబ‌డి మ‌ళ్లీ డ్రోన్ల మోత మోగించ‌డంతో క‌శ్మీర్ సీఎం ఓమ‌ర్ అబ్ధుల్లా కాల్పుల మోత ఆగ‌లేద‌ని.. విర‌మ‌ణ ఒప్పందం అమ‌లు జ‌ర‌గ‌లేద‌న్న ట్వీట్ తో మ‌రోమారు ఉలిక్కి ప‌డింది ప్ర‌పంచం. మ‌రీ ముఖ్యంగా ఇక యుద్ధం ముగిసిందిలే అని ఊపిరి పీల్చుకున్న ఇరు దేశాల ప్ర‌జ‌లు.. అదిరిప‌డ్డారు. ఇక మీడియా అయితే తిరిగి   యుద్ధ తొడుగులు తొడిగి వార్త‌ల‌ను వండి వార్చ‌డం మొద‌లైంది. అంత‌కు ముందు అమెరికా స‌గ‌ర్వ ప్ర‌క‌ట‌న చేసింది. ఇదంతా త‌న‌ వ‌ల్లేన‌ని ట్రంప్ కాల‌ర్ ఎగ‌రేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏంటంటే, ట్రంప్ ప‌లికే శాంతి వ‌చ‌నాల‌కు ఒక అర్ధం లేదు. కార‌ణం ఈ దేశం ఉక్రెయిన్- ర‌ష్యా తో యుద్ధంలో ఉండ‌గానే.. అతి పెద్ద ఖ‌నిజ వ‌న‌రుల ఒప్పందం  చేసుకుంది. అంటే ప్రాణాపాయ ప‌రిస్థితుల‌ను సైతం క్యాష్ చేసుకోవ‌డం ఈ అగ్ర ఉగ్ర ప్రేరేపిత దేశానికి గ‌న్నుతో పెట్టిన విద్య అన్న‌మాట‌.  ఇక భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల విష‌యంలోనూ ఇదే చేయాల‌ని చూసింది. కానీ మోడీ ఈ విష‌యం ముందే గ్ర‌హించి ట్రంప్ కి చెక్ పెట్టారు. అస‌లు ట్రంప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే.. భార‌త్ ని యుద్ధానికి ఎగ‌దోసి.. ఆయుధాలు కొనిపించాలని. కానీ భార‌త్ ఈ విష‌యం ముందే గ్ర‌హించి.. త‌మ ద‌గ్గ‌రున్న ర‌ష్య‌న్ మేడ్ వార్ వెప‌న్స్  మాత్ర‌మే వాడడానికి ఆస‌క్తి చూపింది. ర‌ష్యా నుంచి 35 వేల కోట్ల రూపాయ‌ల డీల్ ద్వారా దిగుమ‌తి చేసుకున్న ఎస్ 400 తో దాదాపు అనుకున్నంత ప‌ని చేసింది.  2018లో ఈ డీల్ కుదురుతున్న‌ప్పుడే యూఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అప్పుడు కూడా ఇదే ట్రంప్ అధికారంలో ఉన్నాడు. మీ మీద ఆంక్ష‌లు గ్యారంటీ అన్నాడు. క‌ట్ చేస్తే భార‌త్ ర‌ష్యాతో త‌న‌కున్న  పాత అనుబంధాన్ని ఈ మాయా స్నేహం కోసం కోల్పోలేదు. ఇప్పుడు కూడా పాక్ కి మిలియ‌న్ డాల‌ర్ల కొద్దీ డబ్బులిచ్చి.. అక్క‌డి ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు అందేలా చేసి.. వారి ద్వారా దాడులు చేయించి.. ఒకయుద్ధ వాతావ‌ర‌ణం  క‌ల్పించి.. త‌ద్వారా.. భార‌త్ చేత ఆయుధ అత్య‌యిక ప‌రిస్థితి క‌ల్పించాల‌న్న‌ది ఒక ఎత్తుగ‌డ‌. కానీ భార‌త్ అయితే ర‌ష్యా.. లేకుంటే ఇజ్రాయెల్ మీద ఆధార ప‌డుతుంది కానీ, యూఎస్ మీద కాదు. ఈ విష‌యం గ్ర‌హించిన అమెరికా త‌న‌కున్న పెద్ద‌న్న పాత్ర‌ను వెంట‌నే గుర్తు చేసుకుని.. భార‌త్- పాక్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి కృషి చేశారు. ఇలాగైనా ప‌రువు ద‌క్కించుకుందామ‌ని. ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా సీనేంట‌ని చూస్తే మీ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగితే మేము మ‌ద్ధ‌తునిస్తామ‌ని చెప్పి... త‌న దృష్టినంతా బ‌లూచిస్తాన్ మీదే పెట్టింది. బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. గానీ బ‌లూచిస్తాన్ ని ఆక్ర‌మించుకుంటే... పాక్ నుంచి విడిపోతే.. త‌మ ఫోక‌స్ మొత్తం షిఫ్ట్  చేద్దామ‌ని చూసింది. అయితే ఆ ప‌ని పూర్తి కాక పోవ‌డంతో తీవ్ర నిరాశ చెందింది డ్రాగ‌న్ దేశం. కార‌ణం త‌మ‌కు కావ‌ల్సింది పాక్ కాదు. పాక్ ఆధీనంలో ఉన్న బ‌లూచిస్తాన్. అక్క‌డున్న అపార‌మైన ఖ‌నిజ వ‌న‌రుల మీదే ఈ దేశ‌పు ధ్యాసంతా. అందుకే తామక్క‌డ‌ గ్వాద‌ర్ పోర్టు నిర్మించింది. అందుకే అక్క‌డ హైబ్రిడ్ రోడ్లు వేసింది. అందుకే అక్క‌డ ఇత‌ర ఎన్నో మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసింది. ఈ విష‌యం గుర్తించిన బ‌లూచీలు.. చైనీయుల‌ను తిప్పి కొడుతుంటే.. కూడా లెక్క చేయ‌క ఎయిర్ పోర్టుల‌ను నిర్మించింది. బ‌లూచీలు కూడా ప‌ట్టు వ‌ద‌ల్లేదు. త‌మ‌ను అడ్డు పెట్టుకుని పాక్ చైనాతో చేస్తున్న దందాను గుర్తించి. ఆ దేశ‌ ట్రైన్ ని హైజాక్ చేశారు. ఆపై క్వెట్టాలోని పాక్ స్థావ‌రాల‌పై దాడి చేశారు. ఇంకా ఎన్నో ర‌కాలుగా పాక్ ని దెబ్బ తీసే య‌త్నం చేశారు. బ‌లూచిస్తాన్ లో మూడొంతుల్లో రెండు వంతుల భూభాగం త‌మ ప‌రం చేసుకున్నారు. ఆ కార్య‌క్ర‌మం కూడా పూర్త‌యి ఉంటే అప్పుడు తెలిసేది  చైనా పూర్తి నైజం. ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ కి కూడా లోప‌ల ఏమంత స‌జావుగా లేదు. పార్ల‌మెంటులో ఎంపీల నుంచి బ‌య‌ట సాధార‌ణ  ప్ర‌జ‌ల వ‌ర‌కూ అంద‌రూ క‌ల‌సి ఆ దేశ ప్ర‌భుత్వానికి, సైన్యానికీ త‌మ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇమ్రాన్ పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం రోడ్ల‌పైకి వ‌చ్చి.. ఇదొక ద‌మ్ములేని ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. త‌మ అధినేత ఇమ్రాన్ని విడిపించి పాక్ ని ర‌క్షించాల‌ని డిమాండ్ చేశారు.  దానికి తోడు భార‌త్ క‌రాచీ పోర్టు వంటి వాటిని ధ్వంసం చేసి.. దిగుమ‌తుల‌ను సైతం లేకుండా చేయ‌డం.. ఆల్రెడీ దేశంలో ఉన్న క‌రువు కాట‌కాలు. వాటికి తోడు ప్ర‌తిదీ ఎదురు తిర‌గ‌డం. ఉన్న ఆ కొద్ది మంది ఉగ్ర‌వాదులు కూడా చ‌నిపోవ‌డంతో ఏం చేయాలో దిక్కు తోచ‌ని  స్థితిలో ఉంది. ఈ కండీష‌న్లో.. ట్రంప్ ఇలా ఫోన్ చేయ‌డం ఆల‌స్యం అలా.. కాల్పుల విర‌మ‌ణ‌కు ఓకే చెప్పేసింది పాక్. ఆ దేశ మిల‌ట‌రీ డీజీ భార‌త్ మిల‌ట‌రీ డీజీతో డీల్ ఓకే చెప్పేశాడు. అయితే బుద్ధిలేని పాక్ ద‌ళాలు ఎప్ప‌టిలాగానే త‌మ పాత బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌న సరిహ‌ద్దుల వెంబ‌డి తిరిగి కాల్పులు జ‌రిపాయి. ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ ఈ కాల్పుల విర‌మ‌ణ‌కు త‌లొంచ‌డానికి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు. ఇంత యుద్ధం జ‌రుగుతుంటే త‌మను ఆర్ధికంగా  ఆదుకోమంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టిన దారుణ‌మైన ప‌రిస్థితి.  దీంతో ఈ పాపిష్టి దేశం కాల్పుల‌ను విర‌మించుకోవ‌డంలో ఒక అర్ధ‌ముంది కానీ.. భార‌త్ ఇంకా ప‌ట్టు ప‌ట్టి ఉండాల్సిందంటారు నిపుణులు.  ఈ సారికి పీవోకే స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. అక్క‌డి ఉగ్ర మూక‌ల స్తావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో స‌రి పెట్ట‌కుండా ఉండాల్సిందంటారు యుద్ధ నిపుణులు. అంతే కాదు బ‌లూచిస్తాన్ సైతం పాక్ నుంచి వేరు ప‌డి ఉండే వ‌ర‌కూ యుద్ధం  కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ దేశ ఉగ్ర ముఖాలైన హ‌ఫీజ్, మ‌సూద్ ల‌ను అప్ప‌గించే వ‌ర‌కూ కాల్పులను విర‌మించ‌మ‌ని తెగేసి చెప్పి ఉండాల్సింది. ఈ మూడు విష‌యాలైనా.. పాక్ తో మ‌నం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా డిమాండ్ చేసి ఉండాల్సిందంటారు పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు.

హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన మిస్ వరల్డ్-2025 పోటీలు

  హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ దేశల నుంచి సుమారు 120 దేశాల అందగత్తెలు మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. మిస్ ఇండియా నందినీ గుప్తా భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆప్రారంభ వేడుకలు నిర్వహించారు. 250 మంది పేరిణి నత్య ప్రదర్శన చేశారు. ఈ నెల 31 వరకు పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది.  జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్‌పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుస్సాడీ, కొమ్ము కోయ కళాకారులు ప్రదర్శన విదేశీ అతిథులను ఆకట్టుకున్నది. కరేబియన్ లాటిన్ అమెరికాతో పోటీదారులు రాక మొదలయింది.  ముందుగా అర్జెంటీనా కంటెస్టెంట్ ర్యాంప్ వాక్ చేశారు. రెండవ రౌండ్‌లో ఆఫ్రికా ఖండం, మూడవ రౌండ్‌లో యూరప్ ఖండం ప్రతినిధులు వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించారు. చివరి రౌండ్‌లో ఆసియా ప్రతినిధులు ర్యాంపుపైకి వచ్చారు. మొత్తం 22 దేశాలు నుంచి ప్రాతినిథ్యం వహించాయి. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్ క్రిష్టినా పిజ్కోవా హాజరయ్యారు. 

వర్షంలోనూ వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్నికి జన నీరాజనం

  వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకొస్తుండగా ప్రజలు రోడ్డు పొడవునా జననీరాజన పలికారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా తండోపతండాలుగా జై జవాన్ జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతికకాయం వెంట ముందుకు జనం సాగుతున్నారు. ప్రజలు తరలివస్తున్నారు. రేపు వీర జవాను మురళీ నాయక్‌కు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు తరిలించారు.  ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంత్రి సవిత వెళ్లారు అక్కడి నుంచి ఆయన స్వగ్రామానికి పంపించారు. మురళి పార్థివ దేహాన్ని ముందుగా జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఇండిగో విమానంలో బెంగళూరు చేరుకున్న ఆయన పార్థివ దేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. చిక్కబళ్ళాపురం మీదుగా ఆయన స్వగ్రామం గోరంటలకు పార్థివ దేహాన్ని తరలించారు. రేపు అంత్యక్రియల్లో మంత్రి నారా లోకేశ్  పాల్గొన్నారు  

కాల్పుల విరమణ అధికారంగా ప్రకటించిన పాకిస్థాన్

  పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదేశ డిప్యూటీ సీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పాక్ ఎప్పుడు శాంతి భద్రతలు కోసమే పాటుపడుతుందన్నారు. ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య జరగబోయే చర్చల్లో సరిహద్దుల్లో శాశ్వత శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది, ఏ షరతుల మేరకు కుదిరింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని, ప్రాంతీయ శాంతికి దోహదపడుతుందని భావిస్తున్నారు.  

పాక్‌తో యుద్దంపై భారత్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన

  భారత్-పాక్  మధ్య యుద్దంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల  విరమణకు ఒప్పందం జరిగిందని భారత్‌, పాక్‌ ప్రధానులు నరేంద్రమోదీ, షెహబాజ్‌ షరీఫ్‌, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసిమ్‌ మునీర్‌, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ డోభాల్‌, అసిమ్‌ మాలిక్‌లతో మాట్లాడినట్లు చెప్పారు. తాను, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ  ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు.