రాజన్న రాజ్యమా? రావణ రాజ్యమా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు పదేపదే చెప్పిన మాట.. 'రాజన్న రాజ్యం తీసుకొస్తాం'. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వంటి వారు ఎన్నికల ప్రచార సమయంలో 'రాజన్న రాజ్యం వస్తుంది'.. 'రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ చూడబోతున్నారు' అని గొంతెత్తి మరీ చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. అసలు రాజన్న రాజ్యమంటే ఏంటి?.. రాజన్న రాజ్యం వస్తే ఎలా ఉంటుంది? అని ఆశగా ఎదురు చూసిన కొందరు మాత్రం.. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి.. ఇదేనా రాజన్న రాజ్యం అంటూ వణికిపోతున్నారు. అవును.. నిజమే కొందరు వైసీపీ శ్రేణుల ఆవేశం, అత్యుత్సాహం వల్ల సామాన్యులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ స్థానిక పోరే.. స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎవరు, ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తారో, ఆ దాడిలో మనం ఎక్కడ బలి అవుతామోనని.. స్థానికులు భయపడుతున్నారు. దానికి కారణం చాలా ప్రాంతాలలో వైసీపీ శ్రేణులు ఇతర పార్టీల వారి మీద దాడులు చేయడమే. అర్హత ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేయడం రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆ రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన కొందరు చాలా చోట్ల ఇతర పార్టీ వాళ్ళని నామినేషన్స్ వేయనివ్వలేదు. నెల్లూరు జిల్లాలో బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా కత్తితో దాడి చేశారు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థుల మీద దాడులు చేశారు. ఇంకొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు. పోలీసులు, అధికారుల కళ్లెదుటే ఇవన్నీ జరగటం గమనార్హం. ఇక గుంటూరు జిల్లాలో అయితే.. ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై దాడి చేయడం కలకలం రేపింది. నామినేషన్ వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన.. టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ లాయర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బోండా ఉమా, బుద్ధా వెంకన్న తృటిలో తప్పించుకున్నారు. లేదంటే ఘోర ప్రమాదం జరిగుండేదేమో!. రెండు-మూడు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలను.. మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా చూస్తున్న సామాన్యులు.. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం? ఇదేనా మేం కలలు కన్న రాజ్యం? అంటూ గుండెలు బాదుకుంటున్నారు.

జగన్, లక్ష్మీ పార్వతి..ఓ జీతంలేని పోస్టు...

జగన్ ని చూస్తుంటే అచ్చం అన్న ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టే ఉంటుంది నాకు.. అయన తర్వాత అంత చరిష్మా ఉన్న నాయకుడు జగనే.. వీలు చిక్కినప్పుడల్లా ఇలాంటి ఎన్నో పొగడ్తలతో జగన్ ని ముచ్చేత్తుతుంటారు లక్ష్మీ పార్వతి. ‘మళ్లీ ఒకవేళ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపించాలని ఉందని తనతో అనేవారని’, అన్నగారు అన్నారో, లేదో తెలియని ఇలాంటి మాటలను కూడా సమయం దొరికినప్పుడల్లా వల్లే వేస్తుంటారు మేడం గారు. ఇంకా చాలా మాటలు చెప్తుంటారు ఆమె. ఇలాంటి కధకురాలు ఒకరు ఉండాలనే భావనతో జగన్ సర్కార్ అన్న నందమూరి తారకరామారావు రెండో భార్య లక్ష్మీపార్వతికి ఓ నామినేటెడ్ పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ గా ఆమెని నియమించారు.క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు.  ఆమెని ఆ పదవిలో నియమించి నాలుగు నెలలు గడిచినా ఒక్క పైసా జీతం కానీ.. అసలు ఆ పదవి బాధ్యతలు కానీ.. అందుకు సంబంధించి ఒక కార్యాలయం కానీ ఎక్కడా ఏర్పాటైన దాఖలాలు లేవు. లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బద్ద శతృవు.. ఆ శతృత్వమే ఆమెని వైసీపీకి దగ్గర చేసింది. ఎన్టీఆర్ అభిమానులలో సానుభూతి కోసం.. అవసరమైతే చంద్రబాబుకి కౌంటర్ కోసం మాత్రమె వైసీపీ ఆమెని ఉపయోగించుకుంది. లక్ష్మీపార్వతి కూడా చాలాకాలంగా వైసీపీ కోసం చాలా కష్టపడుతున్నట్టు కలరింగ్ ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆమె చంద్రబాబుకి వ్యతిరేకంగా తన వాక్పటిమను చాటుకుని జగన్ దగ్గర మార్కుల కోసం పాకులాడుతూనే ఉంటారు. పొగడ్తలకు అస్సలు లొంగని సీఎం జగన్ ఆమెకి తెలుగు అకాడమీ చైర్మన్ పదవిని ఇచ్చారు..నిజం. అయితే, జగన్ అండ్ కో ఆ పదవి పరిస్థితి ఏంటి? అధికారాలేంటి? ఇప్పుడు ఆ పదవిని ఆమెకి అప్పగించవచ్చా? అన్న ఆలోచన లేకుండా చేశారా? లేక కావాలనే అసలు రాష్టంలోని లేని పదవిలో ఆమెని కూర్చోబెట్టి ఏదో ఆమెని కూడా గౌరవించామని రంగేశారా.. అనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం ఆ పదవి రాష్ట్రంలో లేదు. అయితే, ఇది జగన్ సర్కార్ తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ ప్రస్తుతానికి అయితే లక్ష్మీపార్వతికి ఇచ్చింది ఉత్తుత్తి పదవేనని అర్ధమవుతుంది. అసలు ఒక ప్రభుత్వం తెలియక ఇంత అమాయకంగా ఒక చైర్మన్ పదవిని ఇస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవి లేదన్న విషయం కూడా తనకు జీతం, భత్యం అందకపోవడంతో లక్ష్మీపార్వతే స్వయంగా రంగంలోకి దిగి విచారణ  చేసుకుని తెలుసుకున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు అకాడమీ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంది. విభజన చట్టంలో షెడ్యూల్ 10 కిందకు వచ్చే అంశాలలో తెలుగు అకాడమీ కూడా ఉంది. అంటే ఇంకా ఆ సంస్థను విభజించలేదు. కనుక ఇప్పటికీ ఆ సంస్థకి ఒక్కరే చైర్మన్ ఉంటారు. అది తెలంగాణ ప్రభుత్వం నియమించుకుంది. షెడ్యూల్ 10 అంశాల విభజన తర్వాతనే ఏపీకి ప్రత్యేక సంస్థ వస్తుంది. పదవి అప్పగించి నెలలు గడుస్తున్నా తన ఆఫీసు ఎక్కడో తెలియక, ఎలాంటి అధికారాలు లేక.. జీతభత్యాలు కూడా అందక ఆమె ప్రభుత్వ పెద్దల వద్ద ఆరా తీశారట. ఇది ఉన్నతవిద్యాశాఖ కిందకి వస్తుందని వాళ్లే జీతాలు చెల్లిస్తారని చెప్పడంతో ఆమె ఉన్నతవిద్యాశాఖ వద్దకు వెళ్లారు. అక్కడకి వెళ్తే ఆ సంస్థ ఇంకా ఉమ్మడిగానే ఉందని, రాష్ట్రంలోనే లేని పోస్టుకు జీతాలు ఇవ్వలేమని తెగేసి చెప్పడంతో ఆమె పెద్దలపై రుసరుసలు మొదలుపెట్టారట. దీంతో ఖంగుతిన్న పెద్దలు మేడంగారు మళ్ళీ ఎక్కడ నోటికి పని చెప్తారో అని భయపడి ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖతో ఆ జీతభత్యాలను తామే చెల్లిస్తామని హామీ ఇప్పించారట. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ద్వారా తెలుగు బాష వ్యాప్తి, వృద్ధి ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. అయితే, సీఎం జగన్ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో అసలు అకాడమీతో పనేంటో..కూడాతెలియకుండా అంటే అసలు రాష్ట్రంలోనే లేని అకాడమీకి.. ఉన్నా ఏ మాత్రం ఉపయోగం లేని అకాడమీ చైర్మన్ గా లక్ష్మీపార్వతి  నెలకు 4 లక్షల జీతం తీసుకోబోతున్నారన్నమాట.

ఆయన అన్నం పెడితే....వీరు మాత్రం ఆయనకు వాతలు పెట్టారు !

* పత్తా లేని సుధాకర్ యాదవ్, నారాయణ * కార్పొరేట్ల ను నమ్ముకున్నందుకు, వారు బాబు కు బానే బుద్ధి చెప్పారు అన్నం పెడితే అరిగిపోతుంది.. చీర పెడితే చిరిగిపోతుంది.. వాత పెడితే నిలిచిపోతుంది అని సామెత! ఈ సామెత ను త్రికరణ శుద్ధిగా ఫాలో అయిన కడప జిల్లా టీ డీ పీ నేతలు, తమకు అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడుకు కావాల్సినన్ని వాతలు పెట్టి మరీ బీ జె పి లోకి, వై ఎస్ ఆర్ సి పి లోకి జంప్ అయ్యారు. జమ్మలమడుగులో పార్టీని కాపాడుతూ వచ్చిన రామసుబ్బారెడ్డి ప్రత్యర్ధి, ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకుని, మంత్రి పదవి ఇచ్చారు. అది, ఆయన వర్గం చేతిలో హత్యకు గురైన కార్యకర్తల కుటుంబాలకు, బాబు తప్పుడు సంకేతాలిచ్చిందన్న విమర్శకు కారణమయింది. చివరకు ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత, బీజేపీలో చేరారు. పోనీ, అలాగని రామసుబ్బారెడ్డినీ బాబు కాపాడుకోలేకపోయారు. ఫలితంగా, ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నారు. సీఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, రెండుసార్లు రాజ్యసభ సీటిచ్చారు. భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఆయన చాలాకాలం క్రితమే బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ నేత డీ.ఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడి, బాబుతో చర్చలు కూడా జరిపారు. కానీ, యనమల రామకృష్ణుడు ఒత్తిడితో, ఆయన వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌కు సీటు ఇచ్చారు. అప్పటికే టీటీడీ చైర్మన్ పదవి, కాంట్రాక్టులు తీసుకున్న సుధాకర్‌కు మరో అవకాశం ఇవ్వడం, విమర్శలకు దారితీసింది. అయినా యనమల కోసం సుధాకర్‌కు సీటిచ్చారు. ఇప్పుడు అదే సుధాకర్ యాదవ్ కనిపించడం మానేశారు. కడప జిల్లాలో ఎప్పుడూ టీడీపీ బలం పెరగకపోయినా, వర్గాల కారణంతో.. చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తల సంఖ్య మాత్రం బాగానే ఉంది. నిజానికి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీ.ఎం చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల అనుభవం, నలభై ఏడేళ్ల జగన్ ముందు ఏమాత్రం పనిచేయడం లేదు. చెన్నారెడ్డి, కోట్ల, నేదురుమల్లి, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి నేతలను ఎదుర్కొని నిలబడ్డ బాబు ధైర్యం, జగన్ వంటి యువనేత ముంగిట నిలవలేకపోతోంది. చివరకు సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదుర్కోవలసి వస్తోంది. నాయకులపై ఆయన లెక్కలు దారుణంగా తప్పుతున్నాయి. ఆయన వేసుకున్న తాత్కాలిక అవసరాలు, రాజకీయ అవసరాలనే పునాదులు కుప్పకూలిపోతున్నాయి. నమ్మిన వారే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడిపోతున్నారు. అందలమెక్కించినవారే అలవోకగా కాడి కిందపడేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు, కాంట్రాక్టులు పొందిన వ్యాపారులు, విపక్షంలోకి రాగానే వైసీపీ గూటికి చేరుతున్నారు. మంత్రులుగా వెలగబెట్టిన ప్రముఖులు, వ్యాపారాలు చేసుకుని పార్టీ ముఖం చాటేస్తున్నారు. మరి ఏమయింది బాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం? ఏమయిపోయింది ఆయన రాజకీయ చాణక్యం? ఎక్కడికి పోయింది ఆయన ఇమేజ్? నేతల విషయంలో ఆయన లెక్కలు ఎందుకు తప్పినట్లు?.. ఇదీ ఇప్పుడు తెలుగుతమ్ముళ్లలో జరుగుతున్న చర్చ. కడప జిల్లాలో మొన్న సీ.ఎం.రమేష్, నిన్న సతీష్‌రెడ్డి, రేపు రామసుబ్బారెడ్డి. ఎల్లుండి ఇంకెవరో? వరస పెట్టి వలస వెళుతున్నారు. వీరిలో రామసుబ్బారెడ్డి మినహాయిస్తే, మిగిలిన వారు కాంట్రాక్టర్లు, సగం రాజకీయ నాయకులు. సీ.ఎం రమేష్‌కు జనంలో బలం లేకున్నా, కడప జిల్లాపై పెత్తనంతోపాటు, రెండు సార్లు ఎం.పీ సీటిచ్చారు. ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల వైసీపీ ఎం.పీగా టికెట్ సాధించిన అంబానీ అంతేవాసి పరిమళ్ నత్వానీ వ్యవహారంలో రమేష్ సమన్వయం కూడా ఉందంటున్నారు. సతీష్‌రెడ్డికి వరసగా అసెంబ్లీ టికెట్‌తోపాటు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చి, కౌన్సిల్ పదవి కూడా ఇచ్చారు. ఆయన కూడా తాను టీడీపీలో ఉండలేకపోతున్నానని, తనకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇదిలా ఉంటె, పార్టీకి అనాదిగా సేవలందించిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, వైసీపీలో చేరిపోయారు . పార్టీ కోసం కుటుంబసభ్యులను, వందలసంఖ్యలో అనుచరులను పోగొట్టుకున్న రామసుబ్బారెడ్డి కూడా, టీడీపీని వీడటమే ఆ పార్టీ నేతలను కలచివేస్తోంది. వైఎస్ హయాంలో కూడా ఆయనను ఎదుర్కొని నిలబడ్డ రామసుబ్బారెడ్డిలో ఆత్మస్థైర్యం సడలి, జగన్ వైపు అడుగులు వేయడానికి తమ నాయకత్వం తీరే కారణమన్నది తమ్ముళ్ల విమర్శ. ఇక ఇప్పుడు కడపలో మిగిలింది కొద్దిమంది నేతలే. ప్రకాశంలో ప్రతిసారీ, బాలకృష్ణ సిఫార్సుతో టికెట్ తెచ్చుకునే బాబూరావు కూడా వైసీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు, అనేక జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు వైసీపీ కండువా వేసుకుంటున్న వైనం, పార్టీవాదులను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, ఇతర పార్టీల వారిని తాత్కాలిక అవసరాలకు చేర్చుకున్న ఫలితమే.. ఈ పరిణామాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్, ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లిస్తే, ఐదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీ మాత్రం, వరసగా అగ్రకులాలకే సీట్లిచ్చిందని, వారంతా అధికారం పోయిన తర్వాత పార్టీని వీడారని గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు కాకుండా, సీఎం రమేష్‌కు రాజ్యసభ సీటు ఇచ్చిన ప్పటికీ, ఆయన బీజేపీలోకి వెళ్లారు. సీట్లు ఇచ్చిన నలుగురు ఎం.పీలూ బీజేపీలో చేరారని విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు తప్పిదాలేనని, వారి విషయంలో ఆయన లెక్కలు తప్పాయని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. మాగుంట, ఆదాల వంటి వ్యాపారులను చేర్చుకోవడం వల్ల పార్టీ ఏం సాధించిందని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి, సీనియర్లను అవమానించారని.. ఇప్పుడు నారాయణ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా, బిజినెజ్ హౌస్ ల అధినేతలను కాకుండా, జనం లోనుంచి వచ్చిన నాయకులను చట్ట సభలకు పంపితే, పార్టీ పరువు నిలుస్తుందని చంద్రబాబు నాయుడు కు పార్టీ కార్యకర్తలు సూచన చేస్తున్నారు.

ఫోన్లో విన్నది నాదగ్గు కాదు..నాకు కరోనా రాలేదు..

    ఎక్కడ చూసినా కరోనా..కరోనా..ఆర్ధిక వ్యవస్తకూడా దీని బారిన పడిందని వార్తలు. స్టాక్ మార్కెట్ కూడా దీని బారిన పడి లక్షలకోట్లు నష్టాలు చవిచూసింది. ఇప్పుడు ఆ మహమ్మారి ఫోన్ల వినియోగదారులపై పడింది. కరోనా వైరస్ సోకుతుందో లేదో తెలియదు కానీ కానీ ఫోన్ ముట్టుకోవాలంటేనే భయపడి చచ్చే కాలం వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్ చేస్తే అన్ని సార్లు కరోనా నివారణ మెసేజ్ రావడం వినియోగదారులకు విసుగు, విరక్తి కలిగిస్తోంది. ఎవరికి ఫోన్‌ చేసినా మూడు సార్లు దగ్గు.. ఆ తర్వాత ఇంగ్లీష్ లో కోవిడ్‌–19 వైరస్‌ గురించి ఉపన్యాసం..ఇదీ ప్రస్తుత పరిస్తితి. ఆ తర్వాతే కాలర్ రింగ్ టోన్ వస్తోంది. దీంతో ఫోన్ ముట్టుకోవాలంటే కరోనా వైరస్ మనకే వచ్చినంత భయం పుడుతోంది. అర్జెంట్ ఫోన్ కాల్స్ చేయాలంటే 30 సెకన్ల కరోనా మెజేసి ఆ తర్వాత మరో 30 సెకన్ల పాటు రింగ్ కావడంతో ఫోన్ చేసిన తర్వాత ఒక నిమిషం సేపు వేచి ఉండాల్సి వస్తున్నది. మనం కాల్ చేయగానే డయల్ పాడ్ ఓపెన్ చేసి ఒకటి నొక్కితే కరోనా ట్యూన్ ఆగిపోవాలి. కానీ చాలాసార్లు అలా జరగడంలేదని వినియోగదారులు వాపోతున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా కాలర్‌ ట్యూన్‌ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ఇంగ్లీష్ లో ప్రజలను గజిబిజి చేసే విధంగా సమాచారం ఇవ్వడం కాలయాపన తప్ప ప్రయోజనం ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా కాలర్‌ ట్యూన్‌లో చెప్పే టోల్ ఫ్రీ నంబర్ 01123978046 పనిచేయడం లేదన్న విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ కాలర్‌ట్యూన్‌ వలన రెండు రకాల ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ట్యూన్‌తో పాటు కాల్‌ కనెక్ట్‌ కావడం లేదని, ఈ ట్యూన్‌ పూర్తయ్యాకే మనం ఫోన్‌ చేసిన వ్యక్తికి లైన్‌ కలుస్తుండటంతో చాలా టైమ్‌ వేస్ట్‌ అవుతోందని, పదేపదే అదే ట్యూన్‌ వినడం విసుగుపుట్టిస్తోందని ఎక్కువ మంది మొబైల్‌ వినియోగదారులు అంటున్నారు.

తెలుగుదేశానికి ఏమైంది..

గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పైకాపా చేతిలో చిత్తుగా ఓడినప్పటికీ తెలుగుదేశం పార్టీ మొత్తం మీద 39శాతం ఓట్లు సాధించి తనను తక్కువగా చూడవద్దని సంకేతాలు పంపింది. కానీ గత 10 నెలలుగా అధికారపార్టీపై టీడీపీ అనుసరిస్తున్న ప్రతి వ్యూహం, అధికారపక్షంపై చేస్తున్న సమరం చివర్లో బెడిసి కొడుతుండటంతో పార్టీ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న కింది స్థాయి కేడర్లో కూడా బలపడిపోతున్నట్టు కనపడుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. ఈ బలహీన పరిణామాలు స్థానిక ఎన్నికల సమయానికి మరింతగా ముదిరి అధినేతను కలవరపెడుతున్నాయి. స్థానిక ఎన్నికల నగారా మోగగానే తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కీలకమైన నేతలు నైరాశ్యంలో మునిగిపోవడం ఒక ఎత్తైతే పాతికేళ్లకు పైగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు రాజీనామా బాట పట్టడం టీడీపీ అధినేతను కలవరపరుస్తోన్న అంశం. దీనికి మించి స్థానిక బరిలో నిలిచేందుకు అభ్యర్థులు దొరక్క దిక్కులు చూడాల్సి రావడం టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ చూసి ఉండలేదని అనుభవజ్ఞులే చెబుతున్నారు. ముఖ్యంగా జేసీ, గంటా, నారాయణ వంటి అతి ముఖ్యనేతలు ఇప్పటికే చేతులెత్తేసారు. అధికార పార్టీ తమను లక్ష్యంగా చేసుకోవడం, పార్టీ భవిష్యత్తు తమ భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందన్న నమ్మకం సడలిపోవడంతో వీరు పూర్తిగా ఇంటికే పరిమితమైన స్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే ఈ నేతలది స్మశాన వైరాగ్యమే. వైసీపీతో సహా ఏ ఇతర పార్టీల్లోకి ఇలాంటి వారు వెళ్లలేరు. సొంత పార్టీలో కొనసాగాలనుకున్నా దాని భవిష్యత్తు అంధకారంలా కనిపిస్తుంటే బహిరంగ జీవితంలోకి రాలేరు. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు స్మశాన వైరాగ్యానికి మారుపేరుగా నిలుస్తున్నారు. మందూ, డబ్బులు పంచితే గెలిచినా పదవి పోవడమే కాకుండా రెండేళ్లు జైలుకు పోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో స్థానిక సంస్థల్లో ఒక్క సీటులో కూడా మా జిల్లాలో పోటీకి నిలపం అనేంతగా హడలిపోయారాయన. అధికారంలో ఉన్నప్పుడు ఎదురులేకుండా చక్రం తిప్పిన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ బ్రదర్స్‌ అధికారం కోల్పోయాక ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించలేక చేతులెత్తేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటినుంచో చర్చనీయాంశమైంది. స్థానిక ఎన్నికల్లో తాము పోటీ చేయలేమని ప్రకటించి తన నిస్సహాయత్వాన్ని చాటుకున్న జేసీ దివాకర్‌రెడ్డి.. మొత్తంగా స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబును కోరడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. జేసీ దివాకర్‌రెడ్డి చేతులెత్తేయడంతో ఆయన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డితో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కాడి పడేయకుండా ఎలాగోలా పోటీకి శ్రేణులను సిద్ధం చేయాలని బాబు.. పవన్‌ను కోరినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్థానిక బరిలో నిలిచేందుకు చాలా చోట్ల అభ్యర్థులు దొరక్కుండా చీయాలని అధికార పక్షం వేస్తున్న ఎత్తుగడలు, చేస్తున్న దాడులతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్ని మరింత కుంగదీస్తున్నాయి. సీనియర్‌ నేతలు కాడి వదిలేస్తుండటంతో చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, మండలాల నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా, నేరుగా మాట్లాడుతున్నారు. ఎలాగైనా పోటీ చేయాలని, అభ్యర్థులు దొరక్కపోతే చురుగ్గా ఉన్న యువకులను గుర్తించి నామినేషన్లు వేయించాలని సూచిస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత చెప్పారు. అవసరమైన చోట్ల జనసేన, సీపీఐ పార్టీలకు చెందిన వారితో మాట్లాడుకుని వారిని పోటీకి నిలబెట్టి మద్దతు ఇవ్వాలని, పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దని కోరుతున్నట్లు సమాచారం. విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నారా లేరా అన్నట్టున్నారు. కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై నామమాత్రంగా పని చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పి.నారాయణ ప్రస్తుతం అసలు బయటకు రావడం లేదు. ఈ ఎన్నికలను ఆయన పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు. టీడీపీ హయాంలో హవా నడిపిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, మాగంటి బాబు, శిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావు వంటి పలువురు నేతలు స్థానిక ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవడంలేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అనేక నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు కూడా చేతులెత్తేయడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం, కింది స్థాయి క్యాడర్‌ తీవ్ర నిరుత్సాహానికి లోనవ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఎన్నికలను పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల స్థానిక నాయకులు నేరుగా టీడీపీ రాష్ట్ర నాయకులు, కార్యాలయాలకు ఫోన్లు చేసి తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ముఖ్య నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తుండడం టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన సతీష్‌రెడ్డి రాజీనామా చేయడం, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి అధికార పార్టీలో చేరిపోవడం, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోవడం ఆ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పులివెందులలో పార్టీ కోసం పని చేసిన నాయకుడు ఒక్కసారిగా పార్టీని వీడడంతో ఆ పార్టీ క్యాడర్‌ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయింది. ఇది చాలదన్నట్టు నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ వైసీపీలో చేరడంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. మరికొందరు ముఖ్య నాయకులు సైతం టీడీపీని వీడతారనే అనుమానాలు చంద్రబాబును, పార్టీ నేతలను కూడా కలవరపెడుతున్నాయి.

అందుకే ట్విట్టర్ లో పోస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారూ....

పేరెన్నిక గన్న ఆడిటర్ గారు తప్పులో కలిశారా.... వై ఎస్ ఆర్ సి పి లో నెంబర్ 2, జగన్ మోహన్ రెడ్డి అంతరాత్మ అయిన విజయసాయి రెడ్డి ఎందుకిలా దొరికిపోయారు? జె సి దివాకర్ రెడ్డి కి ఝలక్ ఇచ్చే క్రమంలో ఆయనే షాక్ తినాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది? ప్రస్తుతం సాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఇదే విషయంలో... 1996 లోనే చంద్రబాబు నాయుడు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు 500 నోట్ల రూపాయలను పంచారంటూ ఆయన చేసిన పంచ్ ట్వీట్ కు గట్టి జవాబే వచ్చింది. వాస్తవానికి ఇది కిందటి సంవత్సరం ఏప్రిల్ 24 ట్వీట్ అయినప్పటికి, ఇప్పుడది సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇదే విషయమై విజయసాయి రెడ్డి ని ప్రశ్నిస్తూ... ఒక ట్విట్టర్ ఖాతాదారుడు .." 1997 లో 500 నోట్లు ముద్రిస్తే, 1996 లో ఎలా పంచుతారు సాయిరెడ్డి గారూ.. కనీస అవగాహన లేకుండా ఎందుకిలా ఆడిటర్ గారూ.." అంటూ వేసిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియా లో షికారు చేస్తోంది. అంటే సాయి రెడ్డి గారు, జగన్ కన్నా ముందే రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారన్న మాట అనే మాటలూ వినపడుతున్నాయి. నిజానికి ట్విట్టర్ వాడకం లో విజయసాయి రెడ్డి చాలా ముందుంటారు.. కానీ, ఆయన ట్విట్టర్ హ్యాండ్లర్ ఎవరో తెలీక చేసిన వ్యవహారానికి ఇవాళ, నెటిజెన్ల నుంచి ప్రశ్న పరంపర ఎదుర్కోవాల్సి వస్తోంది.   ఈ విషయాలు ఇలా ఉంటె, తెనుగు దేశం అధినేతపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మళ్ళీ విరుచుకు పడ్డారు. " ఎలక్షన్లలో మందు, డబ్బు పంపిణీ చెయ్యనీయకుండా ఆపటానికి మీరెవరని టీడీపీ ప్రశ్నిస్తోంది. వీటిని అడ్డుకునే ఆర్డినెన్సు చెల్లదట. కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి సాధిస్తామని సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నారు. అడ్రసు గల్లంతయ్యే ముందు ఇలాంటి పిచ్చి ఐడియాలే వస్తాయి" అంటూ ఆయన చేసిన తాజా ట్వీట్ నిజానికి టీ డీ పీ ని డిఫెన్స్ లో పడేసింది. అయితే, ఒక ఔత్సాహిక తెలుగుదేశం కార్యకర్త మాత్రం సాయిరెడ్డి కి భలే పసందైన రిప్లై ఇచ్చాడు.. " గ్రామ వాలంటీర్స్ బాగానే స్టాక్ పెట్టారు.. ఓటుకి వెయ్యి రెండూ గోల్డెన్ ఆంధ్రప్రదేశ్ సీసాలు, ఆడోళ్లకి చీరలు బానే పంచుతున్నారు వైసీపీ వాళ్ళు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఏవో గుడిసెలు అని.. వైసీపీ చేసేది కూడా అదే.. అసలు మీరు గెలిచిందే మద్యం, డబ్బు పంచిబెట్టే కదా," అంటూ ఆ తెలుగుదేశం అభిమాని ఇచ్చిన బదులుతో ఇప్పుడు వై ఎస్ ఆర్ సి పి కౌంటర్ వేయడానికి దారి వెతుక్కుంటోంది. అయినా విజయ్ సాయి రెడ్డి గారూ..మీరు లెక్కల్లో చాలా జాగ్రత్త గాఉంటారు కాదాసర్... ఎందుకలా, గభాల్న 1997 అనేశారు.. !!

వివేకా హంతకుల వెనుక బళ్లారి బడా బాబుల ప్రమేయం ఉందా?

* ఉందనే అంటున్న సీనియర్ పోలీస్ అధికారి  * అందుకేనా, వివేకా కుమార్తె ఈ కేసును సి బి ఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు ?          ఆయన తండ్రి హెలికాఫ్టర్ ప్రమాదం లో దుర్మరణం పాలయ్యారు. ఈమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు సంఘటనలు ఆ రెండు కుటుంబాలను తీవ్రంగాకలిచి వేశాయి. కాకపొతే, పినతండ్రి హత్యకు గురికావటం తో ఇప్పుడు, ఆ అన్నా చెలెళ్ల మధ్య స్పర్ధలు మొదలయ్యాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారం గా ఇప్పటి వరకూ అందరూ భావిస్తూ ఉండి  ఉండవచ్చు కాక. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. నిన్న హైకోర్టు ఈ వ్యవహారాన్ని సి బి ఐ కి అప్పగించిన తర్వాత, ఇందులో అంతర్  రాష్ట్ర నేరగాళ్ల ప్రమేయం అనివార్యంగా బయటపడుతుంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం బట్టి, ఆ నేరగాళ్లు పక్క రాష్ట్రం కర్ణాటక లోని బళ్లారి, దాని చుట్టు పక్కల ప్రాంతాల వారని తెలుస్తోంది. ఇదే విషాయాన్ని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లోని ఒక సీనియర్ మోస్ట్ అధికారి తన ప్రయివేట్ సంభాషణల్లో ధృవీకరిస్తున్నారు. కానీ, ' సిట్ ' కాళ్ళూ, చేతులూ కొట్టిపడేయటం వల్ల ...రాష్ట్ర పోలీసు నోరు మెదపటం లేదు. సి బి ఐ చేతికి వెళ్ళింది కాబట్టి ఆ బళ్లారి బడా బాబు ల వ్యవహారమేమిటో బయటకు వస్తుందని ఆ అధికారే స్వయంగా చెపుతున్నారు.  ఆయన గుండె పోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు? ఆయన హత్యకు గురైన విషయాన్ని ఎందుకు ఉద్దేశపూర్వకంగా కొంతసేపు మరుగునపెట్టారు? ఏడాది దాటినా 'సిట్ ' ఎందుకు ప్రోగ్రెస్ చూపలేకపోయింది? ఈ అంశాలన్నింటి మీద ఇప్పుడు సి బి ఐ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. వివేకానంద రెడ్డి హత్య  కేసును, ఎట్టకేలకు సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడం సంచలనం సృష్టించింది. గత 11 నెలలుగా దానిపై సిట్ చేస్తున్న విచారణలో పస లేదని హైకోర్టు నమ్మినందుకే, కేసును సీబీఐకి ఇచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న, నాటి విపక్ష నేత -నేటి సీఎం జగన్.. ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నప్పటికీ.. కోర్టు మాత్రం, నాటి జగన్ వాదనను నెరవేర్చినట్లే భావించాల్సి ఉంది. జగన్ సీఎం అయిన తర్వాత,  పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటానని చెప్పిన తర్వాతనే, విపక్షాలు ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం, అందులో రంధ్రాన్వేషణ చేయడం ప్రస్తావనార్హం. అయితే, ఇప్పుడు ఇదే విషయమై -వివేకా కుమార్తెకు, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులకు మధ్య కొన్ని వాద ప్రతివాదాలు జరిగినట్టు తెలుస్తోంది.  వివేకా హత్య కేసును పులివెందుల పోలీసుస్టేషన్ నుంచే ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశం వల్ల, స్థానిక పోలీసులు చిక్కుల్లో పడక తప్పదు. కాకపోతే.. ఈ హత్య కేసులో అసలు సాక్ష్యాలే కనిపించడం లేదు. సంఘటనాస్థలంలో ఉన్న సాక్ష్యాలను అప్పుడే సమాధి చేశారు. ఒక కీలక వ్యక్తి మృతి చెందాడు. కేసును విచారిస్తున్న సిట్ అధికారులు బదిలీ అయ్యారు. కాబట్టి, సీబీఐ ఈ కేసులో ఏమి సాధిస్తుంది? ఏమి తేలుస్తుందన్న సందేహం రావడం సహజం. తొలుత వైసీపీ అధికార మీడియాలో సహజ మరణం, తర్వాత అనుమానాస్పద మృతిగా భావించిన ఈ హత్య కేసులో.. పోలీసులు నిర్భయంగా ముందుకు వచ్చి, సీబీఐ ముందు పెదవి విప్పుతారనుకోలేం. ఎందుకంటే పులివెందుల ప్రత్యేకత అది.   వివేకా భార్య, కూతురు, ఇద్దరు రాజకీయ పార్టీ నేతలు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై, హైకోర్టు ఇచ్చిన తీర్పు సహజంగా అధికార పార్టీకి సంకటమే. తన కుమారుడే సీఎంగా ఉన్నప్పటికీ, ఆయన సర్కారు సాగిస్తున్న విచారణపై నమ్మకం లేని పిన్ని, చెల్లి.. కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన వైనం, విపక్షాలకు బోలెడు బలమిచ్చినట్టయింది. దానితో కుటుంబసభ్యులనే నమ్మించలేని జగన్, రాష్ట్ర ప్రజలను ఎలా నమ్మిస్తారని వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించడానికీ కారణమయింది. విపక్ష నేతగా ఉన్న జగన్, తన చిన్నాన్న హత్యపై ఎన్నికల ముందు హడావిడి చేసి, చివరకు సీఎం అయిన తర్వాత తాను కోరినట్లుగానే,  కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదన్న విపక్షాల ప్రశ్నకు, అధికార పార్టీ నుంచి జవాబు లేకపోయింది. దీనితో ఎన్నికల ముందు, తన చిన్నాన్న హత్యను జగన్ రాజకీయ లబ్థికి వాడుకున్నారన్న విమర్శలకు తెరలేచినట్టయింది.   ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో, అధికారులు ఏ కోణంలో విచారణ ప్రారంభిస్తారన్న ఉత్కంఠ మొదలయింది. ఈ కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉన్నట్లు, హైకోర్టు అనుమానించడమే దానికి కారణం. తొలుత గుండెపోటు, సహజ మరణంగా ప్రచారం చేసినప్పటికీ.. ఆ తర్వాత ఫొరెన్సిక్ రిపోర్టులో ఆయన ఒంటిపై ఏడుచోట్ల కత్తితో పొడిచిన గాయాలు, తలలో రెండు వైపులా పొడిచిన దెబ్బలు, ఛాతీ, చేతిపైనా కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.  పైగా చనిపోయిన వ్యక్తి శరీరానికి కుట్లు ఎందుకు వేశారని, వివేకా కూతురు ప్రశ్నించారు. ఆయన దారుణ హత్యకు గురైతే, తొలుత గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారని కూడా, ఆమె అనుమానం వ్యక్తం చేయడం బట్టి.. ఈ కేసులో కుటుంబభ్యులు, పీ.ఏ కృష్ణారెడ్డి, అనుచరుల ప్రమేయాన్ని సీబీఐ తేల్చాల్సి ఉంది. అదేవిధంగా, ఇప్పటివరకూ పోలీసులు విచారించని వ్యక్తులు, కుటుంబసభ్యులను కూడా విచారించవలసి ఉంది.ప్రధానంగా, మృతి వార్త తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిన వారిని విచారిస్తే తప్ప, కేసు అడుగుముందుకు పడదంటున్నారు. మరి,  ఇందులో ఉన్న రాజకీయ, ఆర్ధిక, కుటుంబ కోణాలను సీబీఐ ఏవిధంగా విచారిస్తుందో చూడాలి.

కడప జిల్లాలో టీడీపీ ఖాళీ

ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ రామసుబ్బారెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డి వెళ్లిపోవడంతో కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది. రామసుబ్బా రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోకవర్గంలో పలు మార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీని వీడాలని కొంతకాలంగా భావిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పుపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్తుపై జగన్ భరోసా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి రామసుబ్బారెడ్డి ఎంట్రీతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయం మరో కీలక మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతల్ని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీలో జాయిన్ చేసుకుంది. ఇప్పుడు రామసుబ్బారెడ్డి కూడా అధికార పార్టీలోకి వెళ్లారు. రామసుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లగా టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ఊహాగానాలు కూడా వినిపించాయి. ఎప్పటి నుంచో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లారు. , కడపలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి లాంటి కీలక నేత వైసీపీ కండువా కప్పుకోవడం చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది.

తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్

తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగా బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏడెనిమిది మంది పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు దక్కింది. ముందు నుంచీ బీజేపీకి నిబద్ధత కలిగిన నేతగా కొనసాగుతుండటం, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నేత కావడం వంటి కారణాల వల్ల బండి సంజయ్‌ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో బండి సంజయ్‌ను నూతన అధ్యక్షుడిగా నియమితులైయ్యారు. ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఆయన ఎంపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజకవర్గానికి చెందిన నేత ఆయన. అన్ని కోణాల్లోనూ బండి సంజయ్ బలమైన నాయకుడని భావించిన పార్టీ ఆయనను అధ్యక్షుడిని చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే, కొత్తగా చేరిన నేతలకు ఇప్పుడు అధ్యక్ష పదవి అప్పగించడం సరికాదని అధిష్ఠానం భావించింది. ముందునుంచీ పార్టీలో కొనసాగిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాల అప్పగించింది. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో యువతలో సంజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా చాలారోజులుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు బాగా తెలుసు. బండి సంజయ్ సామాజకవర్గం తెలంగాణలో ప్రధానమైనది. ఇది కూడా ఆయనకు కలిసివచ్చింది.

కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటి: పిన్నెల్లి 

పల్నాడు లో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోందని మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ  నుంచి 10 కార్లలో బోండా, బుద్ధా వెంకన్న మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించాడని ఎమ్మెల్యే పిన్నెల్లి పెర్కొన్నారు. " మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఒక పిల్లాడికి తగిలింది: దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. వారిని సముదాయించాల్సింది పోయి టీడీపీ నాయకులు బోండా సహా ఇతర నాయకులు దుర్భాషలాడారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకం," అంటూ పిన్నెల్లి విమర్శించారు.  అందులో భాగంగానే 10 కార్లతో వచ్చి కావాలనే గొడవకు దిగారు. ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది... ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మాచర్ల ఎం ఎల్ ఏ ఆరోపించారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందక్భంగా అంబటి, ముస్తాఫాలపై దాడులు చేసి హతమార్చటానికి కుట్ర పన్నారని పిన్నెల్లి గుర్తు చేసారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు, అయినా సరే... మేం సంయమనంతో వ్యవహరించామని ఎం ఎల్ ఏ చెప్పుకొచ్చారు. అయినా, అసలు విజయవాడ కాల్ మనీ బ్యాచ్ కి మాచర్ల లో పనేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈయన కూడా కోపం నరం తెంచేసుకున్నారా?

ఈయన కూడా తన తండ్రి మాదిరే కోపం నరం తెంచేసుకున్నారా? తన కుటుంబం మీద ఉన్న ఫ్యాక్షన్ ముద్ర చెరిగిపోవటానికి రాజీ ఫార్ములాను ఔపోసన పట్టేశారా ? గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి రూటే మొత్తంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. తన మీద, తన వ్యవహార శైలీ మీద తెలుగు దేశం అనుకూల మీడియా, అలాగే జాతీయ మీడియా లోని కొన్ని ప్రభావశీల మీడియా సంస్థలు తాను అధికారం చేపట్టకమునుపు నుంచీ చేస్తున్న దాడులకు సమాధానం ఇవ్వటం కోసమే అన్నట్టుగా, జగన్ మోహన్ రెడ్డి చాలా వేగం గా పావులు కదుపుతూ ముందుగా తన సొంత జిల్లా నుంచే రాజకీయ వలసలను, అది కూడా ప్రత్యర్థి శిబిరాల నుంచి రాజకీయ వలసలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అసలు..తనను  చూసేందుకు  కూడా ఇష్టపడని వారిని సైతం ఆయన అక్కున చేర్చుకుంటున్న విధానం అందరినీ ఆశర్య పరుస్తోంది. అలాంటి వారికి ఇప్పుడు సొంత పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించటం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. నాడు వైయస్సార్ హయాంలోనే సతీష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో ముద్దాయి అయినా...తాము ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు అదే సతీష్ రెడ్డి వై ఎస్ ఆర్ సి పి లో  చేరటానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్మల మడుగులోనూ రాజకీయ వర్గ పోరు రెండు వైపులా నష్టం కలిగించిన విషయాన్నీ గుర్తు చేసుకున్న జగన్ మోహన్  రెడ్డి,  ఫ్యాక్షన్ రాజకీయలకు ముగింపు పలికేందుకు వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు కదులుతున్నారు. నాడు వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయననూ ఫ్యాక్షన్ నేతగా విమర్శించేవారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత తన కోపం అనే నరాన్ని తెంచేశానని వైయస్ చెప్పుకొచ్చేవారు. ఇక, వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ఇద్దరు కీలక నేతల మధ్య తనంతటగా తాను రాజీ కుదిర్చి అక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేశారు. కర్నూలు జిల్లాలో కాట‌సాని, బిజ్జం కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ త‌గ‌దాలు ఉన్నాయి. అయితే అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండు కుటుంబాల మ‌ధ్య రాజీ కుదిర్చారు. దీంతో అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న బిజ్జం వ్యాపారాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు. జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో పార్టీ లో  సైతం చేరారు. పాణ్యం సీటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు  కేటాయించారు. ఇహ, అలాగే, మొదటి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రామసుబ్బారెడ్డి కుటుంబం ఇప్పుడు జగన్ సమక్షంలో వై ఎస్ ఆర్ సి పి లో చేరుతోంది.  ఇలా, ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు, తన  కుటుంబంతో దశాబ్దాల తరబడి వైరం కొనసాగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను వై ఎస్ ఆర్ సి పి గొడుగు కిందకు తీసుకు రావటం ద్వారా, విపక్ష తెలుగు దేశాన్ని అయోమయం లో పడేయాలనేది జగన్ మోహన్ రెడ్డి వ్యూహం గా కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడ‌ట‌!

ఇటీవలే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడని అభివర్ణించారు. బీజేపీకి ఉన్న క్యాడర్ పవన్ కల్యాణ్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక, బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంతకాలం వైసీపీకి త‌మ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. కర్నూలులో హైకోర్టును బీజేపీ స్వాగతిస్తుందని టీజీ తెలిపారు. బీజేపీ డిమాండ్ ను జగన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలని అన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒంట‌రిగా పోటీ చేయ‌కుండా ప‌వ‌న్‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో దిగింది. అయితే ఏడాది క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు అయినా వ‌స్తాయా? అని బిజెపి నేత‌లు మ‌ద‌న‌ప‌డుతున్నారు. సినీ గ్లామర్ తో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన పవన్ కళ్యాణ్ కు గత ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలి. లేకుంటే కనీసం కింగ్ మేకర్‌గా ఉండాలనుకున్న పవర్ స్టార్‌కు ఆంధ్ర ఓటరు షాక్ ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలుపుకోవాలని భావించిన ఆయన బీజేపీతో జట్టుకట్టారు. రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో జట్టు క‌ట్టారు. ఇక స్థానిక సమరంలో తన పవర్ చాటాలనుకుంటున్నారు ప‌వ‌ర్ స్టార్‌. స్థానిక పోరులో తమ జట్టు గెలుపు సాధిస్తుందనే విశ్వాసంతో ఆయ‌న ముందుకు పోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిల నియామకం కూడా జ‌న‌సేన పార్టీ పూర్తి చేసింది. పవన్ ఎంతగా తాపత్రయపడినా స్థానిక సమరంలో విజయం అంత సులభం కాకపోవచ్చనేది రాజకీయ వర్గాల మాట. అందుకు కారణాలు కూడా చెపుతున్నారు. వెల్ఫేర్ స్కీంలతో మంచి దూకుడు మీదున్న వైసీపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జ‌న‌సేన పార్టీకి కొంత పట్టున్నా, ఇటీవల పరిపాలనా వికేంద్రీకరణతో ఆ ప్రాంతంలో కూడా వైసీపీ బలం పుంజుకుంది. ప్రధాన ప్రతిపకం టీడీపీ కూడా ఎన్నికలను ఎదుర్కోవడంపై తర్జనభర్జనలు పడుతుండగా జనసేన సత్తా చాటాలనుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు విశ్లేష‌కులు. స్థానిక ఎన్నికలు అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా ఆపి రాజకీయ వ్యవహారాలలో తలమునకలవుతున్నారు జ‌న‌నేత‌. స్థానిక ఎన్నిక‌ల్లో ప్రశ్నించటానికి వస్తున్న జ‌న‌నేత‌ను, అదే.... మసాలా ఫ్లేవర్ ను ప్రజలు ఆదరిస్తారా? ప‌వ‌న్ తన ఉనికిని నిలబెట్టుకుంటాడా? ఈ విష‌యాన్ని టీజీ వెంకటేశ్ యే చెప్పాలి.

చిన్నాన్న చిన్నాన్నే.. టార్గెట్ టార్గెట్టే...

లోకల్ వార్ లో ప్రూవ్ చేసుకోవటం తప్పదని తేల్చి చెప్పిన జగన్! ముగ్గురు పెద్ద రెడ్లకూ ప్రాంతాల వారీగా బాధ్యతలు.... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హోమ్ వర్క్ తో అటు పార్టీ నాయకులూ, ఇటు మంత్రులు నానా కుస్తీలు పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యతను నేరుగా మంత్రులకు అప్పగించటమే కాకుండా, ముగ్గురు పెద్ద రెడ్లు- విజయసాయి రెడ్డి, వై వి సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి లకు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, రాయలసీమ బాధ్యతలను అప్పగించారు. అంటే, సన్నిహితులైనప్పటికీ, రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉంటేనే పదవులు గానీ, రాజకీయ మనుగడ గానీ ఉంటాయనే సంకేతాలను ఆయన చాలా బలంగా ఈ ముగ్గురు పెద్ద రెడ్లకూ కమ్యూనికేట్ చేశారు. చిన్నాన్న చిన్నాన్నే, వ్యవహారం వ్యవహారమే అని తేల్చి చెప్పేశారు.  వీళ్ళ సంగతే ఇలా ఉంటె, ఇహ మంత్రుల విషయం చెప్పనక్కర్లేదు మరి అంటున్నారు పార్టీ క్యాడరు, నాయకులూ కూడా. పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. మంత్రులకైతే ఏకంగా పదవులకే ఎసరు పెట్టారు. ప్రతిఒక్కరు గెలుపు కోసం పని చెయ్యాలని సూచించారు . అంతే కాకుండా పార్టీలోని కీలక నేతలకు ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారు జగన్. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి, ఉభయగోదావరి జిల్లాల బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి, రాయలసీమ బాధ్యతలు సజ్జల రామకృష్టారెడ్డికి అప్పగించారు. కేవలం గెలుపు మాత్రమే కాదు.. బంఫర్ మెజారిటీ సాధించాలని , అది కూడా సార్వత్రిక ఎన్నికల కంటే గొప్పగా ఉండాలని భావిస్తున్న వైసీపీ ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకూడదని కసరత్తులు చేస్తోంది వై ఎస్ ఆర్ సి  . ఇంతకీ వైసీపీ బలం ఏంటి ? క్లీన్ స్వీప్ చేసేలా ప్రజలు వై ఎస్ ఆర్ సి పి ని ఆదరిస్తారని ఎలా అనుకుంటుంది ? అనే ప్రశ్నలు ప్రస్తుతం అమరావతి కారిడార్లలో షికార్లు చేస్తున్నాయి.  'లోకల్ వార్' కు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్న వై ఎస్ ఆర్ సి పి,  ఈ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష పార్టీల నోటికి తాళాలు వెయ్యటం . ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించటం అనే రెండు టార్గెట్లను మంత్రుల, కీలక నాయకుల ముందుఉంచింది.  క్షేత్ర స్థాయిలో మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఈ ఎన్నికల్లో బంఫర్ మెజారిటీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ అందుకు కావల్సిన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.   ఇక ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు చెక్ పెట్టేలా నిఘా యాప్ ను కూడా ప్రారంభించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.  మంత్రుల నుంచి సామాన్య కార్యకర్త వరకూ ఎన్నికల క్షేత్రంలో వ్యూహాత్మకంగా అధినేత ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నారు.ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలకు చెక్ పెట్టేలా ముందే ప్రతిపక్ష పార్టీల నేతలకు గాలం వేస్తూ వలసలను ప్రోత్సహిస్తోంది కూడా. . ముఖ్యంగా టీడీపీ ముఖ్య నాయకులను , మాజీ మంత్రులను పార్టీ లో  చేర్చుకుని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తుంది . పులివెందుల సతీష్ రెడ్డి చేరికతో కడప జిల్లాలో ఏకపక్ష విజయాలను ఆవిష్కృతం చేయాలనేది వై ఎస్ ఆర్ సి పి ఆలోచన.

వైఎస్ వివేకా హత్యకేసుపై హైకోర్టు సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించింది. సిట్‌ నివేదికను 2 సీల్డ్‌ కవర్లలో న్యాయస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలను కోర్టు కొట్టి వేసింది. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు వేసిన పిటిషన్లపై హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ కేసులో బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి వేసిన పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఏడాది దాటినా కేసును సిట్ చేధించలేదన్న న్యాయస్థానం. కేసులో అంతరాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందన్న న్యాయమూర్తి. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్ధ్యాలు సిబిఐ కి ఉందని న్యాయస్థానం అభిప్రాయ పడింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.. 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కడప జిల్లా పులివెందులలోని ఆయన సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయి అని వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం రాజకీయంగా పెను సంచలనానికి దారితీసింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా హత్య వెనుక పలు రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సిట్ విచారణ వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ ప్రభుత్వం కూడా వైఎస్ వివేకా హత్య కేసును సిట్‌తోనే విచారించాలని నిర్ణయించింది. అయితే, వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు మాత్రం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు ఈ కేసులో ప్రమేయం ఉందని వైసీపీ ఆరోపించిన టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి కూడా ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సీబీఐ విచారణ అవసరం లేదని, సిట్ విచారణ చివరి దశకు వచ్చిందని జగన్ ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. కానీ, కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది కావ‌స్తున్నా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు బాగా పెరిగాయి. అయినా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై జ‌గ‌న్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. అయితే హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవ‌డం ఎపిలో చ‌ర్చ‌నీయంశంగా మారింది.

కళ్యాణం తో పాటు ఎంపి పి పదవి కూడా ఆ అమ్మాయికి బోనస్!

కళ్యాణం వచ్చినా కక్కు వచ్చిన ఆగదు అని సామెత. అచ్చు గుద్దినట్టు ఈ సంఘటన దానికి సరిపోతుంది. కాకపోతే.. కాస్త అటూ ఇటూగా.. ఇక్కడ కళ్యాణం తో పాటు ఆ పెళ్లికూతురు ఎం పి పి పదవికి నామినేషన్ వేసే మహత్తర అవకాశం కూడా దక్కించుకుంది. కలిసొచ్చే కాలమొస్తే, అటు పెళ్లి తో పటు, ఇటు పదవి కూడా దక్కించుకోవచ్చునని ఆ యువతి ఉదంతమే నిరూపిస్తోంది.  వివాహ నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే ఓ యువతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ వేయాల్సి వస్తున్న సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చోటు చేసుకుంది. నిన్న రాత్రి శిరీష అనే యువతికి నిశ్చితార్థం అయింది. ఈ రోజు ఆమె నామినేషన్‌ వేయనుంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమై ఎన్నికల బరిలో నిలుస్తోంది.  ఇలా హడావిడిగా జరగడానికి కారణముంది. కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది. వైసీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌ కు పార్టీ అప్పగించింది. దీంతో తన కుటుంబం నుంచే అభ్యర్థిని నిలపాలని ఆయన భావించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దీంతో ఆయన తన పెద్ద కుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుని, వెంకట నర్సయ్య అనే వ్యక్తి కుమార్తె శిరీషతో నిన్న రాత్రి హడావుడిగా నిశ్చితార్థం చేసుకున్నాడు. నేటితో ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ గడువు ముగుస్తుంది. దీంతో తనకు కాబోయే కోడలితో చంద్రశేఖర బుధవారం నామినేషన్‌ వేయించనున్నారు.

ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు: బోండా ఉమా, బుద్ధ వెంకన్న 

రాష్ట్రం లో వై ఎస్ ఆర్ సి పి  ప్రభుత్వం మద్దతుతో ఆ పార్టీ కార్యకర్తలు విద్వంసానికి పాల్పడుతున్నారని, మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న ఆరోపించారు. మాచర్ల ఘటనపై పీఎస్‍లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్టు చెప్పిన మాజీ ఎం ఎల్ ఏ బోండా ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ -" మా వాహనాలపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు . మా వాహనాలతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు . కర్రలతో నన్ను, మా అడ్వొకేట్‍ను కొట్టారు . మాకు గాయాలయ్యాయి, రక్తం కూడా కారుతోంది . డీఎస్పీపై కూడా దాడి చేశారు . పోలీసు రక్షణ ఉన్నా మాపై దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతామనుకోలేదు," అని ఉమా మహేశ్వర రావు మీడియా తో చెప్పారు. ఇదిలా ఉండగా, ఎం ఎల్ సి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ-" పల్నాడులో మా పర్యటన వివరాలను వైసీపీకి పోలీసులు అందించారు. అడుగడుగునా మాపై దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు," అని వివరించారు.  విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి. మాచర్లలో నామినేషన్లు వేయడంలో వస్తున్న ఇబ్బందులను మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వెళ్లిన బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు.కారు అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడంతో ఉద్రీక్తత నెలకొంది. నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.

వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా?  మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా?   వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం: చంద్రబాబు నాయుడు  టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు. తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్‌, బిహార్‌లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. 'వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లయినాలేదు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బోండా ఉమా, బుద్ధా వెంకన్నపై వైసీపీ శ్రేణుల దాడి!!

వైసీపీ శ్రేణులు ఏకంగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ నుండి మాచర్ల వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కారులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. బోండా ఉమ, బుద్దా వెంకన్న కార్లను అడ్డగించిన వైసీపీ శ్రేణులు వాటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  మాచర్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవడంతో.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో మాచర్లకు బోండా ఉమ, బుద్దా వెంకన్న వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ కార్యకర్తలు తమ వెంటపడ్డారని, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఎవరూ లేరని బోండా ఉమ వెల్లడించారు.  నిజానికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ముందుగానే, తెలుగుదేశం పార్టీ నాయకులు చెపుతూ వస్తున్నారు. ఈ విషయమై డి జి పి కి కూడా ఫిర్యాదు చేశారు కూడా. అయినప్పటికీ, వై ఎస్ ఆర్ సి పి శ్రేణుల దాడుల పరంపరలో అటు తెలుగు దేశం తో పాటు, జన సేన, బీ జీ పి కార్యకర్తలు, నాయకులు గాయపడుతున్నారు.

కార్పొరేట్లకు దోచిపెట్టి ప్రజలకు వాతలు పెడుతున్న కేంద్రం

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రతరం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో పెట్రో ధరలు భారీగా పతనమయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గించింది. అయితే ఏప్రిల్ 1 నుంచి మాత్రం జీఎస్ 6 నిబంధనల వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా.. డీజిల్ రూ.65.34కి విక్రయించారు. సోమవారం (మార్చి 9, 2020) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2014-15లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 84.16 డాలర్లుగా ఉంది. ఇది 2019 డిసెంబర్‌ నాటికి 63.98 డాలర్లుగా, ప్రస్తుతం అంటే 2020, మార్చి నాటికి 37 డాలర్లకు చేరింది. మొత్తంమీద 2014తో పోల్చిచూస్తే దాదాపు 50 డాలర్లు తగ్గింది. ముడి చమురు 5 డాలర్లు తగ్గితేనే భారత్‌కు 12-13 బిలియన్‌ డాలర్ల(84 వేల కోట్లు) మేర విదేశీమాదక ద్రవ్యం ఆదా అవుతుంది. అంటే 2014తో పోల్చుకుంటే 2019 నాటికి బ్యారెల్‌కు దాదాపు 20 డాలర్ల మేర తగ్గింది. ఆ లెక్కన ఆయిల్‌ను దిగుమతి చేసుకునేందుకు అయ్యే విదేశీ మారక ద్రవ్యం 3 లక్షల 50 వేల రూపాయలు మిగిలింది. దీనికి అదనంగా ఆయిల్‌పై 2014-15లో రూ.1.26 లక్షల కోట్లుగా ఉన్న పన్ను వసూలు, 2018-19 నాటికి అదనంగా దాదాపు రూ.1.53 లక్షల కోట్ల మేర పెరిగి రూ.2.79 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా రాష్ట్రాలు కూడా పన్నులను బాధేశాయి. రూ.1.6 లక్షల కోట్లుగా ఉన్న పన్ను ఆదాయం రూ.2.27 కోట్లకు చేరింది. అంటే అటు ఆయిల్‌ దిగుమతుల సమయంలో మిగిలిన విదేశీ మారక ద్రవ్యం, అటు పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం కలిపి దాదాపు రూ.5.7 లక్షల కోట్ల సొమ్ము మిలిలింది. ఈ సొమ్మునంత టినీ మోడీ సర్కార్‌ వివిధ రూపాల్లో కార్పొరేట్లకు దోచిపెట్టి సాధారణ ప్రజలకు మాత్రం వాతలు పెడుతోంది.