చికిత్స‌ అందక బాలుడి మృతి

ఉపాధి కోసం వలసొచ్చిన  పేద‌ కుటుంబాన్నికి లాక్‌డౌన్ శాపంగా మారింది. స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయించుకోలేక క‌న్న కొడుకును కాటికి మోసుకెళ్లాల్సిన దుస్థితి ఆ పేద తండ్రికి క‌ల్గింది.  కదిరికి చెందిన మనోహర్‌ ఐదేళ్లుగా అనంత‌పూరం జిల్లా గోరంట్లలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుడారంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. మనోహర్ తుక్కు కొనుగోలు షాపులో హమాలీగా పనిచేస్తున్నాడు. అనారోగ్యం బారిన పడిన కుమారుడికి సరైన వైద్యం చేయించలేని నిస్సహాయ పరిస్థితి ఎదురైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాడు.  కొద్దిరోజులుగా మనోహర్ పెద్ద కొడుకు దేవాకు దగ్గు, జ్వరంతోపాటు గొంతు కింద గడ్డలు వచ్చాయి. ముందు స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స అందించారు. తర్వాత నయం కాకపోవడంతో గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత హిందూపురం తీసుకెళ్లగా బాలుడి నోరు, ముక్కునుంచి రక్తం వస్తుండటంతో అనంతపురం పెద్దాసుపత్రి, కర్నూలు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. లాక్‌డౌన్‌తో పిల్లవాడిని అక్కడికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. అందుకే హిందూపురంలోనే వైద్యం చేయించాడు.. అక్కడ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన పసివాడి అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేవు. గత్యంతరం లేక కుమారుడి శవాన్ని చేతులపై ఎత్తుకుని సమీపంలోని చిత్రావతి ఒడ్డున ఖననం చేశాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.

కరోనానూ రాజకీయాలకు వాడుకోవడం నీచం: అంబటి రాంబాబు

* వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కామెంట్స్..   గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను, ఆర్కే, శ్రీ దేవి వెళ్ళాము అని అసత్య ప్రచారం చేస్తున్నారు.అసలు విందే జరగలేదు... జరగని విందుకు మేము ఎలా వెళతామనీ అంబటి రాంబాబు ప్రశ్నించారు.మా పై రాజకీయ ప్రత్యర్థులు  దుష్ప్రచారం  చేస్తున్నారు.మేము అంతా క్వారంటైన్ కి వెళ్ళాలి అని ట్రోల్ చేస్తున్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇలాంటి క్లిష్ట సమయంలో మా పై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు అంబటి రాంబాబు. రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు ఉంటే.. తరువాత మాట్లాడదాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు.నిజంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సామాజిక బాధ్యతగా మేమంతా వెళతా మన్నా రు ఆయన.

లాక్‌డౌన్ వేళ‌ స్ఫూర్తిగా నిలిచిన క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యే!

మారుమూల గ్రామా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులందించ‌డానికి జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు ప‌డుతున్న ఆరాటానికి ఈ ఫొటో సాక్ష్యం. రోడు మార్గం లేక‌పోయిన‌ప్ప‌ట్టికీ నదిని సైతం లెక్క‌చేయ‌కుండా భుజాన సంచి వేసుకొని రోడ్డు బాట ప‌ట్టిన వీరు దేశంలోని ఇత‌ర  అధికారుల‌కు,   నేత‌ల‌కు స్ఫూర్తిగా నిలిచారు. రైస్ బ్యాగ్ భుజాన వేసుకున్న వ్యక్తి కలెక్టర్, పిబి.నోవా ఐఎఎస్‌.  పతనమిట్ట జిల్లా క‌లెక్ట‌ర్. కేరళ  రాష్ట్రం. ఈ ఐఎఎస్ అధికారితో పాటు బ్యాగ్ పట్టుకున్న మరొక వ్యక్తి పతనమిట్ట ఎమ్మెల్యే, జనీష్ కుమార్, ఇద్దరూ ఇతర అధికారులతో పాటు ఒక మారుమూల గ్రామానికి బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకువెళుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రిస్తూ ఆద‌ర్శంగా నిలిచారు. వీరిని చూస్తుంటే మ‌న ద‌గ్గ‌ర శాస‌న‌స‌భ్యులు, ఐఎఎస్ అధికారులు ఎలా వుంటారో ఒక సారి త‌ల‌చుకుందాం! ఒక్కసారి MLA అయితే, ఆయన లేక ఆమె, దేవుడి కంటే ఎక్కువ, ఇంకా మాట్లాడితే ట్రంప్ కంటే ఎక్కువ అని ఫీల్ అయిపోతారు. భూమి మీద నడవడం మానేస్తారు.  మిగతగా రాష్ట్రాల కలెక్టర్ల గురించి నేను చెప్పలేను గానీ, మన రాష్ట్రంలో, శంకరన్ లాంటి వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు...ఈ కన్ఫర్డ్ ఐఏయెస్ వచ్చి, కలెక్టర్లు అయ్యే వారు ఇంకా ఘోరం. అప్పటి దాకా ఆర్డీవో గా ఉండి నమస్కారాలు పెట్టి, ఒక్క సారి ఐఏయెస్, వచ్చి కలెక్టర్ కాగానే ఇక ఆ హంగు, దర్జా, ఆ హంగామా చూడాల్సిందే... ఇక రాజకీయాల ఎమ్మెల్యే లు. అసలు వీళ్ళు డెమీ గాడ్స్. చంద్ర బాబులు, జగన్, కేసీఆర్లు గౌరవంగా మాట్లాడుతారు, కొంచమైనా భూమి మీద వుంటారు. ఈ ఎమ్మెల్యేలు మాత్రం, ఈ ఐదేళ్లలో ఏ పని చేసినా నెక్స్ట్ ఎన్నికలకు నాకు పనికి వస్తుందా? పనికొస్తేనే చేస్తా..లేకపోతే చెయ్య...అంతే...ఏ పార్టీ అయినా సరే... ఎమ్మెల్యే సారు బయటకు వస్తే, నాలుగు కార్లు, గన్ మెన్లు, ఎస్కార్ట్ పోలీస్ వ్యాను, లోకల్ ఎస్సై, కానిస్టేబుళ్లు, బౌన్సర్లు, అనుచరులు, అర్జీదారులు, అధికారులు, వందిమాంగదులు,... అబ్బో, ఎందుకులే, చూసి తీరాలి... మరీ చిన్న టవున్స్ లో మరీ ఎక్కువ...ఎమ్మెల్యే గారి ఆర్ధిక పరిస్థితి, రాజకీయాల్లో సీనియారిటీని బట్టి కొంచం హెచ్చు తగ్గులు....అంతే...సారు బజార్లోకి వస్తే ఒక పది కార్ల కాన్వాయ్ వుండాలంతే... ఇక ఎమ్మెల్యే ఓ యాభై ఏళ్ళ వారైతే, ఒకప్పట్లో, కొడుకు, ఇప్పుడు కొడుకు, కూతురైనా సరే, ఒక యువజన విభాగం వుంటుంది. చిన్న చిన్న పంచాయితీలు, వసూళ్లు, ధర్నాలు అన్నీ, నాన్నకి శ్రమ తగ్గించేందుకు వీళ్ళు చేస్తుంటారు....మరి బాబు...లేక అమ్మాయి గారు, ఎమ్మేల్యే గారి వారసత్వం తీసుకోవద్దేటి? ఏటి సెప్తావు నువ్వు? ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ..ఇక అంతే...ఆ ఊరికి ఆయనే రాజు, పాలేగారు, చక్రవర్తి. పైన చెప్పిన వారందరితో పాటు, ఎమ్మార్వో, ఎండీవో, వ్యవసాయ ఆఫీసరు, పశువుల డాక్టరు, మొదలుకొని, ఆయన వున్న మండల అధికారులు మొత్తం హాజరు...ఇక చిన్న టవున్ అయితే మునిసిపల్ సిబ్బంది... మరి వీళ్ళందరి ఖర్చు? తన అనుచరుల ఖర్చు, సారే భరిస్తారు. మధ్యాహ్నము భోజనం, వెహికళ్ళు, డీజల్, డ్రైవర్ ఖర్చులు, ...ఎమ్మెల్యే సారు గ్రామాలకు వెళ్లి, అలనాటి కృష్ణదేవరాయలు లాగా చేసే దానాలు, పెళ్ళిలకు చదివింపులు, అన్నీ ఈయనే భరిస్తారు... ఓ మాదిరి టవున్స్ లో ఎమ్మెల్ల్యేలకు రోజుకు మినిమం ఖర్చు పాతిక వేల అవుతుందట...ఆంధ్రాలో...  మరీ ఈ డబ్బంతా వచ్చేదెలా సారుకు.....  ఇంజనీరింగ్ ఏఈ లు, డీఈ లు, ఎప్పుడూ సారుకు ఫోన్ లో అందుబాటులో వుండాలి....ఎప్పుడు ఫోన్ చేసినా టకీమని ఆన్సర్ చెయ్యాలి...లేకపోతే బూతులు తిట్టే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని నేనే... చూసాను. ఇక పోలీస్ స్టేషన్ లో కేసులు అన్నీ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే జరుగుతాయి. పంచాయితీలు అన్నీ సారే చేస్తారు...తన దగ్గర ఓ పడేళ్ళు నమ్మకంగా ఉంటే వారికి మార్కెట్ యార్డ్ చెర్మన్లు, డైరెక్టర్లు, ప్యాక్స్ చెర్మన్లు లాంటి పదవులు ఇప్పిస్తారు....సరే ఇక వాటి వసూళ్లు, అవి మామూలే... ఏ ప్రాజెక్టు వచ్చినా సార్ కు తెలియకుండా రాదు...సార్ కు వాటా ఇవ్వకుండా పోలేదు. జరిగే ప్రతి పనిలో, సార్ కు వాటా ఇవ్వాల్సిందే... అదేమీ లేదు అని వాదిస్తారు కానీ, జరిగే సత్యం అంతే.. బాగా సంపాదించటం, దానిలో కొంత రోజు వారీ మెయింటెనెన్స్ కు, ఆనుచరుల కోసం కొంత, ఎన్నికలప్పుడు ఖర్చు, డబ్బు పంపకం కోసం...వీటనన్నింటికి పోగా సారుకు ఒక టర్మ్ కు , అంటే ఐదేళ్లకు ఒక పది పదిహేను కోటలైనా మిగిలితే , మరుసటి సారి ఎమ్మెల్యే గా కొనసాగచ్చు... అంటే, ఒక ఎమ్మెల్యే, ఇష్టం వున్నా లేకపోయినా, దర్బార్ మెయింటెయిన్ చెయ్యాలి, సంపాదించాలి...తప్పదు....పులి స్వారీ...అంతే. ఇష్టమయ్యే చేస్తారు కాబట్టి, పులి స్వారీ లాగా ఫీల్ కారు.. నాకున్న పది పన్నెండేళ్ల రాజకీయ అనుభవంలో, దేశ రాజకీయ స్థితి మారాలంటే, ఈ ఎమ్మెల్యే వ్యవస్థ మారాలి.... వీళ్ళు చెప్పినట్టే రాష్ట్ర పార్టీ అధినేత కూడా వినాల్సిన స్థాయికి వచ్చేసారు....కాదంటే, పార్టీ మారిపోతారు మరి. అప్పటికే అధికారంతో వెళ్ళొనుకు పోయివుంటారు కాబట్టి, వాళ్ళు చెప్పిందే వేదం...ఓట్లు కూడా వాళ్ళవే.... వారి మాట వినాల్సిందే ...తప్పదు. ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అలా చేయకపోతే, వేస్ట్.. ఈ ఎమ్మెల్యే అనేస్తారు.... ప్రత్యర్థి ఎప్పుడూ ఉంటాడు కదా...అతని దగ్గర చేరిపోతారు...అందుకని, ఇష్టం వున్నా లేకపోయినా, అందరూ ఈ చట్రంలో భాగం అయిపోతారు... అధికారం మొత్తం ఒకరి చేతిలో కేంద్రీకృతం అయ్యే ఈ ఎమ్మెల్యేల వ్యవస్థ ఇలాగే కొనసాగితే, మనం గొప్పగా చెప్పుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థ అసెంబ్లీ బోర్డులో మాత్రమే మిగులుతుంది.... మా పార్టీ ఎమ్మెల్యేలు సూపర్ అంటూ రాకండి....అందరూ ఒకే తాను లో ముక్కలే...!

పోలీసు కాలర్‌ పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై మరో కానిస్టేబుల్ గొడవకు దిగడం.. కాలర్ పట్టుకున్న ఘటన జిల్లాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 'ఏరా.. నా కొడుకునే కొడతావా...' అంటూ దుర్భాషలాడటంతో పాటు కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం చేసిన విచిత్ర ఘటన నెల్లూరు నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ.. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎస్ఐ, సీఐలకి ఛార్జి మెమోలు ఎస్పీ జారీ చేశారు. అసలేం జరిగింది..? నగరంలోని ఇరుకళలమ్మ ఆలయం దాటిన తరువాత పోలీసులు రోడ్డుపై ఉండగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో వచ్చాడు. పోలీసులు ఆ యువకుడిపై లాఠీ ఝుళిపించి బైక్‌ తాళాలు లాక్కున్నారు. వెంటనే ఆ యువకుడు తండ్రికి ఫోన్‌ చేసి విషయం తెలిపాడు. తండ్రిని చూసిన ఆ యువకుడు తాను పెట్రోల్‌ కొట్టించుకునేందుకు వచ్చానని, తనకు ఆపరేషన్‌ చేసి రాడ్లు వేశారని ఇలా కొడుతారా అంటూ వాదనకు దిగాడు. ఆ క్రమంలో పోలీసులు ఏరా ఎవరితో వాదిస్తున్నావంటూ దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తండ్రి అక్కడకువచ్చి కర్ర పట్టుకొన్న కానిస్టేబుల్‌తో గొడవకు దిగాడు. పక్కనే ఉన్న పోలీసులు, స్థానికులు, కుమారుడు అందరూ కలిసి వారిద్దరిని విడదీశారు. వీడియో వైరల్ అవ్వడంతో..! ఆ వ్యక్తి.. 'ఎస్పీ దగ్గరకు వెళుదాం రారా... 144 సెక్షన్‌ ఉంటే కొడతారా.. నా బిడ్డకు రాడ్లు వేసి ఉన్నాయ్. ఏదైనా జరిగి ఉంటే...' అంటూ హడావడిగా ద్విచక్ర వాహనంపై కుమారుడిని ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనను మొత్తాన్ని పోలీసులతో పాటు అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం హల్‌చల్‌ చేసింది. ఈ వ్యవహారం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో 24 గంటలలోపే ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యమాలకు లొంగలేదు.. ప్రకృతికి లొంగక తప్పలేదు... అమరావతిపై నోరెత్తని వైసీపీ ప్రభుత్వం

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్నా ఉల్లంఘనులు ఎక్కువైపోతున్నారు. తమకేం కాదులే అనే వాదనతో వారు చెలరేగిపోతున్నారు. ప్రజలు ఒకేసారి గుమికూడటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తొలుత ఉదయం 6 గంటల నుంచి 9 గంటలుగా ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. కానీ ప్రజలు గుమికూడటం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచలో పడాల్సిన పరిస్దితి.  పలు జిల్లాల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రజల తీరును చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. దీంతో షాపింగ్ సమయాలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సోమవారం నుంచి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను మళ్లీ కుదించారు. తాజా మార్పుల ప్రకారం పట్టణ, నగర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపింగ్ కు అనుమతించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 6 గంటల నుంచి 1 గంట వరకూ షాపింగ్ చేసుకోవచ్చు, ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ప్రభుత్వం తాజా సమయాలను విడుదల చేసింది.  కరోనా వైరస్ ప్రభావం ఏపీలో నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో ప్రజల తీరుతో తిరిగి పరిస్దితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రైతు బజార్లు, ఇతర దుకాణాల వద్ద గళ్లు గీసి ఉంచినా ప్రజలు మాత్రం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల వినతి మేరకు ప్రభుత్వం షాపింగ్ సమయాలను తగ్గించేయాలని నిర్ణయించింది. అప్పటికైనా పరిస్ధితిలో మార్పు రాకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనపై సర్కారు సీరియస్- ఉదయం షాపింగ్ సమయాల తగ్గింపు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతున్నా ఉల్లంఘనులు ఎక్కువైపోతున్నారు. తమకేం కాదులే అనే వాదనతో వారు చెలరేగిపోతున్నారు. ప్రజలు ఒకేసారి గుమికూడటం వల్ల కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో తొలుత ఉదయం 6 గంటల నుంచి 9 గంటలుగా ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పెంచారు. కానీ ప్రజలు గుమికూడటం మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రభుత్వం కూడా పునరాలోచలో పడాల్సిన పరిస్దితి.  పలు జిల్లాల్లో క్షేత్రస్ధాయి పరిస్ధితిని గమనిస్తున్న కలెక్టర్లు, ఇతర అధికారులకు ప్రజల తీరును చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. దీంతో షాపింగ్ సమయాలను తగ్గించాలని వారు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సోమవారం నుంచి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు ఈ విషయాన్న నిర్ధారించగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వర్తించేలా అధికారిక ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది.  కరోనా వైరస్ ప్రభావం ఏపీలో నియంత్రణలో ఉందని భావిస్తున్న సమయంలో ప్రజల తీరుతో తిరిగి పరిస్దితి మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రైతు బజార్లు, ఇతర దుకాణాల వద్ద గళ్లు గీసి ఉంచినా ప్రజలు మాత్రం వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో కరోనా అనుమానిత కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ల వినతి మేరకు ప్రభుత్వం షాపింగ్ సమయాలను తగ్గించేయాలని నిర్ణయించింది. అప్పటికైనా పరిస్ధితిలో మార్పు రాకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అన్న క్యాంటీన్లే ఉండుంటే.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ..

ఏపీలో గతేడాది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసేసింది. ఐదు రూపాయలకే అన్నార్తులకు కడుపు నింపే అన్న క్యాంటీన్ల మూసివేతపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి వాటిని రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చుకుని వాడుకోవచ్చుగా అంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్దితి ప్రభుత్వానిది. ఏదో రకంగా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని కొనసాగిస్తే అంతిమంగా వారికే మంచిపేరు వస్తుందన్న ఆక్రోశమే ఇందులో కనిపించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా  వైరస్ ప్రభావం పెరుగుతుందని తెలియగానే, తెలంగాణ సర్కారు వెంటనే లాక్ డౌన్ కారణంగా మూతపడిన అన్నపూర్ణ క్యాంటీన్లను తెరవడమే కాకుండా ఐదు రూపాయలకు కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం అందించేందుకు సిద్దపడింది. కానీ అదే సమయంలో ఏపీలో లాక్ డౌన్ కారణంగా వేలాది మంది యాచకులు, పేదలు ఆకలి కేకలు వేస్తుంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్న పరిస్దితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే అనే చర్చ సాగుతోంది.      రాజకీయ కారణాలతో మూసేసిన అన్న క్యాంటీన్లను సంక్షోభ సమయంలో తెరిచేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోయినా ఇప్పుడు రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్ధలు ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నాయి. లాక్ డౌన్ అమలవుతున్నా సరే.. అందిన కాడికి విరాళాలు సేకరించి మరీ అన్నార్తుల కడుపు నింపుతున్నాయి. వీరే లేకుంటే ఏపీలో కరోనా చావుల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉండేవన్న వాదన వినిపిస్తోంది. స్వచ్ఛంద సంస్ధలు, సామాజిక కార్యకర్తలు పేదల కడుపు నింపడాన్ని చూసిన వారంతా ప్రభుత్వం చేయాల్సిన పనిని నెరవేస్తున్న వీరిన్ అభినందించకుండా ఉండలేని పరిస్దితి. పలుచోట్ల వీరికి అవసరమైన విరాళాలు ఇచ్చేందుకు సైతం ప్రజలు ముందుకొస్తున్నారు. 

విదేశీయుల లెక్క తేల్చడంలో వైఫల్యం- ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలైన వెంటనే విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల జాబితాను తీసుకునే విషయంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఇప్పుడు కొంప మంచుతోంది. కేవలం కేంద్రం ఇచ్చిన డేటాపైనే ఆధారపడి ప్రయాణికులను క్వారంటైన్ కు పంపిన ఏపీ సర్కార్.. ఆ తర్వాత పెరుగుతున్న కేసులతో కలవరపడటం ప్రారంభించింది. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వం కళ్లు తెరిచే సరికే వందల సంఖ్యలో విదేశీ ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేశారు. దీంతో ఇప్పుడు వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. ఈ నెల 22న జనతా కర్ఫ్యూ విధించిన నాడే అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం నిలిపేసింది. కానీ ఇవాళ్టికీ విదేశీ ప్రయాణికుల సంఖ్యను రోజుకు వెయ్యి చొప్పున పెంచుకుంటూ ప్రభుత్వం గణాంకాలు విడుదల చేస్తోంది. అదేంటని అడిగితే కేంద్రం ఇచ్చిన లెక్కలు సమగ్రంగా లేవని, అందుకే తాము ప్రతి రోజూ వాలంటీర్ల సాయంతో విదేశీ ప్రయాణికులను లెక్కిస్తున్నట్లు చెబుతోంది. అయితే ఇప్పటికే పరిస్ధితి చేయి దాటిపోయినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. ఇంకా ఇలాంటివారు ఎందరున్నారో తెలియదు. వీరి లెక్క తేలితేనే కానీ ఏపీలో కరోనా వైరస్ ఎప్పుడు నియంత్రణలోకి వస్తుందో తెలియని పరిస్దితి ఇప్పుడు నెలకొంది.

గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత...

గుడివాడ వలివర్తుపాడు గ్రామంలో పేకాటరాయుళ్ల పై పోలీసుల దాడులు చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులను చితకబాదారు. ఈ దాడుల్లో రత్న కుమార్ అనే వ్య‌క్తిని ఎస్ఐ మరియు సిబ్బంది కొట్టడంతో సొమ్మసిల్లి పడిపోయాడు. పోలీసు లాఠీల‌కు గాయ‌ప‌డిన ర‌త్న‌కుమార్‌ను ఘటనా స్థలం నుండి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అత‌ను దారిలోనే మృతిచెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున మృతుడు బంధువులు చేరుకోవ‌డంతో గుడివాడ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మృతుడి బంధువులు ఆరోపించారు. మ‌రి దారుణంగా పోలీసులు కొట్టి చంపేశారనే వార్త గుడివాడ‌ల సంచ‌ల‌నం రేపింది.

ఇదేం లాక్‌డౌన్.. వీరికి అనుమతి ఎలా ఇచ్చారు?

అసలు ఈ దేశానికి విమానాల్లో కరోనా వైరస్ రావటంలో పేదల, చిరుద్యోగుల పాత్ర ఎంత? అయితే ప్ర‌స్తుత‌ వీరే బాధితులు! ఇది ఢిల్లీ బస్ స్టేషన్ దగ్గర సన్నివేశం. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. రెండు నెలల పాటు కాదు కదా 15 రోజులు కూడా వాళ్ళు పని లేకుండా, ఆదాయం లేకుండా బతకలేరు. స్వగ్రామంలో ఎలాగైనా బతికేస్తారు. 20వ తేదీ వరకు చప్పుడు చేయకుండా ఒక్కసారిగా మూడు వారాలు బైటకి రావద్దంటే వాళ్ళకెలా? రేషన్ కార్డులు, ఓటు హక్కులు, డ్వాక్ర సభ్యత్వం అన్నీ గ్రామాల్లోనే ఉంటాయి. లాక్‌డౌన్ కారణంగా చేసేందుకు పని లేకపోవడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయని.. దీంతో అద్దెలు కట్టలేక.. నిత్యావసరాలు కోనుగోలు చేయలేకపోతున్నామని.. అందుకే తాము సొంతూరుకు వెళ్తున్నామని బదౌనీ జిల్లా బదౌన్ గ్రామానికి చెందిన ఓ యువకుడు తెలిపాడు. నోయిడా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిలిచిపోయిన తమ వాళ్లను సొంతూళ్లకు తీసుకెళ్లడం కోసం 1000 బస్సులను పంపుతున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. డీటీసీ కూడా 200 బస్సులను ఏర్పాటు చేసింది. అందుకే ఈ స్థాయిలో జనం బస్ టెర్మినల్‌కు చేరుకున్నారు. వీరిలో చాలా మంది ముఖాలకు మాస్కులు, కర్చీఫ్‌‌లు కట్టుకున్నారు. కానీ వాటి వల్ల ఎంత మేరకు కరోనా నుంచి కాపాడుకోగలరనే అనుమానాలను చాలా మంది వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ.. ఈ బస్ టెర్మినల్ దగ్గర మాత్రం జనం ఒకరినొకరు తోసుకునేంతలా ఉండటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన వలసదారులు వీళ్లందరూ. ఆప్, బీజేపి ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నిరాశ్రయులైన వీరందరికీ నివాసం కల్పించలేని ఆప్ ప్రభుత్వం కేంద్రానికి ముందుచూపు లేదని బీజేపి మీదకి తోసేస్తే, వీళ్లని నిర్దాక్షిణ్యంగా ఆప్ తరిమేస్తున్నదని బీజేపి అంటుంది. రెండూ నిజమే కావొచ్చునేమో. ఫిబ్రవరి మొదటి వారం నుండే మెల్లగా, క్రమంగా చర్యలు చేపట్టి ఉండాల్సింది పాలకులు. ఫిబ్రవరి 24న లక్షలాదిమందితో కలిసి దేశాధినేతలు చెట్టపట్టాల్ వేసుకున్నారు. ఏదీ ముందు చూపు ఉండదు. ప్రజల బాధలు ప్రజలవి. పాలకుల పరిహాసాలు పాలకులవి. ఈ దేశ స్వరూప స్వభావాలు, ప్రజల జీవన విధానాలు, కదలికలు, ఆర్ధిక స్థితిగతుల మీద పాలకులకు క‌నీస అవగాహన ఉండదా? ప్రజల్ని కేవలం చట్టాల ద్వారా అదుపు చేయటమేనా పాలన అంటే? పోలీసుల ద్వారా భయభ్రాంతుల్ని చేయటమేనా?

క‌రోనాపై సంపన్నదేశాల భీక‌ర‌పోరు, పేదదేశాలు బిక్కుబిక్కు!

కరోనా మహమ్మారిపై సంపన్న దేశాలు భీక‌ర పోరు చేస్తుంటే  ఆకలి దప్పులతో తల్లడిల్లే నిరుపేద దేశాలు క్షణక్షణం భయంతో అల్లాడిపోతున్నాయి. ఓ వైపు ధనిక దేశాలు కొవిడ్‌-19 తో ప్రాణాలొడ్డి పోరాడుతుంటే.. అత్యంత నిరుపేద దేశాల్లో భయోత్పాతం రగిలింది. నిత్యరక్తపాతంలో బిక్కుబిక్కుమంటూ ఆకలిదప్పులతో అల్లాడే శరణార్థ దేశాల్లోనే అత్యంత హాని తప్పదని అంతర్జాతీయ సంస్థలు ఆక్రోశిస్తున్నాయి. సిరియా, యెమెన్‌, సొమాలియా తదితర దేశాలను కరోనా వైరస్‌ కబళిస్తే…పరిస్థితి మరింత దైన్యమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరోపా, అమెరికా దేశాలు కరోనావైరస్‌పై దూకుడు పెంచి.. యుద్ధం చేస్తుంటే…సిరియా, యెమెన్‌ తదితర యుద్ధ క్షేత్ర బరిలోనూ లక్షలాది మంది చనిపోతారని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్ర భయంకరంగా మారాయి.  క‌రోనా వైరస్‌ వ్యాపించి  వేలాది మందిని కబళించింది.  ఆఫ్రికా ఖండంలో…ఇంకా కరోనా వైరస్‌ విజృంభణ ఊపందుకోలేదు. ఇప్పటికి కేవలం 3,200 మంది కరోనా వైరస్‌ కౌగిట్లో చిక్కుకోగా… 83 మంది ఊపిరి ఆగిపోయింది, ధనిక దేశాలతో పోల్చితే తమ ఖండంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగానే ఉందని ఆఫ్రికన్‌ యూనియన్‌ తెలిపింది.  ఇక్కడ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో పరిశుభ్రత పరిస్థితులు చాలా తక్కువ. నిరాశ్రయులై..సంక్షోభంలో అలమటించే శరణార్థులు కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్రంగా నష్టపోతారు” అని అంతర్జాతీయ రెస్క్యూ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.    ప్రపంచంలోని అత్యంత హానికర ప్రాంతాల్లోని పేదలను ఆదుకునేందుకు 200 డాలర్ల ఆర్థిక సాయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ మంజూరు చేసి.. ఒక మానవతా సహాయక ప్రణాళికను ప్రకటించారు. ”అయితే ఈ సాయం సరిపోదని మాకు ఇప్పటికే తెలుసు” అని ఉగాండా డైరెక్టర్‌ డెల్ఫిన్‌ పినాల్ట్‌ అన్నారు. మహమ్మారిని ఎదుర్కోవటానికి పేద దేశాలను మరో సమస్య వేధించనుంది. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలు లేకపోవటమే ప్రధాన కారణం.

స్పెయిన్‌లో క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్నారు!

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది. క‌రోనా మరణాల్లో స్పెయిన్ సైతం చైనాను అధిగమించి, ప్రపంచంలోనే రెండో స్థానంలోనే నిలిచింది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు అక్కడ మరో 800 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,938కి చేరింది. కొత్తగా మరో 8వేల మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల్లో దాదాపుగా లాక్ డౌన్ అమ‌లులో వుంది. అయితే రోజు రోజుకే ప‌రిస్థితి చెయ్యిదాటిపోవ‌డంతో లాక్ డౌన్ చేయబడిన స్పెయిన్ లో పోలీస్‌లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైద‌రాబాద్‌లో బ‌ల్దియా అధికారులు కుక్క‌ల్ని ప‌ట్టుకుని వాహ‌నాల్లో త‌ర‌లించిన‌ట్లు స్పెయిన్‌లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా రోడ్ల మీద క‌నిపిస్తే మ‌నుషుల్ని అలా త‌ర‌లిస్తున్నారు. స్పెయిన్ రోడ్డు మీద క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లుగా పోలీసులు త‌రిమివేస్తున్నారు. మేక‌ల్ని ప‌ట్టుకొని వాహ‌నాల్లో వేసిన‌ట్లు పోలీసు వాహ‌నాల్లో వేసి రోడ్ల మీద నుంచి త‌ర‌లించారు. మీడియా సాక్షిగా పోలీసులు రెచ్చిపోతున్నారు. కుటుంబ‌స‌మేతంగా రోడ్ల మీద‌కి వ‌చ్చిన వారి ప‌రిస్థితి దారుణంగా క‌నిపించింది. మ‌హిళ‌లు అరుస్తున్న పోలీసులు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు స్పెయిన్ పోలీసులు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

భారత్‌లో  933 పాజిటివ్‌ కేసులు..21 మంది మృతి!

దేశంలో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది.  గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 933కు చేరుకుంది. కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. . కరోనా విజృంభిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా... సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.  కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్‌ ముందుకు వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ఆసుపత్రులుగా మార్చే అంశంపై కేంద్రం ఆలోచన చేస్తోంది.

ఏపీలో 19కు చేరిన పాజిటివ్ కేసులు

 కరోనా కేసులు, వ్యాప్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.  ఒక రోజులోనే ఏపీలో 6 కొత్త కేసులు వెలుగు చూశాయి. గుంటూరులో ఒకే ఫ్యామిలీలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది.  ప్రకాశం జిల్లా చీరాలలో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. నవాబుపేటకు చెందిన వ్యక్తి ఢిల్లీ వెళ్లి రాగా.. ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించిన క్వారంటైన్లో ఉంచారు. కర్నూలు జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తికి కూడా కరోనా సోకిందని శనివారం నిర్ధారించారు. 65 ఏళ్ల వయసున్న ఈయన మార్చి 10 మక్కా నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన 29,264 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామని.. క్వారంటైన్ కోసం 23,479 బెడ్లు సిద్ధం చేసినట్లు చెప్పారు.  జిల్లాల వారీగా చూస్తే.. చిత్తూరు, ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో నాలుగు చొప్పున కేసులు నమోదయ్యి. ఒంగోలు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. వీరిలో నెల్లూరుకి చెందిన యువకుడు కరోనా నుంచి కోలుకున్నాడు.

తెలంగాణలో 67 కేసులు నిజామాబాద్‌లో హై అలర్ట్!

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతోంది.  నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా రోడ్డులోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. 60 ఏళ్ల ఆయన ఈ నెల 12న ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన్ను ఈ నెల 15న హాస్పిటల్‌లో చేర్పించారు. టెస్టులు చేయగా ఆయన కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో నిజామాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో 67 మందికి కోవిడ్ సోకిందని మంత్రి ఈటల ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతోపాటు కాంటాక్ట్ అయిన పది మందిని క్వారంటైన్‌కు తరలించారు. మార్చి 12-15 తేదీల మధ్య ఆయన ఇంకా ఎవరినైనా కలిశారా? ఏదైనా హాస్పిటల్‌కు వెళ్లారా అనే దిశగా ఆరా తీస్తున్నారు.    ఇప్పటి వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా శ‌నివారంనాడు నిజామాబాద్‌లోనూ కోవిడ్ కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఒకరు అశ్వాపురం చెందిన వారు కాగా.. మరొకరు కొత్తగూడెం డీఎస్పీ కుమారుడు. ఆయన ద్వారా డీఎస్పీకి, ఇంట్లో వంట మనిషికి కూడా కరోనా సోకింది.

200 ఏళ్ల తర్వాత  బ్రిటీష్‌ను పరిపాలిస్తోన్న ఇండియ‌న్స్‌..! 

బ్రిటీషుకు కరోనాదెబ్బ త‌గ‌ల‌డంతో ఆ దేశ‌ప‌గ్గాలు ఇండియ‌న్స్ చేతికి వ‌చ్చాయి. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇండియా ని పాలించారు.. అని విన్నాం. 200ఏళ్ల తర్వాత ఇండియన్ బ్రిటిష్ ని పాలించ బోవడం చూడబోతున్నాం. రాణి, రాజు, ప్రధాని, ఆరోగ్య మంత్రి అందరూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు బ్రిటన్ పగ్గాలు, ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునక్, హోమ్ మినిస్టర్ ప్రీతి పటేల్, బిజినెస్ మినిస్టర్ అలోక్ శర్మ గారి చేతుల్లో పడ్డాయి.. అది విష‌యం.   ఇప్పుడు బ్రిటన్‌లో భార‌తీయుల‌దే పెత్త‌నం. పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది మరి. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని.. మన దేశ సంపదనంతా దోచుకోవడంతో పాటు ఎంతోమంది అమాయకపు ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న బ్రిటీష్‌ వారిని ఇప్పుడు భారతీయులే దిక్కయ్యారు. కరోనాతో ఆ దేశ రాణి (కోవిడ్ వచ్చినట్లు వార్తలు వచ్చినా.. అధికారికంగా ప్రకటించక లేదు), యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇలాంటి సమయాల్లో సాధారణంగా గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు(రిషి సునక్‌, ప్రీతి పటేల్‌) భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం.  ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో రాబర్ట్ క్లైవ్‌, క్వీన్ విక్టోరియా, విన్‌స్టన్‌ చర్చిల్ ఆత్మలు సమాధుల్లో తిరుగుతూ ఉంటాయని కామెంట్ పెడుతున్నారు.

సామాజిక బాధ్యతగా అన్నార్తులను ఆదుకుందాం!

ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరం ఐదుగురికి చేయూతనిద్దామ‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ఒకరు ముందుకు వచ్చి సహకరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బిజెపి జాతీయ నాయకత్వం పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరు ఐదుగురి వ్యక్తులకు తగ్గకుండా ఆహారం అందించేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  ఈ సందర్భంగా  కరీంనగర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంట చేసిన ఆహార పదార్థాలను ఆయన స్వయంగా అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు వివిధ సంస్థల ప్రతినిధులు బాధ్యతగా విధిగా పేదలకు ఆహారాన్ని అందించే కార్యక్రమాలను చర్యలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్న కరోనా వైరస్ నివారణ చర్యలకు ప్రజలంతా సహకరించి ఇంటి వద్ద ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు సహకరించాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

విదేశాల నుంచి వ‌చ్చిన ఆ 72 మంది వెంట‌నే రిపోర్ట్ చేయండి!

విదేశాల నుండి పశ్చిమగోదావరి జిల్లా వాసులు తిరిగి వారి యొక్క స్వస్థలాలకు రాగా వారిలో 246 మంది యొక్క ఆచూకీ తెలియరాలేదు, వారిలో పోలీసు వారి యొక్క వెరిఫికేషన్ ద్వారా 174 మంది యొక్క సమాచారం ఎక్కడ ఉన్నది అనేది తెలిసినది. అయితే మిగిలిన 72 మంది యొక్క సమాచారం తెలియరాలేదు. వారి యొక్క వివరాలు లలో కొన్ని అసంతృప్తిగా ఉన్నందున వారి యొక్క వివరాలను తెలుసుకోవడం కష్టం అయినది. ఇందుమూలముగా ఈ క్రింది 72 మంది వివరములు ప్రచురించడం జరిగింది. 1    PEETHANI GOPI NAGA SOURYA    M    P5213271    10-81, venkatacheruvugattu ,achantavemavaram ACHANTA achanta mandal 534122. 2    MANDHAPATI DURGA    F    K9233557    3-161,ramannapeta ATTILI POLICE STATION attili(m) 534134 3    NIMMALA RAJESH    M    L3608422    2-95/2,attili ATTILI kanchumarru 534230 4    DASARI MAHAKALAMMA      F    L2847573    d no 5-8-17,grandhi challarao street BHIMAVARAM I TOWN bhimavaram 534201 5    CHAMARTHI ANJANI KUMAR    M    K9232296    d.no.7-9-15, narasayya agraharam BHIMAVARAM bhimavaram village 534201 6    SHAMSHAAD MOHAMMED    F    K3413845    12-6-12. 21st ward BHIMAVARAM bhimavaram 534201 7    MULUKUTLA SRI RAM KASHYAP    M    K3765512    fno-408,sri sai towers BHIMAVARAM sp street bhimavaram 534201 8    MISHRA SHASHI KANT    M    M8228810    6-199/1,brahmam gari temple BHIMAVARAM RURAL rayalam/bhimavaram 534208 9    BOLLA PRADEEP    M    J7363082    1-8-2,ADARSH NAGAR,JP ROAD, BHIMAVARAM, WEST GODAV ARI-534 204,AP...  10    GURRAPU SUNITHA    F    N3041825    d.no:4-1-94, bhimavaram, 4loe 1,2,3 veedhulu, BHIMAVARAM II TOWN bhimavaram loka 534202 11    MINDELLI CHINNA VENKATARAO    M    L9836673    1-56a, main road,gopannapalem DENDULURU denduluru mdl 534450 12    VUTLA SIREESHA    F    S1595061    dno:24b-11-17, near chinna sivalayam,pathebada ELURU II TOWN eluru 534002 13    SANAM LAKSHMI LAVANYA    F    K3407484    24b-10-44,panuganti vari street, 2 TOWN eluru 534002 14 Chandra SEKHAR KASARAPU    M    Z4354946    16b-16/1-1,opp anjaneyaswamy temple,tangellamudi ELURU II TOWN eluru 534005 15    KANAKA RAVI KIRAN GONNURU    M    K9430083    1-148,3rd lane,sri rajarajeswari ngr ELURU II TOWN kandrikagudem,eluru 534005 16    KAROTHI VENKATA SATYANARAYANA    M    K3408955    SRI SATYA COMPLEX,GANDHI NAGAR ELURU ELURU 534002 17    PEDIREDLA MANT KUMAR    M    K9434528    16a-20-11, m.r.c. colony, eluru mandal ELURU I TOWN tangellamudi 534005 18    PASUMARTHY SANDEEP    M    K3407422    9-108,sanivarapupeta ELURU eluru 534005 19    CHALASANI SOWMYA    F    M5647282    10-31,sri ram nagar,11th road,senivaripeta ELURU III TOWN eluru 534003 20    MARAGANI ABHISHEK    M    R2777463    D NO:17-15 NTR COLONY VENKATAPURAM PANCHAYATHI ELURU III TOWN eluru 534001 21    LANKA NAGA VENKATA SAI SURYA TEJA    M    J7363348    3-289/2 GOLLALADIBBA GANAPAVARAM MD WEST GODAVARI AP  22    PARVATHI    F    K9446661    1-59, nr n t r bomma,cheruvugattu,kakula IRAGAVARAM ILLINDALAPARRU 534411 23    MOHAMMAD IRFAN    M    H7989007    3-102/2 BONDADA KALLA WEST GODAVARI AP  24    KOTNIS MAHESH MILIND    M    K6570311    9-35,l n puram KALLA bondada 534209 25    GEDDAM RANI    F    K2208782    D NO:30-53, LINGALA VARI STREET, PENUGONDA, W G DI ST., A P., 534320  26    GUBBALA CHITTITALLI    F    T0930639    1-34,near ramalayam,mulaparru PENUGONDA penugonda mandal 534123 27    CHELLINKI MAHESH BABU    M    M2326131    door-no-3-102,penugonda PENUGONDA mulaparru 534269 28    GURAJAPU NAGESWARA RAO    M    T0929989    dno:3-26,rajakalapeta, nattarameswaram PENUMANTRA penumantra mandal 534124 29    MEDAPATI HARI VIJAYA REDDY    M    M0108655    dno:4-32,main road,penumantra PENUMANTRA juttiga 534124 30    KADALI GOVINDARAJU    M    K8906783    h.no.3-196/a, PENUMANTRA velagaleru 534122 31    MIDDE RATHAYYA    M    P1728935    2-62,apparao peta TADEPALLIGUDEM TOWN tadepalligudem 534145 32    CHINTHALAPUDI VEERA RAMA YEJA    M    M4587896    9-5-23,yerabolu vari st,savitru peta TADEPALLIGUDEM TOWN tadepalligudem 534102 33    PASUPULETI PANDURANGA VIJAYSANTOSH    M    S3816492    d.no.7-40-1/1(2), 11th ward, TADEPALLIGUDEM TOWN tadepalligudem 534101 34    PALIKILA NAGALAKSHMI    F    T0924012    mig-149,housing board colony TADEPALLIGUDEM TOWN tadepalligudem 534101 35    NAGIREEDY RAMARAO    M    S1589597    4-42-10/b,ttdkalyanamandapam road,mahalaxminagar TADEPALLIGUDEM TOWN tadepalligudem 534101 36    PARUCHURI TULASTRAM    M    K5695785    2-154 kn road TADEPALLI GUDEM pedatadepalli 534101 37    BOMMIDI VENKATA SAI KUMARI    F    S5317860    4-69-30/4,mamidi thota,indra nagar TADEPALLIGUDEM TOWN tadepalligudem 534101 38    ELIBUDI PEDDINTLU    F    N1507564    dno:4-92-5/4,weekerscolony TADEPALLIGUDEM TOWN tadepalligudem 534101 39    TADI VENKATA SATYANARAYANA REDDY    M    P1721156    11-2-16/4,bhagya lakshmi peta TADEPALLIGUDEM TOWN tadepalligudem 534102 40    BINGI MALLESH    M    R2799856    10-30-5/1, bhagyalakshmipeta, tadepalligudem TADEPALLIGUDEM TOWN tadepalligudem mandal 534102 41    MANUKONDA PRAMEELA SANTHA KUMARI    F    J7941799    MAHATHMA NAGAR,NR ELEM PRAYER HOUSE TADDEPALLIGUDEM TADEPALLIGUDEM 534101 42    VEZZU SURESH    M    M8688385    d no.4-166-7/1,ganesh nagar TADEPALLIGUDEM RURAL TADEPALLIGUDEM 534101 43    KANDELLI JHANSI RANI    F    R2032716    4-5a,kotturu TADEPALLIGUDEM RURAL tadepalligudem mandal 534146 44    MULAGALA YESURATNAM    M    L6734015    d.no.2-32, arugolanu TADEPALLIGUDEM RURAL tadepalli gudem mandal 534146 45    MANAPRAGADA SURESH    M    J4345875    DRNO. 1-82, ARUGOLANU (POST TADEPALLIGUDEM MDL - 5 34146 WEST GODAVARI DISTRICT - AP   46    KOPPURAVURI KRISHNA DIVAKAR    M    N8448564    26-12-4/1,masjid street,velpur road TANUKU tanuku 534211 47    MANNE BABYKONDA    F    M9592420    31-5-19,vinukondavari veedi TANUKU tanuku 534211 48    PUTTA RADHA    F    P2274051    d,no,21-14-34,sajjapuram TANUKU TOWN tanuku mandal, 534211 49    MATHAMSETTY ASHA    F    M3561220    33-8-11,gf-1,op:suryalayam gudi TANUKU TOWN s street,tanuku 534211 50    NALAM RAMA LAKSHMI    F    M6096028    29-8-11, gadela vari street TANUKU TOWN TANUKU MANDAL 534211 51    KONDURI VENKATA RAMA SUBRAHMANYA    M    M2764598    dno-21-6-16 ,valiveti vari veedhi TANUKU TOWN tanuku 534211 52    GADI SAI RAMA KRISHNA    M    P1715407    35-53-5/4 montessori school veedhi TANUKU tanuku 534211 53    SOLASA PRATHYUSHA    F    N8443893    h no.32-11-34,velpur road,opp narendra theater TANUKU tanuku 534211 54    KUSUME MANGA    F    N6109263    h no.21-14-94,main road TANUKU TOWN tanuku 534211 55    BANDAKAVI SRINIVASA HANUMATH BHASKARA    M    Z4668390    28-12-32 , prasanna building,sattiraju vari st TANUKU TOWN velpur road,tanuku 534211 56    KUNA VENKATESWARA RAO    M    U1855397    10-12-10,near womens college,indrayyanagar TANUKU tanuku 534211 57    MULLAPUDI NARAYANAMMA    F    J5121085    5-9-20, MULLAPUDI VARI ST. TANUKU,WG.DT.AP 534 21 1  58    KADALI LAKSHMI    F    N2886082    door no 21-14-44,sajjapuram TANUKU TOWN tanuku mdl 534211 59    MULLAPUDI MRUTYUMJAYA PRASAD    M    K2755849    5-9-31,MULLAPUDI VARI STREET TANUKU TANUKU 534211 60    CHOLLANGI SATYANARAYANA    M    N5527474    h no 21-14-59 TANUKU TOWN tanuku 534211 61    ATAM NIRMALA    F    M1685372    27-1-1,akulavari veedhi TANUKU tanuku 534211 62    KATTA SUJANA    F    K8338619    h no 23-13/6,2nd ward,sajjapuram TANUKU tanuku 534211 63    KILACHAPORAMBU GANGA BHAVANI    F    N3183092    door no 21-14-96, sajapuram TANUKU TOWN tanuku 534211 64    KARUTURI RAMA SAGAR    M    R2034699    17-25-2,karuturivari st,chinasubbarayudu nagar TANUKU tanuku 534211 65    BADTALA VIJAYA KUMARI    F    P9996358    10-23-36/2,ngos colony,ajjaram road TANUKU tanuku 534211 66    SHAIK CHINNA SAIDHA VALI    M    R7192041    24-207,gangamma gudi veedhi,tanuku, TANUKU TOWN velpuru 534222 67    Gondu Dharma Theja    M        D.NO.1-12-34,ADARSHANAGAR, BHEEMAVARAM(P&M),PIN-53 4204, W.G.DISTRICT,A.P.,INDIA.  68    DUVVURU GOWTHAMI    F        "D.NO.1-5-10,LAKSHMI NIVAS, S.N.PURAM,BHIMAVARAM, P IN- 534202,W.G.DISTRICT,A.P." 69    GOWADA ANJANEYULU    M    K3771443    25-9-226/9,gollavaritippa road BHIMAVARAM prakashnagar 534202 70    ALLURI KUMARI    F    K9434957    26-6-25 BHIMAVARAM II TOWN BHIMAVARAM 534202 71    SABBINA SHANMUKHA VENKATESH    M    J3954550    D.NO.6-602,CHINAMIRAM(V), BHIMAVARAM(M),PIN-534204 , W.G.DISTRICT,A.P.,INDIA.  72    Vashisht Ruchi    F    AI-138    h.no:5-31, pedakalavaripeta MOGALTHUR mogalthur mandal 534280 కావున  ఈ పత్రికా ప్రకటన చూసిన వెంటనే ఈ క్రింది ఇవ్వబడిన ఫోన్ నెంబర్ కు  8332933865 అత్యవసరంగా సమాచారమును తెలియజేయ వలసినదిగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపీఎస్ వారు ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినారు. ఈ పత్రికా ప్రకటన జారీ చేయబడిన తర్వాత కూడా సమాచారం తెలపకుండా ఉన్న 72 మంది మరియు యు.కె వారి యొక్క సమాచారం తెలిసి కూడా ప్రభుత్వమునకు ఉద్దేశ పూర్వకముగా తెలియచేయ నీ వారిపై 1897 ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 188 సెక్షన్ మరియు  డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును అని జిల్లా ఎస్పీ గారు తెలియజేసినారు.

పాకిస్తాన్ కరోనాకు చైనా వైద్యం...

పాకిస్థాన్‌లోనూ రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 1,197 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎనిమిది మంది వైద్యనిపుణులు, అవసరమైన వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శనివారం ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు ఆ దేశ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి తెలిపారు. ఈ వైద్య బృందం పాక్‌లో రెండువారాల పాటు ఉండి తమ వైద్య సిబ్బందికి సరైన సూచనలు ఇస్తూ కరోనా కట్టడికి కృషి చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగశాఖ కార్యాలయం వివరించింది. గత కొన్నేళ్లుగా చైనా, పాకిస్తాన్ ల మధ్య మంచి దౌత్యసంబంధాల ఉన్న కారణంగా 12వేల కరోనావైరస్‌ను నిర్ధారించే కిట్లు, 3లక్షల మాస్కులు, 10వేల రక్షణ సూట్లను ఈ ప్రత్యేకవిమానంలో తీసుకొచ్చినట్టు పాక్‌ విదేశాంగశాఖ తెలిపింది. అలాగే ఐసోలేషన్‌ ఆసుపత్రులను నిర్మించేందుకు అవసరమైన ఆర్థికసాయాన్ని అందించేందుకు చైనాలోని ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. చైనా వ్యాపార సంస్థలైనా అలీబాబా, జాక్‌మా ఫౌండేషన్లు చెరో 50వేల ఫేస్‌ మాస్కులు, కిట్స్‌ను పాక్‌కు దానం చేశాయని, కరోనాపై కలిసిపోరాడాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కృతనిశ్చయంతో ఉన్నారని కూడా పాకిస్తాన్ విదేశాంగకార్యాలయం తెలిపింది. కష్టకాలంలో తమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన చైనాకు పాక్‌ విదేశాంగమంత్రి ఖురేషి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. కష్టంలో ఉన్న దేశానికి సాయం అందించడాన్ని ఎవరూ తప్పు పట్టారు కూడా. కానీ ఇక్కడే కొంతమందికి కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కరోనా మీ సృష్టి, అంటే మీ సృష్టి అని అమెరికా, చైనా బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్ చైనా సృష్టి అని, వాళ్ళ దగ్గర కరోనా విరుగుడు మందు కూడా ఉందని బలంగా నమ్మే వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇప్పుడు చైనా వైద్యుల సాయంతో అతి తక్కువ వైద్య సదుపాయాలు కలిగిన పాకిస్తాన్ లో కరోనా వ్యాప్తి నివారించగలిగితే..చైనా ఇప్పటికే తనకు తెలిసిన కరోనా విరుగుడు మందును మిత్ర దేశం పాకిస్తాన్ కు అందించింది అన్న విషయం తేటతెల్లం అవుతుంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో..