తెలుగుదేశం మేనిఫెస్టోపై అవాస్తవ ప్రచారంతో వైసీపీ నవ్వులపాలు!

ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో  ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలగుదేశం మేనిఫెస్టో 2024ను   ఆ పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిందంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. తెలుగుదేశం, వైసీపీ మేనిఫెస్లోలు విడుదల చేసినప్పటికీ, వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలలో స్పందన కనిపించలేదు. ఆ మేనిఫెస్టోపై కనీసం చర్చ కూడా జరగలేదు. అందుకు భిన్నంగా తెలుగుదేశం మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించింది. ఆ పార్టీ గ్యారెంటీలపై ప్రజలలో విశ్వాసం కనిపించింది.  తెలుగుదేశం మేనిఫెస్టో కూటమికి బ్రహ్మాండమైన మైలేజీని తీసుకువచ్చింది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా పెదవి విరుపే కనిపించింది. దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చి హామీల అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్  ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం కూటమిని మించి విపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పించింది. అది ఫలించలేదని గ్రహించిన వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం తన వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించేసిందంటూ  వదంతులను వ్యాప్తి చేయడానికి తెరతీసింది. ఇందుకు నిదర్శనమంటూ తెలుగుదేశం వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.  ఆ స్క్రిన్ షాట్ ఏమిటంటే.. పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని కనిపిస్తోంది. అయితే వాస్తవం ఏమిటంటే..  తప్పు యూఆర్ఎల్ ను టైప్ చేసి ఎర్రర్ మెసేజ్ వచ్చిన స్క్రీన్ షాట్ ను  వైసీపీ వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.  తెలుగుదేశం వెబ్ సైట్ హోం పేజ్ ఓపెన్ కాగానే ఆ పార్టీ మేనిఫెస్టో డిస్ ప్లే అవుతోంది. అయినా సరిగ్గా ఎన్నికల వేళ ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోను తొలగించదన్న కనీస ఇంగితాన్ని కూడా వైసీపీ కోల్పోయిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవాస్తవ ప్రచారంలో ఎన్నికల గండం గట్టెక్కేందుకు  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యి ఆ పార్టీనే నవ్వుల పాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం కాదు.. నీతి ఆయోగ్ సిఫారసు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. వారి ప్రసంగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా  వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన, ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే మెగా డీఎస్సీపైనే తన తొలలి సంతకం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ ను, ఆయన సర్కార్ ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదనీ, దానిని రద్దు చేయడం సాధ్యం కాదనీ పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.  అయతే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణననలోనికి  తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతీ ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమలులోకి తీసుకువచ్చేసింది.   తాను కూడా ఆ చట్టానికి బాధితుడినేనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి  పూర్తిగా ఉంది. అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. 

ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ ఇన్ చార్జ్  డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు.  ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు. వీరిలో 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఈసీ ఖరారు చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.  మొత్తం మీద ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల వేళ, కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడాన్ని తెలుగుదేశం కూటమి స్వాగతిస్తున్నది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నెలన్నర తరువాత ఈ బదిలీ జరగడం గమనార్హం, ముఖ్యంగా అనకాపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి అనంతరం ఎన్నికల సంఘం రాష్ట్రంలో  శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ సాయంత్రం  ఆయన బాధ్యతలు చేపట్టారు. 

రెండు నెలల్లో 90 మంది ఎన్ కౌంటర్! పట్టు కోల్పోతున్న మావోయిస్టులు

ఛత్తీస్‌గడ్ దండకారణ్యమంతా నివురుగప్పిన నిప్పులా మారింది.  వరుస ఎన్ కౌంటర్‌లతో మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. గడిచిన మూడు నెలల్లో యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొనే సిబ్బంది సంఖ్యను ఒక్కసారిగా పెంచారు. ప్రస్తుతం ఒక్క బస్తర్‌ రీజియన్‌లోనే 80 వేల మంది డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ జవాన్లు నక్సల్స్‌ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.  తెలంగాణ సరిహద్దులో ఉండే మావోయిస్టుల కంచుకోట పూవర్తి, తెర్లం  నుంచి  అబూజ్‌మడ్‌ అడవుల వరకు 400 కిలోమీట‌ర్ల మేర పోలీసులు క్రమంగా క్యాంపులను విస్తరించారు.  అడవిలో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపు ఏర్పాటైంది. ఒక్కో క్యాంపులో 2 వేల నుంచి 5 వేల వరకు బలగాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గడిచిన మూడున్నర నెలలుగా ఎన్‌కౌంటర్లు పెరిగాయి.  అబూజ్ మడ్ దట్టమైన  అటవీ ప్రాంతం. కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇక్క‌డ జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  90 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు.  బాహ్య ప్రపంచానికి ఆవల.. ఎక్కడో విసిరివేయబడ్డట్టుంటుంది అబూజ్ మడ్. దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగేయడమే కష్టం.  4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం… నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలతో పాటు.. ఇటు తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లా.. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్స్ లో విస్తరించి ఉంది. నక్సల్స్ ఈ అబూజ్ మడ్ ను సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకున్నారు. అలా ఈ ప్రాంతం నక్సల్స్ కు ఒక ప్రధాన స్థావ‌రంగా మారింది.  ఈ డెన్ ను కనుక నిర్వీర్యం చేస్తే… ఇక మావోయిస్టులు, ఇతర తిరుగుబాటు దళాల ఉనికే లేకుండా చేయొచ్చనే ఉద్దేశంతో మోదీ సర్కార్ అబూజ్ మడ్ పై దృష్టి పెట్టింది. తరచూ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎన్ కౌంటర్స్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది.  సరిహద్దు భద్రతా దళాలతో పాటు.. జిల్లా రిజర్వ్ గార్డ్ దళాలతో కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి మొత్తంగా అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవ‌డానికి కేంద్రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.  అబూజ్ మడ్ లో ఇటీవ‌ల జరిగిన ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. బూటకపు ఎన్ కౌంటర్లతో గడిచిన రెండు నెలల్లోనే 90 మందిని కాల్చి చంపారని హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి ఆరోపించారు. నక్సల్స్ స్థావరాలను గుర్తించి డ్రోన్ల ద్వారా విష రసాయనాలను చల్లుతున్నారని మండిపడ్డారు. ఆపై నక్సల్స్ స్పృహ తప్పగానే కాల్పులు జరిపి వారిని మట్టుబెడుతున్నారని మండిపడ్డారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని అడవుల్లోకి తీసుకొచ్చి, ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిని ఏరివేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల నుంచి.. నేపాల్‌ వరకు రెడ్‌కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్న నక్సల్స్‌ ఇప్పుడు సేఫ్‌జోన్లు లేక సతమతమవుతున్నారా? దండకారణ్యంపై మావోయిస్టులు పట్టు కోల్పోతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

డబుల్ బెడ్ రూం ఓ బూటకం: బిజెపి 

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ , బిజెపిలు పాలు నీళ్ల మాదిరిగా  కలిసి ఉండేవారు. బిజెపి బి టీం బిఆర్ఎస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ భారీ పరాజయంతో రెండు పార్టీల మధ్య అగాథం బాగా పెరిగి పోయింది. కాంగ్రెస్ ను నిలువరించడానికి బిఆర్ఎస్, బిజెపి చేసిన ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఐదు నెలల కాలంలో మిత్రులు కాస్తా శత్రువులయ్యారు. బిజెపి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయితే రెండో ప్రత్యర్థి మాత్రం బిఆర్ఎస్  అని తెలుస్తోంది . రానున్న లోకసభ ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.  డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజల్ని మోసగించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్ రూం హామీని బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేంద్రం అందించిన పీఎంజేవై పథకాన్ని వినియోగించుకోలేకపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆయన విమర్శించారు.  పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ...ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా మారుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఫార్మా, పెట్రో కెమికల్స్ రంగాల్లో మన దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇదివరకు మొబైల్ ఫోన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమని, కానీ నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశంలోనే మొబైల్ ఫోన్ల తయారు చేస్తున్నామని తెలిపారు. మేకిన్ ఇండియా ద్వారా తయారైన మొబైల్ ఫోన్లనే మనం వినియోగిస్తున్నట్లు నడ్డా చెప్పారు. ఇప్పటివరకు దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామని, 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుద్డీకరణ పూర్తయిందని వెల్లడించారు. ప్రపంచంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఐదోస్థానంలో ఉందని తెలిపారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148 కి పెంచామని, లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జేపీ నడ్డా చెప్పారు.

ఉపాధ్యాయులు రివెంజ్ కు రెడీ అయిపోయారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లు వైసీపీ ప్రభుత్వంతో పూర్తిగా తెగతెంపులు చేసేసుకున్నారా? మరో సారి జగన్ ను నమ్మే పరిస్థితి లేదని విస్పస్టంగా చెప్పేశారా? అంటే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం కోసం వారు దరఖాస్తు చేసుకుంటున్న తీరును బట్టి ఔనని అనక తప్పదు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలట్ ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏ విధంగా చూసినా రికార్డే. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రతి ఎన్నికలలోనూ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు లక్షా లక్షన్నర మంది కూడా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఈ సారి మాత్రం ఉద్యోగులలలో తమ ఓటు హక్కు వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్దగా సుముఖత చూపరు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలంటూ నియోజకవర్గ కేంద్రానికి లేదా మండల కేంద్రాలకు కానీ వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.  అయితే ఈసారి ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగుల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం 7, 8 తేదీలలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. ఫారం 12ను సమర్పించి 7, 8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వెసులు బాటు కల్పించింది. దీంతో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందే విషయంలో అవరోధాలు, ఇబ్బందులు ఎదురౌతున్నా పట్టించుకోకుండా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి తమ ఓటు హక్కును వినియోగించుకుతీరాలన్న సంకల్పం వారిలో కనిపించింది. ఈ పట్టుదల, సంకల్పం  వెనుక జగన్ ను గద్దె దించాలన్న తపన కూడా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో  ఉద్యోగులు, మరీ ముఖ్యంగా టీచర్లను అన్ని విధాలుగా వేధింపులకు, అవమానాలకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తాన్న వాగ్దానాన్నివిస్మరించడం విషయంలో కానీ, వారికి చట్టబద్ధంగా, న్యాయపరంగా అందాల్సిన అలవెన్సులు, సబ్బిడీల విషయంలో కానీ జగన్ ఏ మాత్రం సానుకూలత లేకుండా వ్యవహరించారు.  ఉపాధ్యాయుల్లో 90 శాతం మంది తెలుగుదేశం కూటమికే ఓటు వేయడానికి నిర్ణయించేసుకున్నట్లుగా వారి వాట్సాప్ గ్రూపులలో సంభాషణలు, చర్చల ఆధారంగా వెల్లడౌతోంది. ఉద్యోగులు, టీచర్లు తన ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలన్న ప్రచారం కూడా టీచర్ల వాట్సాప్ గ్రూపులలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   ఫలానా పార్టీ, ఫలానా కూటమికి ఓటు అని ప్రత్యేకంగా చెప్పకున్నప్పటికీ, స్పష్టంగా అధికార పార్టీకి వ్యతిరేకం అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాది.  న భూతో అన్నట్లుగా టీచర్లు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న తీరు మాత్రం జగన్ సర్కార్ తో వారు ఎంతగా విసిగిపోయారో తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 3

వైసీపీ నాయకుడు జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఇంతకుముందు రెండు భాగాల్లో వివరించడం జరిగింది. ఇప్పుడు ‘నార్సీ’ మానసిక వ్యాధిగ్రస్తులకు వుండే ఇతర లక్షణాలను చూద్దాం.  జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసింది. వాటిని జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఐదేళ్ళుగా అవి పాడుబడిపోయి వున్నాయి. వాటిని అలా ఉంచేసి, జగన్ సెంటు భూమి పథకం పట్టుకొచ్చాడు. సెంటు భూమి ఎలా సరిపోతుంది? ఆ ఇచ్చే భూమి కూడా ఎక్కడో ఊరు చివరో, మునక ప్రమాదం వున్న ప్రాంతాల్లోనే ఇచ్చాడు. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇంకా ఈ స్కీములో ఎన్నో స్కాములు, తిరకాసులు, లబ్ధిదారులను స్థలం ఇచ్చాం కాబట్టి మా పార్టీకి ప్రచారకర్తలుగా పనిచేయాలంటూ బెదిరించడం.. ఇలాంటి లీలలు ఎన్నెన్నో. మరి పేదకు ఇళ్ళు సమకూర్చే ఈ పథకాన్ని ఇంత నాశనం చేసిన జగన్, చంద్రబాబు ఇచ్చి టిడ్కో ఇళ్ళు బాగున్నాయని ఎవరైనా అంటే తట్టుకోగలడా.. అందుకే వాటిని పాడుబెట్టేశాడు. జగన్ ఎప్పుడూ దుష్ట చతుష్టయం అనే మాటను వాడుతూ వుంటాడు. జగన్ తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళందర్నీ ఒక తాటిమీద కట్టేస్తాడు.  ఎవరైతే జగన్ ప్రభుత్వం గురించి నిజాలు చెప్తున్నారో వాళ్ళను దొంగలు, దగుల్బాజీలు, అట్లాంటి వాళ్ళు.. ఇట్లాంటివాళ్ళు వాళ్ళ మీద అబద్ధాలు దుష్పచారం చేస్తాడు. చివరికి వాళ్ళు చెప్పే నిజాన్ని కూడా జనం నమ్మని పరిస్థితి తెస్తాడు. అప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా నిజం చెప్పినా జనం పట్టించుకోవడం మానేస్తారు. ఇలా జరగడం ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు... ఉదాహరణకు, 10 రూపాయల నాణెం దేశం మొత్తంలో చెలామణీలో వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పదిరూపాయల నాణాన్ని విలన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే, ఎప్పుడో ఒకసారి పదిరూపాయల నాణెం చెల్లదనే పుకారు వచ్చింది. దాన్ని జనం నమ్మేశారు. చదువుకున్నవారు.. చదువుకోనివారు.. పెద్దపెద్ద ఉద్యోగాలు చేసేవారు.. అందరూ పదిరూపాయల నాణాన్ని తీసుకోవడం మానేశారు. పదిరూపాయల నాణెం చెల్లదని అంటే జైలుకు పంపిస్తామని రిజర్వ్ బ్యాంక్ చెప్పినా జనం ఇప్పటికీ పది రూపాయల నాణాన్ని మిగతా కాయిన్స్.ని నమ్మినట్టుగా నమ్మరు. పుకారుకు వున్న బలం అలాంటిది. జగన్ అండ్ టీమ్ కూడా తమను వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా రకరకాల పుకార్లు పుట్టిస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ నిజాలు చెబుతూ వుండేసరికి వాటికి టీడీపీ రంగు, కులంరంగు పులుముతారు. వాళ్ళూ వాళ్ళూ ఒక కులం వాళ్ళు కాబట్టి జగన్‌కి వ్యతిరేకంగా ఈ న్యూస్ రాసి వుంటార్లే అని జనం అనుకునేలా చేయడం ఒక వ్యూహాత్మక కుట్ర. న్యూట్రల్‌గా వున్నవారిని కూడా ప్రజలు నమ్మకుండా చేసే భయంకరమైన కుట్ర. ఇదే నార్సీ విధానం. ఆమధ్య చంద్రబాబు నాయుడు భార్య మీద దుర్మార్గమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద మాట్లాడుతూ రోదిస్తే, దాన్ని మీడియాలో చూపించీ చూపించీ.. అతను ఏడవడం లేదు.. డ్రామా చేస్తున్నాడు అంటూ  జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. మనిషి అనేవాడు పగవాడు కళ్ళ వెంట నీరు పెట్టుకుంటే కొంచెమైనా చలిస్తాడు. అయ్యో అనుకుంటాడు. అదే ఒక మనిషి ఏడుస్తుంటే చూసి మనసు నిండా విశృంఖలంగా ఆనందం కలిగితే దాన్ని శాడిజం అంటారు. ఆ శాడిజం పుష్కలంగా కలిగిన వ్యక్తి జగన్. తనకున్న శాడిజాన్ని తనను నమ్మే వారి మనసులలో కూడా బలంగా నాటడమే ఈ నార్సీ విధానం. నార్సీ మానసిక వ్యాధి వున్నవాళ్ళు తనను అనుసరించే వాళ్ళలో వున్న రాక్షసత్వాన్ని నిద్ర లేపుతారు.  (ఇంకావుంది)

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరు... కూట‌మిలో జోష్ పెంచిందా?

పోస్ట‌ల్ బ్యాలెట్ ఏపీ రాజ‌కీయాల్నే మ‌లుపు తిప్ప‌నుందా?   ప్రజలు ఎవరివైపు వున్నారు? అధికార‌, ప్ర‌తిప‌క్ష కూట‌మిలో అదే ఉత్కంఠ‌త‌.  మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తూ పావులు కదుపుతున్నారు.. మ‌రో వైపు జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీ కూట‌మి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇరు ప‌క్షాలు  మండుటెండలను సైతం లెక్కచేయకుండా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఓటు కీల‌కంగా మారింది. ముఖ్యంగా పోస్ట‌ల్ బ్యాలెట్ గెలుపు ఓట‌మిల నిర్ణ‌యంలో కీల‌కంగా మార‌నుంది. మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించారు. పోలింగ్ రోజైన మే 13వ తేదీ నాడు విధి నిర్వహణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్,  రెండు రోజుల పాటు  కొనసాగిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆరంభమైన ఈ ఓటింగ్.. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పని చేస్తోన్న అయిదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు  85 ఏళ్ళు నిండిన వయో వృద్ధుల కోసం హోం ఓటింగ్ ఈ నెల 3న స్టార్ట్ అయింది. ఈ నెల 10 వరకూ కొనసాగనుంది.   పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ తీరు చూస్తే, ప్ర‌భుత్వ ఉద్యోగ‌స్థులలో అధికార పార్టీపై వున్న అస‌హ‌నం, ఆగ్ర‌హం స్ప‌ష్టంగా క‌న‌బ‌డింది.  ఉద్యోగులంతా తమవైపే అనుకున్న వైసీపీ ఇప్పుడు ఆలోచనలో పడింది.   పోస్ట‌ల్ బ్యాలెట్ తీరు చూస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థమవుతోందని సోషల్ మీడియాలో విశ్లేషణలు వ‌స్తున్నాయి.   ఉద్యోగుల ఓట్లన్నీ తమకేనని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉంది అధికార పార్టీ, ఇప్పుడు చేతులెత్తేసింది. జీతాలు టైంకు ఇవ్వ‌కుండా ఉద్యోగులను తిప్పలు పెట్టారని, టీచర్లకు వైన్ షాపుల వద్ద డ్యూటీలు వేశారని, వారితో స్కూల్ లో టాయిలెట్లు కడిగించారని, ఇతర డిపార్ట్ మెంట్లలో కూడా ఉద్యోగుల స్వేచ్ఛను హరించినందుకు ఉద్యోగ‌స్తులు ఇప్పుడు త‌మ ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో చూపారు.పోస్టల్ బ్యాలెట్ లో కూట‌మిదే పైచెయ్యి క‌నిపిస్తోంది.      ప్ర‌భుత్వ ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు. అయితే దీని మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరో వైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా, రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది డౌటే అన్న భావన కూడా ఉంది.  అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ కూటమి కూడా ఒకరిని మించిన తీరులో మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని వాళ్ళు భ‌య‌ప‌డుతున్నారు.  అందుకే ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌

తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంధానం.. నారాయణ మూర్తిని నమ్మించి మోసం చేసిన జగన్!

మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు. అందుకే జగన్ తాజా ఎన్నికల మేనిఫెస్టో గురించి కనీసం పట్టించుకోవడం లేదనీ, ఆయన నవరత్నాలు ప్లస్ ను నమ్మడంమే లేదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందుకే జగన్ తన మేనిఫెస్టో గురించి మాట్లాడటం మానేసి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ మాటతప్పి, మడమ తిప్పిన మరో అంశం ఇప్పుడు  సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అదీ నటుడు, దర్శకుడు నారాయణ మూర్తికి ఇచ్చిన మాట కావడం విశేషం.  సామాజిక సమస్యలపై సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించే నటుడు ఆర్. నారాయణ మూర్తిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వామపక్ష భావజాలంతో ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో తన సినిమాలలో పరిష్కారం చూపుతారు. సీనీ పరిశ్రమలో అజాత శత్రువుగా, అందరి మనిషిగా గౌరవాన్ని పొందే ఆర్. నారాయణ మూర్తిని కూడా జగన్ నమ్మించి వంచించారు. అదీ ఒక రోజో, నెలరోజులో కాదు.. ఏళ్ల తరబడి ఆర్. నారాయణ మూర్తి జగన్ చెప్పింది చేస్తారన్న నమ్మకంతో ఉన్నారంటే జగన్ ఆయనను ఎంతగా నమ్మించారో అర్థమౌతుంది. ఇంతకీ విషయమేమిటంటే .. నారాయణ మూర్తి జగన్ వద్దకు ఒక ప్రతిపాదన తీసుకువెళ్లారు. అదేమిటంటే ఏలూరు కాలువలను  విశాఖ తాడవ నదితో అనుసంధానం చేస్తే రెండు జిల్లాల్లోనూ 56 వేల ఏకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రతిపాదనకు జగన్ వెంటనే ఆమోదం తెలిపేశారు. 2021 మార్చిలో ఈ ప్రాజెక్టు కోసం జగన్ ప్రభుత్వం 470 కోట్లు కూడా మంజూరు చేసింది. టెండర్లనూ పిలిచింది. దీంతో నారాయణమూర్తి దేశంలోనే ఇలాంటి మంచి సీఎం ఎక్కడా లేరంటూ ప్రశంసలు గుప్పించేశారు. సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నారని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో పనిలేదని, ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు. దేశంలోనే జగన్ లా ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న సీఎం మరొకరు ఉండని వేనోళ్ల పొగిడేశారు.  అయితే ఆర్భాటమే తప్ప ఆచరణ ఉండదని జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టు విషయంలో మరో సారి రుజువు చేసుకుంది. ప్రాజెక్టుకు అనుమతించిన మూడేళ్ల తరువాత కూడా ఇప్పటి వరకూ కనీసం శంకుస్థాపన జరగలేదు. ఈ ప్రాజెక్టు పూర్తిగా కాగితాలకే పరిమితమైంది. తత్వం బోధపడిన నారాయణ మూర్తి మౌనం వహించారు. తాను గతంలో జగన్ పై కురిపించిన పొగడ్తల వర్షం ఎవరికీ గుర్తుండకుండా ఉంటే బాగుండునని భావించడమే ఈ మౌనానికి కారణం అయ్యుండొచ్చు. కానీ నెటిజనులు మాత్రం జగన్ మోసాల జాబితాలో తాండవ నదితో ఏలూరు కాల్వల అనుసంథానం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేరిపోయిందంటూ మరోసాని జగన్ సర్కార్ వైఫల్యాలు, మోసాల జాబితాను సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తున్నారు. 

జగన్ మానసిక వ్యాధి ‘నార్సీ’ - పార్ట్ 2

జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్‌కట్‌లో ‘నార్సి’ అంటారని, ఆ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం. జగన్ ప్లాన్‌లో జీవితాలను నాశనం చేసుకున్న యువత ‘వాలంటీర్’ అనే విష వలయంలో చిక్కుకున్నారు. ఉద్యోగాలు వుండి, ఉపాధి వుండి, పరిశ్రమలు వుంటే, ఐదు సంవత్సరాలుగా కేవలం ఐదువేల రూపాయలకే పనిచేసే యువత ఎలా దొరకుతారు? ఉపాధి లేకపోవడం వల్ల  కేవలం ఐదువేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగంలో యువత చేరారు. జీవితంలో ఎదగాల్సిన, ఏదైనా స్కిల్, ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుని ముందడుగు వేయాల్సిన యువత ఐదేళ్ళపాటు తమ జీవితాన్ని ‘వాలంటీర్’ అనే ఉచ్చులో చిక్కుకునేలా చేసుకున్నారు.  ఏదో సేవ చేస్తున్నాం, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే భ్రమల్లో చిక్కుకున్న యువత తమ జీవితాలలో విలువైన ఐదేళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారు. మధ్యలో జీతం పెంచమన్న పాపానికి ప్రభుత్వ పెద్ద నుంచి పిచ్చి తిట్లు కూడా తిన్నారు. ‘నార్సీ’ జగన్ తన అబద్ధాలను వాలంటర్లు నమ్మేలా చేసి, తన అబద్ధాలను ప్రచారం చేసేలా వాలంటీర్లను వాడుకున్నాడు.  పోలవరం పూర్తయిందనుకోండి. కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. అప్పుడు రాయలసీమ కూడా కృష్ణ, గోదావరి జిల్లాల తరహాలో మారుతుంది. అలా మారకుండా చేసి, కృష్ణ, గోదావరి జిల్లాల వాళ్ళ మీద రాయలసీమ వాళ్ళకి ద్వేషం పెంచేలా చేసే కుట్రలో భాగమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం. రాయలసీమ సస్యశ్యామలం అయితే పగలు, ప్రతీకారాలు వుండవు, ఫ్యాక్షనిజం వుండదు.. అందరూ సంతోషంగా వుంటే తన మాట వినేవారు వుండరు.. అందుకే రాయలసీమను యథాతథంగా వుంచే కుట్రలో భాగంగానే పోలవరాన్ని పక్కనపెట్టాడు.  ఇక మద్యం గురించి చెప్పాలంటే, మద్యాన్ని నిషేధిస్తానని అధికారంలోకి వచ్చాడు. కేవలం స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం అమ్మేలా చేస్తానని, మద్య నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పి అధికారంలోకి వచ్చాడు. చెప్పింది చేయకపోతా విషం లాంటి కల్తీ మద్యాన్ని, రేట్టు మూడు నాలుగు రెట్లు పెంచి అమ్మాడు. ఇది కేవలం సొంత బ్రాండ్స్ ద్వారా వచ్చే డబ్బుకు ఆశపడి మాత్రమే కాదు... అంతకు మించి.. అంతకు మించి... ఒక మగాడు మద్యానికో, గంజాయికో బానిసైపోతే ఆ కుటుంబం చెల్లాచెదురైపోతుంది. అతలాకుతలం అయిపోతుంది. ఆ ఇంటి ఇల్లాలికి జగనన్న అవసరం పడుతుంది. కల్తీ మద్యం ద్వారా బావ ఉసురు తీసి, చెల్లికి చక్కటి తెల్లటి చీర పెట్టే గొప్ప అన్న రాజకీయం ఇది. ఒక భయంకరమైన, దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఇది.  ఇక అన్న క్యాంటీన్ల పేరు మార్చి కొనసాగిస్తే, జనం చంద్రబాబుని మర్చిపోతారా? మర్చిపోరు.. ఎక్కడో ఒకచోట, ఎంతో కొంత చంద్రబాబు గుర్తు మిగిలిపోతుంది కదా.. అది జగన్ భయం.. అందుకే జనం కడుపు మీద తన్నాడు.. అన్న క్యాంటిన్లు మూసేశాడు. తన రాజకీయ మనుగడ కోసం పేద జనం నోటి దగ్గర వున్న అన్నం తీసేశాడు. అన్న క్యాంటిన్లు ఉన్నాయనుకోండి.. ‘చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పని చేశాడా.. ఒక్క మంచి పని చేశాడా’ అని జగన్ పదే పదే అనలేడు కదా.. (ఇంకావుంది...)

కవితకు కోర్టులో చుక్కెదురు ... బెయిల్ నిరాకరణ 

మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసుకున్న రెండు పిటిషన్లను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది. కవితకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ ఇప్పటికే పూర్తి కాగా ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కవితకు బెయిల్ ఇవ్వడం కుదరదని పేర్కొంది. వాదనల సందర్భంగా.. ఎలాంటి ఆధారాలు లేకున్నా తన క్లయింట్ కవితను అక్రమంగా అరెస్టు చేశారని కవిత లాయర్ వాదించారు. ఈ వాదనను రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఈడీ దాఖలు చేసిన కేసుతో పాటు లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలపై సీబీఐ దాఖలు చేసిన కేసులతో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అంతకుముందు తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరు పరచాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్ నూ కోర్టు తోసిపుచ్చింది.

ప్రజల ఆస్తులు గుటకాయస్వాహా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   ఆయన తన ట్వీట్ లో చెప్పిందేమిటంటే..  కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన ఆయన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్  ఆయన దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి  వెనక్కు పంపేశారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు ఏ హక్కూ లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన తన అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం అని పేర్కొన్నారు.  వాస్తవానికి  ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రతిపాదించిన రోజునే ఆయన కన్ను ప్రైవేటు ఆస్తులపై పడిందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కాదేదీ తాకట్లునకు అనర్హం అన్న రీతిలోనే వ్యవహరించింది.  రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా  అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించింది కానీ కోర్టు మొట్టికాయలతో అది ఆగింది.  ఒక రాష్ట్రం తన పరిధికి చేయాల్సిన అప్పును ఏపీ ప్రభుత్వం ఎప్పుడో మించేసింది. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటుంది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టడానికి సైతం సిద్ధమైపోయింది. అయితే అలా చేసిన  అప్పులు సరిపోలేదేమో  ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  సొంతం చేసుకోవడానికి సిద్ధమైపోయింది.   ఇందుకు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ఉదంతమే ఉదాహరణ. ఏకంగా పీఎంవో ఆఫీసులో పని చేసిన సీనియర్ మోస్ట్ అధికారి భూములకే రక్షణ లేకుండా పోయిందంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

జగన్‌కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’

జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు. దీనికి గురించి మానసిక నిపుణులు ఎప్పటి నుంచో చెబుతూ వుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్‌కి ఈ వ్యాధి వుందని చెబుతున్నారు.  ఈ నార్సీ మానసిక వ్యాధి వున్న వ్యక్తులు తనకు ఫాలోవర్లను పెంచుకుంటారు. ఇతను పదేపదే చెప్పే అబద్ధాలను అతని ఫాలోవర్లు నిజమని నమ్ముతారు. దాన్ని వ్యాప్తి చేస్తూ విష వలయాన్ని సృష్టిస్తారు. ఆ విషవలయం టార్గెట్ అమాయకమైన మహిళలు, వృద్ధులు... ఇంకా లోకం పోకడ పెద్దగా తెలియని అమాయక యువత. జగన్‌కి వున్న మానసిక వ్యాధిని ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. షార్ట‌కట్‌లో ‘నార్సీ’ అని వ్యవహరిస్తారు. ఇది ఒక భయంకరమైన మానసిక రుగ్మత. ఈ జబ్బు వున్నవాళ్ళు మొత్తం అబద్ధపు బతుకు బతుకుతారు. ఫేక్ బతుకు బతుకుతారు. వాళ్ళ జీవితంలో ‘ప్రేమ’ అనే మాటే వుండదు. వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోరు.. వాళ్ళ ఇగోని మాత్రమే ప్రేమిస్తారు. వాళ్ళ చుట్టూ వున్న మనుషుల్ని కాదు కదా.. కన్న తల్లి, తండ్రితో సహా సొంత రక్త సంబంధీకులను, చివరికి తోబుట్టువులతో సహా ఎవర్నీ ప్రేమించరు. చివరికి కన్న బిడ్డలను కూడా ప్రేమించరు. సాధారణంగా సమాజంలో హత్యలు చేసే తల్లిదండ్రులు ఈ నార్సీ కోవకే చెందుతారు. ఇలాంటి వారు మేకవన్నె పులుల మాదిరిగా ప్రశాంత వదనంతో కనిపిస్తారు.  కానీ వాళ్ళో లోపల ఒక కాష్టం రగులుతూనే వుంటుంది. వైసీపీలో విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడు కావచ్చు, నాయకురాలు కావచ్చు కచ్చితంగా ‘నార్సీ’ అయి వుండాలి. ఈ ‘నార్సీ’ విధానాన్ని ప్రజల మీద ప్రయోగించడం వల్ల ఒక్కోసారి రాజకీయంగా విపరీతమైన అధికారం వచ్చే అవకాశం వుంది. అందుకే దీన్ని ప్రజల మీద ప్రయోగించి వుంటారు. ఎగ్జాపుల్ చెప్పాలంటే, జర్మనీని సర్వనాశనం చేసిన హిట్లర్ ఒక నార్సీ, వెనిజులాని నాశనం చేసిన హ్యూగో చావెజ్ ఒక నార్సీ, అల్ ఖైదా ఒసామా బిన్ లాడెన్ ఒక నార్సీ, తాలిబన్ సమూహాలు నార్సీ, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక నార్సీ. నార్త్ కొరియాలో మహిళలకు ఎంతమాత్రం స్వేచ్ఛ లేకుండా చేసిన కిమ్ ఈ మధ్య మహిళలతో సమావేశం ఏర్పాటు చేసి, మీరంతా నాకు కన్న తల్లితో సమానం అనగానే ఆ మహిళలందరూ కన్నీరు పెట్టుకుని కిమ్‌కి ప్రణామాలు చేశారు. ఈ నార్సీ లక్షణాలు వున్నవాళ్ళు అలాంటి వేషాలు వేస్తూ వుంటారు.  సినిమాల్లో చూస్తే, రీసెంట్‌గా వచ్చిన ‘యానిమల్’ సినిమాలో హీరోది నార్సీ బుద్ధి. పాత సినిమాల్లో సూర్యకాంతం చేసే కేరెక్టర్లు నార్సీ బుధ్ధికి నిదర్శనాలు. ఆమే మొగుణ్ణి కొడుతుంది, తిడుతుంది.. కానీ తనను తిట్టినట్టు, కొట్టినట్టు హడావిడి చేస్తుంది. ప్రకాష్ రాజ్ ‘ఒంగోలు గిత్త’ సినిమాలో చేసిన కేరెక్టర్ నార్సీ. మార్కెట్ యార్ట్ ఛైర్మన్ అవడం కోసం సొంత బాబాయినే చంపేస్తాడు.. ఎంతోమంది ప్రాణాలు తీస్తాడు.. సింపతీ క్రియేట్ చేసుకుంటాడు. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ ధరించిన పాత్ర నార్సీ. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ప్రిన్సిపాల్ కేరెక్టర్ కూడా నార్సీయే. ప్రజలందరికీ ఈ నార్సీల మూర్ఖత్వం గురించి, నార్సీల దుర్మార్గం గురించి, వాళ్ళ దాష్టీకం గురించి, వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ప్రజలకు అవగాహన కలిగితే, రాజకీయాల్లో ఈ నార్సీ విధానాన్ని ఎవరు ఫాలో అవుతున్నారో పసిగట్టవచ్చు.  జగన్ రాష్ట్రంలోని కంపెనీలను తరిమేయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు.. ఇసుకను ఆపేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకుందామన్న ఆశ మాత్రమే లేదు.. అంతకు మించి వుంటాయి. ఒక్క ఇసుకను ఆపితే భవన నిర్మాణ రంగ కార్మికులు మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా.. ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు కదా.. అలాంటి టైమ్‌లో వాళ్ళకి కాస్త డబ్బు ఇస్తే డబ్బు ఇచ్చిన వాడు గ్రేట్ అనుకుంటారు. ప్రజల బ్రతుకులు బాగుంటే, ఓ పదివేలో, పాతికవేలో ఇస్తే ఎందుకు గొప్పగా అనిపిస్తుంది చెప్పండి? అసలు ఉద్యోగాలే లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి యువత ఎగబడతారు. (ఇంకా వుంది)

ఓటమి భయంతో ఈసీని ఆశ్రయించిన ఓవైసీ 

హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల కమిషన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల కమిషన్ కు  బిజెపి మీద ఫిర్యాదు చేశారు. తెలంగాణలో హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మీద  మోడీ, అమిత్ షాలు దృష్టి పెట్టారని వీరిద్దరిని ఓడించాలంటే బిజెపి అభ్యర్థి మాధవిలతకు డిపాజిట్లు రాకుండా చేయాలని ఓవైసీ పిలుపునిస్తున్నారు. ప్రతీ బహిరంగ సభలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. 40 ఏళ్ల పాటు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంఐఎం ఏక చత్రాధిపత్యం వహిస్తున్నప్పటికీ మునుపెన్నడూ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించలేదు. ఎంఐఎం చరిత్రలో మొదటి సారి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించి బిజెపి మీద ఫిర్యాదు చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.  బోగస్ వోట్లతో మజ్లిస్ గెలుస్తూ వస్తుందని ఇప్పటికే మాధవిలత ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ సారి కొంత శాతం బోగస్ వోట్లు తగ్గిపోయే సూచనలు కనిపించడంతో అసదుద్దీన్ ఓవైసీ కి ఓటమి భయం పట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఓవైసీ సూచన మేరకు డమ్మీ అభ్యర్థిని నిలబెడుతారని ప్రచారంలో ఉంది. తెలంగాణలో కేవలం హైదరాబాద్ లోని పోలింగ్ బూత్ ల పైనే ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సిటీలోని 420 పోలింగ్ బూత్ లలోనే తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ లపై నిఘా పెట్టాలని సూచించారు.హైదరాబాద్ పై మాత్రమే స్పెషల్ ఫోకస్ ఎందుకని నిలదీస్తూ.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాతబస్తీలో ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

సొంత కుటుంబాల్లోనే నిరసన కుంపట్లు.. వైసీపీ కొంప మునిగిపోయినట్లేనా?

ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?  ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్వయంగా జనగ్ నుంచి, ఆ పార్టీలో బాగా నోరున్న నేతగా పేరుబడిన అంబటి దాకా, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఓడించడానికి తురుఫు ముక్కగా భావించి తెచ్చుకున్న ముద్రగడ పద్మనాభం వరకూ సొంత ఇంటి నుంచే నిరసన సెగలు ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ పార్టీ సొంతింటి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎం చేయాలో, ఎలా సమాధానం చెప్పుకోవాలో అర్ధం కాక అవస్ధలు పడుతోంది.  పార్టీ అగ్రనేతలు, మంత్రులు ఆఖరికి పార్టీ అధినేత ఇంట్లోనే  వ్యతిరేకత అధికారపార్టీకి వడదెబ్బ తగిలేలా చేస్తోంది. ముందుగా  పార్టీ అధినేత జగన్ విషయమే తీసుకుంటే ఆయనను సొంత కుటుంబ సభ్యులే నమ్మడం లేదు.  సొంత చెల్లి షర్మిల- చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత.. జగనన్నకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. చిన్నమ్మ సౌభాగ్యమ్మ కూడా జగనన్న పార్టీకి ఓటేయద్దని  కోరుతూ బహిరంగ లేఖ సైతం రాశారు.  చిన్నాన్న హంతకుడు అవినాష్‌రెడ్డికి ఎలా టికెట్ ఇచ్చావు? అసలు నీవు అన్నవేనా? నీకు మైండ్ పనిచేస్తుందా? లేదా? తండ్రిని చంపారన్న రిలయన్స్ కంపెనీ పరిమళ్ నత్వానీకి రాజ్యసభ ఎలా ఇచ్చావ్? నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటూ షర్మిల ఊరూ వాడా తిరుగుతూ జగన్ పరవు బజారున పడేస్తున్నారు. ఎన్నికల వేళ తన ప్రచారంలో జగన్ పై విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ సంధించని రోజుంటూ లేకుండా ఆమె సాగుతున్నారు.  ఇక జగన్ కూడా షర్మిల తన తండ్రికి వారసురాలు కాదంటూ కరాఖండీగా నిండు సభలో సెలవిచ్చారు.   ఇక స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత  మాజీ మంత్రి మద్రగడ పద్మనాభం ను కాపుల ఓట్లు చీల్చి వైసీపీని ప్రయోజనం చేకూర్చు తురుఫు ముక్కగా భావించి దరికి చేర్చుకున్నా జగన్ కు ఇప్పుడు ఆయన ఒక గుదిబండగా మారిపోయారు. అందుకు కూడా ముద్రగడు కుటుంబ పోరే కారణం అయ్యింది. ముద్రగడ పిలుపునిస్తే కాపు సామాజికవర్గం అంతా కలిసి వస్తుందని జగన్ భావించారు. అందుకే పిఠాపురంలో జగన్ ను ఓడించాలంటే ముద్రగడను పార్టీలో చేర్చుకుంటే సరిపోతుందని భావించారు. జగన్ పిలుపునందుకుని ముద్రగడ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు.  అలా చేరి ఊరుకోలేదు.. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే, తాను పేరు మార్చుకుంటానని  శపథం కూడా చేసేశారు.  అయితే ఆయనకు సొంత ఇంటి నుంచే వ్యతిరేక సెగ తగిలింది. ఆయన కుమార్తె స్వయంగా తన తండ్రిని నమ్మకండి అంటూ జనాలకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన తండ్రి జగన్ చేతిలో పావుగా మారి అనవసరంగా జనసేనాని పవన్ కల్యాణ్ ను తిడుతున్నారు. అది కరెక్టు కాదు అంటే ఆ వీడియోలో పేర్కొన్న ముద్రగత కూతురు తన ఓటు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించారు. దీంతో కూతురిపై ముద్రగడ ప్రాపర్టీ వ్యాఖ్యలు చేసి పరుపు పోగొట్టుకున్నారు.  సొంత కుమార్తే ముద్రగడను నమ్మడం లేదు.. ఇక ప్రజలెందుకు ఆయనను విశ్వసిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రి  బూడి ముత్యాలరాజు ఇంటి పోరు కూడా రచ్చకెక్కింది.  ఆ కథేంటంటే ఆయనకు ఇద్దరు భార్యలు.  మొదటి భార్య కొడుకు బూడి రవికుమార్. ఆయన  మా నాన్న ముత్యాలనాయుడుకు ఓటేయకండి. సొంత కుటుంబానికే న్యాయం చేయని వాడు ప్రజలకేం చేస్తాడంటూ రోడ్డెక్కారు.  పాపం ఆయనా ఇంటి పోరు కారణంగా అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసం పొందలేక ఎదురీదుతున్నారు.  ఇక తాజాగా సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి, మంత్రి అంబటి రాంబాబు ఇంట్లోనూ ఇంటి పోరు రచ్చకెక్కింది. ఆయన కుమార్తె భర్త తన మామ నీచుడు, నికృష్ణుడు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సత్తెన పల్లి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.  ప్రత్యర్థి నేతలపై  నోరు పారేసుకునే అంబటి ఇప్పుడు సొంత అల్లుడు తనపై చేసిన విమర్శలపై నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.   మొత్తంగా వైసీపీ అధినేత నుంచి ఆ పార్టీ కీలక నేతల వరకూ సొంత ఇంటి నుంచే ఎదురౌతున్న వ్యతిరేకతతో  సతమతమౌతున్నారు. సొంత ఇంటి కుంపట్లే నిరసన నిప్పులు చెరుగుతుంటే ఏం చేయాలో తెలియక సతమతమౌతున్నారు.  

జగన్ ఫొటో చిరిగిపోయింది.. పట్టాదారు పాసుపుస్తకాలు జగన్ కొంప ముంచేస్తాయా?

చంద్రబాబు  చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.  అయితే తాజాగా ఆయన పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలేంటంటూ ఫైర్ అయ్యారు. వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో విషయంలో మాత్రం ఆయన పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ భూములను వాళ్ల తాత, తండ్రి ఇచ్చారా? అంటూ నిలదీశారు. మన పెద్దలు మనకు వారసత్వంగాఇచ్చిన పుస్తకాలపై సైకో జగన్ ఫొటోలను సమర్ధిస్తారా అంటూ జగన్ పై చంద్రనిప్పులు చెరిగారు. అంతే కాదు ఆ పట్టాదారు పాసుపుస్తకాలను చించి పారేశారు.  కాకినాడలో ఎన్నికల సభలో ఆయన ఆగ్రహం అంబరాన్ని తాకింది. చంద్రబాబు ఆగ్రహం ధర్మాగ్రహమేనంటూ సభికులు చప్పట్లతో మద్దతు పలికారు.   అసలే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ఆ అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా జనంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆయనకు తోడుగా కూటమి భాగస్వామ్యపక్షాలు కూడా ల్యాండ్ టైలిటింగ్ యాక్ట్ దుర్మార్గమైనదన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరిగేలా ప్రచారంలో ఆ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే పులివెందులలో వైఎస్ జగన్ సతీమణి భారతిని ఓ వైసీపీ నేతే మా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకంటూ నిలదీశారు. ఆ ప్రశ్నకు సమాధానం లేక భారతి నేల చూపులు చూశారు. సరిగ్గా ఆ అంశాన్నే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. తొలి నుంచీ కూడా పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకంటూ తెలుగుదేశం ప్రశ్నిస్తూనే ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో అదే ప్రధాన అంశంగా తెరమీదకు తీసుకురావడంతో జనంలో కూడా ఇదే విషయమై చర్చ జరుగుతున్నది. మొదట భూమిపట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో, ఇప్పుడేమో  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ చట్టం. ఈ రెంటినీ కలిపి చూస్తే మన భూములు మనవి కాకుండా జగన్ చేస్తున్నారంటూ జనంలో పెద్ద చర్చ ఆరంభమైంది. ఆ విషయాన్నే చంద్రబాబు మరింత స్పష్టంగా ప్రజల గుండెలను నేరుగా తాకేలా లేవనెత్తారు.  జగన్ తీసుకువచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదని, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు భాష్యం చెప్పారు.  ఈ చట్టం అమలులోకి వస్తే పట్టాదారుపాసు పుస్తకం ఉండదు. పత్రాలుండవు. మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ఇది మీకు సమ్మతమేనా అని ప్రజజలను నేరుగా ప్రశ్నించారు.  ఎంతో మంది సీఎంలుగా పనిచేశారు. ఎవరైనా ఇలాంటి పనికిమాలిన చట్టం తెచ్చారా? ఏ సీఎం అయినా పట్టాదారు పుస్తకాలపై తన ఫొటో వేసుకున్నారా? అని నిలదీశారు.  ఈ ఫొటోల పిచ్చోడిని సాగనంపకపోతే మీ భూములన్నీ కబ్జా చేసేస్తారు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.  ఇక జగన్ ఫొటో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను చంద్రబాబునాడయుడు చింపేసి, గాల్లో ఎగురవేసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.  మాకు పొలాలిచ్చింది మీ తాత రాజారెడ్డీ కాదు, మీ నాయన వైఎస్సూ కాదు..  అంటూ నెటిజన్లు జగన్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు. పొద్దున్నే మీ ముఖం చూడాల్సిన ఖర్మ మాకేంటి సామీ అంటూ ఈసడించుకుంటున్నారు.   అసలు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో అన్న థీమ్ ను అమలు చేయడం మొదలైనప్పటి నుంచే జగన్ పై సామాజిక మాధ్యమంలో సెటైర్లే మరో రేంజ్ లో పేలాయి. అదేదో సినిమాలో చెప్పినట్లు... ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అంటూ జగన్ ను నెటిజన్లు ట్రోల్ చేశారు.    ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  ఏమైనా పెట్టాయా అంటూ అప్పట్లోనే సందేహం వ్యక్తం చేశారు.  ఇప్పుడు సరిగ్గా ఎన్నికల సమయంలో జగన్ ఫొటోల పిచ్చి ఆయన మెడకు చుట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో భూమి ఉన్న ఏ ఒక్కరూ జగన్ ఫొటోను చూడడానికి ఇష్టపడిని విధంగా పరిస్థితి తయారైంది. అదే ఆయనకు ఈ ఎన్నికలలో భారీ పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశంగా మారిపోయిందని అంటున్నారు. 

ఇన్ చార్జి డీజీపీపై ఎన్నికల సంఘం వేటు.. ఇంత ఆలస్యంగానా?

ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ  వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.   ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవథిలో బెంగాల్ డీజీపీపై వేటు వేసిన ఎన్నికల సంఘం, ఏపీలో ఇన్ చార్జ్ డీజీపీని మార్చడంలో చేసిన తాత్సారం విమర్శలకు తావిస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఇక చివరి క్షణంలో ఇక తప్పని సరి పరిస్థితుల్లో, అదీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై అధకార పార్టీ మూకలు దాడి చేసిన తర్వాత బదలీ వేటు వేసింది.  కానీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెలన్నర వ్యవధిలో సీఎం రేమేష్ పై దాడికి   ముందు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలూ, దాడులను ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది. వాస్తవానికి ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి.  ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా  ట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి ఆయన ఇన్ చార్జ్ డీజీపీయే.  ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలుగుదేశం  ఆరోపణలు చేసింది. వీటి వేటికీ స్పందించని ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగే సరికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గుర్తించింది. మరీ ముఖ్యంగా సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక రోజు ముందు ఇన్ చార్జి డీజీపీపై వేటు వేసింది. ఇప్పుడు ఇక వారం రోజులలో ఎన్నికలు జరగనుండగా కొత్తగా వచ్చే డీజీపీ పోలీసుల పని తీరును సమూలంగా మార్చేందుకు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా పోలీసుల పనితరులో మార్పు వచ్చి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చక్కబడుతుందేమో చూడాలి.  

గొట్టిపాటి లక్ష్మి వైపే దర్శి.. గెలుపు సునాయాసమే!

ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తొలుత జనసేనకు కేటాయించాలని భావించినప్పటికీ, తరువాత మాజీ మంత్రి సిద్ధారాఘవరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆ స్థానాన్ని ఆయనకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అయితే తరువాత ప్రత్నమ్నాయ అభ్యర్థి కోసం గాలించింది. ఆ గాలింపులో భాగంగా దర్శినియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి రంగంలోకి వచ్చారు. దీంతో దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  మధ్య రసవత్తర పోరుకు తెరలేచింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు గొట్టిపాటి లక్మికి అదనపు బలంగా మారింది. నియోజకవర్గంలో అన్ని వర్గాల వారూ కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నారు. కూటమి పట్ల మహిళలు, వృద్ధులు సైతం ఆసక్తి కనబరచడం గమనార్హం. కూటమి సభలకు మండుటెండలను సైతం లెక్క చేయకుండా పోటెత్తుతున్న జనం తెలుగుదేశం శ్రేణులలో జోష్ పెంచుతున్నది. అన్నిటికీ మించి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తన ప్రసంగాలతో ప్రజలను మంత్రముగ్థులను చేస్తున్నారు.  స్పష్టమైన హామీలు ఇవ్వడమే కాకుండా, వైసీపీ పాలనా వైఫల్యాలను సూటిగా సుత్తి లేకుండా ఎండగడుతున్న తీరు ప్రజలను ఆకర్షిస్తోంది. కష్టపడి పని చేసే తత్వం, ప్రజలలో మమేకం అవుతున్న తీరు  గొట్టిపాటి లక్ష్మికి సానుకూలాంశాలుగా మారాయి. ప్రజలలో ఆమె పట్ల నమ్మకాన్ని పెంచాయి. మరో వైపు  ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి దశాబ్దాల రాజకీయ అనుభవం, నియోజకవర్గ పరిధిలో ఆయనకు వివిధ వర్గాల ప్రజలతో ఉన్న సత్సంబంధాలు పెద్ద సంఖ్యలో వైసీపీ కేడర్ తెలుగుదేశం గూటికి చేరేలా చేశాయి. ఇది దర్శిలో తెలుగుదేశం అవకాశాలను మరింతగా పెంచింది. ఈ పరిణామాలతో దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం బలం అనూహ్యంగా పెరిగింది. దీంతో పరిశీలకులు సైతం దర్శిలో గొట్టిపాటి లక్ష్మి విజయం నల్లేరుమీద బండినడకలా మారిందని విశ్లేషిస్తున్నారు.