వీళ్ళని చూస్తే బాధ.. వాళ్ళని చూస్తే ఆనందం!!

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మన భారతదేశ పౌరులు విభిన్నగంగా వుంటారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంతమంది పద్ధతి చాలా బాధని కలిగిస్తూ వుంటుంది. అదే సమయంలో ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొంతమంది కమిట్‌మెంట్ ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక మైనస్ బాధిస్తే, మరో ప్లస్ దాన్ని బేలన్స్ చేస్తూ వుంటుంది. ఈ రెండు భిన్నత్వాలు కలిసి వుంది కాబట్టే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వున్న దేశంగా అయింది. చాలామంది ఓటర్లు ఓటు వేయాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎన్నెన్నో తాయిలాలు ఆశ చూపించాలి. స్వర్గాన్ని కిందకి దించుతామని హామీలు ఇవ్వాలి.. అప్పుడుగానీ కొంతమంది ఓటు వేయడానికి ఇళ్ళలోంచి బయటకి కదలరు. ఇంత చేసినా ‘మనం ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే’ అని ఊరుకునేవాళ్ళూ వుంటారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమేనా అనే సందేహం వచ్చేలా చేస్తారు. ఇలాంటివారు నిరాశ కలిగిస్తే, మరికొంతమంది ఉత్సాహం కలిగిస్తారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు తరలి వస్తారు. ఆ దూర ప్రాంతాలు విదేశాలు అయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అనేకమంది విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అలా వస్తున్న భరతమాత ముద్దుబిడ్దలతో విజయవాడ విమానాశ్రయి క్రిక్కిరిసిపోతోంది. విమానాశ్రయానికి వెళ్ళే రోడ్లు వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి ఓటర్లను చూసినప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని అనిపిస్తూ వుంటుంది. ఓటు వేయడం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి వస్తున్నారని, ఇంకో మూడు రోజులపాటు విజయవాడ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే వుంటాయని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. 

మా భూమి మీద నీ హక్కేంటి జగన్?

మా భూమి మీద నీ హక్కేంటి జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశావు.. ఇప్పుడు మా భూముల మీద పడ్డావా అని పలువురు ఆంధ్ర్రప్రదేశ్ రైతులు నిలదీస్తున్నారు. కడుపు కాలి, కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడుతున్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని జగన్ తమ భూముల మీద ఆధిపత్యం కోసం తీసుకొచ్చాడని, ఇప్పుడు ఆ యాక్ట్ కారణంగానే రైతులు జగన్ ప్రభుత్వాన్ని భూమిలో పాతిపెట్టబోతున్నారని అన్నారు. మా భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో చూసినప్పుడు గుండెలు మండిపోయాయని, మా తల్లిదండ్రులు ఇచ్చిన భూముల పుస్తకాల మీద జగన్ ఫొటో ఏంటని చాలా బాధపడ్డామని వారు చెప్పారు. అయితే, ఇంతకాలం జగన్ దురాగతాలకు భయపడి నోరు విప్పలేదని ఇప్పుడు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి, తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించడానికి సమయం వచ్చిందని వారు అంటున్నారు. 

వైసీపీ ఇసుక ముఠా అక్ర‌మ మైనింగ్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్రమ తవ్వకాల్ని తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతూనే ఉన్నార‌ని, దీనికి సంబంధించి ఇసుక రవాణ చేస్తున్న వాహనాలతో పాటు ఫొటోలు, తేదీ, సమయంతో కూడిన ఆధారాలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్ర కుమార్ సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా వ్యాఖ్యానించారు. ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన ఆరోప‌ణ‌లపై సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయ్యింది. అక్ర‌మ మైనింగ్ ఆపాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి, అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందో లేదో నిర్ధారించాల‌ని ఆదేశించింది.    గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అక్రమంగా 20 మిలియన్‌ టన్నుల ఇసుకను తవ్వి తరలించి ఉంటారని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ కిందకు తీసుకొచ్చి అమ్మడం ద్వారా 18 వేల కోట్లపైనే నేతలు వెనకేసుకొన్నారని ప్రముఖ జియాలజిస్ట్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెబుతున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో తేలాల్సి ఉందంటారాయ‌న‌.  గతంలో ఎన్నడూ లేనంతగా గత ఏడాదిగా అక్రమంగా ఇసుకను దోచుకున్నారని  ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.    సహజసిద్దంగా దొరికే ఇసుక విషయంలో జేపీ వెంచర్స్ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సమంజసం కాదని పర్యావరణవేత్తలు అంటున్నారు. "ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. వాటివల్ల నదీ ప్రవాహాల్లో వేగం, దిశ కూడా మారిపోతున్నాయి. పర్యావరణ హననం జరుగుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇసుక పేరుతో నదులను ఇష్టారాజ్యంగా తొలిచేస్తే తీవ్ర నష్టం తప్పదు’’ అని పర్యావరణ‌వేత్త ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులు జరుపుతున్న తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే అక్రమంగా తరలిస్తున్న 6.36 లక్షల టన్నుల ఇసుక పట్టుబడడం గమనిస్తే ఏపీలో ఇసుకని అక్రమార్కులు ఏ తీరున పక్కదారి పట్టిస్తున్నారో అర్థమవుతుంది. పట్టుబడిన ఇసుకనే అంత పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు చిక్కకుండా తరలిపోయింది ఎంత ఉంటుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

జగన్ కు ఓటేస్తే ఒక్కొక్కరికి 57 వేలు నష్టం

జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే, రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న పేదలు ఒక్కొక్కరికి రాబోయే అయిదేళ్లలో 57 వేల రూపాయలు నష్టపోతార‌ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీలక్ష్మీ శ్యామల చెబుతున్నారు. మహిళ ఓటర్లతో 27 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్ర‌చారం నిర్వ‌హించారు.  అధికారంలోకి వ‌స్తే చంద్రబాబునాయుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పింఛనును 4000 చేస్తానని ప్రకటించారు.  జులై నెలలో అరియర్స్ కలిపి 7వేల రూపాయల పింఛన్లు అందుకుంటారు.   జగన్ సర్కారు ప్ర‌స్తుతం కేవ‌లం మూడువేల పెన్షను మాత్రమే అందిస్తోంది. జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోలో  అయిదేళ్లకూ కలిపి 500 మాత్రం పెంచేలా హామీ ఇచ్చారు. అది కూడా.. 2028 ఏప్రిల్లో 250, 2029 ఏప్రిల్లో అంటే జస్ట్ ఎన్నికలకు ముందు మరో 250 పెంచుతానని పేర్కొన్నారు.  అంటే జగన్ ను గెలిపిస్తే ఇప్పుడున్న మూడు వేలు  మాత్రం ప్రజలకు అందుతాయన్నమాట.  ఇటు చంద్ర‌బాబు, అటు జ‌గ‌న్ హామీలను పోల్చి చూస్తే..చంద్రబాబు ఇచ్చేది అయిదేళ్లలో రూ.2.40 లక్షలు.  జగన్ ఇచ్చేది అయిదేళ్లలో రూ.1.83 లక్షలు. తేడా 57 వేలు.  అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారని శ్రీలక్ష్మీ శ్యామల  ప్ర‌చారం చేస్తున్నారు.  జ‌గ‌న్‌పై కేసులు కావొచ్చు, ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడూ ప్ర‌శ్నించ‌ని ఆయ‌న సొంత ప‌నులే చూసుకున్నారు. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు త‌దిత‌ర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మంటారు శ్రీలక్ష్మీ శ్యామల. ఆకువేడు ఉండి నియోజకవర్గంలో ఆమె రఘురామకృష్ణ రాజు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.  రఘురామకృష్ణంరాజు తన గెలుపు పక్కా ..మెజార్టీ లెక్కేసుకోవడం మిగిలింది. 

పిఠాపురం.. పవన్ కల్యాణ్ మెజారిటీపైనే అందరి ఆసక్తి!

ఏపీ ఎన్నికలలో  హాట్ సీట్లు అనదగ్గ వాటిలో మొదటిగా చెప్పుకోవలసింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని పవన్ కల్యాణ్ కు పోటీగా అదే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను వ్యూహాత్మకంగా వైసీపీ పోటీలో నిలబెట్టింది. అలాగే కాపు సామాజికవర్గానికే చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. పవన్ కు వ్యతిరేకంగా ముద్రగడ పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో మూడు రోజుల వ్యవధిలోకి వచ్చేసిన తరుణంలో ప్రచారం జోరందుకుంది.   అయితే వాతావరణం మాత్రం పవన్ కల్యాణ్ కు పూర్తి అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పవన్ కు గట్టి బలంగా మారింది. పవన్ కల్యాణ్ కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరోలు, పలువురు సినీ, బుల్లితెర సెలిబ్రిటీలు సైతం పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలంటూ ఓ వీడియో సందేశం ద్వారా ఇచ్చిన పిలుపు కూడా నియోజకవర్గ ఓటర్లపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు పిఠాపురంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి. ఇక జనసేన శ్రేణులైతే పవన్ విజయం ఎప్పుడో ఖరారైందనీ, ఇప్పుడు తమ దృష్టింతా ఆయన సాధించబోయే మెజారిటీపైనేనని చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించిన రాజకీయ పండితులు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. కొన్ని సర్వే సంస్థలు కూడా ఆయనకు 75 వేల నంచి లక్ష ఓట్ల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.   జగన్ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు కూటమి బలం, కాపు సామాజికవర్గం మద్దతు కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాజముద్ర కోసం రైతులు రెడీ!!

మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, తెలుగుదేశం కూటమికి ఓటు వేసి జగన్ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ 4న ఫలితాలు రాగానే తమ తమ పొలాల్లో సరిహద్దు రాళ్ళమీద వున్న జగన్ ముఖాన్ని చెక్కేయడానికి  కొడవళ్ళు సిద్ధంగా వుంచుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు అవుతాయి. అలా రాజముద్రతో కూడిన పాస్‌ బుక్ తమ చేతికి అందిన వెంటనే, జగన్ ముఖచిత్రంతో వున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను సాముహికంగా దహనం చేయడానికి పిడకలు, కట్టెలు రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టగానే లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు.. అప్పుడు రైతులందరూ నా భూమి నా సొంతం అని సంతోషంగా అరవడానికి సిద్ధంగా వున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు   భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిులు కోసం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిలు పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా సింఘీ సుప్రీంను అభ్యర్థించారు. అయితే కోర్టు ఆయనకు జూన్ 1వ వరకూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది. రాజకీయ ప్రచారం కోసం ఒక వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం అన్నది ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదని పేర్కొంది. అయితే కోర్టు మాత్రం ఈ 21 రోజులూ కేజ్రీవాల్ లోపల ఉన్నా, బయట ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేసింది. అలాగే జూన్ 2న ఈడీ అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవితకు పలు మార్లు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.  

కూటమికి వినూత్నంగా రైతుల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులు టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమికి వినూత్నంగా మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన కౌలు రైతులు ఎన్టీయే కూటమి గుర్తులను తమ పొలంలో నారుతో వచ్చేలా చేయడం ద్వారా మద్దతు తెలిపారు. గోంగూర విత్తనాలను క్రమపద్ధతిలో మొలకెత్తించడం ద్వారా సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుల రూపంలో నారు మొలకెత్తేలా చేశారు. అలాగే ‘ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు’ అనే నినాదం కూడా మొలకెత్తిన నారు ద్వారా కనిపించేలా చేశారు. ‘అత్తోట కౌలు రైతులు’ అనే అక్షరాలు కూడా కనిపించేలా నారును మొలకెత్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా లాండ్ టైటిల్ చట్టం నుంచి తమను కాపాడేది ఎన్డీయే కూటమేనని రైతులు భావిస్తున్నారు. అందుకే కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు.

నవనీత్ కౌర్ పై కేసు

అబ్ కీ బార్ 400 బహార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి హైదరాబాద్ లోకసభ స్థానం  మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది. 40 ఏళ్లుగా హైద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలుస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీని ఓడించడానికి బిజెపి అధిష్టానం భారీ వ్యూహంతో ఉంది. ఎవరూ ఊహించని  మహిళా అభ్యర్ధిని రంగంలో దించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్  షో నిర్వహిస్తే దేశవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలను రంగంలో దించుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల హీరోయిన్ అయిన నవనీత్ కౌర్  హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత  తరపున ప్రచారానికి వచ్చి  కేసులో ఇరుక్కున్నారు.  హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే మాధవీలతపై మజ్లిస్ పార్టీ ఈసీ కి ఫిర్యాదు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోలీస్ కేసు నమోదు చేయించడం చర్చనీయాంమైంది. 

గెలుపు దారి కానరాదేమి బాలినేని!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు బాలినేని అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.   ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2019 వరకూ ఒంగోలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తోంది. 2019 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన బాలినేని జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం అన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. అభివృద్ధి మాట అలా ఉంచితే ఆయన హయాంలో నియోజకవర్గంలో అరాచకం తాండవించింది. స్వయంగా బాలినేని కుమారుడిపైనే భూ కబ్జాలు, దాడుల ఆరోపణలు ఉన్నాయి. బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో సిట్ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందంటే బాలినేని హయాంలో నియోజకవర్గంలో ఏ స్థాయిలో అరాచకత్వం రాజ్యమేలిందో ఊహించవచ్చు.  అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్ంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  తాగునీటి పథకాలు, పోతురాజు కాలువ ప్రాజెక్టు విషయంలో బాలినేని వైఫల్యాలు నియోజకవర్గ ప్రజలలో బాలినేని ప్రతిష్టను మసకబార్చాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కు ప్రజా మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో దామచర్ల దూసుకుపోతుంటే.. బాలినేని సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. అలాగే ఒంగోలు  సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో దిగడం కూడా బాలినేని విజయావకాశాలపై ప్రభావం చూపనుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు, కొంండెపి నియోజకవర్గాలలో మంచి గుర్తింపు ఉంది. బైపాస్ రోడ్డు వంటి నిర్మాణాలతో ప్రజలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబంపై నియోజకవర్గ ప్రజలల సానుభూతి వ్య్తఅవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, టీచర్లు, కాపు సామాజికవర్గం ఈ సారి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, దామచర్ల విజయానికి మద్దతు ప్రకటించారు  

ఓటు వేయ‌డానికి ఎన్నారైల రాక! టీడీపీ గెలుపు కోసం ఎన్నారైల‌ ప్రచారం

ఎన్నిక‌ల పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 25 వేలకు పైగా ఎన్నారైలు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, కెన‌డా, లండ‌న్‌తో పాటు  గల్ఫ్‌ దేశాల నుంచి పోలింగ్‌లో పాల్గొన‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ -  విజయవాడ విమానం రద్దీ నెలకొంది.  ఓటు  హక్కు వినియోగించుకోవడానికి  మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇదే ఒరవడి మరో మూడు రోజు లు కొనసాగుతుంది అని విమానాశ్రయాధికారులు చెబుతున్నారు.  విదేశాలనుండి వచ్చే వారంతా చంద్ర‌బాబుకు సంఘీభావంగానే వస్తున్నారు. టీడీపీ కూట‌మి గెలుపు కోసం ఎన్నారైలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విదేశాలలోని టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో  ఉద్యోగాలకు సెలువు పెట్టి, త‌మ వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి ఓటు వేయ‌డానికే విమానం ఎక్కేశారు.  ఈ రకమైన అంకితభావం కేర‌ళ‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడు ఏపీకి చెందిన వారు ఓటు వేయ‌డానికి భారీ సంఖ్య‌లో విదేశాల నుంచి వ‌స్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాలలోనూ అమెరికా నుండి వచ్చి ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని రక్షించేందుకు తాము ప్రత్యక్షంగా రంగంలో దిగిన‌ట్లు వారు చెబుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పోటి చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నారై తెలుగుదేశం బృందాలు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్నారు. మంగళగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూంలో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కీలకపాత్ర వహిస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా!

వేమన శతకం, సుమతీ శతకం తరహాలోనే భాస్కర శతకం కూడా వుంది. మారవి వెంకయ్య కవి 16వ శతాబ్దంలో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలోని ఒక పద్యం ఇలా చెబుతుంది... దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్ దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్, దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!   ఈ పద్యం అర్థం ఏమిటంటే, దానం చేయడం చేతగాని ధనికుడికి ఎంత సంపద వుండి ఏం లాభం? అడవిలో బూరుగుచెట్టు విరగ కాస్తుంది. కానీ, దాని కాయలు ఎవరికీ ఉపయోగపడవు. దాని కాయలు పగిలిపోయి దాంట్లో వున్న దూది మొత్తం గాలిలోకి ఎగిరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. ఈ పద్యం తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్‌కి వున్న జనాకర్షణ అడవిలో పుట్టిన బూరుగ చెట్టు మాదిరిగా అయిపోయింది. ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడకుండా వృధా అయిపోయింది. అకారణంగా తెలుగుదేశం పార్టీ మీద అలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటున్నారు. పార్టీకి దూరంగా వుండటమే కాకుండా, కొడాలి నాని లాంటి వ్యక్తులకు అండగా నిలిచి, వాళ్ళ నోరు ఎంత మాట అయినా అనడానికి ధైర్యం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు, ఆయన సన్నిహితుల ఉద్దేశం కావచ్చు.. తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలి. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలూ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించే జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా వున్నారు. ఏ నిమిషంలోనైనా అతని మనసు మారి ప్రచారానికి వస్తారేమోనని తెలుగుదేశం వర్గాలు ఎదురుచూశాయి. తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం అని అనుకుంటూ ఆయన అభిమానులు ఆనందిస్తూ వుంటారు.. అది వేరే విషయం! ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా, చంద్రబాబును విమర్శించడానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ వుంటారు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని ఎవరూ అనుకోరు. ఈసారి ఎన్నికలలో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం వర్గాలు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తే వున్నాడనే విషయాన్ని మరచిపోయారు. ఆయన ప్రచారం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. గత ఎన్నికలలో రామయ్యా.. వస్తావయ్యా అన్న తెలుగుదేశం.. ఈసారి మాత్రం రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పకుండానే చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా బెట్టు చేసి, బిల్డప్ ఇచ్చే అవకాశం ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. కానీ వైసీపీ మాత్రం జూనియర్ పేరుతో ఫేక్ ప్రచారం చేసుకుంటోంది. జూనియర్ ఫొటో పెట్టుకుని, ఆయన వైసీపీకి మద్దతుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయిన పార్టీకి ఉపయోగపడలేదు. కాని పార్టీ మాత్రం ఇలా ఫేక్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. 

ఫోనే లేకుండా నంబరెక్కడిది జగన్ రెడ్డీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను చెప్పే అబద్ధాలు గోడకట్టినట్లు కాదు కదా కనీసం తడికె కట్టినట్లు కూడా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకురావడం, అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు కావడం జగన్ కు ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోయింది. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా జరిగిన గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఎన్నికలలో సానుభూతి లబ్ధి కోసం చేసిన ప్రయత్నం ఎలా బూమరాంగ్ అయ్యిందో తెలిసిందే. గాయం తగిలిందంటూ డజను మంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి, గాయానికి పెద్ద పట్టీ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించిన జగన్ ఆ పట్టీ తీసేయగానే నుదుటిపై గాయానికి సంబంధించి చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా అభివర్ణిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి.   తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనకు ఫోనే లేదంటూ ఓ బ్రహ్మాండమైన విషయం వెల్లడించారు. జగన్ తనకు ఫోన్ లేదు అని చెప్పి నెటిజనులకు అడ్డంగా బుక్కైపోయారు. ఫోన్ లేదు అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఒక వేళ ఫోన్ ఉన్నా ఆ ఫోన్ నంబర్ కూడా తనకు తెలియదని మరో  మాట అన్నారు. ఫోన్ లేకుండా నంబర్ ఎందుకు ఉంటుంది జగన్ భాయ్ అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.   ఇంకా స్పష్టంగా జగన్ తన ఫోన్ బాగోతం ఎలా చెప్పారంటే... తన దగ్గర ఫోన్ లేదు అన్నారు. అలా అని ఊరుకోకుండా  ఫోన్ నంబర్ కూడా లేదు. అసలు నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు అని సాగదీశారు. ఫోనే లేకపోతే.. నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది సీఎం గారూ అని నెటిజనులు నిలదీస్తున్నారు. అదే సమయంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి మూడు రాజధానులు కట్టేసినట్లే లేని ఫోన్ కు కూడా నంబర్ ఉందేమో అంటూ జోకులేస్తున్నారు.   అదే సమయంలో  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జగన్ తన అఫిడవిట్లో పోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఎ9849904123. ఫోన్ లేని జగన్ కు నంబర్ ఎలా వచ్చింది. అసలు తనకే తెలియని నంబర్ ను అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారు.  అంటూ నెటిజనులు ప్రశ్నలు సంధిస్తుండటంతో అసలా ఇంటర్వ్యూ ఇవ్వనేల.. ఇచ్చితిని పో ఫోన్ బాగోతం గురించి చెప్పనేల? అంటూ జగన్  తల బాదుకుంటూ ఉండొచ్చు. 

టాలీవుడ్ సపోర్టు తెలుగుదేశం కూటమికే!

ఆంధ్రప్రదేశ్ లో  మే 13న పోలింగ్ జరగనుంది. శనివారం (మే 11) సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది.  ఎన్నికల ప్రచారంలో సినీ తళుకులు ఈ సారి పెద్దగా కనిపించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం కూటమికి సామాజిక మాధ్యమం ద్వారా తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటించారు. హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వీరిరువురికీ వారి అభిమానుల మద్దతు ఎటూ ఉంటుంది. అలాగే నందమూరి హీరోల మద్దతు బాలయ్యకు, మెగా హీరోల సపోర్టు పవన్ కల్యాణ్ కు  ఉంటుంది. పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరోలు సాయిధర్మతేజ,  వైష్ణవ్ తేజ్, నాగబాబు వంటి వారు ప్రచారం చేశారు. మెగా స్టార్  చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా మద్దతు తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు.ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ తరఫునా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రచారం చేశారు. అన్నిటికీ మించి బాలకృష్ణ కూటమి తరఫున సీమ మెత్తం తిరిగి చేసిన ప్రచారానికి భారీ స్పందన  అభించింది. అదే విధంగా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ అభ్యర్థుల తరఫున హీరో విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం చేశారు.   నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ కుటుంబాలే కాకుండా  కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల జాబితా భారీగానే ఉంది. అలాగే  హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్, సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి,  జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ వంటి వారు కూటమికి మద్దతు ప్రకటించారు.  వీరే కాకుండా ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తమ మద్దతు కూటమికే అని స్పష్టం చేశారు. టాలీవుడ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కారణంగా..  అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున  వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ తరఫున ఈ సారి సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ మద్దతు పలికిన దాఖలాలు లేవు. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రముఖ కమేడియన్ అలీ అసలు పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలాగే ఆ పార్టీ తరఫున పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికే పరిమితమయ్యారు.    

ఏపీ ఫలితాలపై కేసీఆర్ బానిసల ఊహలు!!

చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్‌కి విపరీతమైన ద్వేషం. ఎందుకంటే, ఆ రోజుల్లో కేసీఆర్ తోక కట్ చేసింది చంద్రబాబు. అలా తోక కట్ చేయడం వల్లే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశాడు. యువతరం ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వస్తే, దాన్ని తన గొప్పగా కలరింగ్ ఇచ్చి, పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఘోరమైన పాలన అందించాడు. తాను ముఖ్యమంత్రి అవడానికి పరోక్షంగా చంద్రబాబు కారణం అయినప్పటికీ కేసీఆర్‌కి చంద్రబాబు అంటే ద్వేషం. కేసీఆర్ అధికారంలో వున్న పదేళ్ళకాలంలో చంద్రబాబు మీద ఆయన చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు.. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేత ఛీ కొట్టించుకుని, అధికారం కోల్పోయిన కేసీఆర్ ఇప్పటికీ చంద్రబాబు మీద విషం కక్కుతున్నాడు. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని తన దగ్గర సమాచారం వుందని వీలైనచోటల్లా ఎవరూ అడక్కపోయినా చెబుతూ నోటి దురద తీర్చుకుంటున్నాడు.  చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి దెబ్బకి అధికారం కోల్పోయిన కేసీఆర్ లబోదిబో అంటున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ తట్టుకోగలడా.. అటు గురువు, ఇటు శిష్యుడు అధికారంలో వుంటే కేసీఆర్ కుళ్ళుకుని, క్రుంగి కృశించిపోతాడు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాడు అని విషప్రచారం చేయడానికి కేసీఆర్ వెనుకాడటం లేదు. మొన్నటి ఎన్నికలలో ఈయన గెలుస్తాడో, గెలవడో ఈయనకి తెలియదుగానీ, ఏపీ ఎలక్షన్ల గురించి ఈయన జోస్యం చెబుతున్నాడు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలున్న తెలంగాణలో ఒక్క స్థానం కూడా బీఆర్‌ఎస్‌కి వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. తనకు గెలవటం చేతకాదుగానీ, చంద్రబాబు ఓడిపోతాడని ఈయన పనికిమాలిన జోస్యాలు చెబుతున్నాడు. కేసీఆర్ వ్యవహారం అలా వుంటే, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతుకులు వెళ్ళదీస్తున్న ఆయన సొంతమీడియాలో పనిచేసే బానిసలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అంటూ కథనాలు వండుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు పొరుగు రాష్ట్రం గొడవలు మా రాష్ట్రంలో ఎందుకు అంటూ వదరుగా మాట్లాడిన కేటీఆర్ మనుషులు ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఎన్నికల గురించి ఎక్కడలేని ఇంట్రస్టు చూపిస్తూ కథనాలు వ్యాప్తి చేస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెత్తకుండీలో వేసేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ డైరెక్ట్.గా డంపింగ్ యార్డుకు చేరుకుంటుంది. బీఆర్ఎస్ డంపింగ్ యార్డుకు చేరుకుంటే కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతికే జనాలకు పోషణ వుండదు. అందుకే చంద్రబాబు మీద విష ప్రచారం చేస్తూ, తాము చేస్తున్న విష ప్రచారం నిజం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు మాత్రం వీళ్ళ ఆకతాయితనాన్ని గమనిస్తున్నారు. 

గుడివాడ టిడిపి అభ్యర్థి తరపున కుమారి ఆంటీ ప్రచారం

సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు అంతా కాదు. హైదరాబాద్ కుమారి ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యారామె. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు.  మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేశ్‌ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుంద‌ని కుమారి ఆంటీ వ్యాఖ్యానించారు.  తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ, మమకారంతో ఇక్కడికి వచ్చానని.. ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదని దుయ్య‌బ‌ట్టారు.  వెనిగండ్ల రాము చ‌క్క‌టి విజన్ ఉన్న నేత అని.. కష్టపడేవారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్ప‌టికే చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. రాము వంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రామును, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కుమారీ ఆంటీ కోరారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు , జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, 32, 31, 25, 21,24 వార్డుల టీడీపీ, జనసేన కమిటీల సభ్యులు పాల్గొన్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

కడప ఓటు.. ఒకటి అటు.. ఒకటి ఇటు.. అవినాష్ పనైపోయిందా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గెలుపు ఓటములపై సర్వేలన్నీ వార్ వన్ సైడే అని చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరులో కానీ, స్వయంగా ఆ పార్టీ  అధినేతలో కూడా ఓటమి భయం ప్రస్ఫుటమౌతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని  స్వయంగా జగన్ ప్రకటించి కాడె పడేసినట్లు చెప్పేశారు. దీంతో వైసీపీ శ్రేణులలో నైరాశ్యం కానవస్తోంది. ఇవన్నీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రతిఫలిస్తున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు నభూతో అన్న చందంగా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నతీరు కూడా వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాన్నే ఇచ్చింది.  అయితే రాష్ట్ర మంతో ఒకెత్తు అయితే రాయలసీమది ఒక్కటీ ఒకెత్తు. మరీ ముఖ్యంగా కడప జిల్లా పరిస్థితే వేరు అని అంతా అంటుంటారు. కడప జిల్లాలో వైఎస్ ముద్ర అత్యంత బలంగా ఉంటుంది. ఆయన సీఎం కావడానికి ముందు నుంచీ కూడా కడప అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకున్నా.. ఆ జిల్లాలో కాంగ్రెస్ బలం మొత్తం వైఎస్ బలమేనన్నది తెలిసిందే. వైఎస్ మరణానంతరం వైఎస్ బలం, బలగం జగన్ కు బదలీ అయిపోయింది. 2014, 2019 ఎన్నికలలో ఇది స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికలలోనూ అదే పరిస్థితి అని అంతా భావించారు. అయితే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి, కడప ఎంపీగా పోటీలోకి దిగడంతో కడపలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అలా అని వైఎస్ ను అభిమానించేవారంతా ప్లేటు ఫిరాయించి.. జగన్ కు దూరం జరిగి షర్మిల పంచకు వచ్చేసిన పరిస్థితీ లేదు. ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో వైఎస్ అభిమానులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కడపలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అని డిసైడైపోయారు. అంటే కడప లోక్ సభ స్థానంలో  ఒక  పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కడప ఓటర్లు భావిస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ. వారి విశ్లేషణ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చే సరికి వైఎస్ కుమారుడైన జగన్ పార్టీ వైసీపీ అభ్యర్థికి, కడప లోక్ సభ ఎన్నికలలో వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని మెజారిటీ జనం భావిస్తున్నారు. అదే జరిగితే కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పనైపోయినట్లే అనడంలో సందేహం లేదు. కడప లోక్ సభ లో వైసీపీ ఓట్లను భారీగా షర్మిల తన ఖాతాలో వేసుకుంటారు. తెలుగుదేశం కూటమి ఓట్ల లో ఎటువంటి చీలికా ఉండదు. దీంతో అవినాష్ కు అంటే వైసీపీకి భారీ నష్టం వాటిల్లుతుంది. వైసీపీ ఓట్లలో భారీ చీలిక అనివార్యమని షర్మిల ప్రచారానికి వస్తున్న విశేష జనస్పందనే చెబుతోంది. దీంతో  కడప లోక్ సభ ఎన్నికలలో పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం కూటమి మధ్యే అన్న వాతావరణం కనిపిస్తోంది.  వైసీపీ వీరభక్త హనుమాన్ వంటి కేడర్, నేతలూ కూడా వైఎస్ కుమార్తెకు ఓ ఓటు వేద్దాం అన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.  

వామ్మో.. జనం భూమిపై జగన్ భారీ కుట్ర!

ఒక తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి ఊడిపోయే ముఖ్యమంత్రి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన కామెంట్లు విని జనానికి మతిపోతోంది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని, జనం భూమిని కబళించడానికి ఇన్ని ప్లాన్స్ వేస్తూ, పైకి మాత్రం జనానికి మేలు చేయడానికి మాత్రమే దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తెస్తున్నట్టుగా జగన్ మాట్లాడుతున్న తీరు చూసి ‘ముదురు టెంకెవే’ అని అని జనం అనుకుంటున్నారు.  ఎవరైనా సరే ఫలానా భూమి తమది అని ప్రభుత్వం దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఎవరైనా ఆ భూమి తమదని ప్రభుత్వానికి క్లైమ్ చేసుకుంటే, ఆ విషయాన్ని సదరు అసలు ఓనరు గుర్తించి, నిర్ణీత వ్యవధిలో ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే ఎవరైతే ముందు ఆ భూమి తమదని క్లెయిమ్ చేశారో వారికే ఆ భూమి చెందుతుంది. ఆ తర్వాత భూమి రియల్ ఓనర్ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ కూడా వుండదు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటే, ప్రభుత్వమే జరిగిన పొరపాటును గ్రహిస్తుంది. నష్టపోయిన వ్యక్తికి ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. అంతే తప్ప, అక్రమంగా భూమిని కొట్టేసిన వ్యక్తిని ఏమీ అనదు. ఇక్కడ పెద్ద తిరకాసు ఏమిటంటే, ఏ భూమి అయినా గవర్నమెంట్ విలువ ఎకరానికి రెండు లక్షలు వుంటే, దాని విలువ మార్కెట్లో ఎన్ని కోట్లయినా వుండవచ్చు. ప్రభుత్వ ధరకు, అసలు ధరకు చాలా వ్యత్యాసం వుంటుంది. అంటే, జగన్ మనుషులే భూములు కబ్జా పెడతారు. భూమి సొంతదారు లబోదిబోమంటే, గవర్నమెంట్ పరిహారం ఇస్తుంది. అంటే, లక్షలు, కోట్ల విలువ చేసే భూమికి ప్రభుత్వ రేటు ఎంత వుందో అంత ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. భూమి విలువ ఎంత వుందో అంతే ఇచ్చాంగా.. ఇందులో మా తప్పేముంది అని అమాయకంగా మాట్లాడుతుంది. నీ భూమిని నువ్వు కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహించావు, అందుకే అది అన్యాక్రాంతం అయింది. అయినా సరే, ప్రభుత్వం దయతలచి నీకు నష్టపరిహారం ఇచ్చింది అని దానకర్ణుడికి కజిన్ సిస్టర్లా మాట్లాడుతుంది. అప్పుడు భూమి యజమానికి ఏడవటం తప్ప చేసేదేం వుండదు.