గుప్పెడు గుండెకు ..గ్లాసుడు జ్యూస్

ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50 శాతానికి పైగా, అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.  కాబట్టి అధిక రక్త పోటును అదుపులో వుంచగలిగితే గుండెకు ముప్పు తగ్గినట్టే.  అందుకు వ్యాయామం , మంచి ఆహరం ముక్య సూత్రాలు . వీటితో పాటు  ఉదయాన్నే ఓ గ్లాసుడు జ్యూస్ తాగండి చాలు అంటున్నారు పరిశోధకులు. ఏ ఏ జ్యూసులు గుండెకు మంచివంటే .. * బీట్రూట్ పేరు వినగానే, మొహం చిట్లిస్తారు చాలామంది. కాని రోజు ఉదయాన్నే ఓ చిన్న  గ్లాసు బీట్రూట్ రసం తాగితే రక్త పోటు అదుపులో ఉంటుందట. బీట్రూట్ లో వుండే నైట్రేట్ కంటెంట్ రక్త నాళాలని శుభ్రపరచి అవి విచ్చుకునేలా చేస్తుంది అంటున్నారు లండన్ స్కూల్ అఫ్ మెడిసిన్ పరిశోధకులు . * యూనివర్సిటీ అఫ్ వేస్కోసిన్ పరిశోధకుల ప్రకారం రోజుకి ఒక గ్లాసుడు ద్రాక్ష రసం చాలు గుండె గట్టిగా ఉండటానికి .  ద్రాక్ష రక్త నాళాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుందట . దాంతో రక్త సరఫరా సజావుగా సాగుతుంది.  అంతేకాకుండా బ్యాడ్ కొలస్ట్రాల్ ని కూడా తగ్గించగలదు. రక్తనాళాలలో ఆటంకాలు వంటి ముప్పు తగ్గుతుంది.  * ఇక ఫ్రెంచ్ వైద్య నిపుణులు కమలా రసం తప్పక తాగాలి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే అంటున్నారు. కమలాల లో వుండే హెస్పిరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని చెబుతున్నారు. అధిక రక్తపోటుతో బాధ పడేవారు రోజు ఈ జ్యూస్ తాగితే నెలరోజుల్లో రక్త పోటులో తరుగుదల కనిపిస్తుందని తేలింది వీరి పరిశోధనలలో . అయతే బిపి తో పాటు షుగర్ కూడా వుంటే మాత్రం ఒకసారి వైద్యుల సలహా తీసుకోవటం మంచిది అంటున్నారు. చివరిగా ఒక్క మాట జ్యూస్ లు మంచివన్నారు కదా అని వాటిలో ఇంత పంచదార వేసుకుని తాగకండి అని గట్టిగా చెబుతున్నారు నిపుణులు.  పంచదార ఏ రకంగా చూసినా మంచిది కాదని తెలిసిందే గా . అందులోనూ జ్యూస్ ల లో కొంచం ఎక్కువ మొతాదులోనే వేస్తారు . కాబట్టి ఒట్టి రసాలని తీసుకు తాగండి ..గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి .

సూర్యుడు ఎంతసేపు ఉంటే అంత ఆరోగ్యం

  మన పూర్వీకులు సూర్యుని ప్రత్యక్ష దైవంగా భావించేవారు. ఇప్పటికీ సూర్యడు అంటే హిందువులకు భగవానుడే. ఆయన లేకుండా సృష్టిలోని జీవకోటి మనుగడ లేదన్న విషయం తెలిసిందే! కానీ సూర్యుడు ఆకాశంలో ఎంతసేపు ఉంటే మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారన్న విషయం తెలుసా...   ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి: మార్క్‌ బీచర్‌, లారెన్స్‌ రీస్‌, డెనిస్‌ ఎగెట్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కలిసి సూర్యకాంతి మీద ఓ పరిశోధన చేశారు. ఇందులో ఒకరు తన దగ్గరకి మానసిక సమస్యలతో వచ్చే రోగులకు సంబంధించిన వివరాలన్నింటినీ ఒక్క చోటకి చేర్చారు. మరొకరు వాతావరణానికి సంబంధించిన గణాంకాలన్నీ సేకరించారు. ఇంకొకరు ఈ రెంటికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించారు.   అందరి మీదా ప్రభావం: కొంతమంది చలికాలంలో మాత్రమే డిప్రెషన్‌కి లోనయ్యే జబ్బుతో బాధపడుతూ ఉంటారు. దీనిని Seasonal affective disorder (SAD) అంటారు. చలికాలంలో సూర్యకాంతిలో మార్పు రావడం వల్ల మన శరీరంలోని సెరిటోనిన్‌, మెలటోనిన్‌ అనే హార్మోనుల ఉత్పత్తిలో మార్పు వస్తుంది. ఫలితంగా కొందరు SAD బారిన పడతారు. కానీ తాజా పరిశోధనతో తేలిందేమిటంటే పగటివేళలు తగ్గడం అనేది మనలో ప్రతి ఒక్కరి మీదా ఎంతో కొంత ప్రభావం చూపుతుందట.   వేళలే ముఖ్యం: సూర్యుడు ఎంత తీక్షణంగా ఉన్నాడన్నది ముఖ్యం కాదని ఈ పరిశోధనతో తేలింది. కాలుష్యం కారణంగానో, ఆకాశం మేఘావృతంగా ఉండటం చేతనో సూర్యుడు పెద్దగా కనిపించపోయినా ఫర్వాలేదు కానీ... సూర్యుడు వీలైనంతగా ఆకాశంలో ఉండటమే ముఖ్యం అని తెలిసింది. మరో మాటలో చెప్పాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఎంత ఎక్కువ సమయం ఉంటే మనుషులు అంత సంతోషంగా ఉన్నారట. సూర్యకిరణాలు భూమిని ఎంత ఎక్కువసేపు తాకితే మన మానసిక ఆరోగ్యం అంత బాగా ఉంటుందట.   కారణం! పగటివేళలకీ, మానసిక ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించైతే చెప్పారు కానీ దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం పరిశోధకులు తేల్చలేదు. బహుశా SAD రోగుల విషయంలోలాగా ఇతరులలోనూ హార్మోనుల ఉత్పత్తిలో వచ్చే మార్పులే దీనికి కారణం కావచ్చు. ఇక సూర్యరశ్మి నుంచి లభించే D విటమిన్‌లో లోపం ఏర్పడటం వల్ల కూడా మనిషి మనసులో ఇలాంటి అలజడి ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పగటివేళలు తక్కువగా ఉండే కాలంలో కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. - నిర్జర.

ఇలా చేస్తే మీ ఎముకలు భద్రం

  ఎముకలు లేని మనిషి మాంసపు ముద్దతో సమానం. అతనికి ఒక ఆకారాన్ని ఇచ్చి, ఆ ఆకారాన్ని నడిపించే బాధ్యత ఎముకలదే! 30 ఏళ్ల వరకూ ఎముకల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఎముకలు నానాటికీ బలాన్ని పుంజుకుంటాయి. అప్పటివరకూ ఎముకలు తగినంతగా ఎదిగేందుకు అవసరమయ్యే పోషకాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఇక 30 ఏళ్ల తరువాత ఎముకల ఎదుగుదల కంటే తరుగుదలే అధికంగా ఉంటుంది. అప్పుడు వాటిని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఇవీ...     ఎముకలు = కాల్షియం ఎముకల ప్రస్తావన వచ్చే ప్రతిసారీ కాల్షియం గురించి చెప్పుకోక తప్పదు. ఎముకల ఎదుగుదలకీ, రక్షణకీ కూడా కాల్షియం చాలా అవసరం. అందుకే మన శరీరానికి అందే కాల్షియంలో 90 శాతం ఎముకలకే సరిపోతుందట. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బోలుగా మారిపోయి త్వరగా విరిగిపోయే ‘ఆస్టియోపొరోసిస్‌’ అనే ప్రమాదాన్ని కూడా కాల్షియం నివారిస్తుంది. అందుకే కాల్షియం సమృద్ధిగా ఉండే పాలపదార్థాలు, ఆకుకూరలు, బీన్స్, సోయాపాలు వంటివి పుష్కలంగా తీసుకోవాలి.     విటమిన్‌ డి మనం ఎంత పోషకాహారాన్ని తీసుకున్నా... వాటిలోని కాల్షియాన్ని శరీరం గ్రహించాలంటే విటమిన్‌ డి అవసరం. అయితే ఈ విటమిన్‌ చేపలు, జున్ను, గుడ్డు వంటి కొన్ని పదార్థాలలోనే ఉంటుంది. అందుకనే ఈ మధ్య నూనె, పాలు వంటి పదార్థాలకు కృత్రిమంగా డి విటమిన్‌ను చేరుస్తున్నారు. ఈ బాధలన్నీ పడే బదులు విటమిన్‌ డిని సహజంగా, సమృద్ధిగా ఇచ్చే సూర్యకాంతి కింద కాసేపు తిరగడం మేలు.   వ్యాయామాలు పరుగులెత్తడం, జాగింగ్‌ చేయడం, టెన్నిస్‌ ఆడటం, డాన్స్ చేయడం... ఇలా ఎముకల మీద ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయడం వల్ల అవి దృఢపడతాయంటున్నారు నిపుణులు. పైగా శరీరానికి తనని తాను అదుపు చేసుకునే క్షమత కూడా పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలు ఉన్నవారు నడక, ట్రెడ్‌మిల్‌ వంటి వ్యాయామాలతో సరిపెట్టుకుంటే మంచిదని సూచిస్తున్నారు.     కాఫీ, సిగిరెట్, మద్యం దూరం కాపీలో ఉండే కెఫిన్‌ మన శరీరం కాల్షియంను గ్రహించేందుకు అడ్డుపడుతుందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఇక విపరీతంగా మద్యం సేవించడం డి విటమిన్‌ పనితీరుని దెబ్బతీస్తుందనీ తేలింది. సిగిరెట్లు తాగడం వల్ల కూడా ఎముకలు పెళుసుబారిపోతాయని హెచ్చరిస్తున్నారు.   అవసరమైతే మందులు తప్పదు వయసుని బట్టి మనకు రోజువారీ 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల వరకూ కాల్షియం అవసరం అవుతూ ఉంటుంది. దీనికి దాదాపు 1000 IUల వరకూ విటమిన్‌ డి కూడా జోడించాల్సి ఉంటుంది. ఇవి మన రోజువారీ జీవితంలో తగినంతగా అందుతున్నాయో లేదో తేల్చుకునేందుకు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. సదరు వైద్యుని సలహా మేరకు అవసరం అనుకుంటే కాల్షియం, డి విటమిన్లను మందుల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుతుక్రమం నిలిచిపోయిన స్త్రీలు, 60 ఏళ్లు దాటిన పెద్దలు, వంశపారంపర్యంగా ఆస్టియోపోరోసిస్‌ సమస్య ఉన్నవారు తమ ఎముకల ఎంతవరకూ దృఢంగా (Bone Density) ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.   - నిర్జర.

వంటింట్లో సంజీవని... కరివేపాకు!

‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అంటూ వాపోయేవారు, ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అయితే కూరకి రుచి అంటగానే చక్కగా ఆకుని కాస్తా ఏరిపారేస్తారు. కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో... కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు ప్రాశస్త్యం తెలిస్తే చక్కగా అన్ని వంటల్లో ఇంత కరేపాకు ఏరిపారేయడానికి వీలు లేకుండా ఎలా వేయొచ్చో తప్పకుండా ఆలోచిస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది.  కానీ, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌లో కరివేపాకు వెనుకబడిపోయింది.  మనం ఎవరి ఫాస్ట్‌ఫుడ్స్‌ని అలవాటు చేసుకుని కరివేపాకుకి దూరమవుతున్నామో వారు మాత్రం కరివేపాకుని భారీగా వినియోగిస్తారంటే నమ్ముతారా! మన దేశం నుంచి సుమారు 900 టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతోందిట. గల్ఫ్ దేశాలలో మన కరివేపాకుకి బోలెడంత డిమాండ్. ఐరోపా వాసులైతే  ఎండబెట్టిన కరివేపాకు ఆకుల పొడి వాడతారుట. అసలు కరివేపాకుని ఎందుకు తినాలి? అందులో బోల్డన్ని పౌష్టిక విలువలు ఉండబట్టేనని చెప్పుకున్నాం. అంతేనా.. దానిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. కరివేపాకుని మధుమేహానికి మంచి మందుగా పాశ్చాత్యులు సైతం గుర్తించారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని రసాయనాలు చక్కెర వ్యాధిగ్రస్తుల పాలిట వరం అంటారు నిపుణులు. ఎలా అంటే, తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్‌గా మార్చి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచేందుకు క్లోమగ్రంధి నుంచి విడుదలయ్యే అల్థాఎమిలేజ్ అనే ఎంజైమే కారణం. కరివేపాకులోని ప్రత్యేక పదార్ధాలు ఈ ఎంజైమ్ స్రావాన్ని తగ్గిస్తాయని గుర్తించారు నిపుణులు. నిజానికి జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా నియంత్రివచ్చని ఆయుర్వేద నిపుణులూ చెబుతుంటారు.  ప్రతిరోజూ ఉదయమే పది కరివేపాకుల చొప్పున మూడు నెలలపాటు తింటే స్థూలకాయం, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతాయంటారు ఆయుర్వేద వైద్యులు.పిల్లలు ఆకలిగా లేదంటూ అన్నం చూడగానే ముఖం తిప్పేస్తుంటే చక్కగా స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు పొడి కలిపి రోజు మొదటగా రెండు ముద్దలు పెడితే చాలుట. ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది కూడా. కరివేపాకు పొడి అంటే ఒట్టి కరివేపాకే కాదు.. మెంతులు, మిరియాలు కూడా కలపాలి.  ఇక డయేరియా వంటి వాటికి రెండు టీస్పూన్ల కరివేపాకు రసం బాగా పనిచేస్తుందిట. అలాగే మజ్జిగలో కాసిన్ని కరివేపాకుల్ని నలిపి లేదా రసం తీసి వేస్తే కడుపులోని బాధలు ఏవైనా తగ్గుతాయిట. అలాగే ఒట్టి కరివేపాకుని వేయించిగానీ, ఎండబెట్టిగానీ పొడిచేసి పెట్టుకుని రోజూ ఓ స్పూన్ తేనెతో ఓ స్పూన్ కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యానికే కాదు.. అందానికీ కరివేపాకుని వాడతారు. కురులకి ఈ ఆకు ఎంతో మంచిదట. కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. పెరుగుతాయి కూడా. అంతేనా... జుట్టు తెల్లబడటం తగ్గి, కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయిట కూడా. ఇలా ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచిది అని నిపుణులు గట్టిగా చెబుతున్న కరివేపాకుని తరచూ ఏదో ఒక రూపంలో తప్పక తీసుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చేశారా? మరింకేం.. కమ్మటి పచ్చడి, టేస్టీ పొడి లేదా పూర్వంలా మజ్జిగలో కరివేపాకు వేసి తాగడం వంటివి మొదలుపెట్టండి. పిల్లలు ఏరిపారేస్తారన్న భయం లేకుండా వుండాలంటే అన్ని కూరల్లో కరివేపాకు పొడిచేసి వేస్తే సరి!

నీరు ఎక్కువగా తాగితే మరణమే..!

  అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు మన పెద్దలు..అతిగా ఏం చేసినా అది మంచిది కాదు. ఈ సూత్రం ఆరోగ్యానికి కూడా వర్తిస్తుంది. నీళ్లు తాగడం శరీరానికి మంచిదన్నారని అతిగా నీరు తాగితే అది ఏకంగా ప్రాణాలనే హరిస్తుందని తాజా అధ్యయనంలో బయటపడింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది.   వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు. అనంతరం వారి ఎంఆర్ఐ తీసి చూడగా... అందులో నీళ్లు అధికంగా తాగిన వ్యక్తుల మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. అటువంటి వారు ఏదైనా తినాలన్నా..నమలడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని కనుగొన్నారు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు నీళ్లు అధికంగా తాగకూడదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   ఎక్కువ నీళ్లు తాగితే తొందరగా సన్నబడతామనో, ఆరోగ్యం బాగుపడుతుందనో భావించి నీళ్లు బాగా తాగేస్తుంటారు. నిజానికి ఎంత నీరు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ మానవ శరీరంలో ఉంటుందట..ఆ వ్యవస్థ మనిషిని ఎక్కువ నీళ్లు తాగకుండా ఆపుతుందట. అయినప్పటికి మోతాదుకు మించి నీళ్లు తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఏర్పడితే శరీరంలోని ఫ్లూయిడ్స్ పలచబడతాయి. ఫలితంగా సోడియం ప్రమాణాలు పడిపోతాయి. దీంతో బాడీలోని కణాలు వాస్తాయి. ఫలితంగా కొన్నిసార్లు స్పృహతప్పి పడిపోతారు. పరిస్ధితి విషమిస్తే కోమాలోకి కూడా పోవచ్చు. అందుకే మనిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు.

మీకు 45 సం. నిండాయా?

  మీకు 45 సం. నిండాయా? అయితే మీరు రోజు కనీసం 2 వెల్లుల్లి రెబ్బలు పొద్దున్నే తినండి. ఎందుకంటే.... డాక్టర్స్ దాచిపెడుతున్న ఈ పదార్థం 14 రకాల క్యాన్సర్ ను నివారిస్తుంది ! ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధితో చనిపోయేవారి సంఖ్య మొదటిస్థానంలో ఉంటె, రెండవ స్థానంలో క్యాన్సర్ వల్ల చనిపోయేవారు ఉన్నారు. క్యాన్సర్ తో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలంటే వైద్యులకి, వారిచ్చే మందులకి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుగొనే పనిలో నిమిగ్నమై ఉన్నారు. క్యాన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా మీ శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు. దాదాపు అందరి ఇళ్ళల్లో లభించే వెల్లుల్లి 14 రకాల క్యాన్సర్ మరియు మరెన్నో రకాల ఇతర జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ పేషెంట్స్ రోజుకి కనీసం 5 - 6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు. ఈ రేమ్మలని వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి allinase అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇందులో యాంటి ఫంగల్ మరియు యాంటి క్యాన్సర్ తత్వాలు ఉంటాయి. క్యాన్సర్ మాత్రమే కాదు... తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు.  

కొబ్బరి నీళ్లతొ వచ్చే ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగుతారు..

ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. ఎలాంటి కల్తీ లేకుండా మనకు స్వచ్ఛంగా లభించే పానీయం ఇదొక్కటే ఉంటుంది. కొబ్బరి నీళల్లో చాలా పౌష్టిక గుణాలుంటాయి. ఇందులో ఉండే చాలా మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అందువల్ల రెగ్యులర్ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్ల వల్ల కలిగి ఉపయోగాలు ఏమిటో మీరూ చూడండి. గుండెకు చాలా మంచిది: కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. హార్ట్ అటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య కూడా ఉండదు. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ దూరం చేయగలదు.   జీవక్రియను పెంచుతుంది : రోజూ కొబ్బరినీరు తాగడం వల్ల మీ జీవక్రియ రేట్ కూడా పెరుగుతుంది. అలాగే మీరు త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులోని ఎలెక్ట్రోలైటీ అనేది అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీవక్రియ పెరిగి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది.   కిడ్నీలోని రాళ్లను కరిగించుకోవొచ్చు : తక్కువగా నీరు తాగితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. అయితే కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కిడ్నిలోని చిన్నసైజ్ రాళ్లు త్వరగా కరిగించుకోవొచ్చు. అలాగే కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా బయటకు వెళ్లడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. డీ హైడ్రేషన్ ఉండదు : కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీలో డీ హైడ్రేషన్ సమస్య అనేది ఏర్పడదు. నీళ్ల కంటే ఎక్కువగా కొబ్బరి నీళ్లు పని చేస్తాయి. అథ్లెట్లు, వ్యాయామాలు చేసేవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.   జీర్ణశక్తిని పెంచుతుంది: కొబ్బరి నీరు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇందులో మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మీలో మీలో జీర్ణశక్తిని పెంచుతాయి.

Is Excessive Sweating embarrassing you??

  Sweating is physiological process occurring in the body, it way of dissipating heat and also means by which certain toxic wastes are thrown out. Sweating in warm and humid conditions or after exercising is considered normal. Sweating occurring in unusual conditions, without any stimulus or even in cooler climates is considered hyperhidrosis or excessive sweating. It is usually linked to some medical conditions like menopause, anxiety or hyperthyroidism. Sweating is embarrassing, it stains clothes and ruins the social interactions, and it may also have serious implications such as making it difficult to grip on things and may earn you the tag of ‘butter fingers’. Hyperhidrosis is mostly neurologic, endocrine, infectious and systemic diseases, most cases are the people who are apparently healthy and still suffer from hyperhidrosis. Systemic conditions associated are; heart diseases, cancer, stroke, hyperthyroidism, menopause, spinal cord injuries, lung diseases, Parkinsonism and certain anti-depressants. Best way to tackle this to find out the trigger and have a judicious approach. Usage of anti-perspirants which contain aluminum or aluminum chloride, oral anti-cholinergic drugs reduce sweating and Botox-A has been approved by the FDA for treating excessive axillary sweating. The sweat gland can be destroyed by microwave energy or lasers, to reduce the sweating. As a last resort is thoracic sympathectomy these will cut off the stimulation of sweat glands, for sweating. -Koya Satyasri  

డయాబెటీస్‌ ఉంటే పండ్లు తినవచ్చా!

  డయాబెటీస్‌ ఉన్నవారు పండ్లకి ఆమడ దూరంలో ఉంటారు. మహా అయితే నేరేడు పండ్ల సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే చక్కెర వ్యాధి ఉన్నవారు నేరేడు పండు తప్ప మరే పండు తిన్నా తేడా వస్తుందేమో అన్న భయం వారిది. నిజానికి మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అతి చవకగా, అతి సహజంగా అందించే బాధ్యత పండ్లది. అలాంటి పండ్లని పూర్తిగా దూరం పెట్టడం వల్ల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మరి డయాబెటీస్‌ ఉన్నవారు ఎలాంటి పండ్లను, ఏ రకంగా తీసుకోవాలో నిపుణులు చెబుతున్న మాటలను ఓసారి చూద్దాం... ఎలాంటి బెర్రీలైనా!  స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు... ఇలా రకరకాల బెర్రీ పండ్లు ఇప్పుడు మనకి కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నిస్సంకోచంగా తీసుకోవచ్చంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరుకోదనీ, కాబట్టి వీటిని తినవచ్చనీ సూచిస్తున్నారు. పైగా ఈ బెర్రీలలో ఉండే రకరకాల విటమిన్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది కూడా. నారింజ: చక్కెరవ్యాధిగ్రస్తులకు ఇష్టమైన పండు నారింజేనేమో! తీపి కంటే పులుపే ఎక్కువగా ఉండే నారింజతో శరీరానికి కావల్సిన ‘C’ విటమిన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో పీచుపదార్థాలు కూడా అధికమే! పైగా నారింజలో ఉండే ఫోలేట్‌, పొటాషియం అనే పదార్థాలకి రక్తపోటుని అదుపుచేసే గుణం ఉంది. జామ:  డయాబెటీస్‌ ఉన్నవారు జామని కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ ఏ,సీలు ఆరోగ్యానికి కావల్సిన పోషకాలను అందిస్తే, పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. ఇక శరీరంలోని కండరాల పనితీరుని మెరుగుపరిచే పొటాషియం కూడా జామకాయలో సమృద్ధిగా దొరుకుతుంది. యాపిల్:  రోజుకో యాపిల్‌తో రోగాలు దూరమన్న విషయం తెలిసిందే! కానీ కాస్త తియ్యగా ఉండే యాపిల్‌ అంటే డయాబెటీస్‌ రోగులు భయపడుతూ ఉంటారు. నిజానికి యాపిల్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంటల్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు! కొన్ని పోషకాలను శరీరం మరింత సమర్థంగా జీర్ణం చేసుకునేందుకు కూడా యాపిల్స్ ఉపయోగపడతాయి. అయితే వీటిని తొక్కుతో సహా తిన్నప్పుడే... మరింత ఉపయోగం అని గుర్తుచేస్తున్నారు వైద్యులు. అరటిపండు:  అరటిలో ఉన్న సుగుణాలు అన్నీఇన్నీ కావు! అత్యంత చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంలు ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. అంతేకాదు శరీరంలోని జీవక్రియకు (మెటాబాలిజం) తోడ్పడే B6 విటమిన్‌ కూడా అరటిలో కనిపిస్తుంది. ఇక జీర్ణక్రియకు అరటిపండు చేసే సాయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! పుచ్చకాయ:  ఎండాకాలం వస్తూనే ఊరించే ఈ పండుని పూర్తిగా కాకుండా కొన్ని ముక్కలను తీసుకోవడంలో తప్పులేదంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో విటమిన్‌ సి ఎలాగూ ఉంటుంది. ఇక పళ్లరసాలను దూరంగా ఉండే డయాబెటీస్‌ రోగులకు... పుచ్చకాయ, జ్యూస్‌ తాగినంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక నీరు, దాహాన్ని తీర్చి శరీరానికి కావల్సిన తేమని అందిస్తుంది. కేవలం పైన పేర్కొన్న పండ్లే కాకుండా పీచ్‌, పియర్స్‌, కివీ, అవకాడో... వంటి విదేశీ పళ్లు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన పండ్ల జోలికి ఎవరు వెళ్తారులే అనుకుంటే ఉసిరి, దానిమ్మ, పంపరపనస... వంటివి ప్రతి చోటా కాస్త తక్కువ ధరలోనే లభిస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి కాస్త కాస్త మోతాదులో తీసుకోవడం, అన్ని పదార్థాలతో కలిపి లాగించేయకుండా విడిగా తినడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం ఉన్నవారు కూడా పళ్ల రుచిని ఆస్వాదించవచ్చునని సూచిస్తున్నారు వైద్యులు. - నిర్జర

సమ్మర్ లో మామిడితో మజా

మన భారతదేశంలో లభించే రకరకాల పండ్లన్నింటిలోనూ మామిడికాయలు ఎంతో ప్రత్యేకమైనవి. పచ్చిమామిడికాయల నుంచి పండు మామిడికాయల వరకు ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. చిన్న, పెద్ద అని తేడాలేకుండా ప్రతిఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి పండు రకరకాల వంటకాలలోను మామిడిపండ్లను ఉపయోగిస్తారు. అందువల్లే దీనిని పండ్లకు రారాజుగా పేర్కొంటారు... మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి... ముఖ్య ప్రయోజనాలను చూద్దాం :- వేసవిలో వడదెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడి రసాన్ని మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. నీరసంతో పాటూ, అలసట కూడా తగ్గుతుంది. వడదెబ్బ సమస్య నుంచి కూడా త్వరగా కోలుకుంటారు. పచ్చిమామిడి కాయలో విటమిన్  సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి.  ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్ర రక్తకణాల వృద్దికి దోహదపడుతుంది. మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.

వేసవిలో ఈ ఆహారంతో జాగ్రత్త

  వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే...   మితంగా ప్రొటీన్లు: ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు.   నూనెపదార్థాలు: నూనె ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిరుతిళ్ల వంటి పదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే మంచిదట. నూనె పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పైగా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మం కూడా జిడ్డోడుతుందని తేలింది. అలా నూనెపదార్థాలు ఒంటి లోపలా బయటా కూడా చిరాకు కలిగిస్తాయన్నమాట.   మద్యపానం: వేసవి వచ్చిందంటే చాలు... ఆ పేరు చెప్పి పీపాలకు పీపాలు బీరు తాగేస్తుంటారు. ఒకవేళ బీరు దొరక్కపోతే ఎలాంటి మద్యానికైనా సిద్ధంగా ఉంటారు. బీరుతో సహా ఎలాంటి మద్యానికైనా dehydration కలిగించే లక్షణం ఉంది. అందుకనే మద్యం సేవించేటప్పుడు ఒళ్లంతా చెమటలు కక్కడం, మాటిమాటికీ మూత్రానికీ వెళ్లాల్సి రావడం జరుగుతుంది.   మామిడిపళ్లు: వేసవికాలంలో మామిడిపళ్లే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా! అని ఆబగా లాగించేస్తుంటాం. కానీ మామిడిపళ్లు మోతాదుని మించితే.... విరేచనాలు తప్పవు. పైగా వీటికి వేడి చేసే గుణం కూడా ఉంది. అందుకనే నిరంతరం మామిడిపళ్లు తింటే పెదాలు పగలడం, సెగ్గడ్డలు రావడం జరుగుతుంది.   పాలు: పాల నుంచి వచ్చే పెరుగు, మజ్జిగలు వేసవిలో దాహాన్ని తీరుస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. కానీ నేరుగా చల్లటి పాలు తాగితే మాత్రం చిక్కులు తప్పవు. చాలామందికి పాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండదు. పైగా చల్లటి పాలని తాగడం వల్ల, వాటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మార్చేందుకు మరింత వేడిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్కి కూడా డీహైడ్రేషన్ కలిగించే లక్షణం ఉంది. ఇవే కాదు మాంసాహారం, మసాలా పదార్థాలు, చపాతీలు... ఇవన్నీ కూడా వేసవి తాపాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందంటున్నారు. - నిర్జర.  

మీ పిల్లలు బాగా ఆడాలంటే ఈ ఫుడ్ పెట్టండి

    పిల్లలు ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగా కూడా వాళ్లు ఎదగాలి.. ఇది కావాలంటే వారికి చదువుతో పాటు ఆటలు నేర్పించాలి.. అలా అని ప్రతీ ఒక్కరూ సచిన్, సానియా, సైనా నెహ్వాల్ అవ్వాలని కాదు.. ఎదిగే పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. వైద్యుల సలహాలో.. లేక మారుతున్న కాలమో కానీ దీని ప్రాధాన్యత గుర్తించిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్పోర్ట్స్ స్కూల్స్‌లో జాయిన్ చేస్తున్నారు. అయితే వాళ్లు ఆటలు ఆడటానికి తగినంత శక్తి కూడా ఎంతో అవసరం.. లేదంటే పిల్లలు నీరసించిపోతారు.. వారిలో ఎనర్జీ లెవల్స్ బాగా పెరగడానికి కొన్ని రకాల పోషకాహారాలను సూచిస్తున్నారు నిపుణులు.. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=HLTHriVZaTc  

కడుపులో బిడ్డని బట్టి తల్లి ఆరోగ్యం

  పుట్టబోయే బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అని చెప్పడానికి మన పెద్దలు రకరకాల లక్షణాలు చెబుతూ ఉంటారు. పొట్ట ఎత్తుగా ఉందా, ఆయాసం వస్తోందా, ఒళ్లు చేశారా... ఇలా భిన్నమైన లక్షణాల ఆధారంగా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని అంచనా వేస్తుంటారు. వినడానికి ఇవన్నీ సరదాగానో, కించిత్తు ఛాదస్తంగానో కనిపిస్తాయి. కానీ ఈ మధ్యే జరిగిన ఓ పరిశోధనని కనుక గమనిస్తే... మన పెద్దల మాటలని మరీ అంత కొట్టి పారేయడానికి వీల్లేదని అనిపిస్తుంది.   ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... తల్లి గర్భంలో ఉన్న శిశువు లైంగికతకీ, ఆమె రోగనిరోధక శక్తికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు మన ఒంట్లో రోగనిరోధక శక్తిని ప్రతిబింబించే సైటోకైన్స్ (cytokines) అనే కణాల తీరుని గమనించారు. కడుపులో ఆడపిల్ల ఉన్నా, మగపిల్లవాడు ఉన్నా ఈ సైటోకైన్స్ సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు. కానీ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు ఏర్పడే సైటోకైన్స్ తీరు కాస్త విభిన్నంగా కనిపించింది.   గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే కనుక inflammation అనే చర్యకు అనుకూలమైన సైటోకైన్స్ కనిపించాయట. మన శరీరంలోకి హానికారక సూక్ష్మక్రిములు కానీ రోగకారకాలు కానీ ప్రవేశించినప్పుడు... వాటిని ఎదుర్కొనేందుకు జరిగే పోరాటమే inflammation. ఈ సందర్భంగా శరీరాన్ని పోరాటానికి సన్నద్ధంగా ఉంచేందుకు తెల్లరక్తకణాల వంటి కణాల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోతుంది. గాయం చుట్టూ మనకి కనిపించే వాపు ఇలా ఏర్పడేదే! అయితే ఈ inflammation ఒకోసారి మన రోగనిరోధక శక్తికి సాయపడితే, మరికొన్ని సందర్భాలలో లేనిపోని ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. అనవసరంగా శ్వాసనాళాలు వాయడం వల్ల ఆస్తమా, కీళ్ల దగ్గర వాపు ఏర్పడటం వల్ల ఆర్థ్రయిటిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.   ఆడపిల్ల కనుక గర్భంలో ఉంటే ఇలా inflammationకు సంబంధించిన లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నమాట. దీని వలన మేలు, కీడు రెండూ అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భీణీ స్త్రీలకు చికిత్స చేసేటప్పుడు వారి కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అన్న విషయం మీద స్పష్టత ఉంటే... దానికి అనుగుణంగా వారికి చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భిణీ స్త్రీలలో ఆస్తమా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, వారి కడుపులో ఉన్న శిశువు లైంగికతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్నింటికీ మించి... తగిన వ్యాయామం, ఆకుకూరల వంటి పోషకాహారం తినడం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి అవాంతారాలూ లేకుండా పండంటి బిడ్డను కనవచ్చని సూచిస్తున్నారు. - నిర్జర.