టీచర్ ని లవ్వాడాడు! పెళ్లాడాడు! ఇప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయ్యాడు!
యూరప్ ఖండంలో రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య తీవ్రమైన పోటీ వుండేది. కేవలం ఆయుధాలు, విమానాలు, యుద్ధ నౌకల విషయంలో మాత్రమే కాదు… కవిత్వం, కళలు వంటి వాటి గురించి కూడా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు తెగ పోటీ పడేవి. ఆ పోటీలో భాగంగానే బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి యూరోపియన్ దేశాలు ప్రపంచంలోని అనేక దేశాల్ని కాలనీలుగా మార్చుకుని పంచుకున్నాయి! అయితే, ఇంగ్లీషు వాళ్లు ఎప్పుడూ రాజకీయంగా డామినేట్ చేసేవారు! కాని, ఫ్రెంచ్ వారు మాత్రం రొమాన్స్ విషయంలో ముందుండే వారు!
ఎప్పుడో వాల్డ్ వార్ టూకి ముందు విషయాలు ఇప్పుడెందుకు అంటారా? ఒక పెద్ద లింక్ వుంది. అందుకే, ఈ ఉపోద్ఘాతం! ఫ్రాన్స్ ఇప్పుడే కాదు ఎప్పుడూ రొమాన్స్ కి కేరాఫ్ అడ్రస్! వందల సంవత్సరాలుగా మత్తు కలిగించే మద్యాలు, గమ్మత్తు కలిగించే రొమాంటిక్ పద్యాలు అక్కడ సర్వ సాధారణం! ఈ కళల విషయంలో బ్రిటన్ ఎన్నో శతాబ్దాలు ట్రై చేసి కూడా ఫ్రెంచ్ వార్ని ఓడించలేకపోయింది. అయితే, ఆధునిక ప్రజాస్వామ్య కాలంలోనూ ఫ్రాన్స్ జనాల రొమాంటిక్ ప్యాషన్ ఏ మాత్రం తగ్గినట్టు లేదు! అందుకు తాజా సంచలన ఉదాహరణ… న్యూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యువల్ మాక్రోన్!
తనకంటూ ఓ పార్టీ కూడా లేకుండా ఇండిపెండెంట్ గా బరిలో దిగాడు 39ఏళ్ల ఎమ్మాన్యువల్! ఆయన ప్రత్యర్థిది జాతీయ వాదం అయితే ఈయనది ఆదర్శవాదం. లిబరల్ థింకింగ్ వున్న లెఫ్టిస్ట్ అయిన ఎమ్మాన్యువల్ ని ఆయన ఇచ్చిన వాగ్ధానాలు నమ్మే ఫ్రెంచ్ ఓటర్లు అధికారంలోకి తెచ్చారు. కాకపోతే, క్యాంపైన్ టైంలో ఎమ్మాన్యువల్ కి బాగా కలిసొచ్చిన మరో అంశం… ఆయన భార్య బ్రిజ్జెట్టి! ఇప్పుడు 39ఏళ్లున్న కొత్త అధ్యక్షుడి 64ఏళ్ల భార్య ఆమె!
ఇంకా నలభై నిండని వాడికి అరవై దాటిన బామ్మ భార్య అనటంతోనే అవాక్కయ్యారా? ఇంకా వుంది బోలెడంత ఫ్రెంచ్ రొమాన్స్! ఎమ్మాన్యువల్ 15ఏళ్లున్నప్పుడు బ్రిజెట్టి మనోడి టీచర్! ఆమె ప్రేమలో మునిగిపోయిన టీనేజ్ కుర్రాడు మెల్లగా లైన్లో పెట్టాడు. కాని, అందరు టీనేజర్లలా కొన్నాళ్లకు మర్చిపోకుండా టీచర్ నే కళ్లల్లో, కలల్లో పెట్టుకుని చూసుకుంటూ వచ్చాడు. చేసేది లేక ఈ ఫ్యూచర్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కి టీచరమ్మ కూడా పడిపోయింది. అలా 15ఏళ్లప్పుడు స్టార్టైన ఎమ్మాన్యువల్ ప్రేమ కథ ఆయన పీజీ కూడా పూర్తయ్యాక పెళ్లితో కొత్త పుంతలు తొక్కింది. కాని, బ్రిజ్జెట్టికి అప్పటికే పెళ్లైంది. విడాకులు కూడా ఇచ్చేసింది. కాని, ముగ్గురు పిల్లలున్నారు మొదటి భర్త కారణంగా! ఇంకా విడ్డూరం ఏంటంటే.. మన ఎమ్మాన్యువల్ కంటే ఆయన భార్యగారి మొదటి భర్త తాలూకూ మొదటి సంతానం రెండేళ్లు పెద్ద! బ్రిజ్జెట్టి రెండో సంతానమైన కూతురు ఎమ్మాన్యువల్ కి క్లాస్ మేట్!
టీచర్ ని లవ్ చేయటం, పెళ్లి చేసుకోవటం, ఆమె పాతికేళ్లు పెద్దది కావటం, అంతకు ముందే ఆమెకి ముగ్గురు పిల్లలుండటం, వారిలో ఒకరు రెండో భర్తకంటే పెద్ద వారు కావటం… ఇవన్నీ వింటుంటే.. మైండ్ బ్లాంక్ అవుతోంది కదా? ఇలాంటి పెళ్లి, కుటుంబం, నేపథ్యం వుంటే మన దేశంలో ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడేవాడే! కాని, రొమాన్స్ అంటే పడి చచ్చిపోయే ఫ్రెంచ్ జనాలు ఆరితేరిన ఈ స్టూడెంట్ లవ్వర్ నే ఏరికోరి ఎంచుకున్నారు! ఎమ్మాన్యువల్ సక్సెస్ లో ఎంతో కొంత ఈ టీచర్,స్టూడెంట్ రొమాన్స్ పాత్ర కూడా వుందనేది కాదనలేని సత్యం!