రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కల్పన సింగ్ మృతి
posted on Aug 25, 2012 @ 11:57AM
హైదరాబాద్ లోని మెహదీపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్పన సింగ్ (27) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి చెందింది. బంజారాహిల్స్ లోని బీఎస్ ట్రాన్స్కమ్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో సంవత్సర కాలంగా ఆమె పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో, కింద పడిపోయిన కల్పన సింగ్ తలపై నుంచి వాహనాలు వెలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కల్పన తండ్రి ఉద్యోగరీత్యా కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. ఆరు నెలల నుంచి వీరు హుమాయున్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.