న్యూయార్క్‌లో కాల్పులు: 2మృతి, 9మందికి గాయలు
posted on Aug 25, 2012 9:28AM
అమెరికాలోని న్యూయార్క్‌లో గల ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సమీపంలో జనంపై తూటాలు పేలాయి. జాన్సన్ అనే ఉద్యోగిని తొలగించారన్న అసంతృప్తితో ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు మరణించారు, మరో తొమ్మిది మందికి గాయలయ్యాయి. ఈ ఉదంతం న్యూయార్క్‌లోని 102 అంతస్తుల ఆకాశహర్మ్యం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బయట శుక్రవారం చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడిన జెఫ్రీ జాన్సన్(53) అనే వ్యక్తిని పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమార్చా రు. ఇటీవల కాలంలో రెండు విచక్షణారహిత కాల్పుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. జులై 20న అరోరాలో 'ది డార్క్ నైట్ రైజెస్' అనే సినిమా చూస్తున్న వారిపై జేమ్స్ హోమ్స్ (24) అనే వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటనలో 12 మంది మృతి చెందారు. 58 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ నెల 5న మిల్‌వాకీ బయట సిక్కు మందిరం వద్ద ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.